![how to know your honey pure Here is how to test the purity](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Honey-healthbenefits.jpg.webp?itok=9VzglBzM)
భారతదేశంలో చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్లకు నిస్పందేహంగా వాడే పదార్థం తేనె (Honey). తేనెటీగల ద్వారా సహజంగా లభించే ఒక తీపి పదార్థం (Natural Sweetener). తేనె వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే కొలెస్ట్రాల్, కొవ్వు సోడియం లేని చక్కటి ఆహారం కూడా తేనె. ప్రపంచవ్యాప్తంగా తేనెను ఎక్కువగా ఉపయోగించేది మన భారతీయులే. అయితే కోవిడ్ తరువాత తేనె వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది విశ్వవ్యాప్తమైంది. పెరిగిన డిమాండ్ తో తేనె కల్తీ కూడా పెరిగింది. మార్కెట్లో ఇప్పుడు స్వచ్ఛమైన తేనె, బ్రాండ్లు చాలా తక్కువే అని చెప్పవచ్చు. మరి స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలి.
తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. తేనెలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు, ఖనిజాలు దండిగా లభిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాల మాట దేవుడెరుగు కల్తీ తేనె అనేక సమస్యలకు కారణమవుతోంది. అందుకే స్వచ్ఛమైన తేనె ఏది. నకిలీది ఏది గుర్తించడం, దాని గురించి అవగాహనకలిగి ఉండటం చాలా అవసరం.
తేనె కల్తీ ఎలా?
తేనె కల్తీ చౌకైన పదార్థాలతో చేయబడుతుంద. ఇది ప్రయోగశాల పరీక్ష పారామితులను తేలిగ్గా దాటేస్తుంది. .
మొలాసిస్: ఇది మందపాటి , జిగటగా చెరకు రసం. చెరకు రసం మరిగించడం వల్ల తేనెలా తీపిగా ఉండే టర్బిడ్, ముదురు ద్రావణం లభిస్తుంది.
ద్రవ గ్లూకోజ్: ఇది మిఠాయి చ బేకింగ్ పరిశ్రమలో ఉపయోగించే మెరిసే , మందపాటి ద్రావణం. ఇది మార్కెట్లో సులభంగా లభిస్తుంది.
ఇన్వర్ట్ షుగర్: ఇది మెరిసే , మందపాటి ద్రవం, శుద్ధి చేసిన చక్కెరను ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు.
హై గ్లూకోజ్ కార్న్ సిరప్ (HFCS): ఇది స్వీట్‌కార్న్‌ను ప్రాసెస్ చేసినప్పుడు ఉత్పత్తి అవుతుంది.ఇది అచ్చం తేనెలాగానే కనిపిస్తుంది.
రైస్ సిరప్: ఈ సిరప్ బియ్యం ప్రాసెసింగ్ సమయంలో ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తేనెను కల్తీ చేసే వాటిలో ఒకటి.
ఇదీ చదవండి: సిల్వర్ స్క్రీన్ క్వీన్ : దేవుడా, ఇలాంటి జీవితం పగవాడిక్కూడా వద్దు!
తేనె స్వచ్ఛమైనదా లేదా కల్తీదా ఎలా తనిఖీ చేయాలి?
బొటనవేలిపై కొద్దిగా తేనె రాసుకొని చూడండి. నిజమైన తేనె చిక్కగా ఉంటుంది.
తేనెను ఒక గ్లాసు నీటిలో నెమ్మదిగా వేయండి. తేనె నీటిలో కరగకుండా గ్లాసు అడుగు భాగానికి చేరుకుంటే తేనె స్వచ్ఛమైనది. నీటిలో కరిగిపోతుంటే అది నకిలీది అని అర్థం.
వెనిగర్ నీటిలో కొన్ని చుక్కల తేనె కలపండి. మిశ్రమం నురగలు రావడం ప్రారంభిస్తే అది కచ్చితంగా నకిలీదే.
తేనెలో అగ్గిపుల్లను ముంచి, ఆపై వెలిగించడానికి ప్రయత్నించడం ద్వారా ఇంకో పరీక్ష చేయవచ్చు. తేనె స్వచ్ఛంగా ఉంటే, అగ్గిపుల్ల సులభంగా మండుతుంది. కల్తీ దైతే అగ్గిపుల్లను వెలిగించడం కష్టం కావచ్చు.
ఇదీ చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!
తేనె-ప్రయోజనాలు
తేనె సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. తేనె అనేది గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.
కాలిన గాయాలు, దెబ్బలకు పై పూత చికిత్సగా వాడవచ్చు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు సూపర్-హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అందుకే మొటిమల నివారణలోకూడా పనిచేస్తుంది
తేనెలో కాటలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చిన్న మంట నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందిహృదయనాళ వ్యవస్థను రక్షించండి
గ్యాస్ట్రోఎంటెరిటిస్ లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది. జ్ఞాపకశక్తి లోపాలను నివారిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment