ఎంత చక్కని ముఖ కవళికలు ఉన్నా... చర్మం మీద మొటిమల మచ్చలు, గీతలు ఉంటే అందం మరుగున పడిపోతుంది. అందుకే ఇంట్లోనే కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే మీ ముఖారవిందం మీకే కనువిందు చేస్తుంది.
∙ఒక టేబుల్ స్పూన్ తేనెలో టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మూడు వారాలకు ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం మీదున్న నల్ల గీతలు, మచ్చలు తొలగిపోయి చంద్రబింబంలా మారుతుంది.
∙ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప తురుములో ఐదారు చుక్కల నిమ్మరసం, అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి. కొంచెం మంటగా ఉంటుంది. కాబట్టి ముఖమంతా పట్టించవద్దనుకుంటే మచ్చల మీద మాత్రమే రాయవచ్చు. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. అయితే పిగ్మెంటేషన్, సన్‌బర్న్ వంటి సమస్యలకు పై ప్యాక్‌ను ముఖమంతా వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
∙వేపాకులను పచ్చిగా కాని ఉడికించి కాని పేస్టు చేసి ముఖానికి రాస్తే మచ్చలు, గుల్లలు విస్తరించకుండా తగ్గిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment