చర్మంపై బ్లాక్ స్పాట్స్, మచ్చలు కనిపించడం అన్ని వయసుల వారిలోనూ వచ్చే సమస్యే. కానీ, ఇటీవల యువతలో ఈ సమస్యను ఎక్కువ చూస్తున్నాం.
ఎవరిలో అధికం అంటే...
అధిక బరువు ఉన్నవారిలో మెడపైన, వీపు పైన మచ్చలు కనిపిస్తుంటాయి. నేరుగా ఎండ బారిన పడేవారికి చేతులు, ముఖం, పాదాలపై ట్యాన్ ఏర్పడుతుంది. కొంతమందిలో విటమిన్ల లోపం వల్ల మంగు మచ్చలు కూడా వస్తున్నాయి. సాధారణంగా యుక్తవయసులో మొటిమలు వస్తుంటాయి.
మొటిమలను గిల్లడం, వాటిలో ఉండే పస్ తీయడం.. వంటి వాటి వల్ల మచ్చలు, ఇంకొందరిలో చర్మంపై గుంటలు ఏర్పడవచ్చు. కొందరికి సరైన అవగాహన లేక బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతిని మచ్చలు ఏర్పడతాయి. ఇంకొందరిలో చర్మం రకరకాల ఇన్ఫెక్షన్లకు లోనవుతుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మచ్చలు ఏర్పడి, అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.
త్వరగా గుర్తించి...
ముందుగానే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే ఇబ్బంది ఉండదు. థైరాయిడ్, ఒబేసిటీ, పీసీఓడీ సమస్యలు ఉంటే వాటికి చికిత్స తీసుకోవాలి. ఎండ నేరుగా తాకకుండా సన్ స్క్రీన్ వాడటం ముఖ్యం. వీటిలో బ్లూ లైట్ కాంపొనెంట్ ఉండే సన్‌స్క్రీన్స్ బెటర్.
మంగు మచ్చలు వస్తున్నాయనుకునేవారు వారి వంశంలో ఈ సమస్య ఉంటే, ముందే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
మొటిమలు, యాక్నె వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని గిల్లకూడదు. పింపుల్స్ తగ్గే ఆయిట్‌మెంట్స్‌ను నిపుణుల సూచనల మేరకు వాడాలి. పింపుల్స్ ఉండేవారు పింపుల్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. ఏజ్‌తోపాటు వస్తాయి అవే పోతాయి అనుకోకూడదు. ఒకసారి చెక్ చేసుకొని, చికిత్స తీసుకోవాలి.
విటమిన్ బి12 లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. క్యారట్, టొమాటో, విటమిన్– సి ఉన్న పండ్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఆన్‌లైన్‌లో చూసి, ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ వాడకూడదు. అవి మీ చర్మతత్త్వానికి సరిపడతాయా లేదా అని చూడాలి.
ఇంట్లో సౌందర్య లేపనాలను ఉపయోగిస్తూ, పార్లర్ ఫేసియల్స్ చేయకూడదు. ఏదైనా ఒకదాని మీద మాత్రమే ఆధారపడాలి.
(చదవండి: సక్సెస్‌ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment