
బాదంపప్పును నానబెట్టి, పొట్టుతో సహా పేస్ట్ చేయాలి. టీ స్పూన్ బాదంపప్పు పేస్టులో ఆరు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకోసారి ఇలా రెండువారాల పాటు చేస్తే చర్మం కాంతివంతంగా, మృదువుగా అవుతుంది. అరటిపండు గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. నాలుగు టేబుల్ స్పూన్ల కాఫీ గింజలను పొడి చేసి, అందులో ఎనిమిది టేబుల్ స్పూన్ల బాదం పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో టీ స్పూన్ తే¯ð కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
దీని వల్ల చర్మం కాంతిమంతం అవుతుంది.కప్పు బార్లీ గింజలను పొడి చేసి, నీళ్లు కలిపి ఉడికించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారంలో మూడు రోజులు ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గిపోయి, ముఖ చర్మం నునుపుగా తయారవుతంది. బాగా పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మంలోని మలినాలు, మృతకణాలను శుభ్రపరుస్తుంది. ఫలితంగా ముఖం యవ్వన కాంతితో మెరుస్తుంది. విటమిన్ –ఇ క్యాప్సుల్‌ని కట్ చేసి, అందులో అర టీ స్పూన్ గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మానికి సరైన పోషణ లభిస్తుంది. చర్మం మృదువుగా అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment