మిసమిసల పనస
- ముఖంపై ముడతలతో చిన్న వయసులోనే ముసలివారిలా కనపడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ ఇంటి చిట్కా చదవండి. పనసపండు తిన్నాక వాటి గింజలను పడేస్తాం. అలా కాకుండా వాటిని రాత్రంతా చల్లటి పాలలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని రుబ్బి పేస్ట్‌లా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. అలా వారానికి నాలుగైదుసార్లు చేస్తే ముడతలు తప్పకుండా తగ్గిపోతాయి.
- బజారులో దొరికే స్క్రబ్‌ల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే దాన్ని తయారు చేసుకోండి. అరకప్పు పచ్చి పాలలో టీ స్పూన్ టేబుల్ సాల్ట్ కలిపి దాన్ని ముఖానికి, మోచేతులకు రాసుకోండి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి. అది స్క్రబ్‌లా బాగా ఉపయోగపడుతుంది.
- ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలంటే ముఖంపై మొటిమలు పెద్ద సమస్యగా మారతాయి. ఒక్క రాత్రిలో మొటిమలు తగ్గుముఖం పట్టాలంటే రాత్రి పడుకునే ముందు తెల్లటి టూత్ పేస్ట్‌ను మొటిమలపై రాసుకోవాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఉపయోగించే పేస్ట్ జెల్ కాకూడదు.
- పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం చిన్న వయసువారు కూడా జుట్టు తెల్లబడటంతో హెయిర్ డైలు వేసుకుంటున్నారు. అలా కాకుండా తలకు ఆవాల నూనె రాసుకుంటే జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. క్రమంగా అది నలుపుగా తయారయ్యే అవకాశం ఉంది. సత్వర ఫలితాలు కావాలంటే ప్రతి రోజూ రాత్రి పడుకునే ముంది ఆవాల నూనెను మాడుకు సున్నితంగా మర్దనా చేసుకొని ఉదయాన్నే తల స్నానం చేయాలి.