
బ్యూటిప్స్
ముఖంపై మచ్చలు, మొటిమలతో బాధపడుతున్నారా? చిన్న ఇంటి చిట్కా పాటిస్తే చాలు. చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు తీసుకొని, అందులో ఒక టీ స్పూన్ కుంకుమ పువ్వును వేయండి. చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ తేనెను ఆ మిశ్రమానికి కలిపి పది నిమిషాలు నానబెట్టి, ముఖానికి ప్యాక్ వేసుకోండి. తర్వాత పావుగంట ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
చిన్న వయసులోనే ముఖంపై ముడతలతో బాధపడే వారికి ఓ చిట్కా. వారానికి రెండుసార్లు సబ్జా గింజెల ఫేస్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. దాని కోసం రెండు టీ స్పూన్ల ఎండిన సబ్జా గింజలను పౌడర్‌లా చేసుకోండి. దానికి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే చాలు. ఇలా రెండు నెలలు చేస్తే ముఖంపై ముడతలన్నీ మటుమాయమై యవ్వనంగా కనిపిస్తారు.