Soften
-
పోల్ ధమాకా : వడ్డీ రేట్లలో కోత..?
సాక్షి, బెంగళూర్ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ఆర్బీఐ వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన భేటీ గురువారం ముగియనుండటంతో వడ్డీ రేట్ల తగ్గింపుపై కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకోవచ్చని రాయటర్స్ పోల్ అంచనా వేసింది. గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియామకం తర్వాత గత నెలలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో తాజాగా మరోసారి వడ్డీ రేట్లలో కోత ఉంటుందని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటం, వృద్ధి మందగించిన నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపును ఆర్బీఐ సమర్ధించుకుంది. మారిన కేంద్ర బ్యాంక్ వైఖరితో తాజా సమీక్షలోనూ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ మొగ్గుచూపుతుందని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు, డిమాండ్‌ను పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించాల్సిందిగా పరిశ్రమ వర్గాలు ఎంతోకాలంగా ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు వడ్డీ రేట్ల తగ్గింపుతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలూ దిగివస్తాయని ఆయా కస్టమర్లు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆర్థిక వ్యవస్థ పురోగతికి బీజేపీ విజయం ఉపకరిస్తుందని రాయటర్స్ పోల్‌లో పలువురు పేర్కొన్నారు. -
ముఖానికి సౌందర్యాహారం
బాదంపప్పును నానబెట్టి, పొట్టుతో సహా పేస్ట్ చేయాలి. టీ స్పూన్ బాదంపప్పు పేస్టులో ఆరు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకోసారి ఇలా రెండువారాల పాటు చేస్తే చర్మం కాంతివంతంగా, మృదువుగా అవుతుంది. అరటిపండు గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. నాలుగు టేబుల్ స్పూన్ల కాఫీ గింజలను పొడి చేసి, అందులో ఎనిమిది టేబుల్ స్పూన్ల బాదం పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో టీ స్పూన్ తే¯ð కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మం కాంతిమంతం అవుతుంది.కప్పు బార్లీ గింజలను పొడి చేసి, నీళ్లు కలిపి ఉడికించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారంలో మూడు రోజులు ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గిపోయి, ముఖ చర్మం నునుపుగా తయారవుతంది. బాగా పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మంలోని మలినాలు, మృతకణాలను శుభ్రపరుస్తుంది. ఫలితంగా ముఖం యవ్వన కాంతితో మెరుస్తుంది. విటమిన్ –ఇ క్యాప్సుల్‌ని కట్ చేసి, అందులో అర టీ స్పూన్ గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మానికి సరైన పోషణ లభిస్తుంది. చర్మం మృదువుగా అవుతుంది. -
ఆర్బీఐపై మెత్తబడిన కేంద్రం: మార్కెట్ల జోరు
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు మధ్య ఏర్పడిన వివాదంనేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గడంతో స్టాక్‌మార్కెట్లు పుంజుకున్నాయి. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిన కాపాడతామని హామీ యిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో కీలక సూచీలు లాభాల్లోకి మళ్ళాయి. ఒకదశలో 200 పాయింట్లకు పైగా కోల్పోయి సెన్సెక్స్ అదే స్థాయిలో రీబౌండ్ అయింది. తీవ్ర ఒడిదుడుకులతో లాభ నష్టాలమధ్య ఊగిసలాడిన సెన్సెక్స్, ప్రస్తుతం 353పాయింట్లు పుంజుకుని 34, 244వద్ద, 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10 312వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. టెక్ మహీంద్రా 7 శాతం, మైండ్‌ట్రీ 6 శాతం చొప్పున జంప్‌చేయగా.. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఇన్ఫీబీమ్, టాటా ఎలక్సీ, నిట్ టెక్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు హెచ్డీఎఫ్సీ, ఐబీ హౌసింగ్, యూపీఎల్, సన్ ఫార్మా, సిప్లా, ఇండస్ఇండ్, యాక్సిస్ లాభపడుతున్నాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, జీ, ఎన్టీపీసీ, మారుతీ, ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో టాటా స్టీల్, కోల్ ఇండియా, జిందాల్ స్టెయిన్లెస్, నాల్కో, హిందాల్కో, ఎన్ఎండీసీ, హింద్ జింక్, సెయిల్, వేదాంతా నష్టపోతున్నాయి. అటు దేశీయ కరెన్సీ కూడా డాలరు మారకంలో పుంజుకుంది. ఉదయం ట్రేడింగ్‌లో 74 స్థాయికి దిగజారిన రూపాయి ఈ స్థాయినుంచి కోలుకుని 73.93 వద్ద కొసాగుతోంది. -
మృదువైన మర్దన
బ్యూటిప్స్ వెంట్రుకలు రాలడం, నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు పోషకాహరం లోపంతో తలెత్తుతాయి. అలాగే సరైన పోషణ లేకపోవడం వల్ల కూడా కురుల నిగనిగలకు సమస్యలు ఎదురవుతాయి. పరిష్కారంగా... కొబ్బరి నూనె, నువ్వుల నూనెలతో మాడుకు మసాజ్ చేసుకోవాలి. ఈ నూనెలలో ఉసిరి లేదా మందార పువ్వు లేదా బంతిపువ్వు లేదా కరివేపాకు వేసి వేడి చేయాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. అలాగే వెంట్రుకల చివర్లకు రాయాలి. రాత్రి పడుకునేముందు ఇలా మసాజ్ చేసుకొని, మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల మాడుపై గల మృతకణాలు తొలగిపోతాయి. చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది. షాంపూల వాడకం వల్ల జుట్టు పాడైపోతుందనుకునేవారు సహజసిద్ధంగా లభించే వాటితో తలంటుకోవచ్చు. కుంకుడుకాయ, షికాయలను నానబెట్టి రసం తీసి దీంట్లో ఉసిరిపొడి, మందారపువ్వుల పొడి, టీ స్పూన్ బంకమట్టి, మెంతి పొడి, గోరింటాకు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ట్రేలలో పోసి డీప్ ఫ్రీజర్‌లో పెట్టాలి. ఈ ఐస్‌క్యూబ్స్‌ని కావల్సినప్పుడు తీసి ఉపయోగించడం సులువు అవుతుంది. పదిహేను రోజులకొకసారి పప్పులతో తయారుచేసిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇందుకు శనగపిండి, మినప్పిండి, పెసరపిండి సమభాగాలుగా తీసుకోవాలి. ఈ పిండిలో నీళ్లు లేదా కుంకుడు రసంలో కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసి, మృదువుగా రుద్దుతూ కడిగేయాలి. -
పాదాల చర్మం మృదువుగా..!
బ్యూటిప్స్ పాదాల పగుళ్లు పెద్ద సమస్యగా బాధిస్తుంటుంది. పాదాల అందాన్ని దెబ్బతీయడమే కాదు, నొప్పినీ తెచ్చే సమస్యలకు విరుగుడుగా!పావు కప్పు వెనిగర్, అరకప్పు వెచ్చని నీళ్లలో కలపాలి. ఆ నీళ్ళను పాదాలకు, మడమలకు రాయాలి. మిగిలిన నీళ్లను వెడల్పాటి టబ్‌లో పోసి అందులో పాదాలను ఉంచాలి. 10-15 నిమిషాల తర్వాత తడి క్లాత్‌తో అదిమిపట్టి తుడవాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా పాదాలకు పట్టిన బాక్టీరియా కూడా నశిస్తుంది. తర్వాత మంచి నీళ్లతో శుభ్రపరుచుకొని, పొడి క్లాత్‌తో తుడిచి బాడీ లోషన్ రాయాలి. రెండు-మూడు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తుంటే పగుళ్లు తగ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా అవుతుంది. మరిగించిన నీళ్లలో నిమ్మరసం, రాతిఉప్పు కలపాలి. ఈ నీళ్లుగోరువెచ్చగా అయ్యాక అందులో పది నిమిషాల సేపు పాదాలను ఉంచితే ఫంగస్ నశించడమే కాకుండా దుర్వాసనా తగ్గుతుంది.రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసానికి టేబుల్ స్పూన్, పెట్రోలియమ్ జెల్లీ కలిపి శుభ్రం చేసుకున్న పాదాలకు రాయాలి. తర్వాత సాక్స్‌లు వేసుకోవాలి. రోజూ రాత్రిపూట ఈ జాగ్రత్త తీసుకుంటే నిమ్మరసం మృతకణాలను తొలగిస్తుంది. పెట్రోలియమ్ జెల్లీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. టేబుల్ స్పూన్ బియ్యప్పిండిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో పాదాలను, మడమలను బాగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వుల నూనె రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.