Spots
-
చూడదగిన ప్రదేశాలు
ప్రకృతి శోయగాలు.. కనువిందు చేసే జలపాతాలు.. ప్రాచీన ఆలయాలు, శిల్పకళకు అద్దంపట్టే దేవాలయాలు, తిరుమల గిరులను పోలిన పర్వత శ్రేణులు.. అడుగడుగునా కనిపించే అలనాటి రాజమందిరాలు.. ఇలా ఎన్నెన్నో విశిష్టతలతో నిండిన ప్రాంతాలు పర్యాటక శోభితం కానున్నాయి. అవే ఉదయగిరి నియోజకవర్గంలోని సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలు. వీటిని అటవీశాఖ ఎకో టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఉదయగిరి దుర్గానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. చోళులు, పల్లవులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, రాయలు ఏలిన ఈ ప్రాంతంలో ఒకప్పుడు రతనాలు రాసులు పోసి అమ్మారని ప్రతీతి. రెండు శతాబ్దాలకు పూర్వం వరకు కూడా మహోన్నతంగా ఒక వెలుగు వెలిగిన ఉదయగిరి ప్రాంతం అనంతరం తన ప్రాభవాన్ని కోల్పోయింది. అలనాటి రాచరిక పాలనకు గుర్తులుగా మొండి గోడలు, శిథిల రాజభవనాలు నేటికీ ఈ ప్రాంతంలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రానికి వంద కి.మీ. దూరంలో నీటి ఆధారం లేని మెట్టప్రాంతంగా ఉదయగిరి అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. త్వరలో ఈ ప్రాంతం పర్యాటక శోభతో పరిఢవిల్లనుంది. తొలి సూర్యకిరణాలు పడే గిరి సముద్ర మట్టానికి 755 అడుగుల ఎత్తులో ఉదయగిరి కోట ఉంది. ఈ కోటపై 20 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. ఉదయగిరి కోట 5 కి.మీ. వ్యాసార్థంతో తిరుమల కొండను పోలి ఉంది. పచ్చిక బయళ్లతో, వన్యప్రాణులతో ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ ఉంటుంది. ఉదయించే సూర్యుడి తొలి కిరణాలు ఈ కొండ(గిరి)పైనే పడతాయి. విజయనగర సామ్రాజ్యంలో సూర్యకిరణాలు ఒక్క కొండ కోటపైనే ముందుగా పడుతుండడంతో దీనికి ఉదయగిరిగా నామకరణం చేశారని పెద్దలు చెబుతుంటారు. ఇంతటి చారిత్రాత్మక నేపథ్యం గల ఉదయగిరి దుర్గాన్ని శ్రీకృష్ణదేవరాయలు 18 నెలలుగా ఇక్కడే మకాంవేసి పాలన సాగించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అభివృద్ధిని మరిచిన గత పాలకులు ఉదయగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. దీనిపై గత ఐదు దశాబ్దాలుగా ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన గత పాలకులు ఆచరణలో విఫలమయ్యారు. ఎన్నికల వేళ హామీలు గుప్పించిన పారీ్టలు అధికారం చేపట్టగానే ఇచ్చిన హామీలు మరిచిపోయాయి. దీంతో పర్యాటకంగా ఈ ప్రాంత అభివృద్ధి కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఎంతో ప్రాశస్త్యం ఉన్న సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు, ఆ రెండు ప్రాంతాల్లో పర్యాటకులకు వసతులు కలి్పంచేందుకు అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పార్కులు, తాగునీటి వసతులు, రిఫ్రెష్ గదులు, గార్డెన్స్, జిమ్‌లు, పిట్నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, ప్రకృతిని వీక్షించేందుకు వాచ్ టవర్లు, సోలార్ షెడ్స్, లైట్లు ఇలా.. 45 రకాల పనులకు ఒక్కొక్క ప్రాంతంలో వసతులు కలి్పంచేందుకు రూ.2.78. కోట్ల వంతున అంచనాలతో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి ఉదయగిరిని 1512లో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించారు. గజపతులు ఉదయగిరి ప్రాంతంలో దేవాలయాలు, కోనేరులు నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఆలయాలు, నవాబులు నిర్మించిన మసీదులు, రాణి మందిరాలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, ఫిరంగి కోటలు, కోనేర్లు, సొరంగమార్గం నేటికీ ఉన్నాయి. ఉదయగిరి దుర్గం కింద పట్టణంలో తల్పగిరి రంగనాయకులస్వామి దేవాలయం, కృష్ణాలయం, కల్యాణమండపం నేటికీ దర్శనమిస్తున్నాయి. ఉదయగిరి నుంచి బండకిందపల్లికి వెళ్లే ఘాట్‌రోడ్డులో పాదచారుల కోసం రాయిలో తవి్వన బావి తానాబావిగా ప్రసిద్ధి. అనంతరం బ్రిటిష్ పాలనలో స్టేట్ దొర నిర్మించిన ప్రార్థనా మందిరం, తహసీల్దార్ కార్యాలయ భవన సముదాయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు ఉదయగిరికి 33 కి.మీ. దూరంలో అత్యంత ప్రాచీనమైన, అతి శక్తివంతమైన శైవక్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం ఉంది. సిద్ధేశ్వరానికి అతి సమీపంలో ఉన్న బూసానాయుడు కోటను కూడా అభివృద్ధి చేయవచ్చు. సిద్ధేశ్వరం నుంచి మరో 30 కి.మీ. దూరంలో పల్లవులు అద్భుత శిల్పాకళా నైపుణ్యంతో ఒకే రాతిలో చెక్కిన దేవాలయం, ద్వారపాలకులు, శివలింగాల నందీశ్వరుడు కొలువైన భైరవకోన ఉంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అక్కడి నుంచి మరో 24 కి.మీ. ముందుకు వెళితే నారాయణస్వామి ఆలయం, మరో 10 కి.మీ. దూరంలో హనుముని కొండ, మరో 25 కి.మీ. దూరంలో వెంగమాంబ ఆలయాన్ని సందర్శించవచ్చు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన మేకపాటి ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో కేంద్రం నుంచి కూడా మరికొంత నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి దోహదపడాలని వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉదయగిరి దుర్గానికి వెళ్లేందుకు రోప్ వేతోపాటు ఉదయగిరిలో ఉన్న ప్రాచీన దేవాలయాలను జీవనోద్ధరణ చేసేలా ప్రతిపాదనలు అందజేశారు. పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు ఉదయగిరి దుర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే సుమారు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాం. త్వరలో నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. రాయలు ఏలిన నేల కావడంతో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. – చంద్రశేఖర్, డీఎఫ్ఓ, నెల్లూరు -
ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలు
-
నేటి క్రీడా విశేషాలు
యాషెస్ తొలి టెస్టులో 251 పరుగులతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఫాస్ట్‌బౌలింగ్‌కు పర్యాయపదంగా నిలిచిన దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ టెస్టు క్రికెట్లో తన ఆటను ముగించాడు. క్రికెట్లో అత్యుత్తమ పేసర్‌గా తనదైన ముద్ర వేసిన డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్‌నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. పాకిస్తాన్‌తో జరిగే ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం అయిదుగురు సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. మరిన్ని క్రీడా విశేషాల కోసం కింది వీడియోని వీక్షించండి. -
అందాల రాశిలా
సహజసిద్ధమైన అందం నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే మచ్చలు, మొటిమలు లేని మృదుత్వం శాశ్వతంగా నిలవాలంటే ఏం చెయ్యాలి? ఇది చాలా మందికి తలెత్తే సమస్యే. పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. అందాల రాశిలా మెరవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : రోజ్ వాటర్ – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, స్క్రబ్ : పెసరపిండి – అర టేబుల్ స్పూన్, చిక్కటి పాలు – అర టేబుల్ స్పూన్, మాస్క్: క్యారెట్ గుజ్జు – రెండు టీ స్పూన్లు, కొబ్బరి పాలు – 1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా రోజ్‌వాటర్, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, చిక్కటిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ గుజ్జు, కొబ్బరిపాలు, ముల్తానీ మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
బ్యూటిప్
ఎంత చక్కని ముఖ కవళికలు ఉన్నా... చర్మం మీద మొటిమల మచ్చలు, గీతలు ఉంటే అందం మరుగున పడిపోతుంది. అందుకే ఇంట్లోనే కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే మీ ముఖారవిందం మీకే కనువిందు చేస్తుంది. ∙ఒక టేబుల్ స్పూన్ తేనెలో టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మూడు వారాలకు ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం మీదున్న నల్ల గీతలు, మచ్చలు తొలగిపోయి చంద్రబింబంలా మారుతుంది. ∙ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప తురుములో ఐదారు చుక్కల నిమ్మరసం, అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి. కొంచెం మంటగా ఉంటుంది. కాబట్టి ముఖమంతా పట్టించవద్దనుకుంటే మచ్చల మీద మాత్రమే రాయవచ్చు. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. అయితే పిగ్మెంటేషన్, సన్‌బర్న్ వంటి సమస్యలకు పై ప్యాక్‌ను ముఖమంతా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ∙వేపాకులను పచ్చిగా కాని ఉడికించి కాని పేస్టు చేసి ముఖానికి రాస్తే మచ్చలు, గుల్లలు విస్తరించకుండా తగ్గిపోతాయి. -
ఇంత చిన్న పాపకు డయాబెటిసా?
మా పాపకు ఆరేళ్లు. ఎప్పుడూ దాహం అంటూ ఉంటే తరచూ నీళ్లు తాగించేవాళ్లం. చర్మంపై ర్యాష్ వచ్చింది. మా డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి షుగర్ టెస్ట్ చేయించారు. పాపకు డయాబెటిస్ అని చెప్పారు. ఇంత చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్ వస్తుందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. – డి. పావని, కాకినాడ మీ పాప కండిషన్‌ను జ్యూవెనైల్ డయాబెటీస్ అంటారు. దీన్నే టైప్ ఒన్ డయాబెటిస్ అని కూడా అంటారు. ఇది నెలల పిల్లలకూ రావచ్చు. డయాబెటిస్ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంతవూత్రాన ఆందోళనపడాల్సిందేమీ లేదు. వీళ్లలో చక్కెర నియంత్రణ చేస్తూ ఉంటే మిగతా అందరు సాధారణమైన పిల్లల్లాగానే వీళ్లూ పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయాబెటిస్ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయనాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కారణం అవతాయి. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ వాడటం తప్పనిసరి. ఈ పిల్లల చేత క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్లు చేయించడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయడం కూడా అవసరం. డయాబెటిస్ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయాబెటిక్స్ ఉన్న పిల్లలయితే వాళ్లలో సాధారణంగా బరువ# పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీ–హైడ్రేషన్, చర్మంపై ర్యాషెస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియంత్రణ లేకపోతే పోనుపోనూ రక్తపోటు పెరగడం, వుూత్రపిండాల సమస్యలు. కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవేవీ రాకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా ఇన్హెలేషన్ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియలు అందుబాటులోకి రాబోతున్నాయి. పాంక్రియాటిక్ సెల్స్ (ఇన్సులిన్ తయారు చేసే కణాల) మార్పిడి శస్త్రచికిత్స కూడా పరిశోధన దశలో ఉంది. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియలు వురింత సులువవతాయి. మీరు పీడియాట్రీషియన్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి. పాపకు నత్తి వస్తోంది... తగ్గుతుందా? మా పాప వయసు ఎనిమిదేళ్లు. బాగా చదువుతుంది. అయితే ఇప్పటికీ నాలుక తిరగదు. కొంచెం నత్తిగా మాట్లాడుతుంది. డాక్టర్‌ను కలిస్తే అంతా మామూలు అయిపోతుంది. మాటలు బాగా వస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యంగా వస్తాయి అన్నారు. అయితే మా పాప కంటే చిన్నవాళ్లు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మా పాప మామూలుగా మాట్లాడగలుగుతుందా? మాకు తగిన సలహా ఇవ్వండి. – ఆర్. అంజలి, కొత్తగూడెం ఉచ్చారణ విషయంలో మీ పాపకు ఉన్న సమస్యను స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ఒక పదాన్ని ఉచ్చరించే ముందు అదేమాటను పదే పదే పలుకుతూ ఉండటం, లేదా గబుక్కున అనలేక దాన్ని పొడిగించడం, ఒక్కోసారి మాట ఆగిపోవడం కూడా జరగవచ్చు. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. ఈ సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, బాగా రాణించాలని కోరుతూ ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్ ఉంటే... ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందర (అర్లీ టీన్స్‌లో) 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇలాంటి పిల్లల్లో వాళ్లు చెప్పేది పూర్తిగా వినడం మన బాధ్యత. వాళ్లను తొందరపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేలా ప్రోత్సహించడం అవసరం. ఇలాంటి పిల్లలకు నిర్దిష్టంగా ఒకే ప్రక్రియతో సమస్య మటుమాయం అయ్యేలా చేయడం జరగదు. కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్ ఫ్లుయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మీ పాపకు చాలామటుకు నయమవుతుంది. మీరు మొదట స్పీచ్ థెరపిస్ట్‌ని కలిసి తగు చికిత్స తీసుకోండి. పాపకు ఒంటి మీద మచ్చలు... తగ్గేదెలా? మా పాపకు 13 ఏళ్లు. ఏడాది కిందటినుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి?– ఆర్. మీనాక్షి, విజయవాడ మీ పాపకు ఉన్న కండిషన్ నీవస్ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్ నీవస్ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్డ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్ మచ్చ. ఒంటిపై మచ్చలు పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావయయొలెట్ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... దీన్ని ఎక్సెషన్ థెరపీతో వాటిని తొలగించవచ్చు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ఆకర్షణీయమైన అందం
సహజసిద్ధమైన చిట్కాలను ఫాలో అయితే.. ఫేస్ క్రీమ్స్, లోషన్స్‌తో పనిలేదంటున్నారు నిపుణులు. ముఖంపైన మచ్చలు, మొటిమలు కనిపించకుండా ఉండేందుకు కెమికల్స్‌తో తయారుచేసిన మార్కెట్ ప్రొడక్ట్స్‌తో పనిలేదంటున్నారు. మరైతే సహజసిద్ధమైన చిట్కాలతో వచ్చే ఫలితాలను మీరూ ప్రయత్నించండి. కావాల్సినవి : క్లీనప్ : టమాటా గుజ్జు – 1 టేబుల్ స్పూన్, గడ్డపెరుగు – అర టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు మాస్క్: యాపిల్ గుజ్జు – 3 టీ స్పూన్లు, చిక్కటి పాలు – అర టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు తయారీ : ముందుగా టమాటా గుజ్జు, గడ్డపెరుగు ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, కీరదోస గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు యాపిల్ గుజ్జు, చిక్కటి పాలు, పసుపు, తేనె కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మెరుస్తూనే ఉండిపోతారు
మచ్చలు, మొటిమలు, ముడతలు... ఇవి అందాన్ని మాయం చేసి ముఖాన్ని కాంతిహీనంగా తయారు చేసి మగువలను ఇబ్బంది పెట్టే సమస్యలు. వయసుతో వచ్చే ముడతలు కొన్నైతే... కాలుష్యంతో పెరిగే మచ్చలు, మొటిమలు మరికొన్ని. అవన్నీ పూర్తిగా తగ్గి.. మృదువైన మోమును సొంతం చేసుకోవాలంటే ఇలాంటి చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్ స్క్రబ్ : పెసరపిండి – 2 టీ స్పూన్లు, చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు మాస్క్: అరటిపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్, బాదం గుజ్జు – 1 టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు తయారీ : ముందుగా కొబ్బరిపాలు, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, చిక్కటిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు అరటిపండు గుజ్జు, బాదం గుజ్జు, గడ్డపెరుగు, శనగపిండి కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మచ్చలేని అందం!
మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్ కేవలం ఆయా సమయాల్లో మాత్రమే మెరుపునిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే.. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – ఒకటిన్నర టీ స్పూన్, కీరదోస జ్యూస్ – ఒకటిన్నర టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : పెసరపిండి – 2 టీ స్పూన్లు, గడ్డ పెరుగు – ఒకటిన్నర టీ స్పూన్లు మాస్క్: క్యారెట్ గుజ్జు – 3 టీ స్పూన్లు, కిస్మిస్ గుజ్జు – 1 టీ స్పూన్, చిక్కటి పాలు – ఒకటిన్నర టీ స్పూన్ తయారీ : ముందుగా కొబ్బరి పాలు, కీరదోస జ్యూస్, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, గడ్డ పెరుగు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ గుజ్జు, కిస్మిస్ గుజ్జు, చిక్కటి పాలు బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మెరుపు చూడతరమా!
ఖర్చుతో కూడిన ఫేస్ క్రీమ్స్ కంటే.. ఖర్చులేని సహజసిద్ధమైన చిట్కాలే ముఖానికి అన్నివిధాలా మంచిదంటున్నారు నిపుణులు. అందుకే మరి మీ ముఖ సౌందర్యానికి కాసింత సమయాన్ని వెచ్చించండి. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం మరింత కాంతివంతం అవుతుంది. మచ్చలు, మొటిమలు లేని మృదువైన అందం మీ సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : రోజ్‌వాటర్ – 1 టీ స్పూన్, గ్లిజరిన్ – 3 లేదా 4 చుక్కలు స్క్రబ్ : కొబ్బరి పాలు – ఒకటిన్నర టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్, పెసర పిండి – అర టీ స్పూన్ మాస్క్ : చిక్కటి పాలు – 2 టీ స్పూన్లు, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు, శనగ పిండి – అర టీ స్పూన్ తయారీ : ముందుగా రోజ్‌వాటర్, గ్లిజరిన్ చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, బియ్యప్పిండి, పెసర పిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు చిక్కటిపాలు, కీరదోస గుజ్జు, శనగపిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఫేస్‌క్రీమ్స్‌తో పనిలేదు!
మేకప్‌తో వచ్చే అందం కంటే.. మేకప్ వేయకుండా మెరిసే అందానికే ఓటేస్తుంటారు చాలా మంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఖర్చులేని ఈ చిట్కాలను పాటించడానికి మాత్రం కాసింత సమయం వెచ్చించాల్సిందే. అప్పుడే ఫలితం కనిపిస్తుంది. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు మచ్చలు, మొటిమలు పూర్తిగా మాయమవుతాయి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : ఆలీవ్ నూనె – పావు టీ స్పూన్, దానిమ్మ జ్యూస్ – 2 టీ స్పూన్లు(చెత్త తొలగించి), బాదం పాలు – 1 టీ స్పూన్ (బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి.. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని, జ్యూస్‌లా మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని బాదం పాలు తయారు చేసుకోవాలి. వాటిని ఫ్రిజ్‌లో నిలువ చేసుకోవచ్చు.) స్క్రబ్ : దానిమ్మ గుజ్జు – 2 టీ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్, పచ్చిపసుపు – పావు టీ స్పూన్ మాస్క్ : గడ్డ పెరుగు – 2 టీ స్పూన్లు, యాపిల్ గుజ్జు – 3 టీ స్పూన్లు, పెసరు పిండి – 1 టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్ తయారీ : ముందుగా దానిమ్మ జ్యూస్, బాదం పాలు, ఆలీవ్ నూనె ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గుజ్జు, బియ్యప్పిండి, ఆరెంజ్ జ్యూస్, పచ్చి పసుపు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, యాపిల్ గుజ్జు, పెసరు పిండి, నిమ్మరసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. వెంటనే సబ్బు ముఖానికి రాసుకోకపోవడమే మంచిది. -
ముఖానికి సౌందర్యాహారం
బాదంపప్పును నానబెట్టి, పొట్టుతో సహా పేస్ట్ చేయాలి. టీ స్పూన్ బాదంపప్పు పేస్టులో ఆరు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకోసారి ఇలా రెండువారాల పాటు చేస్తే చర్మం కాంతివంతంగా, మృదువుగా అవుతుంది. అరటిపండు గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. నాలుగు టేబుల్ స్పూన్ల కాఫీ గింజలను పొడి చేసి, అందులో ఎనిమిది టేబుల్ స్పూన్ల బాదం పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో టీ స్పూన్ తే¯ð కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మం కాంతిమంతం అవుతుంది.కప్పు బార్లీ గింజలను పొడి చేసి, నీళ్లు కలిపి ఉడికించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారంలో మూడు రోజులు ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గిపోయి, ముఖ చర్మం నునుపుగా తయారవుతంది. బాగా పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మంలోని మలినాలు, మృతకణాలను శుభ్రపరుస్తుంది. ఫలితంగా ముఖం యవ్వన కాంతితో మెరుస్తుంది. విటమిన్ –ఇ క్యాప్సుల్‌ని కట్ చేసి, అందులో అర టీ స్పూన్ గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మానికి సరైన పోషణ లభిస్తుంది. చర్మం మృదువుగా అవుతుంది. -
మచ్చలు మటుమాయం
నున్నటి మృదువైన మోముపైన చిన్నపాటి మొటిమ వస్తే చాలు.. అది పూర్తిగా తగ్గించుకునేంతవరకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు మగువలు. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్, లోషన్స్ వంటివి ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : నిమ్మరసం – పావు టీ స్పూన్, రోజ్ వాటర్ – పావు టీ స్పూన్, బాదంపాలు – 1 టీ స్పూన్ (బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి.. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని, జ్యూస్‌లా మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని బాదం పాలు తయారు చేసుకోవాలి) స్క్రబ్ : బ్రౌన్ సుగర్ – 2 టీ స్పూన్లు, అరటి గుజ్జు – 2 టీ స్పూన్ల గంధం – అర టీ స్పూన్ (గంధం చెక్క నుంచి నూరి తీసుకోవాలి) మాస్క్ : శనగ పిండి – 1 టీ స్పూన్, కిస్మిస్ గుజ్జు – అర టేబుల్ స్పూన్కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు తయారీ : ముందుగా నిమ్మరసం, బాదంపాలు, రోజ్‌వాటర్ ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ సుగర్, అరటి గుజ్జు, గంధం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు శనగపిండి, కిస్మిస్ గుజ్జు, కొబ్బరి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
సహజమే సుందరం
పెరిగిపోతున్న కాలుష్యం కోరల నుంచి సౌందర్యాన్ని కాపాడుకోవాలన్నా, ఉన్న అందాన్ని రెట్టింపు చేసుకోవాలన్నా సౌందర్య లేపనాలను వాడాల్సిందే. అయితే ఆ లేపనాలు మార్కెట్లో దొరికే ఖరీదైన కాస్మెటిక్స్ మాత్రమే అనుకుంటే పొరబాటే. ఆహారంలో ఉపయోగించే అనేక పదార్థాలతోనే ఫేస్ ప్యాక్స్ సిద్ధం చేసుకుంటే ఆ అందం సహజసిద్ధంగా, శాశ్వతంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఫేస్‌ప్యాక్ వేసుకుని క్లీన్ చేసుకోవడమే కాకుండా ముఖానికి ఆవిరి పట్టడం, స్క్రబ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న ప్రయత్నాలు చెయ్యడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. నల్లటి మచ్చలు తగ్గి చక్కని వర్చస్సు వస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు – 3 టీ స్పూన్స్, ఆలివ్ నూనె – 1 టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్ స్క్రబ్ : టమాటా గుజ్జు – 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు – 1 టీ స్పూన్బ్రౌన్ సుగర్ – అర టేబుల్ స్పూన్ మాస్క్ : ఓట్స్ – 3 టీ స్పూన్స్, అనాస గుజ్జు – 2 టీ స్పూన్స్తేనె – 1 టీ స్పూన్, పాలు – 3 టీ స్పూన్స్ తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని పెరుగు, ఆలివ్ నూనె, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా గుజ్జు, కొబ్బరిపాలు, బ్రౌన్ సుగర్ ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు అనాస గుజ్జు, ఓట్స్, పాలు, తేనె ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, 15నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఫేస్ గ్లామర్ పెరుగుతుందిలా..
కాలుష్యం, పింపుల్స్... కారణంగా ముఖం మీద నల్లగా, గోధుమరంగు మచ్చలు వస్తుంటాయి, చంద్రబింబాన్ని సవాల్ చేస్తున్నట్లే ఉంటాయి. ఆ సవాల్‌కే సవాల్‌గా నిలిచే చక్కటి సమాధానాలు ఇవి. ∙బంగాళదుంపను తురిమి రసం తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ రసంలో ఐదారు చుక్కల నిమ్మరసం, అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ముఖమంతా పట్టించడానికి ఇష్టంలేకుంటే మచ్చల మీద మాత్రమే రాయవచ్చు. పట్టించిన ఇరవై నిమిషాల సేపు ఉంచాలి. చిన్న మచ్చలు లేదా ముఖమంతటిలో రెండు–మూడు ఉన్నప్పుడు ఇలా చేయవచ్చు. అయితే పిగ్మెంటేషన్, సన్‌బర్న్ వంటి సమస్యలకు ముఖమంతా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. వేపాకులను పచ్చిగా కాని ఉడికించి కాని పేస్టు చేసి దానిని ముఖానికి అప్లయ్ చేయాలి. కావాలంటే ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. ఎండకాలంలో పసుపు వేడి చేస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి నిరభ్యంతరంగా వాడవచ్చు. అయితే స్వచ్ఛమైన పసుపును వాడాలని మర్చిపోకూడదు. -
బంగారు దుంప
నెలరోజులకు ఒకసారైనా పార్లర్‌కి వెళ్లి ఫేసియల్ చేయించుకోవడం సాధారణమైన విషయం. మృతకణాలు, ట్యాన్, జిడ్డు తగ్గిపోయి ముఖ చర్మం తాజాగా ఉండాలంటే నేచురల్ పద్ధతిలో ఇంట్లోనే ఫేసియల్ చేసుకోవచ్చు. పచ్చి బంగాళదుంప రసాన్ని ఉపయోగించి చేసే ఈ పద్ధతి వల్ల ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గడమే కాకుండా చర్మం బంగారంలా మెరుస్తుంది. తయారీ ►2 బంగాళదుంపలు (తురమాలి) ► ఈ తరుగును మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ►పిడికి ట్లో బంగాళదుంప గుజ్జు పట్టుకొని గట్టిగా వత్తితే రసం వస్తుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ రసాన్ని వడకట్టుకోవాలి. స్టెప్:01 క్లెన్సింగ్ ►ఒక గిన్నెలో టీ స్పూన్ బంగాళదుంప రసాన్ని తీసుకోవాలి. టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి కలపాలి. ►దూది ఉండను పై మిశ్రమంలో ముంచి బుగ్గలు, చుబుకం, కనుల కింద, నుదురుభాగం, మెడ భాగం.. ఇలా ముఖమంతా తుడవాలి. ►2 నిమిషాలు వదిలేసి చల్లని నీళ్లతో కడిగేయాలి. ► 5 నిమిషాలు ఆవిరి పట్టాలి. దీంతో పోర్స్‌లో మురికి, జిడ్డు వదిలిపోతాయి. స్టెప్ :02 మలినాల తొలగింపుకు పోర్స్‌ని అలాగే వదిలేయకుండా సహజపద్ధతిలో ముఖకాంతి పెంచాలంటే..టీ స్పూన్ బియ్యప్పిండి, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ బంగాళదుంప రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 3 నుంచి 4 నిమిషాలు మృదువుగా వేళ్లతో వలయాకారంగా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. తర్వాత మళ్లీ ముఖాన్ని నీటితో కడిగేయాలి. దీని వల్ల చర్మంపై మలినాలు తొలగిపోతాయి. స్టెప్: 03 ఫేసియల్ మసాజ్ కలబంద రసం, బంగాళదుంప రసం సమపాళ్లలో తీసుకొని దీంట్లో ఏదైనా మసాజ్ క్రీమ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కిందనుంచి పైకి వేళ్లతో గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా 5 నిమిషాలు చేసిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల చర్మం మృదువుగా అవుతుంది. స్టెప్:04 ఫేస్ ప్యాక్ ∙టీ స్పూన్ బంగాళదుంప రసంలో 4–5 చుక్కల నిమ్మరసం, 2 టీ స్పూన్ల పాలు, టీ స్పూన్ గంధంపొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేసియల్ బ్రష్‌తో అద్దుకుంటూ ముఖమంతా రాయాలి. 20 నిమిషాలు వదిలేయాలి. తర్వాత కడిగేయాలి. బంగాⶠదుంపలో ఉండే ‘సి’ విటమిన్ చర్మం మలినాలను తొలగిస్తుంది. జీవం లేని చర్మానికి కాంతిని తెస్తుంది. వయసు కారణంగా వచ్చే ముడతలను నివారిస్తుంది. పొడిబారడం వంటి సమస్య కూడా తగ్గిపోతుంది. 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం తాజాదనం కోల్పోదు. -
ఖాళీ స్థలాలు..ఇక బ్యూటీ స్పాట్స్!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖాళీ స్థలాలు ఇక బ్యూటీ స్పాట్లుగా మారనున్నాయి. ఇవి చెత్త డంప్‌లుగా మారకుండా సర్వాంగ సుందరంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు ఖాళీ స్థలాల్లో సైతం చెత్తను వేయకుండా కట్టడి చేసేందుకు ఒక బృహృత్తర ప్రణాళిక రూపొందించింది. ముందుగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు వాటి చుట్టూ కీపాండ్ వాల్స్ నిర్మాణం చేపట్టి అందమైన పూల మొక్కలు, షో చెట్లు పెంచాలని నిర్ణయించింది. ఇందులో స్థానికుల సహాయ సహకారాలు, భాగస్వామ్యం ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనుంది. దీంతో విలువైన స్థలాలను పరిరక్షించడంతో పాటు వీటిని ఆట స్థలాలు, పార్కులుగా అభివృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు వీలవుతుందని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఈమేరకు ఆయా స్థలాల సుందరీకరణపై నెలరోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చాలా ప్రాంతాఆల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో చెత్తను వేయడం ద్వారా అవి మురికి, చెత్త డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. ఫలితంగా దోమల ఉత్పత్తికి కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ ఖాళీ స్థలాలో వేసే డంపింగ్ పై నగర వాసుల నుంచి పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందడం సర్వసాధారణంగా మారాయి. నేటి నుంచి సుందరీకరణ మాసం నగరంలోని ఖాళీ స్థలాల సుందరీకరణ కోసం ఒక నెల రోజులు ప్రత్యేకంగా కేటాయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఖాళీ స్థలాల సుందరీకరణ మాసంగా పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి డిప్యూటి, జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నగరంలోని తమ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని, వాటిలో జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలు అయితే వెంటనే ప్రహారీ గోడలను తగు అనుమతితో నిర్మించి మొక్కలను నాటించడం, మంచి ప్లే గ్రౌండ్లుగా మార్చాలని ఆదేశించారు. ఖాళీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవి అయితే ఆ స్థలం యజమానులను పొరుగువారితో కలిసి గుర్తించనున్నారు. ఆయా గుర్తించిన ఖాళీ స్థలాల్లో తిరిగి చెత్త వేయకుండా బోర్డులను ప్రదర్శిస్తారు. ఖాళీ స్థలాల ఇంటి యజమానులతో ప్రహరీ గోడలను నిర్మించే విధంగా చర్యలు చేపట్టి తిరిగి ఎవ్వరు కూడా చెత్తను వేయకుండా పొరుగు ఇంటి వారికి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ప్రతి ఖాళీ స్థలాలను ఒక జవాను లేదా ఎస్.ఎఫ్.ఏ లేదా ఇతర కార్మికుడిని ఇన్చార్జిగా నియమిస్తారు. ఎవ్వరూ కూడా చెత్త వేయకుండా నిరోధిస్తారు. అదేవిధంగా ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం వల్ల అధికంగా సమస్యలు ఎదుర్కొనే వారిని గుర్తించి వారిని స్వచ్ఛ రాయబారిగా నియమించనున్నారు. ఈ ఖాళీ స్థలాలు పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటే పార్కింగ్ ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. -
బ్యూటిప్స్
►ఎండకు కమిలిన ముఖం తిరిగి తాజాగా రావాలంటే... ఫేస్ప్యాక్లతోనే సాధ్యం. ఈ ప్యాక్‌లతో చర్మానికి సాంత్వన కలుగుతుంది, మచ్చలు పోతాయి, మేనిఛాయ మెరుగవుతుంది. ►ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పచ్చి బంగాళదుంపను తురిమి ముఖమంతా పరిచినట్లు ప్యాక్ వేయాలి. అరగంటకు చన్నీటితో కడగాలి. ► తాజా బత్తాయిరసాన్ని ముఖానికి రాసి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది స్కిన్ టోనర్‌గా పనిచేస్తుంది. ►రెండు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా పేస్టు చేయాలి. అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్‌చేసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ►ఎండకు కమిలిన ముఖం తిరిగి తాజాగా రావాలంటే... ఫేస్ప్యాక్లతోనే సాధ్యం. ఈ ప్యాక్‌లతో చర్మానికి సాంత్వన కలుగుతుంది, మచ్చలు పోతాయి, మేనిఛాయ మెరుగవుతుంది. ►ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పచ్చి బంగాళదుంపను తురిమి ముఖమంతా పరిచినట్లు ప్యాక్ వేయాలి. అరగంటకు చన్నీటితో కడగాలి. ►తాజా బత్తాయిరసాన్ని ముఖానికి రాసి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది స్కిన్ టోనర్‌గా పనిచేస్తుంది. ► రెండు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా పేస్టు చేయాలి. అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్‌చేసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. -
మచ్చలు పోవడానికి
అందమె ఆనందం ► కొబ్బరి నూనెలో గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకుని ముఖానికి పట్టిస్తే మచ్చలు పోతాయి. కొబ్బరి నూనె బదులుగా మరే ఇతర నూనెనయినా వాడవచ్చు. ►అర టీ స్పూన్ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి. ►కరివేపాకులో చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసి మచ్చల మీద రాసి పదిహేను నిమషాల తర్వాత కడగాలి. ►గోరింటాకు పొడిలో చిటికెడు పసుపు కలిపి మచ్చల మీద రాయాలి. ► ఎండిన తులసి, వేప, పుదీన ఆకులు ఒక్కొక్కటి వందగ్రాములు తీసుకుని అందులో చిటికెడు పసుపు వేసి కలుపుకుని నిలవ ఉంచుకోవాలి. వాడేటప్పుడు రెండు టీ స్పూన్ల పొడిలో తగినంత పన్నీరు వేసి కలుపుకుని ముఖానికి పట్టించాలి. ► తమలపాకుల్లో కొద్దిగా కొబ్బరినూనె కలిపి గ్రైండ్ చేసి మచ్చల మీద రాయాలి. ► తులసి ఆకులలో పసుపు వేసి గ్రైండ్ చేసి ముఖానికి పట్టించాలి. ► దోసకాయ రసాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే గీతలు, మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం బిగుతుగా కూడ ఉంటుంది. ► తేనెలో కుంకుమ పువ్వు కలిపి రంగరించి మచ్చల మీద రాయాలి. -
టీ డికాక్షన్‌తో మెరుపు
న్యూ ఫేస్ ఉదయాన్నే టీ తాగితే తాజాదనం భావన కలుగుతుంది, చురుగ్గా ఉంటామని చాలా మంది ఆలోచన. అందుకే ఉదయాన్నే రోజును టీతో మొదలుపెడతారు. కొంతమంది పాలు కలపకుండా బ్లాక్ టీని సేవిస్తారు. అంటే కేవలం డికాక్షన్ మాత్రమే అన్నమాట. టీ డికాక్షన్‌తో మేని మెరుపును కూడా పెంచుకోవచ్చు. కావాల్సినవి: ♦ స్పూన్ టీ పొడి ♦ అర స్పూన్ తేనె ♦ 2 స్పూన్ల బియ్యప్పిండి తయారీ: ⇒ కప్పున్నర నీళ్లను వేడి చేసి, అందులో టీ పొడి వేయాలి. అర కప్పు టీ అయ్యేంత వరకు మరిగించి, చల్లారనివ్వాలి. ⇒ టీ డికాక్షన్ చల్లారాక అందులో తేనె, బియ్యప్పిండి కలపాలి. ⇒ ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి, పూర్తిగా ఆరనివ్వాలి. ఇందుకు కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ⇒ ముఖం మీద నీళ్లు చిలకరించి, వేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. ⇒ తర్వాత చల్లని నీటితో మొత్తం కడిగేయాలి. ⇒ టీ డికాక్షన్లోని యాంటీ ఆక్సిడెంట్లు మచ్చలు, మొటిమలు తొలగించడానికి సహాయపడతాయి. ముడతలను నివారిస్తాయి. బియ్యప్పిండి మర్దన వల్ల మృతకణాలు తొలగిపోతాయి. తేనెలోని పోషకాలు సహజకాంతిని ఇస్తాయి. అందుకని, వారానికి 2-3 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మ సమస్యలు దరిచేరవు. స్నానానికి ముందు శరీరానికంత టీ డికాక్షన్‌తో ప్యాక్ వేసుకొని, తర్వాత స్నానం చేస్తే తాజాదనం అనుభూతి కలుగుతుంది. మేనికాంతి సహజసౌందర్యంతో నిగనిగలాడుతుంది. -
మెడపై మచ్చలు తొలగాలంటే...
బ్యూటిప్స్ బ్యూటిప్స్అందమైన మెడ... ముఖారవిందాన్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. చెమట, మురికి కారణంగా మెడ భాగమంతా నల్లగా, డల్‌గా అవుతుంది. ఈ సమస్య తీరాలంటే... అరటిపండుని గుజ్జులా చేసి... అందులో కాసిన్ని పాలు, రెండు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడ భాగానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికోసారి చొప్పున ఇలా కొన్ని వారాలు చేస్తే మంచి ఫలితముంటుంది. రోజూ స్నానం చేసేముందు మెడకి పెట్రోలియం జెల్లీ పట్టించాలి. కాసేపు అలా ఉంచి, తర్వాత మెత్తని పొడి బట్టతో రుద్ది తుడవాలి. ఇలా చేయడం వల్ల పేరుకున్న మురికి పోతుంది. తెల్లద్రాక్షలను మెత్తగా రుబ్బి గుజ్జులా చేయాలి. ఈ మిశ్రమంతో మెడను బాగా రుద్ది వదిలేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే మెడమీది చర్మం ఆరోగ్యంగా తయారై కాంతులీనుతుంది. మజ్జిగలో దూదిని ముంచి మెడ భాగాన్ని తరచూ శుభ్రం చేసుకుంటూ ఉంటే... మురికి, నలుపు పోయి అందంగా తయారవుతుంది. -
చర్మానికి ట్రీట్మెంట్
బ్యూటిప్స్ పుచ్చకాయ సహజమైన ఆస్ట్రింజెంట్. చర్మం మీద పేరుకుపోయిన కాలుష్యపు జిడ్డును తొలగిస్తుంది. మచ్చలు, గాయాల గీతలను పోగొడుతుంది. వార్ధక్యంతో వచ్చే ముడతలను నివారిస్తుంది. ఒక్కమాటలో... చర్మానికి ఇది... ట్రీట్ (విందు) మెంట్.అర కప్పు పుచ్చకాయ ముక్కలను మిక్సీలో బ్లెండ్ చేసి రసం తీసుకుని ఆ రసాన్ని దూదితో ఒంటికి పట్టించాలి. ఎండ ఉన్నప్పుడు ప్రతిరోజూ ఈ ప్యాక్ వేయవచ్చు. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో స్నానం చేయాలి. వాటర్మెలన్ ఎక్స్‌ఫోలియేషన్‌కు కూడా బాగా పని చేస్తుంది. పుచ్చకాయలోని తెల్లటి భాగాన్ని చిక్కగా పేస్టు చేసి ఒంటికి పట్టించి వలయాకారంగా మర్దన చేయాలి. ఇది మృతకణాలను తొలగించడంతోపాటు నాచురల్ క్లెన్సర్‌గానూ పని చేస్తుంది. చర్మం పటుత్వాన్ని పెంచుతుంది. -
ముఖ కాంతికి... బియ్యం నీళ్లు!
మచ్చలు, మొటిమలు సమస్య ఉంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి ముఖారవిందాన్ని కాంతిమంతంగా మార్చుకోవచ్చు. ♦ 3 టేబుల్ స్పూన్ల పిండిలో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కొబ్బరి నూనె, టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అర గంట లేదంటే పూర్తిగా ఆరేదాకా ఉంచి శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు రోజూ కూడా ఈ ప్యాక్‌ను వేసుకోవచ్చు. ♦ బియ్యాన్ని నానబెట్టి, బాగా కడిగి.. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాస్తూ మృదువుగా మసాజ్ చేయాలి. ఎండవేడికి నిస్తేజంగా మారిన చర్మం తాజాగా మారుతుంది. చర్మం ముడతలు పడటం కూడా తగ్గుతుంది. ♦ మొటిమలు, యాక్నె సమస్య ఉన్నవారు దాల్చిన చెక్కను పొడి చేసి, దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. యాక్నె సమస్య తగ్గుతుంది. చర్మం కాంతిమంతం అవుతుంది. ♦ టీ స్పూన్ తేనె, సగం అరటిపండు , పావు కప్పు పెరుగు కలిపి మెత్తటి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి, మృదువుగా రుద్ది, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. -
కళ్లజోడు మచ్చలకు కలబంద...
బ్యూటిప్స్ కళ్లజోడు పెట్టుకున్నవారికి ముక్కుకు ఇరువైపులా ముదురు గోధుమరంగులో, ఇంకొందరికి నల్లగా మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలు పోయి, చర్మం పూర్వపు రంగులోకి రావాలంటే...కలబంద జెల్‌ను మచ్చలు ఏర్పడిన చోట రాసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి.మచ్చలపై తేనె రాసి, 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.రెండు స్పూన్ల నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి, మచ్చలపై రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల కళ్లజోడు వల్ల అయిన మచ్చలను తగ్గించుకోవచ్చు. బంగాళదుంప రసాన్ని మచ్చలున్న చోట రాయాలి. లేదంటే, బంగాళదుంప ముక్కతో మచ్చలున్న చోట మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి. నారింజతొక్కలను ఎండబెట్టి, పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా పాలు పోసి, పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఈ విధంగా చేయాలి.అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును మచ్చలున్నచోట మాత్రమే కాదు, ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణాలు చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, మచ్చలున్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. {స్టాబెర్రీలో విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ గుజ్జును మచ్చల మీద రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. -
ముడతల్ని ఇలా మడతెట్టేద్దాం...
బ్యూటిప్స్ వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం సహజమే అయినప్పటికీ చర్మం ముడతలను నివారించడానికి ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు, పండ్లు, తేనెతో ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. బొప్పాయి గుజ్జు కాని, పైనాపిల్ జ్యూస్ కాని ముఖానికి పట్టించి మర్దన చేస్తే చర్మం మీద మచ్చలు, జిడ్డు పోయి చర్మం మృదువుగా మారుతుంది. చిన్నవయసులోనే ముడతలు రావడాన్ని నివారిస్తుంది. ఇలా వారానికొకసారి చేస్తుంటే ఫలితం ఉంటుంది. క్రమం తప్పకుండా ఫేషియల్ చేసుకుంటే ముడతలను, వార్ధక్య లక్షణాలను అదుపు చేయవచ్చు. అరకప్పు చెరకు రసంలో ఒక టేబుల్ స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించుకుని ఆరిన తర్వాత కడిగితే చర్మం బిగుతుగా మారుతుంది, ముడతలు పడదు. ఇలా వారానికొకసారి చేయాలి. రాత్రి పడుకునే ముందు ఆముదంతోకాని, కొబ్బరి నూనెతో కాని అరగంటసేపు మర్దన చేసుకుంటే ముడతలు దరిచేరవు. రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్లో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించుకుని అరగంట తరువాత శుభ్రపరచుకోవాలి. పొడి చర్మానికి ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాన్నిస్తుంది.