చర్మాన్ని బిగుతుగా చేసి.. ముఖాన్ని మెరిపిస్తుంది! మెషీన్‌ ధర? | Beauty Tips: How Hydrafacial Machine Works | Sakshi
Sakshi News home page

Beauty: చర్మాన్ని బిగుతుగా చేసి.. ముఖాన్ని మెరిపిస్తుంది! ఈ మెషీన్‌ ధర ఎంతంటే..

Published Mon, Jan 9 2023 4:59 PM | Last Updated on Mon, Jan 9 2023 5:06 PM

Beauty Tips: How Hydrafacial Machine Works - Sakshi

అందాన్ని సంరక్షించుకోవాలంటే.. శ్రద్ధ ఎంత అవసరమో.. పోగొట్టుకున్న అందాన్ని తిరిగి రప్పించుకోవాలంటే చికిత్స కూడా అంతే అసవరం. ఈ హైడ్రో డెర్మాబ్రేషన్‌  వాటర్‌ డెర్మాబ్రేషన్‌ డీప్‌ క్లెన్సింగ్‌ ఫేషియల్‌ మెషిన్‌ .. అదిరిపోయే ట్రీట్మెంట్‌ని అందిస్తోంది.. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా! 

డీప్‌ క్లీనింగ్, బ్లాక్‌ హెడ్‌ క్లియర్‌.. వంటి చాలారకాల చికిత్సలను ఇవ్వడంలో ఇది దిట్ట. ఆక్సిజన్‌  స్ప్రే గన్, కోల్డ్‌ హేమర్‌.. వంటి అటాచ్‌మెంట్‌ హెడ్స్‌ని కలిగిన ఈ మెషిన్‌ .. వయసుతో వచ్చే ముడతలను, పిగ్మెంటేషన్‌ మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది.  చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముఖాన్ని మెరిపిస్తుంది. 

ఈ డివైజ్‌లో  లైట్‌ థెరపీ మాస్క్‌ (చిత్రంలో గమనించొచ్చు) ఉంటుంది. ఇది మొత్తంగా 7 రంగుల్లో పని చేస్తూ.. ఏడు వేరువేరు ప్రయోజనాలను ఇస్తుంది. ఈ మాస్క్‌ (ఇలాంటి మాస్స్స్‌ను  విడిగా మన బ్యూటీజర్‌లో చూశాం)ని ముఖానికి అమర్చుకుని.. సురక్షితంగా ట్రీట్మెంట్‌ పొందొచ్చు. మెషిన్‌  వెనుక వైపు రెండు వాటర్‌ ట్యాంక్స్‌ ఉంటాయి.

వాటిలో నీళ్లు నింపుకుని.. ఆప్షన్స్‌ను బట్టి.. దీన్ని వినియోగించుకోవచ్చు. అలాగే మెషిన్‌ ముందువైపే డిస్‌ప్లే కనిపిస్తూ ఉంటుంది. ఇది చర్మంపైన పేరుకున్న మురికిని, చర్మం లోతుల్లోకి చేరుకున్న మృతకణాలను తొలగించి యవ్వనాన్ని తిరిగి తెస్తుంది.

దీని ధర సుమారుగా 279 డాలర్లు. అంటే 23,068 రూపాయలు. ఇలాంటి మోడల్స్‌.. అదనపు సౌకర్యాలతో ఆన్లై‌న్లో అందుబాటులో ఉన్నాయి. అయితే పలు రివ్యూస్‌ని ఫాలో అయ్యి.. కొనుగోలు చేసుకోవడం మంచిది.  

చదవండి: Anti Aging Foods: ప్రతిరోజూ బొప్పాయి పండు, దానిమ్మ తింటున్నారా? అయితే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement