మచ్చలు, మొటిమలు, ముడతలు... ఇవి అందాన్ని మాయం చేసి ముఖాన్ని కాంతిహీనంగా తయారు చేసి మగువలను ఇబ్బంది పెట్టే సమస్యలు. వయసుతో వచ్చే ముడతలు కొన్నైతే... కాలుష్యంతో పెరిగే మచ్చలు, మొటిమలు మరికొన్ని. అవన్నీ పూర్తిగా తగ్గి.. మృదువైన మోమును సొంతం చేసుకోవాలంటే ఇలాంటి చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్
స్క్రబ్ : పెసరపిండి – 2 టీ స్పూన్లు, చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు
మాస్క్: అరటిపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్, బాదం గుజ్జు – 1 టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు
తయారీ : ముందుగా కొబ్బరిపాలు, తేనె ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, చిక్కటిపాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు అరటిపండు గుజ్జు, బాదం గుజ్జు, గడ్డపెరుగు, శనగపిండి కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment