
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సెలబ్రిటీలకు లాక్‌డౌన్‌లో కాస్తా విరామ సమయం దొరికింది. ఈ క్రమంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న ఫొటోలను వీడియాలు తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అంతేగాక చిన్ననాటి జ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ వాటికి సంబంధిచిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి తన కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్‌ల చిన్ననాటి ఫొటోను శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అంతేగాక వారి ముద్దు పేర్లను కూడా ప్రకటించాడు. (వైరలైన కాజోల్ మెహందీ ఫంక్షన్ ఫొటో!)
లాక్‌డౌన్: ‘వీరిని చూస్తే గర్వంగా ఉంది’
ఈ ఫొటోలో ఉన్నది ‘సాధు’ ‘సాతాన్’.. వీరిలో ఒకరూ బాలీవుడ్ స్టార్‌గా కూడా ఎదిగారు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇక సునీల్ శెట్టి పోస్టు చూసిన అతడి బాలీవుడ్ స్నేహితుడు ఇందులో ఎవరిని సాధు అని పిలిస్తారు.. ఎవరిని సాతాన్ అని పిలుస్తారని అని అడగ్గా.. ‘‘ఆహాన్ ఎప్పుడూ నా సాధునే’’ అంటూ సునీల్ శెట్టి సమాధానం ఇచ్చాడు. ఇక బాలీవుడ్ భామ అతియాను తాను ‘సాతాన్’ అని పిలుస్తానని చెప్పకనే చెప్పాడు. ఇక ఈ పోస్టుకు అతియా రూమర్డ్ బాయ్ ఫ్రెండ్, ఇండియన్ క్రికెటర్ కెఎల్ రాహుల్ లాఫింగ్ ఎమోజీతో తన స్పందనను తెలపడం గమనార్హం. (గర్ల్‌ఫ్రెండ్ విషెస్‌కు రిప్లై ఇవ్వని రాహుల్)
Comments
Please login to add a commentAdd a comment