మచ్చలు పోవడానికి
అందమె ఆనందం
► కొబ్బరి నూనెలో గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకుని ముఖానికి పట్టిస్తే మచ్చలు పోతాయి. కొబ్బరి నూనె బదులుగా మరే ఇతర నూనెనయినా వాడవచ్చు.
►అర టీ స్పూన్ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి.
►కరివేపాకులో చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసి మచ్చల మీద రాసి పదిహేను నిమషాల తర్వాత కడగాలి.
►గోరింటాకు పొడిలో చిటికెడు పసుపు కలిపి మచ్చల మీద రాయాలి.
► ఎండిన తులసి, వేప, పుదీన ఆకులు ఒక్కొక్కటి వందగ్రాములు తీసుకుని అందులో చిటికెడు పసుపు వేసి కలుపుకుని నిలవ ఉంచుకోవాలి. వాడేటప్పుడు రెండు టీ స్పూన్ల పొడిలో తగినంత పన్నీరు వేసి కలుపుకుని ముఖానికి పట్టించాలి.
► తమలపాకుల్లో కొద్దిగా కొబ్బరినూనె కలిపి గ్రైండ్ చేసి మచ్చల మీద రాయాలి.
► తులసి ఆకులలో పసుపు వేసి గ్రైండ్ చేసి ముఖానికి పట్టించాలి.
► దోసకాయ రసాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే గీతలు, మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం బిగుతుగా కూడ ఉంటుంది.
► తేనెలో కుంకుమ పువ్వు కలిపి రంగరించి మచ్చల మీద రాయాలి.