
Athiya Shetty- Skin Care Tips: పార్టీలకు రెడీ అయ్యే క్రమంలో బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదంటోంది బాలీవుడ్ తార అథియా శెట్టి. ఈ చిట్కాలు పాటిస్తే మిలా మిలా మెరిసే మోముతో అందరిలో ప్రత్యేకంగా నిలవొచ్చని చెబుతోంది. ఈ స్టార్ కిడ్ చెప్పిన బ్యూటీ టిప్స్ ఆమె మాటల్లోనే.. ‘‘చర్మ సౌందర్యానికి మా అమ్మ నాకు చెప్పిన ఒకటే మంత్రం బొప్పాయి.
రోజువారీ అలవాటుగా బొప్పాయి గుజ్జు, ఒక అర స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ఆరెంజ్ జ్యూస్ అన్నీ కలిపి ముఖం, మెడకు పట్టించి ఐదు నిమిషాల పాటు ఉంచి కడిగేస్తాను. ఆ తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటా. పార్టీకి, ఫంక్షన్‌కి వెళ్లేముందు బొప్పాయి గుజ్జు, కొన్నిచుక్కల రోజ్ వాటర్ కలిపి ఒక మాస్క్‌లాగా వేసుకుంటా.
పదిహేను నిమిషాలు ఉంచుకుని చల్లటి నీటితో కడిగేస్తా. ఆ మెరుపుతో వెళ్లిన చోట నేను ప్రత్యేకంగా కనిపిస్తానని వేరే చెప్పాలా! ’’ అంటూ తన తల్లి చెప్పిన సౌందర్య చిట్కాలు పంచుకుంది. కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి- మనా శెట్టి దంపతుల గారాల పట్టి అథియా.
తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించేందుకు 2015లో బీ-టౌన్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హీరో మూవీతో తెరంగేట్రం చేసిన ఆమె.. నవాబ్‌జాదే, మోతీచూర్ చక్నాచూర్ వంటి సినిమాల్లో నటించింది. ఇక త్వరలోనే... టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమవుతోంది ఈ అందాల తార.
చదవండి: Beauty Tips: మొటిమలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఇలా చేస్తే సరి!
Comments
Please login to add a commentAdd a comment