Wrinkles
-
ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి
సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మంపై ముడతలను రావడానికి కారణమవుతాయి. కాలుష్యం కూడా చర్మంపై ముడతలకు కారణం అవుతుంది. మరి సహాజసిద్దమైన పద్దతుల్లో చర్మంపై ముడతలను ఎలా నివారించాలి అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లోనే.. చర్మానికి మృదువైన, తేమను అందించే క్రీమ్‌ను రాసుకోండి రోజుకు కనీసం 15 నిమిషాలు మీ చర్మాన్ని మసాజ్ చేయడం. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి ముడతలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యం నిద్రపై చాలా ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడి చర్మంపై ముడతలకు కారణం అవుతుంది. యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ధూమపానం సాధారణ వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసి, ముడతలకు దోహదం చేస్తుందట. అధిక నాణ్యత గల యాంటీ రింకిల్ క్రీమ్‌ను ఉపయోగించండి. ఇది ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయి పైతొక్కును ముఖంపై రబ్ చేసి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే యవ్వనంగా మారుతుంది. అలోవెలా జెల్లో యాంటీ ఆక్సిడెంట్స్, హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. ప్రతిరోజూ దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి. గుడ్డులోని తెల్లసొనను చర్మంపై అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయాలి. గుడ్డు తెల్లసొనలోని అల్బుమిన్ అనే ప్రోటీన్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పండిన అరటిపండును మెత్తగా చేసి 1స్పూన్ తేనే, 1స్పూన్ పెరుగు కలపి చర్మానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీళ్లతో వాష్ చేసుకోవాలి. అరటిపండులోని పోషకాలు కొల్లాజెన్‌ను పెంచుతాయి. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల ముడతలను తగ్గిస్తుంది. -
మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! డివైజ్ ధర?
స్కిన్‌కేర్‌లో స్త్రీలు పాటించే పద్ధతులు చాలా ప్రత్యేకం. తెలిసిన చిట్కాలు.. నిపుణుల సలహాలు.. పార్లర్స్‌లో ట్రీట్మెంట్లు.. ఇలా అన్నిటినీ అవలంబిస్తారు. అయినా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకు మంచి సొల్యూషన్.. ఈ హ్యాండ్‌హెల్డ్ ఫేషియల్ మసాజర్. బెస్ట్ స్కిన్ స్పెషలిస్ట్‌లా ఉపయోగపడుతుంది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఫేస్ అండ్ స్కిన్‌కేర్ థెరపీ టూల్.. సులభమైన ఎన్నో చికిత్సలను అందిస్తుంది. దీనిలోని ఎల్ఈడీ లైట్ థెరపీ హెడ్.. ముడతలను, మచ్చలను పోగొడుతుంది. చర్మం లోతుల్లోకి వెళ్లి శుభ్రపరుస్తుంది. ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు.. కొల్లాజెన్‌ను నిర్మించడానికి.. తగిన మోతాదులో వైబ్రేషన్‌ను అందిస్తుంది. కాంతిమంతమైన ముఖాన్ని తీర్చిదిద్దడంలో ఈ పర్సనల్ బ్యూటీ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుంది. హాట్ అండ్ కోల్డ్ రింగ్స్‌తో పాటు క్లీనింగ్ రింగ్నూ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ స్వయంగా ఎవరికి వారే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మైక్రోకరెంట్ టెక్నాలజీతో ఈ ఫేషియల్ మెషిన్.. కళ్ల చుట్టూ ఉండే నల్లటి మచ్చలను పోగొడుతుంది. అలాగే చర్మపు బిగువును కాపాడుతుంది. ముఖ కండరాల్లో రక్తప్రసరణను బాగా పెంచి.. స్కిన్ టోన్‌ను మెరిపిస్తుంది. చిగుళ్ల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను.. అలసట, ఒత్తిడినీ దూరం చేస్తుంది. ఈ మెషిన్‌ను భద్రపరచు కోవడానికి సాఫ్ట్ కేరింగ్ బ్యాగ్ లభిస్తుంది. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక యూఎస్బీ చార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇలాంటి డివైజెస్‌ను ఆన్లైన్లో కొనుక్కునే ముందు వినియోగదారుల రివ్యూస్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని ధర 395 డాలర్లు. అంటే రూ. 32 వేల పైనే. అయితే ఆప్షన్స్‌ని బట్టి.. అదనపు రింగ్స్ కొనుగోలుచేయడానికి అదనపు ధర ఉంటుంది. దీన్ని పురుషులు కూడా వినియోగించుకోవచ్చు. చదవండి: CWS: డ్రైవర్ బబ్లూ.. అమెరికా డాక్టర్ కోమలి! చాలా మంది ఎందుకు ఇలా పిచ్చిగా ఆరాధిస్తారు? -
చర్మాన్ని బిగుతుగా చేసి.. ముఖాన్ని మెరిపిస్తుంది! మెషీన్ ధర?
అందాన్ని సంరక్షించుకోవాలంటే.. శ్రద్ధ ఎంత అవసరమో.. పోగొట్టుకున్న అందాన్ని తిరిగి రప్పించుకోవాలంటే చికిత్స కూడా అంతే అసవరం. ఈ హైడ్రో డెర్మాబ్రేషన్ వాటర్ డెర్మాబ్రేషన్ డీప్ క్లెన్సింగ్ ఫేషియల్ మెషిన్ .. అదిరిపోయే ట్రీట్మెంట్ని అందిస్తోంది.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా! డీప్ క్లీనింగ్, బ్లాక్ హెడ్ క్లియర్.. వంటి చాలారకాల చికిత్సలను ఇవ్వడంలో ఇది దిట్ట. ఆక్సిజన్ స్ప్రే గన్, కోల్డ్ హేమర్.. వంటి అటాచ్మెంట్ హెడ్స్‌ని కలిగిన ఈ మెషిన్ .. వయసుతో వచ్చే ముడతలను, పిగ్మెంటేషన్ మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముఖాన్ని మెరిపిస్తుంది. ఈ డివైజ్‌లో లైట్ థెరపీ మాస్క్ (చిత్రంలో గమనించొచ్చు) ఉంటుంది. ఇది మొత్తంగా 7 రంగుల్లో పని చేస్తూ.. ఏడు వేరువేరు ప్రయోజనాలను ఇస్తుంది. ఈ మాస్క్ (ఇలాంటి మాస్స్స్ను విడిగా మన బ్యూటీజర్లో చూశాం)ని ముఖానికి అమర్చుకుని.. సురక్షితంగా ట్రీట్మెంట్ పొందొచ్చు. మెషిన్ వెనుక వైపు రెండు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. వాటిలో నీళ్లు నింపుకుని.. ఆప్షన్స్‌ను బట్టి.. దీన్ని వినియోగించుకోవచ్చు. అలాగే మెషిన్ ముందువైపే డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. ఇది చర్మంపైన పేరుకున్న మురికిని, చర్మం లోతుల్లోకి చేరుకున్న మృతకణాలను తొలగించి యవ్వనాన్ని తిరిగి తెస్తుంది. దీని ధర సుమారుగా 279 డాలర్లు. అంటే 23,068 రూపాయలు. ఇలాంటి మోడల్స్.. అదనపు సౌకర్యాలతో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అయితే పలు రివ్యూస్‌ని ఫాలో అయ్యి.. కొనుగోలు చేసుకోవడం మంచిది. చదవండి: Anti Aging Foods: ప్రతిరోజూ బొప్పాయి పండు, దానిమ్మ తింటున్నారా? అయితే.. -
బొప్పాయి, దానిమ్మ.. రోజూ తింటే కలిగే లాభాలు! ముఖంపై ముడతలు.. ఇంకా
వయసు పెరిగే కొద్ది రకరకాల మార్పులు రావడం సహజం. ముఖ్యంగా ముఖంపై ముడతలు, ముఖం మెరుపు కోల్పోయి కళావిహీనం కావటం, కళ్లకింద ఉబ్బెత్తుగా ఉండటం, మంగు మచ్చలు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటినుంచి ఉపశమనానికి చాలా మంది మార్కెట్లో లభించే అనేకమైన కాస్మెటిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే వీటి వినియోగం వల్ల పరిష్కారం లభించకపోగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా కొన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటూ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌లను వాడటం వల్ల శరీరం యవ్వనంగా తయారవుతుంది. అంతేకాకుండా చాలా రకాల చర్మసమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాం... బొప్పాయి దీనిలో చర్మానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి బొప్పాయి పండ్లను ప్రతి రోజూ తినడం మంచిది. బొప్పాయిలో యాంటీ ఏజింగ్ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి కాబట్టి దీనిని తినడం వల్ల శరీరానికి అధిక పరిమాణం లో యాంటీ ఆక్సిడెంట్లు లభించి చర్మం ఆరోగ్యంగా మిలమిలలాడుతుంది. అంతేకాదు, అనేకరకాల చర్మ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బొప్పాయి గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆకు కూరలు ఆకు కూరల్లో క్లోరోఫిల్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా, కళ్లు మెరుపులీనుతూ ఉండాలంటే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఆకుకూరల వాడకం వల్ల ఏ లోపం లేకుండా శరీరానికి సమృద్ధిగా విటమిన్లు అందుతాయి. అంతేగాక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. పాలు, బాదం పాలలో ఉండే పోషకాల గురించి చిన్నప్పటినుంచి వింటున్నదే కాబటిట ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక బాదం పప్పును ఏ విధంగా తీసుకున్నా అందులో చర్మాన్ని యవ్వనంగా ఉంచే లక్షణాలున్నాయి కాబట్టి రోజూ గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది. దానిమ్మ దానిమ్మను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని ఆపడానికి సహాయపడుతుంది. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే రోజూ ఆహారంలో దానిమ్మను వినియోగించాలి. దానిమ్మ రసాన్ని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. షుగర్ ఉన్న వారు కూడా దానిమ్మను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెరుగు శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్ అధిక పరిమాణంలో లభించాలంటే ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే. పెరుగును ఫేస్ ప్యాక్‌గా కూడా వాడచ్చు. ప్రతి రోజూ పెరుగును ఆహారంలో తీసుకుంటే ముడతలు తొలగిపోవడంతోపాటు చర్మంపై రంధ్రాలు, మచ్చలు లేకుండా ముఖచర్మం మృదువుగా తయారవుతుంది. పిల్లలకు చిన్నప్పటినుంచి పెరుగు తినే అలవాటు చేయడం మంచిది. పైన చెప్పుకున్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మందులు, సౌందర్య సాధనాలతో పనిలేకుండా యవ్వనంగా ఉండచ్చని నిపుణుల మాట. చదవండి: Carrot Juice: క్యారట్ జ్యూస్ తాగే అలవాటుందా?... ఈ విషయాలు తెలిస్తే.. -
Beauty Tips: బెల్లం వాష్‌తో ముఖం మీది ముడతలకు చెక్!
బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే కారకాలే కాదు.. అందాన్ని ఇనుమడింపజేసే గుణాలు కూడా ఉన్నాయి. బెల్లంతో తయారు చేసిన ఫేస్ వాష్ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను తగ్గిస్తుంది. బెల్లంతో పాటు శనగపిండి, పెరుగు కలిపి తరచుగా ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయండి! ►చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లుపోసి మరిగించాలి. ►బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, టీస్పూను పెరుగు వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాలపాటు గుండ్రంగా మర్దన చేయాలి. ►ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ►ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాసుకోవాలి. ►ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. ►వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి. చదవండి: Benefits Of Tamarind Syrup: చింతపండు సిరప్‌ను ముఖానికి రాసుకున్నా, నేరుగా తాగినా సరే! అద్భుత ప్రయోజనాలు! Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! -
రక్తహీనతతో బాధ పడుతున్నారా? ఈ ఫ్రూట్ తిన్నారంటే..
ఎక్కువ మంది ఇష్టంగా తినే పండ్లలో సపోటా పండు కూడా ఒకటి. ఈ సీజనల్ ఫ్రూట్ రుచికే కాకుండా పోషకాలకు కూడా రారాజే. సపోటా చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు ప్రముఖ నూటీషనిస్ట్ పూజ మఖిజా మాటల్లో మీకోసం.. సపోటా పండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కీలకంగా వ్యవహరిస్తుంది. కాల్షియంతోపాటు మాగ్నిషియం, పొటాషియం, జింక్, కాపర్, పాస్పరస్, సెలినియం వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే! ఇక రోగనిరోధకతను పెంపుకు ఉపయోగపడే ‘ఎ, బి, సి’విటమిన్లు దీనిలో మెండే. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. కడుపులో చికాకు కలిగించే బొవెల్ సిండ్రోమ్ నివారణకు, మలబద్ధకం సమస్య పరిష్కారానికి దీనిలో ఫైబర్ గుణాలు చక్కగా పనిచేస్తాయి. రక్తపోటును తగ్గించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. సపోటాలోని మాగ్నిషియం రక్తనాళాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది. పొటాషియం రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలోని ఐరన్ రక్తహీనతతో బాధపడే వారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంతేకాదు సపోటాపండులో చర్మ, జుట్టు సమస్యలను నివారించి, సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేసే గుణం కూడా కలిగి ఉంటుంది. దీనిలోని పోషకాలు శరీరంలోని హానికారకాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మంపై ఏర్పడే ముడతల నివారణకు తోడ్పడుతుంది. ఖర్జూరాలను సపోటాల్లో చేర్చి జ్యూస్ రూపంలో తీసుకున్న లేదా సపోటాను నేరుగా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పూజ మఖిజా సూచిస్తున్నారు. చదవండి: Healthy Food: ఎదిగే పిల్లలకు ఈ పోషకాహారం ఇస్తున్నారా? పాలు, గుడ్డు, పాలకూర.. -
ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది..
చర్మ సౌందర్యానికి అతివలు అత్యధిక ప్రాధాన్యమిస్తుంటారు. చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి, ముడతలు రాకుండా ఉండటానికి ఫేస్‌మాస్కులు వేసుకోవడం, క్రీములు, లోషన్లు పూసుకోవడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య తగ్గకపోగా, మరింత పెరుగుతుంది. చర్మాన్ని మృదువుగా, ముడతలు రాకుండా చూసుకోవడానికి ఇప్పుడు అంత కసరత్తు అవసరం లేదు. ప్రత్యామ్నాయ పరిష్కారంగా సరికొత్త గాడ్జెట్ మార్కెట్లోకి వచ్చింది. అదే ఈ ‘క్లినికల్ మైక్రోడెర్మాబ్రేషన్ మెషిన్’. క్లినికల్ పరీక్షల్లో ఈ గాడ్జెట్ పనితీరు సమర్థంగా నిరూపితమైంది. ఇది చర్మాన్ని శుభ్రం చేయడమే కాకుండా, టోనింగ్ చేస్తుంది. ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల ముఖ చర్మం ‘స్పా’ చేసినట్లుగా తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఇందులోని మైక్రోడెర్మ్ గ్లో సిస్టమ్ ముఖ చర్మానికి అధునాతన హోమ్ ఫేషియల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అత్యంత సులభంగా మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసి, వయసు ప్రభావాన్ని వెనక్కు నెట్టేస్తుంది. త్రీడీ టెక్నాలజీతో రూపొందిన ఈ గాడ్జెట్ అన్ని రకాల చర్మాలకూ సురక్షితమైనదే. ఇది పూర్తిగా వైర్లెస్,రీఛార్జబుల్. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చు. వారానికి ఒకసారి నాలుగు నిమిషాలసేపు ముఖానికి దీంతో ట్రీట్మెంట్ ఇస్తే, మంచి ఫలితం ఉంటుంది. ఈ గాడ్జెట్ ముందు భాగంలోని డిస్ప్లేలో స్పీడ్, మోడ్ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. డిస్ప్లే కింద పవర్ బటన్, స్పీడ్ పెంచుకునే బటన్, స్పీడ్ తగ్గించుకునే బటన్ వరుసగా ఉంటాయి. దీనిని ముఖంతో పాటు మెడ, చేతులు, కాళ్లు వంటి ఇతర భాగాలలోనూ ఉపయోగించుకోవచ్చు. దీని ధర 200 డాలర్లు (సుమారు రూ.15,000). -
మృదువైన మెరుపు
మార్కెట్లో కొన్న క్రీమ్స్ కంటే.. సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే చర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా కాపాడతాయి. మచ్చలు, మొటిమలు, ముడతలు... ఇలా ఒక్కటేమిటి వయసుతో వచ్చిన సమస్యలను, కాలుష్యం తెచ్చిపెట్టిన ఇబ్బందులను సహజసిద్ధమైన చిట్కాలు పరిష్కరిస్తాయి. అందుకే చాలా మంది ఈ చిట్కాలను తు.చ. తప్పకుండా పాటిస్తారు. నిపుణుల సలహాలు కూడా ఇవే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : కమలా రసం – 2 టీ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – అర టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్ మాస్క్: కీరదోస గుజ్జు – 3 టీ స్పూన్లు, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా కమలా రసం, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కొబ్బరి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కీరదోసగుజ్జు, ముల్తానీ మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మెరుస్తూనే ఉండిపోతారు
మచ్చలు, మొటిమలు, ముడతలు... ఇవి అందాన్ని మాయం చేసి ముఖాన్ని కాంతిహీనంగా తయారు చేసి మగువలను ఇబ్బంది పెట్టే సమస్యలు. వయసుతో వచ్చే ముడతలు కొన్నైతే... కాలుష్యంతో పెరిగే మచ్చలు, మొటిమలు మరికొన్ని. అవన్నీ పూర్తిగా తగ్గి.. మృదువైన మోమును సొంతం చేసుకోవాలంటే ఇలాంటి చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్ స్క్రబ్ : పెసరపిండి – 2 టీ స్పూన్లు, చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు మాస్క్: అరటిపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్, బాదం గుజ్జు – 1 టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు తయారీ : ముందుగా కొబ్బరిపాలు, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, చిక్కటిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు అరటిపండు గుజ్జు, బాదం గుజ్జు, గడ్డపెరుగు, శనగపిండి కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
నుదిటి మీద ముడతలు చెప్పే రహస్యం
పారిస్ : సాధారణంగా నుదిటి మీద ముడతలు ఎక్కువవుతుంటే ఏమనిపిస్తుంది?.. వయస్సు పెరుగుతోంది కదా! ముడతలు సహజమే.. అనుకుంటాం. కానీ నుదిటి మీద ముడతలకు కేవలం వయస్సుతోనే కాకుండా గుండె జబ్బులకు కూడా సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. నుదిటి మీద ముడతలు గుండె జబ్బులకు సూచనలుగా భావించవచ్చంటున్నారు. ఎక్కువ ముడతలు ఉన్నవారు కార్డియోవాస్క్యులర్ డిసీస్‌తో మరణించే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ‘‘హాస్పిటల్ యూనివర్సరీ డే టౌలౌస్’’ ప్రోఫెసర్ ‘యోలాండ్ ఎస్క్విరోల్’ జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జీవనశైలిలో మార్పులు చేయటం ద్వారా కార్డియోవాస్క్యులర్ను నియంత్రించవచ్చని యోలాండ్ తెలిపారు. వయసు పెరిగేకొద్ది గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఆహారపు అలవాట్లు, సరైన మందులను వాడటం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చని అన్నారు. యోలాండ్ ఎస్క్విరోల్ బృందం వివిధ వయస్సులకు చెందిన 3200 మందిపై 20 ఏళ్ల పాటు పరిశోధనలు జరిపింది. వారిలో ఇప్పటి వరకు 244 మంది వివిధ కారణాలతో చనిపోయారు. అయితే వారిలో నుదిటిపై ముడతలు లేని వారి కంటే ఉన్నవారు ఎక్కుగా గుండె సంబంధ జబ్బులతో చనిపోయినట్లు తేలింది. రెండు అంతకంటే ఎక్కువ ముడతలు ఉన్నవారు ముడతలు లేని వారికంటే పదిరెట్లు తొందరగా చనిపోయినట్లు వెల్లడైంది. -
మల్టీటాస్కింగ్ బొటాక్స్...
ఒక మందు ఎన్నో వ్యాధులకు చికిత్సగా మారింది. ఒకప్పుడు అందానికి వాడే కాస్మటిక్ డ్రగ్‌గా వీరవిహారం చేసిన బొటాక్స్... ఇప్పుడు మల్టీటాస్కింగ్ చేస్తూ ఆరోగ్యానికి సంజీవని అయ్యింది. పాము కాటుకు పాము విషమే పనిచేసినట్టు ఎన్నో వ్యాధులకు ఈ విషం అమృతంలా పనిచేస్తోంది. బొటాక్స్ కేవలం ముఖం మీద ముడుతలను తగ్గించడానికి పనికి వస్తుందనే మాట ఒకనాటి మాట. ఇప్పుడు అది మైగ్రేన్, డిప్రెషన్, కళ్లు పదే పదే చికిలించడం, మాటిమాటికీ మూత్రం వస్తుండటం, కాళ్లు చేతులకు అతిగా చెమటలు పట్టడం... ఇలాంటి ఎన్నో సమస్యలకు దివ్యౌషధం అయ్యింది. నమ్మశక్యం కాని విధంగా ఎన్నెన్నో సమస్యలకు బొటాక్స్ పరిష్కారమవుతోంది. అది ఎలాగో చూద్దాం రండి. తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడొక పేషెంట్. ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు అతడి మాటిమాటికీ వస్తోంది. అలా అతడు ఆ ధోరణిలో ఉండటం మొదటిసారి కాదు. ఎన్నో డోసుల యాంటీడిప్రెసెంట్ మందులు అతడి విషయంలో పనిచేయలేదు. ఇక ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ నార్మన్ రోసెంథెల్కు విభిన్నంగా ఓ ప్రయత్నం చేద్దామని అనిపించింది. ‘‘బొటాక్స్ ఇచ్చి చూద్దాం’’ అన్నారు డాక్టర్ నార్మన్. ఇది ఒక చిత్రమైన ఆలోచన. జార్జ్‌టౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ నార్మన్ రోసెంథెల్, జార్డ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన సైకియాట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎరిక్ ఫింజీ 2014లో ఒక అధ్యయన ఫలితాలను వెలువరిచారు. ఆ అధ్యయన సారాంశం చాలా విచిత్రంగా ఉంది. కొందరు రోగుల విషయంలో రోగులకు భరోసా కలిగించేందు ఉత్తుత్తి మందు వాడతారు. ఈ ఉత్తుత్తి మందును ‘ప్లాసెబో’ అంటారు. దీని వల్ల ఏదైనా ఫలితం కనిపిస్తే దాన్ని ప్లాసెబో ఎఫెక్ట్ అని చెబుతారు. ఏదో మందు వాడామంటూ రోగులకు భరోసా ఇచ్చేందుకు ఉపయోగించే మందుకాని మందూ, ఉత్తుత్తి మందూ అయిన ప్లాసెబోను తీసుకున్న వారి కంటే ... బొటాక్స్ ఇంజెక్షన్‌పై ఉంచిన రోగుల్లో డిప్రెషన్ లక్షణాలు గణనీయంగా తగ్గాయి. అదీ ఆరు వారాల్లో! ‘‘ఇది చాలా అసాధారణం. డిప్రెషన్‌కు బొటాక్స్ పనిచేస్తుంది. కానీ ఇంకా ఇది ప్రధాన (మెయిన్ స్ట్రీమ్) చికిత్స మాత్రం కాదు’’ అంటారు నార్మన్. పైగా ఔషధాల వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యూఎస్ ఫుండ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) దీన్ని ఆమోదించలేదు. అయితే ఇలాంటి లేబుల్ చేయని మందులను అత్యున్నత పరిశోధన స్థాయి సంస్థల్లో కేవలం ప్రయోగాత్మకంగా వాడటం కాస్త అసాధారణంగా జరిగేదే అయినా అసాధ్యమేమీ కాదు. కానీ ఒకసారి గనక ఎఫ్‌డీఏ అనుమతి లభిస్తే ప్రతి లైసెన్స్డ్ ప్రాక్టీషనర్ దాన్ని ఇక అవసరం ఉన్నా లేకపోయినా వాడేస్తూ ఉంటాడు. ఇలాంటి ఆఫ్ లేబుల్ (అంటే ప్రిస్క్రయిబ్ చేయడానికి ఇంకా అనుమతించని) మందుతో ఈ ప్రయోజనం ఉందని తెలిసింది. కేవలం దీన్ని ప్రయోగాత్మకమైన దశలోనే ఉంది. మరిన్ని అధ్యనాయనాలు ఇంకా చేయాల్సి ఉంది. నిజానికి దాన్ని ప్రధానంగా నరాలకు సంబంధించిన చికిత్సల పాటు ముఖంపై ముడుతలను తగ్గించడానికి కాస్మటిక్ ప్రయోజనం కోసం ఉపయోగిస్తుంటారు. అది డిప్రెషన్‌కూ పనిచేసినట్లు తేలింది. మరెన్నో రకాల సమస్యలకూ... కేవలం డిప్రెషన్‌ను తగ్గించడం కోసమే కాదు... ఇంకా 793 రకాల జబ్బులకు బొటాక్స్‌తో చికిత్స సాధ్యమవుతోంది. అరచేతులూ, అరికాళ్లూ బాగా తడిసిపోయినట్లుగా చెమటలు పట్టే వారిలో చెమటలు తగ్గించడం కోసం, మైగ్రేన్‌కు చికిత్సగానూ, మెడ ఇరుకుపట్టేసినప్పుడు (నెక్ స్పాజమ్స్) దాన్ని వదిలించడానికీ బొటాక్స్ ఉపయోగపడుతోంది. అంతేకాదు... గుండె లయ సరిగా లేనివారిలో (ఏట్రియల్ ఫిబ్రిలేషన్ / అరిథ్మియా కండిషన్స్‌లో) దాన్ని సరిచేయడానికి గుండెకు శస్త్రచికిత్స చేశాక కలిగే గుండెసంబంధిత ప్రమాదాల నివారణ కోసమూ బొటాక్స్‌ను ఉపయోగించవచ్చంటున్నారు నిపుణులు. ఇవన్నీ స్పష్టంగా నిరూపితమై ఎఫ్‌డీఏ ఆమోదం లభిస్తే... ఇక మందుల్లో అదో బ్లాక్‌బస్టర్ ఔషధంగా నిలుస్తుంది. బొటాక్స్ అంటే... బొటాక్స్ అంటే క్లాస్ట్రీడియమ్ బొటులినమ్ అనే బ్యాక్టీరియా నుంచి లభ్యమయ్యే ఒక విషం. ఈ గరళం నరాల మీద పనిచేస్తుంది. ఇలా నరాల మీద పనిచేసే విషాలను న్యూరోటాక్సిన్స్ అంటారు. ఒకవేళ ఈ విషంతో కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటే దానివల్ల పక్షవాతం వచ్చినట్లుగా మన ప్రధాన కండరాలన్నీ చచ్చుబడిపోతాయి. ఒక్కోసారి మరణం సైతం సంభవించవచ్చు. కొన్ని దేశాలు రసాయన యుద్ధం కోసం దీన్ని నిల్వ చేసుకున్నట్లు కొన్ని దృష్టాంతాలు లభ్యమయ్యాయి. అంతటి ప్రమాదకరమైనదీ విషం. ముడుతల ఉన్న చోట శరీరానికి అనుసంధానితమైన ఉన్న కండరాలకు దీన్ని ఇచ్చినప్పుడు నరాల నుంచి వచ్చే సిగ్నళ్లకు ఈ విషం అడ్డంకిగా నిలుస్తుంది. దాంతో ఆ ముడుతలు తెరచుకుంటాయి. అలా ఇది ముడుతలను నివారిస్తుంది. దాంతో ముఖం సాఫీగా మారి యౌవనంతో కనిపిస్తుంది. శక్తి అపారం..అభియోగాలూ అపరిమితం బొటాక్స్లోని శక్తి అపారం. అయితే దీన్ని ఉపయోగించడం పూర్తిగా రిస్క్ లేని వ్యవహారమేమీ కాదు. నిపుణులుంతా చెప్పేదేమిటంటే చాలా చిన్న మోతాదులో ఇది సురక్షితం. కేవలం నిపుణులైన లైసెన్స్డ్ ప్రొఫెషనల్స్ మాత్రమే దీన్ని ఉపయోగించాలన్నది అందరూ అంగీకరించే మాట. కానీ కేవలం వారు మాత్రమే అందునా దీన్ని ఉపయోగించాల్సిన ప్రయోజనాలకే ఉపయోగిస్తున్నారా అన్నది సందేహమే. రష్యాలో దీన్ని బార్బర్ షాపుల్లోనూ ఫేషియల్‌గా విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. అలా దీన్ని ఆఫ్ లేబుల్ ప్రయోజనాలకు దీన్ని ఉపయోగిస్తున్నారన్నది పరమ వాస్తవం. అందుకే దీన్ని ఉత్పాదనలో పాలుపంచుకుంటున్న అలెర్గాన్ ఫార్మస్యూటికల్స్పై ఇటీవల కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. మైగ్రేన్‌కూ ఉపయోగకరమని తెలిసిన తీరు విచిత్రం... బొటాక్స్ ఉత్పాదన సంస్థ అయిన అలెర్గాన్ దీన్ని మైగ్రేన్‌కు చికిత్సగా కనుగొన్న తీరు విచిత్రం. అలెర్గాన్ సంస్థ వైస్ ప్రసిడెంట్, ఆ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ అయిన డాక్టర్ మిట్చెల్ బ్రిన్ మాటల్లో చెప్పాలంటే... ‘‘తొలుత మైగ్రేన్‌కు బొటాక్స్ మందును క్లినికల్ ట్రయల్స్‌గా వాడినప్పుడు ఎన్నో సార్లు విఫలమయ్యాం. ఆ తర్వాత ఎంత సునిశితత్వంతో ఎంత మోతాదులో ఇస్తే అది మందుగా పనిచేస్తుందో అన్న విషయం అనేక వైఫల్యాల తర్వాతే తెలిసింది’’ అని అన్నారు. ‘‘బీవర్లీహిల్స్కు చెందిన ప్లాస్టిక్ సర్జన్లు దీన్ని ముఖం ముడుతలకు మందుగా ఇచ్చే సమయంలో కొంతమంది రోగుల్లో తలనొప్పి కూడా తగ్గినట్లు తెలియడంతో దీనిపై మరిన్ని అధ్యయనాలు జరిగాయి. దాంతో ఇది తలనొప్పులనూ తగ్గిస్తోందని తేలింది’’ అని పేర్కొన్నారు డాక్టర్ బ్రిన్. అయితే ఇప్పుడు దీన్ని మైగ్రేన్ నివారణ కోసం దాదాపు ముఖం, మెడ భాగాల్లో 31 చోట్ల దీన్ని ఇంజెక్షన్‌గా నమ్మకంతో తీసుకుంటున్నారు. అయితే ఆయా కేసుకు అనుగుణంగా దీని ప్రభావం మూడు నుంచి ఆర్నెల్ల వరకు మాత్రమే ఉంటుందన్నది వాస్తవం. ప్రమాదాలూ ఎన్నోన్నో... బొటాక్ అన్నది కేవలం ప్రయోజనకారిగానే కాదు... నిర్దిష్టంగా ఇవ్వాల్సిన కండరానికి కాకుండా ఇతర కండరాలకు ఇచ్చినప్పుడు ప్రమాదకారిగా కూడా పరిణమించింది. దీన్ని ఉపయోగించిన వారిలో చూపు అస్పష్టంగా మారడం (బ్లర్డ్ విజన్), మింగడంలో ఇబ్బందుల వంటివి కనిపించాయి. అయితే ఇవి చాలా అరుదు. దీని తీవ్రతను గుర్తించిన కొన్ని దేశాలు దీన్ని ఒక జీవరసాయన ఆయుధంగా కూడా వాడవచ్చని గుర్తించాయంటే దీని వల్ల ప్రమాదం ఎంతో గ్రహించవచ్చు. ఇప్పటికీ డిప్రెషన్‌కు దీన్ని వాడటంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. మెదడు నుంచి నరాల ద్వారా కండరానికి అందే సంకేతాలకు అడ్డంకి (బ్లాక్)గా ఇది పనిచేస్తుంది కాబట్టి దీని వల్ల చాలా అవాంఛిత ఫలితాలూ వచ్చే అవకాశం ఉందన్న విషయంలో ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. అయితే దీన్ని సురక్షితంగా వాడటం వల్ల వచ్చే ప్రయోజనాలపై గత 25 ఏళ్లలలో దాదాపు 3,200కు పైగా అధ్యయనాలు ఉన్నందున అనేక ఆఫ్–లేబుల్ అంశాలకు అధికారికంగా ఆమోదం ఇవ్వాలన్నది అలెర్గాన్ సంస్థ వాదన. మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10,000 యూనిట్ల బొటాక్స్‌ను వాడటం జరుగుతోంది. ఏయే చికిత్సల్లో ఎఫ్‌డీఏ ఆమోదం ఉందంటే... ∙మెల్లకన్ను ∙కనురెప్ప మూసుకుపోయే బ్లెఫరోస్పాజమ్కు చికిత్సగా ∙ముఖంలో సగభాగంలోని కండరాలు బిగుసుకుపోవడం ∙మెడను బలవంతంగా ఒకవైపు వంకరంగా ఉంచే సర్వికల్ డిస్టోనియా చికిత్స కోసం ∙అరచేతులు, అరిపాదాల్లో ఎక్కువ చెమట స్రవించడానికి చికిత్సగా ∙చేతులు, కాళ్లలో కండరాలు బాగా బిగుతైపోవడం (స్పాస్టిసిటీ) ∙దీర్ఘకాలిక మైగ్రేన్‌కు నివారణ కోసం ∙ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ∙ముఖంపై ముడుతలను తగ్గించేందుకు. ∙నిత్యం నోటి నుంచి లాలాజలం ఊరే కండిషన్లలో ∙కొందరు దీన్ని చిన్న పిల్లల్లో వచ్చే సెరెబ్రల్ పాల్సీ వంటి లక్షణాల్లోనూ దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎఫ్‌డీఏ ఆమోదం లేకపోయినా వాడుతున్న సందర్భాలు... మందుల ఉపయోగానికి అనుమతి ఇచ్చే ఎఫ్‌డీఏ అనుమతి లేకపోయినా ఆఫ్–లేబుల్ డ్రగ్‌గా వాడుతున్న సమస్యలివి... దవడ ఎముకలో పట్టేయడంతో నోరు తెరవలేని ‘లాక్ జా’ కేసుల్లో వెన్నునొప్పి కోసం సెక్స్ సమయంలో తీవ్రమైన నొప్పి వచ్చే సందర్భాల్లో డిప్రెషన్‌కు మందుగా మలద్వారం చీరుకుపోయే యానల్ ఫిషర్ కేసుల్లో నిత్యం పళ్లు కొరుకుతూ ఉండే కేసుల్లో డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ముడతల్ని మడిచేయండి
బ్యూటిప్స్ పెదవులు అందంగా ఉండాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. అందుకు ఒక్క లిప్‌స్టిక్ రాసుకుంటేనే సరి కాదు కదా. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. కాబట్టి పెదాలకు లిప్‌స్టిక్, లిప్‌బామ్ లాంటివి రాసుకునే ముందు స్క్రబ్ చేసుకోవడం మంచిది. అందుకో మంచి ఇంటి చిట్కా. మెత్తని కాఫీ పౌడర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని పెదాలకు మర్దన చేసుకుంటూ రాసుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కొని వెంటనే కొబ్బరి నూనె లేదా ఏదైనా నేచురల్ లిప్‌బామ్ రాసుకోవాలి. దాంతో పెదాలు మృదువుగా తయారవుతాయి. చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతోంది. ఆ ముడతలు రావడానికి అనేక కారణాలున్నాయి. మానసిక ఒత్తిడి, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, పొడి చర్మం ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి నెయ్యి, బాదం నూనె/ కొబ్బరి నూనె కలిపిన మిశ్రమాన్ని రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అరచేతుల్లాగే వాటి వెనుక భాగం (నకల్స్) కూడా అందంగా మెరవాలని అందరూ కోరుకుంటారు. మరి దానికి పాటించాల్సిన చిట్కా ఒకటుంది. అదే చేతులను నానబెట్టడం. ఓ గిన్నెలో గోరువెచ్చని నీళ్లు పోసి అందులో 5-6 చుక్కల గ్లిజరిన్, కొద్దిగా రోజ్‌వాటర్, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో రెండు చేతులను 10-15 నిమిషాల పాటు పెట్టి వెంటనే వేరే నీటితో కడిగేసుకోకుండా టవల్‌తో తుడుచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో చేతులను కడుక్కోవాలి. దాంతో నల్లగా కనపడే నకల్స్ కూడా అందంగా అరచేతి రంగులోకి వస్తాయి. -
మిసమిసల పనస
- ముఖంపై ముడతలతో చిన్న వయసులోనే ముసలివారిలా కనపడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ ఇంటి చిట్కా చదవండి. పనసపండు తిన్నాక వాటి గింజలను పడేస్తాం. అలా కాకుండా వాటిని రాత్రంతా చల్లటి పాలలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని రుబ్బి పేస్ట్‌లా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. అలా వారానికి నాలుగైదుసార్లు చేస్తే ముడతలు తప్పకుండా తగ్గిపోతాయి. - బజారులో దొరికే స్క్రబ్ల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే దాన్ని తయారు చేసుకోండి. అరకప్పు పచ్చి పాలలో టీ స్పూన్ టేబుల్ సాల్ట్ కలిపి దాన్ని ముఖానికి, మోచేతులకు రాసుకోండి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి. అది స్క్రబ్‌లా బాగా ఉపయోగపడుతుంది. - ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలంటే ముఖంపై మొటిమలు పెద్ద సమస్యగా మారతాయి. ఒక్క రాత్రిలో మొటిమలు తగ్గుముఖం పట్టాలంటే రాత్రి పడుకునే ముందు తెల్లటి టూత్ పేస్ట్‌ను మొటిమలపై రాసుకోవాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఉపయోగించే పేస్ట్ జెల్ కాకూడదు. - పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం చిన్న వయసువారు కూడా జుట్టు తెల్లబడటంతో హెయిర్ డైలు వేసుకుంటున్నారు. అలా కాకుండా తలకు ఆవాల నూనె రాసుకుంటే జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. క్రమంగా అది నలుపుగా తయారయ్యే అవకాశం ఉంది. సత్వర ఫలితాలు కావాలంటే ప్రతి రోజూ రాత్రి పడుకునే ముంది ఆవాల నూనెను మాడుకు సున్నితంగా మర్దనా చేసుకొని ఉదయాన్నే తల స్నానం చేయాలి. -
ముడతలు తగ్గాలంటే...
అందమె ఆనందం గుడ్డులోని తెల్లసొన, అర టీ స్పూన్ మీగడ, అర టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. రోజు విడిచి రోజు ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటే చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. అంగుళం పరిమాణంలో క్యారెట్ ముక్క, సగం బంగాళదుంప ముక్క కలిపి ఉడకబెట్టి, గుజ్జులా చేయాలి. దీంట్లో చిటికెడు పసుపు, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ముడతలు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది. రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్, ఒక చుక్క గ్లిజరిన్, 2 చుక్కల నిమ్మరసం కలపాలి. దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. ఇది ఇంట్లో చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అంతేకాదు, చర్మముడతలు పడదు. యవ్వనకాంతితో మెరుస్తుంది.