సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు మధ్య ఏర్పడిన వివాదంనేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గడంతో స్టాక్‌మార్కెట్లు పుంజుకున్నాయి. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిన కాపాడతామని హామీ యిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో కీలక సూచీలు లాభాల్లోకి మళ్ళాయి. ఒకదశలో 200 పాయింట్లకు పైగా కోల్పోయి సెన్సెక్స్ అదే స్థాయిలో రీబౌండ్ అయింది. తీవ్ర ఒడిదుడుకులతో లాభ నష్టాలమధ్య ఊగిసలాడిన సెన్సెక్స్, ప్రస్తుతం 353పాయింట్లు పుంజుకుని 34, 244వద‍్ద, 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10 312వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ భారీ లాభాల్లో కొనసాగుతోంది.
టెక్ మహీంద్రా 7 శాతం, మైండ్‌ట్రీ 6 శాతం చొప్పున జంప్‌చేయగా.. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఇన్ఫీబీమ్, టాటా ఎలక్సీ, నిట్ టెక్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐబీ హౌసింగ్, యూపీఎల్, సన్ ఫార్మా, సిప్లా, ఇండస్‌ఇండ్, యాక్సిస్ లాభపడుతున్నాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, జీ, ఎన్‌టీపీసీ, మారుతీ, ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో టాటా స్టీల్, కోల్ ఇండియా, జిందాల్ స్టెయిన్‌లెస్, నాల్కో, హిందాల్కో, ఎన్‌ఎండీసీ, హింద్ జింక్, సెయిల్, వేదాంతా నష్టపోతున్నాయి.
అటు దేశీయ కరెన్సీ కూడా డాలరు మారకంలో పుంజుకుంది. ఉదయం ట్రేడింగ్‌లో 74 స్థాయికి దిగజారిన రూపాయి ఈ స్థాయినుంచి కోలుకుని 73.93 వద్ద కొసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment