హాట్‌ సమ్మర్‌...కూల్‌ లుక్స్‌ | Cool Looks in Hot Summer | Sakshi

హాట్‌ సమ్మర్‌...కూల్‌ లుక్స్‌

Jun 11 2022 3:41 PM | Updated on Jun 11 2022 3:45 PM

Cool Looks in Hot Summer - Sakshi

గేదర్డ్‌ ఫెర్న్‌ కుర్తా...


పూల డిజైన్లు ప్రతి వేసవి రూపాన్ని శాసించే ఎవర్‌ గ్రీన్‌ ట్రెండ్‌.  అదే పాత పూల ప్రింట్‌లతో విసిగిపోయి ఉంటే, కలెక్షన్‌కు మసాలా యాడ్‌ చేయడానికి ఈ ఫెర్న్‌ ప్రింట్‌ కుర్తాని ప్రయత్నించవచ్చు. ఈ వేసవి సీజన్‌లో ’గేదర్డ్‌ ఫెర్న్‌ కుర్తా’ను  బ్లూస్‌/ గ్రీన్స్‌లో తగిన అలంకరణతో ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. మరింత స్టైలిష్‌గా కనిపించడం కోసం ఈ కాటన్‌ ఫెర్న్‌ కుర్తాను ఆఫ్ఘని ప్యాంటుతో కలపవచ్చు. 
కాటన్స్‌ జైపూర్‌ డాట్‌కామ్‌
ధర: రూ.2,199

కూల్‌ గాగుల్స్‌...


ఎండవేడిమి నుంచి రక్షించుకోవడానికి సన్‌ గ్లాసెస్‌ తప్పనిసరిగా ఉండాలి. అటు కళ్లకు చల్లదనంతో పాటు జెయిన్‌ ఎక్స్‌ అర్నెట్టె అందించే గుల్వింగ్‌ హాటెస్ట్‌ లుక్‌ని ఎలివేట్‌ చేస్తుంది. బ్లీచ్డ్‌ టై–డై కలర్‌ ఎఫెక్ట్స్, ఫ్లాట్‌ మిర్రర్స్‌ కలయిక మరింత అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. 
గెస్‌స్టోర్స్, గెస్‌ డాట్‌కామ్‌
ధర: రూ.8,079

టెన్నిస్‌ నెక్లెస్‌..


యాక్సెసరీస్‌ మన రూపాన్ని మెరుగుపరుస్తాయి, అయితే వేసవిలో ఎలా పడితే అలా స్టైల్‌ని యాక్సెసరైజ్‌ చేయడం కష్టం. ఈ అందమైన స్టీల్‌ కోటింగ్‌ కలిగిన ఎ–టెన్నిస్‌ నెక్లెస్‌ సీజనల్‌ యాక్సెసరీస్‌ ఎంపికగా చక్కగా నప్పుతుంది. 
గెస్‌స్టోర్స్, గెస్‌ డాట్‌కామ్‌
అజియో & టాటా క్లిక్‌ 
ధర: రూ. 8,079

గ్రీన్‌ ఫ్లోరల్‌ ఫ్లోవీ డ్రెస్‌..


 స్నేహితులతో కలిసి డే అవుట్‌కి వెళ్లినా లేదా వర్క్‌ ప్లేస్‌కి లీజర్‌గా వెళ్లినా... ఈ ఫ్లూ డ్రెస్‌ వేడి వాతావరణంలో  చల్లగా ఉంచుతుంది. ఈ బొటానికల్‌ డ్రెస్‌ని వేసవిలో కుర్తాగా దుస్తులుగా ధరించవచ్చు. బాడీస్‌పై అందమైన చతురస్రాకార బట¯Œ లతో ఉన్న ఈ దుస్తులు  ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 
అమెజాన్, టాటా క్లిక్‌ అండ్‌ అజియో
ధర: రూ 6190

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement