
ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ, ప్రముఖ నటుడు సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం సాగుతూ ఉంది. వీరిరువురు పబ్‌లు, పార్టీలు, డిన్నర్ డేట్‌లు అంటూ చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే కలియ తిరిగినా.. తమ ప్రేమ వ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు, అలాగని ఖండించనూ లేదు. కాగా, రాహుల్, అతియాల ప్రేమాయణం వార్తలకు మరింత బలం చేకూర్చేలా తాజాగా ఓ సన్నివేశం చోటుచేసుకుంది. వీరిద్దరూ కలిసి తొలిసారి ఓ యాడ్‌లో నటించారు.
అందులో వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దీంతో ఇక పెళ్లే తరువాయని వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. 'నుమి ప్యారిస్' అనే లగ్జరీ గాగుల్స్ యాడ్‌లో వీరిద్దరూ నటించారు. ఈ యాడ్‌లో ఇరువురు అద్భుతంగా హావభావాలు పలికించారని, సరికొత్త అవతారంలో మతి పోగొట్టారని అతియా తండ్రి సునీల్ శెట్టి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రశంసించాడు. దీంతో వీరి పెళ్లికి లైన్‌క్లియర్ అయ్యిందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన ఫొటోలపై వారు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ క్వీన్ అనుష్క శర్మ బాటలోనే రాహుల్-అతియా నడుస్తున్నాడని, ఇక పెళ్లి చేసుకోవడమే ఆలసమ్యని కామెంట్లు చేస్తున్నారు.
గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే ఓ యాడ్‌లో నటించాక ఒక్కటయ్యారు. కాగా, రాహుల్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ నిమిత్తం టీమిండియా ప్రకటించిన 15 మంది సభ్యుల బృందంలో అతనికి చోటు దక్కలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగినా.. జట్టు యాజమాన్యం అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. బహుశా ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌లో అతనికి అవకాశాలు లభించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: నా జీవితంలో పెళ్లి తర్వాత చాలా మార్పులొచ్చాయి: బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment