goggles
-
‘కార్తికేయ 2’ ట్రైలర్ ఈవెంట్, వేదికపైనే ఫ్యాన్‌కి నిఖిల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కార్తికేయ 2’. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ఇది. నిన్న(జూన్ 24) ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌తో పాటు హీరోయిన్, డైరెక్టర్ ఇతర నటీనటులు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు వచ్చిన వీరాభిమానికి నిఖిల్ అక్కడిక్కడే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ సదరు అభిమాని ఈవెంట్లో లేచి మాట్లాడుతూ.. నిఖిల్ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన నటించిన ప్రతి సినిమా చూస్తున్నానని చెప్పాడు. ఆయనంటే తనకెంతో ఇష్టమంటూ నిఖిల్‌పై అభిమానం కురిపించాడు. ఇక అతడి అభిమానానికి ఫిదా అయిన నిఖిల్ అతడి వేదిక మీదకు పిలిచాడు. అనంతరం తన గుర్తుగా అక్కడికక్కడే తన ఫ్యాన్‌కు తను పెట్టుకున్న కూలిగ్గ్లాసెస్ బహుమతిగా ఇచ్చాడు. ఈవెంట్ అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సదరు ఫ్యాన్ మహేశ్ దాసరి ట్విటర్లో షేర్ చేశాడు. చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన అతడి ట్వీట్‌పై నిఖిల్ స్పందిస్తూ.. ‘బ్రో.. ఆ గ్లాసెస్‌ను జాగ్రత్త చూసుకోండి. నాపై మీరు చూపించిన ప్రేమకు గుర్తుగా వెంటనే నేను ఇచ్చిన గిఫ్ట్ అది’ అని రాసుకొచ్చాడు. కాగా సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం.. ద్వారకా నగరం అనే ఆసక్తికర కథాంశంతో ఈ కార్తికేయ 2 తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్గా వైవా హర్ష కనిపించనున్నారు. Take good care of the Goggles bro … My spontaneous gift for ur love ❤️🙏🏽 #Karthikeya2 trailer event.. https://t.co/KKTHtuz264 — Nikhil Siddhartha (@actor_Nikhil) June 25, 2022 -
హాట్ సమ్మర్...కూల్ లుక్స్
గేదర్డ్ ఫెర్న్ కుర్తా... పూల డిజైన్లు ప్రతి వేసవి రూపాన్ని శాసించే ఎవర్ గ్రీన్ ట్రెండ్. అదే పాత పూల ప్రింట్లతో విసిగిపోయి ఉంటే, కలెక్షన్‌కు మసాలా యాడ్ చేయడానికి ఈ ఫెర్న్ ప్రింట్ కుర్తాని ప్రయత్నించవచ్చు. ఈ వేసవి సీజన్లో ’గేదర్డ్ ఫెర్న్ కుర్తా’ను బ్లూస్/ గ్రీన్స్‌లో తగిన అలంకరణతో ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. మరింత స్టైలిష్‌గా కనిపించడం కోసం ఈ కాటన్ ఫెర్న్ కుర్తాను ఆఫ్ఘని ప్యాంటుతో కలపవచ్చు. కాటన్స్ జైపూర్ డాట్‌కామ్ ధర: రూ.2,199 కూల్ గాగుల్స్... ఎండవేడిమి నుంచి రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్ తప్పనిసరిగా ఉండాలి. అటు కళ్లకు చల్లదనంతో పాటు జెయిన్ ఎక్స్ అర్నెట్టె అందించే గుల్వింగ్ హాటెస్ట్ లుక్‌ని ఎలివేట్ చేస్తుంది. బ్లీచ్డ్ టై–డై కలర్ ఎఫెక్ట్స్, ఫ్లాట్ మిర్రర్స్ కలయిక మరింత అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. గెస్స్టోర్స్, గెస్ డాట్‌కామ్ ధర: రూ.8,079 టెన్నిస్ నెక్లెస్.. యాక్సెసరీస్ మన రూపాన్ని మెరుగుపరుస్తాయి, అయితే వేసవిలో ఎలా పడితే అలా స్టైల్‌ని యాక్సెసరైజ్ చేయడం కష్టం. ఈ అందమైన స్టీల్ కోటింగ్ కలిగిన ఎ–టెన్నిస్ నెక్లెస్ సీజనల్ యాక్సెసరీస్ ఎంపికగా చక్కగా నప్పుతుంది. గెస్స్టోర్స్, గెస్ డాట్‌కామ్ అజియో & టాటా క్లిక్ ధర: రూ. 8,079 గ్రీన్ ఫ్లోరల్ ఫ్లోవీ డ్రెస్.. స్నేహితులతో కలిసి డే అవుట్‌కి వెళ్లినా లేదా వర్క్ ప్లేస్‌కి లీజర్‌గా వెళ్లినా... ఈ ఫ్లూ డ్రెస్ వేడి వాతావరణంలో చల్లగా ఉంచుతుంది. ఈ బొటానికల్ డ్రెస్‌ని వేసవిలో కుర్తాగా దుస్తులుగా ధరించవచ్చు. బాడీస్‌పై అందమైన చతురస్రాకార బట¯Œ లతో ఉన్న ఈ దుస్తులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అమెజాన్, టాటా క్లిక్ అండ్ అజియో ధర: రూ 6190 -
అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు కదూ.. నిజం తెలిస్తే, ఆశ్చర్యపోతారు
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులను చూస్తుంటే.. ఎవరో అనుమానాస్పదుల్లా కనిపిస్తున్నారు కదూ? ఎందుకు వారు ముఖాన్ని దాచుకుంటున్నారు? ఏదైనా ల్యాబ్‌లో పనిచేస్తూ .. మరిచిపోయి డైరెక్ట్‌గా రోడ్డు మీదకు వచ్చేశారా? లేదా.. మనుషులను పోలి ఉండే గ్రహంతర వాసులా? ఇలాంటి వింత ఆలోచనలు అనుమానాలన్నీ మీ బుర్రను తొలిచేయడం మొదలుపెట్టే ఉంటాయి. (చదవండి: పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత) అసలు నిజం తెలిస్తే, ఆశ్చర్యపోతారు. మాస్కును మించి ముఖాన్ని కవర్ చేసేసేలా వీరు ధరించినవి కొత్తరకం గాగుల్స్. నిజం.. ఇవి సరికొత్త కళ్లజోళ్లు. సాధారణంగా ఎండ నుంచి కళ్లను రక్షించే సన్గ్లాసెన్ను మాత్రమే ఇప్పటివరకు చూసి ఉంటారు. కానీ, ఈ సన్‌గ్లాసెస్ మాత్రం మీ ముఖం మొత్తాన్ని ఎండ ప్రభావం నుంచి కాపాడుతాయి. జపాన్‌కు చెందిన ఓ కంపెనీ అధిక నాణ్యత గల పాలికార్బొనేట్‌తో వీటిని రూపొందించింది. సాధారణ సన్ గ్లాసెస్లాగే వీటిని కూడా చెవుల పైభాగం నుంచి ధరించొచ్చు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ గాగుల్స్ ఎండ నుంచే కాదు, కరోనా వంటి మహమ్మారి రోగాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరైనా వీటిని ధరించొచ్చు. ఆన్లైన్ మార్కెట్లో వివిధ పరిమాణాలు, ధరల్లో ఇవి లభిస్తున్నాయి. (చదవండి: కరోనా ఆంక్షలు.. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి.. అప్పుడొచ్చింది ఓ మైండ్ బ్లోయింగ్ ఐడియా!) -
KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే
ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ, ప్రముఖ నటుడు సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం సాగుతూ ఉంది. వీరిరువురు పబ్‌లు, పార్టీలు, డిన్నర్ డేట్లు అంటూ చెట్టాపట్టాలేసుకు తిరగడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే వీరూ బాహటంగానే కలియ తిరిగినా.. తమ ప్రేమ వ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు, అలాగని ఖండించనూ లేదు. కాగా, రాహుల్, అతియాల ప్రేమాయణం వార్తలకు మరింత బలం చేకూర్చేలా తాజాగా ఓ సన్నివేశం చోటుచేసుకుంది. వీరిద్దరూ కలిసి తొలిసారి ఓ యాడ్‌లో నటించారు. View this post on Instagram A post shared by NUMI Paris (@numiparis) అందులో వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దీంతో ఇక పెళ్లే తరువాయని వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. 'నుమి ప్యారిస్' అనే లగ్జరీ గాగుల్స్ యాడ్‌లో వీరిద్దరూ నటించారు. ఈ యాడ్‌లో ఇరువురు అద్భుతంగా హావభావాలు పలికించారని, సరికొత్త అవతారంలో మతి పోగొట్టారని అతియా తండ్రి సునీల్ శెట్టి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రశంసించాడు. దీంతో వీరి పెళ్లికి లైన్‌క్లియర్ అయ్యిందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన ఫొటోలపై వారు భారీ ఎత్తున స్పందిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ క్వీన్ అనుష్క శర్మ బాటలోనే రాహుల్-అతియా నడుస్తున్నాడని, ఇక పెళ్లి చేసుకోవడమే ఆలసమ్యని కామెంట్లు చేస్తున్నారు. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే ఓ యాడ్‌లో నటించాక ఒక్కటయ్యారు. కాగా, రాహుల్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ నిమిత్తం టీమిండియా ప్రకటించిన 15 మంది సభ్యుల బృందంలో అతనికి చోటు దక్కలేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగినా.. జట్టు యాజమాన్యం అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. బహుశా ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌లో అతనికి అవకాశాలు లభించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: నా జీవితంలో పెళ్లి తర్వాత చాలా మార్పులొచ్చాయి: బుమ్రా -
కంటి పరీక్ష ఇక ఇంట్లోనే...
వయసుతోపాటు చూపు మందగించడం అందరికీ అనుభవమైన విషయమే. కళ్లజోళ్లతో ఆ చిక్కును కాస్తా దాటేస్తామనుకోండి. కాకపోతే తరచూ కళ్లు చెక్ చేయించుకోవడం, తగిన ప్రిస్క్రిప్షన్‌తో కళ్లజోళ్లు ఆర్డర్ చేయడం, వచ్చేదాకా పాతవాటితో సర్దుకుపోవడం కొంచెం చీకాకైన పనే. థ్యాంక్స్‌టు స్మార్ట్‌ఫోన్... ఇకపై ఆ సమస్య ఉండబోదు. ఓ బుల్లి పరికరం దాంతోపాటు పనిచేసే అప్లికేషన్‌తో ఎంచక్కా ఇంట్లోనే కళ్లు పరీక్షించుకునే అవకాశం కల్పిస్తోంది ఓ కంపెనీ. ఐక్యూ విజన్ చెక్ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరం, ఆప్ అత్యాధునిక మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తాయి. కళ్లు చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు పరికరాన్ని స్మార్ట్‌ఫోన్ కు బిగించుకోవడం.. కళ్లజోళ్లు తీసేసి ఒక్కో కంటికి దగ్గరగా పెట్టుకుని పరీక్ష చేసుకోవచ్చు. కళ్ల ముందు కనిపించే రెండు గీతలను ఒకదానిపై ఒకటి చేర్చేలా ఐక్యూ యంత్రంపై ఉన్న బటన్లను నొక్కుతూండటం ఒక్కటే మనం చేసే పని. కంటిలోని ప్రతి కోణం నుంచి వివరాలు సేకరించి మన దష్టి మాంద్యం తీవ్రత ఎంతన్నది అంకెల్లో చెప్పేస్తుంది ఈ యంత్రం. ఆన్లైన్లో డిజైన్ ఎంచుకుని, ప్రిస్క్రిప్షన్‌ను జోడిస్తే ఒకట్రెండు రోజుల్లో కొత్త కళ్లజోడు రెడీ! -
లక్ష మందికి కంటి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘కంటి వెలుగు’కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు దాదాపు లక్ష మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వేలాది మందికి కళ్లజోళ్లు ఇచ్చారు. కొందరికి మాత్రలు ఇవ్వగా, మరికొందరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. కంటివెలుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 824 శిబిరాల్లో ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో 561, పట్టణ ప్రాంతాల్లో 109, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 158 శిబిరాలు ప్రారంభమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో ‘కంటి వెలుగు’పథకాన్ని తొలుత లాంఛనంగా ప్రారంభించారు. కొంతమందికి కళ్లద్దాలను అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా మరికల్లో కంటి శిబిరాన్ని ప్రారంభించారు. కళ్లజోళ్లు, మందులు ఉచితంగా అందజేశారు. కంటిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో అనేకమంది వృద్ధులు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకోవడంతో పండగ వాతావరణం నెలకొందని మంత్రి లక్ష్మారెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’తో అన్నారు. మొదటిరోజు కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైందని, ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుందని వారు వివరించారు. -
జవాన్లకు 10 వేల కళ్లద్దాలు విరాళం ఇచ్చిన వ్యాపారులు
గుజరాత్: సూరత్, గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారులు బీఎస్ఎఫ్ జవాన్లకు 10 వేల కళ్లజోళ్లు, ఆర్వో వాటర్ మిషన్లు, ఈసీజీ తదితర పరికరాలు పంపిణీ చేశారు. ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల దాని నుంచి ఉపశమనం కల్పించేందుకు జవాన్లకు అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు. గుజరాత్ హోం మంత్రి హరిబాయ్ పార్థిబాయ్ చౌదరి అభ్యర్థన మేరకు వీటిని ఇవ్వడం హర్షణీయం అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. -
కళ్లజోళ్లకు గుడ్‌బై!
ఇంకో రెండేళ్లు. ఐ సైట్ కోసం గాగుల్స్ వాడటం. ఆ తరువాత? నొప్పిలేని చిన్న ఆపరేషన్... కంట్లోనే ఓ లెన్స్... జీవితాంతం 20/20 కంటే మూడు రెట్లు ఎక్కువ స్పష్టమైన చూపు. అంతా ఆక్యూమెటిక్స్ టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన బయోనిక్ లెన్స్ మహిమ! అవును. మీరు చదివింది నిజమే. 2017 నాటికల్లా దృష్టిలోపాల కోసం కళ్లజోళ్లు ధరించడం గతకాలపు మాట అవుతుంది అంటున్నారు బయోనిక్ లెన్స్ సృష్టికర్త డాక్టర్ గార్త్ వెబ్. ఎనిమిదేళ్ల పరిశోధనల ఫలితంగా తయారు చేసిన ఈ లెన్స్‌ను కేవలం ఎనిమిది నిమిషాల్లో కంట్లో అమర్చవచ్చు. ఇది కూడా చాలా సింపుల్‌గా జరిగిపోతుంది. ముడుచుకుపోయి సూక్ష్మస్థాయిలో ఉండే బయోనిక్ లెన్స్‌ను ఉప్పునీటి ద్రావణం ద్వారా కంట్లోకి స్ప్రేచేస్తారు. పది సెకన్లలో బయోనిక్ లెన్స్ విచ్చుకుంటుంది. దానంతటఅదే కనుగుడ్డు ఎక్కడ ఉందో గుర్తించి దానిపై ఒక పొరలా పరుచుకుంటుంది. అంతే. మీ చత్వారం, దూరదృష్టి, హ్రస్వదృష్టి లోపాలన్నీ గాయబ్! అంతేకాదు... ఒకసారి ఈ బయోనిక్ లెన్స్‌ను ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో మీకు కంటిశుక్లాలు వచ్చే అవకాశం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. అంటే... ముసలితనంలోనూ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరముండదన్నమాట. ప్రస్తుతం దృష్టి లోపాల సవరణకు ఉపయోగిస్తున్న లాసిక్ సర్జరీ కంటే ఇది ఎంతో మెరుగైందని, నిరపయాకరమైంది కూడానని గార్త్ వెబ్ అంటున్నారు. మరిన్ని ట్రయల్స్ తరువాత 2017 నాటికల్లా ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా. -
మా బుజ్జిగాడి సబ్జెక్టు డౌట్సూ... నా మతికి పట్టిన గతి!
నవ్వింత మా బుజ్జిగాడు ఒకరోజు అకస్మాత్తుగా... ‘‘నాన్నా, నాగుపాముకు గాగుల్స్ అంటే చాలా ఇష్టం కదా’’ అని అడిగాడు. కాసేపు నా మతి (అలా షికారుకు) పోయి, మళ్లీ తిరిగి మెదడులోకి తిరిగి వచ్చాక వాణ్ణి అడిగా... ‘‘నాగుపాముకూ, గాగుల్స్కూ సంబంధం ఏమిట్రా?’’ అని. ‘‘అదే నాన్నా... మాకు సైన్స్ క్లాస్‌లో చెప్పారు. నాగుపాము పడగ మీద స్పెక్టకిల్స్ ఉంటాయట. ఆ కళ్లజోడు గుర్తు కూడా పర్మెనెంటుగా ఉంటుందట. అంటే కళ్లజోడు జారిపోకుండా ఉంటానికేమో కదా నాన్నా’’ అన్నాడు వాడు. ‘‘ఒరేయ్... అవి కళ్లజోడు వంటి ముద్ర మాత్రమే. అంతేగానీ, ఏ రేబాన్ గ్లాసులో, పోలీస్ బ్రాండ్ స్పెట్సో కావు. ఇలాంటి అరకొర నాలెడ్జ్‌తో బుర్ర చెడగొట్టుకోకు. నా బుర్రతిరిగేలా చేయకు’’ అని వాడికి వార్నింగ్ ఇచ్చా. సైన్స్ క్లాస్ గోల అలా ముగిసిందా! మళ్లీ సోషల్ క్లాస్‌లో జరిగిన మరో సంఘటనతో నా ఒంట్లోంచి నేనే బయటకు దూకి... కాసేపటిగ్గానీ మళ్లీ నా దేహంలోకి దూరలేకపోయా. ‘‘నాన్నా... శనిగ్రహం చుట్టూ అలా రింగులు ఎందుకుంటాయో, మిగతా గ్రహాలకు ఎందుకుండవో నాకు తెలిసిపోయింది’’ అన్నాడు. ‘‘ఎందుకురా?’’ అడిగాను ఆసక్తిగా. ‘‘ఎందుకంటే... శనిగ్రహం తాలూకు దుష్టగ్రహ ప్రభావం తనమీదే పడకుండా అలా రింగులుంటాయి’’ అన్నాడు వాడు. ‘‘మోకాలికీ బోడిగుండుకూ ముడెయ్యకు. శనిగ్రహం చుట్టూ రింగులుంటే దాని ప్రభావం దాని మీద పడకుండా ఉండటమేంటి?’’ అడిగాన్నేనను. ‘‘మొన్న మన ఇంటికి వచ్చిన అంకుల్గారూ... అన్ని వేళ్లకూ రింగ్స్ పెట్టుకున్నారు కదా. ‘అన్ని రింగ్స్ ఎందుకూ’ అని నువ్వు అడిగితే... కొన్ని గ్రహాల దుష్టప్రభావం తన మీద పడకుండా ఉండటానికీ, తనకు అంతా మంచి జరిగేందుకూ అని జవాబిచ్చారు కదా. ఇక శనిగ్రహం మాట అంటావా! ‘శనిలా పట్టుకున్నావు, శనిగాడు’ లాంటి పదాలతో పాపం ఆ గ్రహంపై అందరూ ఆగ్రహిస్తూ, దాన్ని ఆడిపోసుకుంటుంటారు కదా నాన్నా. అందుకే తన చెడు తనకే తగలకుండా ఆ ఒక్క గ్రహానికే రింగులుంటాయని నాకు అర్థమైపోయిందిలే’’ అన్నాడు.ఈసారి నేను నా మతి పోగొట్టుకున్న మాట వాస్తవమే గానీ... అలా పోయిన సదరు మతిని వెతికి మళ్లీ మైండ్‌లో సెట్ చేసుకోడానికి నాకు చాలా టైమే పట్టింది. ‘‘నాన్నా... దున్నపోతు మీద వర్షం పడితే, ఎంత తడిసినా దానికి ఏమీ కాదట కదా. మా తెలుగు క్లాస్‌లో మా సార్ ఈ సామెత చెప్పారు. ఇప్పుడు నాకు అర్థమైంది నాన్నా. దున్నపోతు మీద ఎంత వర్షం కురిసినా దానికి ఏమీ కాదెందుకో తెలిసింది. ‘దున్నపోతు మీద వర్షం కురిసినట్టు’ అన్న సామెత ఎందుకు పుట్టిందో కూడా అర్థమైంది’’ అన్నాడు వాడు. చిన్నప్పట్నుంచీ చదువుకునే తెలుగే కదా. ఈ క్లాసుతో ప్రమాదమేమీ ఉండదులే అనుకున్నా. అయినా ఆసక్తిని చంపుకోలేక అడిగితే, ‘‘ఎందుకంటే... దున్నపోతుకు ఏ జలుబో గిలుబో చేసిందనుకో. దానికి విక్సో, జండూబామో, టైగర్బామో రాసేవాళ్లు ఎవరుంటారు నాన్నా? అందుకే దేవుడలా ఏర్పాటు చేశాడన్నమాట’’ అని జవాబిచ్చాడు. మా బుజ్జిగాడు లెక్కల్లో కాస్త పూర్. అవేవో చెబుదామని పూనుకుని, కూడికలయ్యాక, తీసివేతలు చెబుతున్నా. ‘‘నీ దగ్గర వంద రూపాయలున్నాయనుకో. అందులో ఇరవై పెట్టి లాలీపాప్‌లు కొనుక్కుని మిగతా డబ్బులు జేబులో వేసుకున్నావనుకో. నీ జేబులో ఉన్న డబ్బులెన్నీ?’’ అన్నా. వాడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించాడు. ఆ భంగిమ నాకు నచ్చింది. ఎవరైనా ఏదైనా ఆలోచిస్తున్నారంటే... సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టే కదా. ‘‘అదీ... అదీ... అలా ఆలోచించాలి. చెప్పు... ఇప్పుడు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో దాచకుండా చెప్పు’’ అంటూ ప్రోత్సహించా. ‘‘కంగారూకు సంచి ఎందుకుంటుందో నాకిప్పుడు తెలిసింది’’ అన్నాడు. ‘‘సడన్‌గా లెక్కల నుంచి మళ్లీ బయాలజీకి వెళ్లావెందుకు రా’’ అన్నాను విసుగ్గా, ఒకింత ఆందోళనగా. ‘‘ఎందుకంటే... అది లాలీపాప్ కొనుక్కున్న తర్వాత మిగిలిన డబ్బుల్ని దాచుకోడానికి దేవుడు దానికి ముందే ఒక జేబు కుట్టేశాడు నాన్నా. మనలా షర్టూ, ప్యాంట్లకు జేబులు కుట్టుకోవాల్సిన అవసరం దానికి లేదు’’ అన్నాడు వాడు. ఈ సారి నా మతి మళ్లీ పోయింది. కానీ షికారుకు కాదు. అది పారిపోయింది. అలా పోయిన నా మతి ఇప్పట్లో దొరుకుతుందో, లేదో?! - యాసీన్ -
పదేళ్లలోపు చిన్నారుల్లో చూపు తగ్గుతోంది..
- పదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహార లోపం.. - ఆహారపు అలవాట్లు, చీకటి గదుల్లో విద్యాబోధనే కారణం - తల్లిదండ్రులూ.. పారాహుషార్ గతంలో కంటిచూపు తగ్గిపోతోందంటే వృద్ధాప్యం దగ్గరపడుతుందని భావించేవారు. ప్రస్తుతం జీవనశైలి, ఆహారపు అలవాట్లు వెరసి వయసుతో నిమిత్తం లేకుండానే చూపు మందగిస్తోంది. పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారుల్లో చూపు సమస్య ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రతి చిన్నారి కళ్లజోళ్లతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ హెల్త్ :జిల్లాలో కంటిచూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్లలోపు ఉన్న వంద మంది చిన్నారులను పరిశీలిస్తే.. నల్గురికి పైగా దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కంటిఅద్దాలు సమకూర్చినా చూపు బాగుపడని పరిస్థితి ఉంది. పిల్లల్లో చూపు తగ్గడానికి అనేక కారణాలున్నారుు. ప్రధానంగా కంటిచూపు తగ్గడానికి జన్యుపర సమస్య ఒకటైతే, విటమిన్-ఏ లోపం, తగినంత వెలుతురు లేని గదుల్లో విద్యాభ్యాసం చేయడం, అదేపనిగా వీడియో గేమ్స్, కంప్యూటర్, టీవీ చూడటం వ ంటివి కూడా కారణమవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కంటిచూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరునెలలకో సారి ఏ-విటమిన్ పిల్లలకు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. విటమిన్ ‘ఏ’ ద్రవం అందించే కార్యక్రమం పకడ్బందీగా చేపట్టకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోపణలున్నారుు. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కంటిచూపు సమస్యతో బాధపడుతున ్న వారిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు.. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకు ఉంది. వీరిలో నాలుగు శాతం పదేళ్ల వయసులోపు పిల్లలు ఉండగా ... 11 నుంచి 16 సంవత్సరాల లోపు వారు ఎక్కువ గా ఉంటున్నారు. చూపు తగ్గడానికి కారణాలు ఇవీ.. - పిల్లలకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులు, అసవరం అయినంతమేరకు తీసుకోకపోవడంతో ఏ-విటమిన్, కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపుతోపాటు ఇతర ఆరోగ్యసమస్యలూ వస్తాయి. - వెలుతురు, గాలి లేని ఇరుకుగదుల్లో విద్యాభ్యాసం చేయడం. - గతంలో బ్లాక్‌బోర్డుపై చాక్‌పీస్‌తో అక్షరాలు రాసేవారు. ఈ అక్షరాలు కళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్దగా కూడా కనిపించేవి. తరగతి గదిలో చివరివరుసలో కూర్చున్నా..అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్‌బోర్డుపై మార్కర్‌తో చిన్న అక్షరాలు రాస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడిపడి నరాలపై ప్రభావం చూపి చూపు తగ్గుతోంది. - ప్రస్తుతం పుస్తకాల్లో అక్షరాలు కూడా మరీ చిన్నవిగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతోంది. - టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో ఈ కంటిచూపు సమస్య ఉత్పన్నమవుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, ద్రాక్ష, బొప్పాయి, చిలగడ దుంపలు వంటి తినడంతో కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న ఏదైనా వ స్తువును తదేకంగా చూడాలి. తర్వాత దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా ఐదారుసార్లు చేయడంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూసి తెరుస్తుండడం మరిచిపోవద్దు. పిల్లలు, పెద్దలు ఎలాంటి సమస్యలేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చిన ప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేందుకు పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాలి. - రఘు, కంటి వైద్య నిపుణులు -
ఆల్ ద బెస్ట్
నేడే ఎంసెట్ ఏర్పాట్లు పూర్తి 325 స్పెషల్ బస్సుల ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిల్ సాక్షి, సిటీబ్యూరో: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ‘ఇంజనీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్)-2014’కు సర్వం సిద్ధమైంది. నగరంలోని ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నగరాన్ని ఎనిమిది జోన్లుగా విభజించారు. అభ్యర్థుల నివాసాలకు ఐదు కి లోమీటర్ల రేడియస్‌లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఈ కేంద్రాలుండే మార్గంలో ఆర్టీసీ 325 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎంసెట్ రాయనున్న అభ్యర్థులు చేయాల్సిందల్లా.. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరడమే. నిర్దేశిత సమయం కన్నా నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించమని అధికారులు ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఓఎంఆర్ షీట్‌ను నింపేటపుడు ఇన్విజిలేటర్ సూచనలు పాటించాలి. సెల్ఫోన్లు, గాగుల్స్, డిజిటల్ వాచీలను లోనికి అనుమతించరు. అభ్యర్థులు వెంట హాల్‌టికెట్, బాల్‌పాయింట్ పెన్నులు, ఆన్లైన్ దరఖాస్తు ఫారం ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఎంసెట్‌కు హాజరవుతున్న అభ్యర్థులందరికీ ‘ఆల్ ది బెస్ట్’ మరి. ఏ జోన్ పరిధిలో ఏఏ ప్రాంతాలంటే.. కూకట్పల్లిః ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు కుత్బుల్లాపూర్: బోరంపేట్, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్ మెహదీపట్నం: టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌస్, ఇబ్రహీంబాగ్, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి మాసబ్‌ట్యాంక్: ఖెరతాబాద్, లక్డీకాపూల్, సైఫాబాద్, నాంపల్లి, సోమాజిగూడ, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ఓయూః విద్యానగర్, రామాంతపూర్, అంబర్‌పేట, హబ్సిగూడ, నాచారం, తార్నాక, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ సికింద్రాబాద్ : రాణిగంజ్, ఎస్పీరోడ్, ఆర్పీరోడ్, ఈస్ట్ మారేడ్‌పల్లి, వెస్ట్ మారేడ్‌పల్లి, జూబ్లీ బస్టాండ్, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్ ముషీరాబాద్: గగన్‌మహల్, నారాయణగూడ, బషీర్‌బాగ్, బర్కత్‌పుర, చిక్కడపల్లి, హిమయత్ నగర్, హనుమాన్ తెక్డీ రాజేంద్రనగర్: బండ్లగూడ, అప్పా జంక్షన్, మొయినాబాద్ ఆరు గంటలకు సెట్‌కోడ్ విడుదల ఎంసెట్-2014 ఇంజనీరింగ్ పరీక్ష ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను గురువారం ఉదయం ఆరు గంటలకు, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను ఉదయం 10.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణరావు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. జేఎన్టీయూహెచ్లోని అకడమిక్ స్టాఫ్ కళాశాల ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఎంసెట్-2014 చైర్మన్, జేఎన్టీయూహెచ్ ఉపకులపతి డాక్టర్ రామేశ్వరరావు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.