
కాలుష్యం, పింపుల్స్... కారణంగా ముఖం మీద నల్లగా, గోధుమరంగు మచ్చలు వస్తుంటాయి, చంద్రబింబాన్ని సవాల్ చేస్తున్నట్లే ఉంటాయి. ఆ సవాల్‌కే సవాల్‌గా నిలిచే చక్కటి సమాధానాలు ఇవి.
∙బంగాళదుంపను తురిమి రసం తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ రసంలో ఐదారు చుక్కల నిమ్మరసం, అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ముఖమంతా పట్టించడానికి ఇష్టంలేకుంటే మచ్చల మీద మాత్రమే రాయవచ్చు. పట్టించిన ఇరవై నిమిషాల సేపు ఉంచాలి.
చిన్న మచ్చలు లేదా ముఖమంతటిలో రెండు–మూడు ఉన్నప్పుడు ఇలా చేయవచ్చు. అయితే పిగ్మెంటేషన్, సన్‌బర్న్ వంటి సమస్యలకు ముఖమంతా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. వేపాకులను పచ్చిగా కాని ఉడికించి కాని పేస్టు చేసి దానిని ముఖానికి అప్లయ్ చేయాలి. కావాలంటే ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. ఎండకాలంలో పసుపు వేడి చేస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి నిరభ్యంతరంగా వాడవచ్చు. అయితే స్వచ్ఛమైన పసుపును వాడాలని మర్చిపోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment