పెరిగిపోతున్న కాలుష్యం కోరల నుంచి సౌందర్యాన్ని కాపాడుకోవాలన్నా, ఉన్న అందాన్ని రెట్టింపు చేసుకోవాలన్నా సౌందర్య లేపనాలను వాడాల్సిందే. అయితే ఆ లేపనాలు మార్కెట్‌లో దొరికే ఖరీదైన కాస్మెటిక్స్ మాత్రమే అనుకుంటే పొరబాటే. ఆహారంలో ఉపయోగించే అనేక పదార్థాలతోనే ఫేస్ ప్యాక్స్ సిద్ధం చేసుకుంటే ఆ అందం సహజసిద్ధంగా, శాశ్వతంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఫేస్‌ప్యాక్ వేసుకుని క్లీన్ చేసుకోవడమే కాకుండా ముఖానికి ఆవిరి పట్టడం, స్క్రబ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న ప్రయత్నాలు చెయ్యడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. నల్లటి మచ్చలు తగ్గి చక్కని వర్చస్సు వస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి :
క్లీనప్ : పెరుగు – 3 టీ స్పూన్స్, ఆలివ్ నూనె – 1 టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్
స్క్రబ్ : టమాటా గుజ్జు – 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు – 1 టీ స్పూన్‌బ్రౌన్ సుగర్ – అర టేబుల్ స్పూన్
మాస్క్ : ఓట్స్ – 3 టీ స్పూన్స్, అనాస గుజ్జు – 2 టీ స్పూన్స్‌తేనె – 1 టీ స్పూన్, పాలు – 3 టీ స్పూన్స్
తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని పెరుగు, ఆలివ్ నూనె, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా గుజ్జు, కొబ్బరిపాలు, బ్రౌన్ సుగర్ ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు అనాస గుజ్జు, ఓట్స్, పాలు, తేనె ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, 15నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment