kurta
-
మన్మోహన్ సింగ్ డ్రైస్సింగ్ స్టైల్ ఎలా ఉండేదంటే..!
ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) ఇక లేరు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి, ప్రముఖులు, సెలబ్రిటీలు నివాళులర్పించారు. మౌనమునిగా కనిపించే గొప్ప రాజనీతిజ్ఞుడు. తానెంటనేది చేతల ద్వారానే చూపించే గొప్ప దార్శనికుడు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను, విమర్శలను చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తూ..తన విలువేంటో చాటిచెప్పేవారు. అంతేగాదు తాను కూల్‌గా కనిపించినా..టైం వస్తే ఎలా దూకుడుగా వ్యవహరిస్తానో తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశానికి తెలిసొచ్చేలా చేశారు. అంతటి మహనీయుడు ఈ రోజు మన కళ్లముందు లేకపోయినా..ఆయన వదిలిన కొన్ని మధురమైన మాటలు, గడ్డు పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాగే మన్మోహన్ వ్యవహార శైలికి తగ్గట్టుగానే ఆయన ఆహార్యం ఉంటుంది. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంటుంది. బహుశా ఈ స్టైల్‌తోనే ప్రత్యర్థులను మారుమాట్లడనీయకుండా తన మాటే శాసనమయ్యేలా చేసేవారిని చెబుతుంటారు అంతరంగికులు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ దుస్తుల వార్డ్రోబ్ గురించి తెలుసుకుందామా..!రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలిసిక్కుగా ఘనత దక్కించుకున్న మృదుస్వభావి మన్మోహన్ సింగ్(Manmohan Singh). ఆయన ఎక్కువగా తెల్లటి కుర్తా, నెహ్రూ మాదిరి జాకెట్లు , నీలిరంగు తలపాగతో కనిపించేవారు. ఈ వేషధారణ తాను కార్యచరణకు, ప్రగతికి పెద్దపీట వేసే వ్యక్తి అని చెప్పకనే చెబుతోంది. ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాన్ ప్రధాని ధరించి దుస్తులు దేశాన్ని నడిపించే బాధ్యతయుతమైన పనిలో ఉన్న వ్యక్తి ఆహార్యానికి అద్దంపట్టేలా ఉంటాయని అన్నారు. మన దేశ సంస్కృతిని తెలియజెప్పేలా ఆయన ధరించే నీలిరంగు తలపాగ(sky-blue turbans), తెల్లటి కుర్తా పైజామాలు ఉంటాయని ప్రశంసించారు. అంతేగాదు మాజీ ప్రధాని మన్మోహన్ ఆధునాతనంగా కనిపించేలా గౌరవప్రదమైన డ్రెస్సింగ్‌ని ఎంచుకుంటారని చెప్పారు. ప్రశాంతంగా కనిపించే తన వ్యవహారశైలికి సరిపోలిన డ్రెస్సింగ్ స్టైల్ అని అభిర్ణించారు డిజైనర్ తరుణ్. అంతేగాదు ఆయన ధరించే నీలిరంగు తలపాగా మన్మోహన్ ట్రేడ్‌మార్క్ అని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ(University of Cambridge)లో చదివిన నేపథ్యం తనలో అంతర్భాగమని తెలియజేప్పేలా ఆయన ఇలా ఎక్కువగా నీలి ఆకాశం రంగులోని తలపాగను ధరించేవారని సన్నిహితులు చెబుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ విధమైన రంగుల కలయికతో కూడిన దుస్తులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తికి సంకేతమని, పైగా సానుకూలంగా వ్యవహారం చక్కబెట్టుకునేలా చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు, నమ్రతతో, రిజర్వ్‌గా ఉంటే వ్యక్తులు ఎక్కువగా ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్‌నే ఎంచుకుంటారని అన్నారు.(చదవండి: యువ 'కలం'..! ట్రెండ్ సెట్టర్స్‌గా యంగ్ రైటర్స్) -
Deepika Padukone: పూల కుర్తాలో మెస్మరైజ్ చేస్తున్న దీపికా..
బాలీవుడ్ నటి, కాబోయే తల్లి దీపికా పదుకొణె తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల కల్కి మూవీ ప్రమోషన్లో హైహిల్స్‌తో వచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. కాబోయే తల్లి దీపికా తన బేబి బంప్‌తోనే కల్కి మూవీలో నటించటం విశేషం. ఇటీవల తన భర్త రణ్వీర్ తో పాటూ ముంబాయి డిన్నర్ డేట్‌కు వెళ్లింది. అక్కడ ఓ రెస్టారెంట్లో దీపికా తన బాడీగార్డుతో.. కెమెరాకు చిక్కింది. కాబోయే తల్లి అయిన దీపికా వైట్ ప్యాంట్, సింపుల్ మేకప్ లుక్ తో సబ్యసాచి పూల కుర్తా ధరించింది. ఆమె ప్రెగ్నెన్సీ డ్రెస్ కాబోయే తల్లులకు సౌకర్యాంగా ఉండే డ్రెస్ ఇది. ఈ బ్యూటీ తన ప్రెగ్నెన్సీ లుక్ కోసం చక్కటి పూల కుర్తాలో మెరిసింది. స్వీకరించింది. ఈ పూల కుర్తీని సవ్యసాచి డిజైన్ చేశారు. అక్కడ పలువురి అభిమానులతో మాట్లాడటమే గాక ఫోటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసే అందంతో అలరించింది. ఇక్కడ దీపికా తన రేంజ్‌కి తగ్గట్టు లూయిస్ విట్టన్ హ్యాండ్ బ్యాగ్‌ను ధరించింది. చెప్పాలంటే ఈ పూలకుర్తీలో బేబీ బంప్‌ని దాచేస్తూ సరికొత్త రూపంతో అందంగా కనిపించింది. కాగా, ఆమె ధరించిన బ్రాండెడ్ బ్యాగ్ ధర ఏకంగా 3.25 లక్షలు పలుకుతుందట. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: స్పేస్‌లో ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..? బెస్ట్ స్పేస్ ఫుడ్స్ ఇవే..!) -
టెకీలూ.. ఆఫీసులకు కుర్తా వేసుకురండి
టెకీలు, ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు ఎలాంటి దస్తులు వేసుకుని వస్తారు..? చక్కగా సూటు బూటు వేసుకుని వస్తారు. కానీ కుర్తాలు వేసుకుని రావాలని చెబుతున్నారు ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్.ఏఎన్ఐకి చెందిన స్మితా ప్రకాష్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతీయులందరూ పాశ్చాత్య దుస్తులకు స్వస్తి పలికి కుర్తాలను ధరించాలని సూచించారు.“మనం కుర్తాలో మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చు. ఇది ప్రత్యేకంగా భారతీయమైనది. నా దృష్టిలో, కుర్తా చాలా సొగసైన డ్రెస్. భారతీయులందరూ, ముఖ్యంగా యువ సాంకేతిక నిపుణులు కుర్తాలను ధరించాలని నేను అనుకుంటున్నాను” అని అగర్వాల్ అన్నారు.జూలై 8న షేర్ చేసిన ఈ పాడ్‌కాస్ట్ కొద్ది సమయంలోనే ట్రాక్‌ని పొందింది. చాలా మంది అగర్వాల్ భావాలతో ఏకీభవించడంతో కామెంట్ సెక్షన్ సానుకూల స్పందనలతో నిండిపోయింది. -
మై ఛాయిస్!
భారతీయ మహిళలకు కుర్తాలు ఇష్టమైన దుస్తులు. వృత్తిరీత్యా టీషర్ట్లు ధరించడం అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే ‘విమెన్స్ డే’ సందర్భంగా జొమాటో తన మహిళా డెలివరీ పార్టనర్లకు ఎర్ర కుర్తాలను బహూకరించింది. ఇకపై వారు డ్యూటీలో నచ్చిన టీ షర్ట్గాని, కుర్తా గాని ధరించవచ్చు. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్ యాడ్ ఇంటర్నెట్లో కుతూహలం రేపుతోంది. జొమాటోలో దేశమంతా మూడున్నర లక్షల మంది డెలివరీ పార్టనర్లు ఉన్నారు. అంటే ఫుడ్ డెలివరీ చేసే బోయ్‌లు. వీరిలో స్త్రీలు కేవలం 1500 నుంచి 2000 మంది మాత్రమే ఉన్నారు. టూ వీలర్ మీద వేళకాని వేళలో తిరగాల్సి రావడం వల్ల ఇదొక ఛాలెంజింగ్ జాబ్ అయ్యింది మహిళలకు. అయినప్పటికీ సవాలుగా తీసుకుని వందల ఆర్డర్లు డెలివరీ చేస్తున్న జొమాటో మహిళలు ఉన్నారు. వృత్తిరీత్యా వారు టీషర్ట్ ధరించాల్సి ఉంటుంది. అది అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే జొమాటో మొన్నటి విమెన్స్ డే రోజు కుర్తాలు బహూకరించింది. ‘మీ చాయిస్. మీరు టీషర్ట్ వేసుకోవచ్చు లేదంటే కుర్తాలు వేసుకోవచ్చు’ అని చెప్పింది. ఇందుకోసం ప్రమోషన్ యాడ్ చేస్తే మహిళా డెలివరీ పార్టనర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘జేబులున్న కుర్తా నాకు నచ్చింది’ అని ఒక మహిళ చెప్పింది. ‘ఫోటోలు బాగా తీయండి’ అని మరో మహిళ ఉత్సాహపడింది. ‘పదండి అందరం మనాలి వెళ్దాం’ అని మరో మహిళ ఉత్సాహ పరిచింది. కొత్త ఉపాధి మార్గంలో వెరవక నడిచే వీరందరినీ చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. దేశీయ దుస్తుల్లో బాగున్నారంటూ కితాబిచ్చారు. -
పాపం!.. ఆ మంత్రి దురదకు తాళలేక నడిరోడ్డు మీద కుర్తా తీసి..
మధ్యప్రదేశ్‌లో బీజేపీ వికాస్ రథయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే యాత్ర చేస్తున్న మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆ యాత్ర ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ మేరకు మంత్రి బ్రజేంద్ర సింగ్ అసెంబ్లీ నియోజకవర్గం మంగవోలిలోని ఓ గ్రామం గుండా యాత్రకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దురద పెట్టించే పౌడర్‌ను చల్లాడు. దీంతో ఆ మంత్రికి విపరీతమైన దురద రావడంతో.. నడిరోడ్డుపైనే కుర్తా విప్పే పరిస్థితికి దారితీసింది. ఆ దురదకు తాళలేక మంత్రి నీళ్లతో చేతులను, ముఖాన్ని కడుక్కున్నారు. అందుకు సంబంధించిన వీడియోని కొందరూ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మాజీ సర్పంచ్ వికాస్ యాత్ర అవసరమా అని బ్రిజేంద్ర సింగ్‌ని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అంతేగాదు వీడియోలో..ఈ ప్రాంతంలో మూడు కిలోమీటర్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేయలేకపోయింది. మేము కాంగ్రెస్ చెడ్డదనుకున్నాం, కానీ మీరు అంతకంటే అధ్వాన్నంగా ఉన్నారు. మాకు మంచి రహదారులను ఇవ్వండి లేకపోతే మీకు ఓటు వేయం అని ఆ వ్యక్తి ఎమ్మెల్యే ముఖం మీదే అంటున్నట్లు వినిపిస్తుంది. దీనికి మంత్రి కూడా ఓటు వేయకండి అదీ మీ హక్కు అని అతనికి బుదులిస్తున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఇలానే రెండు రోజుల క్రితమే ఖండ్వా జిల్లాలోని ఒక గ్రామం గుండా వెళ్తుండగా మరో వికాస్ రథ్ రోడ్డుపై ఇరుక్కుపోయింది. ఇదిలా ఉండగా, ఈ వికాస్ యాత్రలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ఫిబ్రవరి 25 వరకు కొనసాగుతుంది. अशोकनगर, मध्य प्रदेश जनसंपर्क पर निकले मंत्री को लगाया #खुजली पाउडर। यात्रा रोक, नहाना पड़ा। PHE मंत्री / भाजपा नेता बृजेंद्र सिंह यादव को जनसंपर्क के दौरान किसी ने लगाया खुजली पाउडर। खुजा खुजा कर हुआ था बुरा हाल ! pic.twitter.com/w5GZtCWmyy — काश/if Kakvi (@KashifKakvi) February 9, 2023 (చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం) -
హాట్ సమ్మర్...కూల్ లుక్స్
గేదర్డ్ ఫెర్న్ కుర్తా... పూల డిజైన్లు ప్రతి వేసవి రూపాన్ని శాసించే ఎవర్ గ్రీన్ ట్రెండ్. అదే పాత పూల ప్రింట్లతో విసిగిపోయి ఉంటే, కలెక్షన్‌కు మసాలా యాడ్ చేయడానికి ఈ ఫెర్న్ ప్రింట్ కుర్తాని ప్రయత్నించవచ్చు. ఈ వేసవి సీజన్లో ’గేదర్డ్ ఫెర్న్ కుర్తా’ను బ్లూస్/ గ్రీన్స్‌లో తగిన అలంకరణతో ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. మరింత స్టైలిష్‌గా కనిపించడం కోసం ఈ కాటన్ ఫెర్న్ కుర్తాను ఆఫ్ఘని ప్యాంటుతో కలపవచ్చు. కాటన్స్ జైపూర్ డాట్‌కామ్ ధర: రూ.2,199 కూల్ గాగుల్స్... ఎండవేడిమి నుంచి రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్ తప్పనిసరిగా ఉండాలి. అటు కళ్లకు చల్లదనంతో పాటు జెయిన్ ఎక్స్ అర్నెట్టె అందించే గుల్వింగ్ హాటెస్ట్ లుక్‌ని ఎలివేట్ చేస్తుంది. బ్లీచ్డ్ టై–డై కలర్ ఎఫెక్ట్స్, ఫ్లాట్ మిర్రర్స్ కలయిక మరింత అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. గెస్స్టోర్స్, గెస్ డాట్‌కామ్ ధర: రూ.8,079 టెన్నిస్ నెక్లెస్.. యాక్సెసరీస్ మన రూపాన్ని మెరుగుపరుస్తాయి, అయితే వేసవిలో ఎలా పడితే అలా స్టైల్‌ని యాక్సెసరైజ్ చేయడం కష్టం. ఈ అందమైన స్టీల్ కోటింగ్ కలిగిన ఎ–టెన్నిస్ నెక్లెస్ సీజనల్ యాక్సెసరీస్ ఎంపికగా చక్కగా నప్పుతుంది. గెస్స్టోర్స్, గెస్ డాట్‌కామ్ అజియో & టాటా క్లిక్ ధర: రూ. 8,079 గ్రీన్ ఫ్లోరల్ ఫ్లోవీ డ్రెస్.. స్నేహితులతో కలిసి డే అవుట్‌కి వెళ్లినా లేదా వర్క్ ప్లేస్‌కి లీజర్‌గా వెళ్లినా... ఈ ఫ్లూ డ్రెస్ వేడి వాతావరణంలో చల్లగా ఉంచుతుంది. ఈ బొటానికల్ డ్రెస్‌ని వేసవిలో కుర్తాగా దుస్తులుగా ధరించవచ్చు. బాడీస్‌పై అందమైన చతురస్రాకార బట¯Œ లతో ఉన్న ఈ దుస్తులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అమెజాన్, టాటా క్లిక్ అండ్ అజియో ధర: రూ 6190 -
ఏంటి 2.5 లక్షలా.. మా అమ్మ రూ.250కే తెస్తుంది
కొన్ని ఇంటర్నెషనల్ బ్రాండ్ దుస్తుల ఖరీదు చూస్తే.. కళ్లు తిరుగుతాయి. అరే ఇంత ఖరీదు పెట్టడానికి అసలు వాటిలో ప్రత్యేకత ఏంటో మనలాంటి సామాన్యులకు అర్థం కాదు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే వాటిని కొనే ధైర్యం చేస్తారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత గుస్సి బ్రాండ్‌కు చెందిన ఓ కుర్తా ఖరీదు తెలిస్తే.. హవ్వా అంటూ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. దీనిపై దేశీ నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు.. గుస్సి తాజాగా తన కలెక్షన్లో భారతీయ మహిళలు ఎక్కువగా ఇష్టపడే కుర్తీలను తీసుకువచ్చింది. కుర్తీని కాస్త పొరపాటుగా కఫ్తాన్‌గా పేర్కొంది. ఇక దాని ఖరీదును ఏకంగా 3,500 డాలర్లుగా పేర్కొంది. అంటే మన కరెన్సీలో సుమారు 2,50,000 రూపాయలకు పైగా ఖరీదన్నమాట. Gucci selling an Indian kurta for 2.5 lakhs ? I'll get the same thing for 500 bucks 💀 pic.twitter.com/Opw2mO5xnV — nalayak (@samisjobless) June 1, 2021 చూడటానికి కూడా పెద్దగా బాగాలేదు. గొప్ప కలర్ కూడా కాదు. తెలుపు రంగు కుర్తీ మీద నెక్ దగ్గర మెరూన్ డిజైన్‌తో ఉన్న ఈ కుర్తీకి 2.5 లక్షల రూపాయల ఖరీదుగా ప్రకటించడంతో మన నెటిజనులు ఏ మాత్రం కన్విన్స్ కాలేకపోతున్నారు. ‘‘ఏంటి ఈ కుర్తా ఖరీదు 2.5 లక్షలా.. మా అమ్మ 250 రూపాయల్లో కొనుగోలు చేస్తుంది’’.. ‘‘నేనైతే ఇలాంటివి 500 రూపాయలకు రెండు ఇప్పిస్తాను’’.. ‘‘నా బర్త్‌డేకి ఇదే కొనబోతున్నాను.. అయితే రెండున్నర లక్షల రూపాయలకు కాదు.. కేవలం 250 రూపాయలకు మాత్రమే.. ‘‘బ్రాండ్ పేరు చెప్పి.. ఇంత ఖరీదు ప్రకటించడం ఏమైనా బాగుందా’’అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. -
మోదీ కుర్తాకు యువత ఫిదా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ధరించే కుర్తా–జాకెట్‌కు యువతలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దేశంలోని ఏడు ఖాదీ ఇండియా అవుట్‌లెట్లల్లో కలిపి రోజుకు 1,400కు పైగా మోదీ కుర్తా–జాకెట్లు అమ్ముడవుతున్నాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) చైర్మన్ వీకే సక్సేనా తెలిపారు. కాగా, ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ వస్త్ర శ్రేణిని ఖాదీ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని అవుట్లెట్లలో వీటిని అమ్మేందుకు ప్రణాళికలు రూపొందిస్తుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ, కోల్కత్తా, జైపూర్, జోథ్‌పూర్, భోపాల్, ముంబై, ఎర్నాకులం ఖాదీ అవుట్లెట్లలో సగటున రోజుకు 200కు పైగా మోదీ ‘కుర్తా–జాకెట్లు’ అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఖాదీని ప్రోత్సహించాలన్న నరేంద్రమోదీ పిలుపు ఇవ్వటంతో ఈ వస్త్రాల అమ్మకాలు పెరిగినట్లు అభిప్రాయపడ్డారు. -
డ్యూయెట్!
పొడవు కుర్తీ, పొట్టి గౌన్ అది మన సంప్రదాయ డిజైన్ అయినా, పాశ్చాత్య స్టైల్ అయినా ఒకటే డ్రెస్‌కు రెండు ప్యాటర్న్ రంగులు. డిజైన్లలో హంగులు ఉంటే ఇలా మనసు దోచేస్తాయి. చిన్న మార్పుతో డ్రెస్‌కి ఆకట్టుకునే లుక్ తీసుకురావచ్చు. ముదురు, లేత రంగుల కాంబినేషన్‌తోనూ డ్రెస్ లుక్‌ను పూర్తిగా మార్చేయవచ్చు. మరే హంగులూ లేకున్నా ఇలాంటి డ్రెస్ ధరిస్తే ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆ ప్రత్యేకతే ఇప్పడు ట్రెండ్ అయ్యింది. వచ్చేది వానకాలం. మబ్బులు పట్టి కాస్త డల్‌గా ఉన్న వాతావరణాన్ని కొంత చమక్కుమనిపించే స్టైల్‌తో మేల్కొలిపితే మనసు కూడా హుషారైపోతుంది. ఫ్యాషన్ పోయెట్ రాసిన డ్యూయెట్ ఇది. బారున రెండు రంగులు కుట్టేస్తే అరుణాన్ని పున్నమితో కలిపినట్టు లేదూ! నేలను ముద్దాడే సముద్రంలా లేదూ! ఇవి రెండు వర్ణాలు కావు వర్ణించలేనంత అందమైన ద్వివర్ణాలు (నిలువు, అడ్డ చారల డిజైన్‌లో కుర్తీ ,జీన్స్‌పైన టు ప్యాటర్న్ స్టైల్ స్లిట్ టాప్ , కుడివైపు ఫ్లోరల్, ఎడమ వైపు ప్లెయిన్.. లాంగ్టాప్ ,ఓ వైపు ప్రింట్లు, మరో వైపు నీలం రంగు లాంగ్ గౌన్ ) ( పువ్వుల ప్రింట్లలోనూ రంగుల వైవిధ్యం ,ద్వివర్ణాల లాంగ్ కుర్తా! ) -
'మమ్మల్ని వెధవల్ని చేసే ఆటలు వద్దు'
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై దాడి మొదలైంది. తన కుర్తా చినిగిపోయిందని, మోదీ చినిగిపోయిన కుర్తా ఎప్పుడైనా వేసుకున్నట్లు చూశారా అంటూ రాహుల్ చెప్పడంపై ట్విట్టర్లో ఎప్పటిలాగే సెటైర్లు మొదలయ్యాయి. వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు ప్రారంభమయ్యాయి. చదవండి..('చొక్కా చింపేసిన' రాహుల్!) ఉత్తరాఖండ్ రిషికేష్‌లో ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్ యథాలాపంగా ప్రధాని మోదీపై విమర్శల కురిపిస్తూ అకస్మాత్తుగా మైక్ నుంచి కొంచెం ముందుకొచ్చి.. చినిగిన తన కుర్తా (చొక్కా)ను చూపించారు. అనంతరం 'చూడండి నా కుర్తా చినిగిపోయింది. కానీ మోదీజీ కుర్తా ఎప్పుడూ చినిగిపోయినట్టు మీకు కనిపించదు. ఆయన సంపన్నులు, ధనికులతోనే కనిపిస్తారు' అని రాహుల్ పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో మీడియాలు పలువురు స్పందించారు. 'మమ్మల్ని వెధవల్ని చేసే ఆటలు ఆడొద్దు. ఇటీవలే నువ్వు విదేశాలకు వెళ్లొచ్చావా లేదా? రాహుల్ కొత్త కుర్తా కొనుగోలు చేయలేరుగానీ, విదేశాలకు వెళ్లే వ్యయాన్ని మాత్రం సంతోషంగా భరించగలరు. బ్రేకింగ్ న్యూస్.. మన ప్రియమైన రాహుల్ గాంధీ(పప్పు)కి తగిన కుర్తా లేదంట. వెంటనే తలా ఒక రూపాయి నిధిని జమ చేయండి. ప్రియమైన్ రాహుల్ గారు.. మీరు చార్టెడ్ విమానంలో వెళుతుంటే మీ కుర్తా చినిగిపోయందా?' అంటూ ఇలా వరుసగా ట్విట్టర్లో ట్వీట్లు పేలాయి. -
'చొక్కా చింపేసిన' రాహుల్!
నా కుర్తా చినిగిపోయింది! మోదీ కుర్తా ఎప్పుడైనా చినిగిందా? రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ రిషికేష్‌లో ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్ యథాలాపంగా ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. పెద్దనోట్ల రద్దుపై మోదీని దుయ్యబడుతూ ప్రసంగాన్ని ఎక్కుపెట్టిన ఆయన.. అకస్మాత్తుగా మైక్ నుంచి కొంచెం ముందుకొచ్చి.. చినిగిన తన కుర్తా (చొక్కా)ను చూపించారు. 'చూడండి నా కుర్తా చినిగిపోయింది. కానీ మోదీజీ కుర్తా ఎప్పుడూ చినిగిపోయినట్టు మీకు కనిపించదు. ఆయన సంపన్నులు, ధనికులతోనే కనిపిస్తారు' అని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ ఇలా చినిగిన చొక్కాను జనానికి చూపించడంతో వారి నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. రాహుల్ మాట్లాడుతూ 'నేను పేదల కోసం రాజకీయాలు చేస్తున్నా. మోదీ ఫొటోలు ఎప్పుడూ సంపన్నులతోనే ఉంటాయి' అని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్బీఐ లాంటి స్వతంత్ర సంస్థను మోదీ చంపేశారని రాహుల్ మండిపడ్డారు. మోదీ చేయాల్సింది యోగా కాదు తపస్సు అంటూ ఎద్దేవా చేశారు. -
ప్లెయిన్ పోజ్
పైనొక ప్లెయిన్ కుర్తీ... కిందొక ప్లెయిన్ పలాజో... ఇగ జూస్కో పోజు! ఎంత ప్లెయిన్ అయినా నథింగ్ సో సో... ప్లెయిన్ విత్ పలాజో!! స్లీవ్‌లెస్ షార్ట్ ప్లెయిన్ కుర్తీకి బాటమ్‌గా కాంట్రాస్ట్ పలాజో ధరిస్తే కంఫర్ట్ ఫీల్‌నిస్తుంది. అంతేకాదు, సూపర్ స్టైలిష్‌గా ఆకట్టుకుంటారు. రెడ్ అండ్ వైట్ ప్లెయిన్ కాంబినేషన్. వెస్ట్రన్పార్టీలో వెరైటీ లుక్. నలుపు రంగు లాంగ్ స్లీవ్స్ కుర్తీ, ముదురు ఎరుపు పలాజో నేటి వనితలకు నప్పే సరైన డిజైనర్ వేర్. మిడ్ స్లీవ్స్ షార్ట్ కుర్తీకి కాటన్ పలాజో హుందాతనాన్ని పెంచుతుంది. ట్రెడిషనల్ లుక్‌తోనే మోడ్రన్‌గా ఆకట్టుకోవాలనుకునే వారికి సరైన ఎంపిక. లాంగ్ గ్రే కలర్ కుర్తాకి నలుపురంగు పలాజో క్యాజువల్ అండ్ కంఫర్ట్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంది. షర్ట్ టైప్ ప్లెయిన్ లాంగ్ కుర్తీకి వైట్ పలాజో సింపుల్‌గా అనిపించే గ్రేట్ కాంబినేషన్. క్యాజువల్ వేర్లో అతివలను అమితంగా ఆకట్టుకుంటున్న స్టైల్ ఇది. మస్టర్డ్ ఎల్లో లాంగ్ స్లీవ్‌లెస్ కుర్తీ టాప్, రాణీ పింక్ పలాజో సంప్రదాయ వేడుకలకు స్టైలిష్ మెరుగులు అద్దుతుంది. -
గడ్కరీకి కుర్తా.. నితీష్‌కు పైజామా
రహదారి నిర్మాణ పనులపై ఎలాంటి ముందడుగు కనిపించకపోవడంతో కలతచెందిన బిహార్‌లోని ఓ స్థానిక ఎంఎల్ఏ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. సగం ప్యాంటు, బనీన్ను మాత్రమే ధరించి, తన కుర్తాను కేంద్ర రోడ్డు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి, పైజామాను బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు పంపి తన నిరసన తెలిపారు. బీహార్‌కు చెందిన ఎమ్ఎల్ఏ వినయ్ బిహారీ, గత మూడేళ్లుగా తమ నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జోగపట్టి మార్గాన్ని కలుపుతూ వెస్ట్ చంపారన్స్ మనుపుల్ నుంచి నావల్పుర్ రత్వాల్ చౌక్ మార్గాన్ని మీదుగా 44కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాలని ఆయన సంకల్పించారు. కానీ ఈ రోడ్డు నిర్మాణ పనులపై కనీసం సీఎం నితీష్‌కుమార్ నుంచి కానీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినా వారినుంచి స్పందన కరువైంది. దీంతో ఇరు ప్రభుత్వాల తీరుపై విసుగెత్తిన ఆయన తన కుర్తాను నితిన్ గడ్కరీకి పంపుతూ ఓ లేఖను పంపారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేవరకు తాను కుర్తాను ధరించనని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కుర్తా ఎలా ఉందో అలా భారతీయ జనతా పార్టీ అహంకారపూరిత వైఖరి కనిపిస్తుందన్నారు. అంతటితో ఆగకుండా తన పైజామాను సీఎం నితీష్‌కు పంపుతూ... మూడేళ్ల కిందట ఆయన ఇచ్చిన వాగ్దానాలపై మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల తర్వాత హామీలన్నింటినీ నితీష్ పక్కనబెట్టారని బాహాబాటంగా విమర్శించారు. -
కూల్ కుచ్చులు...
కొత్త డిజైన్‌లో ఏదొచ్చినా ‘అబ్బో ఎంత కూల్‌గా ఉంది’... అంటారు. ఇప్పుడు సింగిల్పీస్కుచ్చుల కుర్తాలు మార్కెట్లో కూల్ హల్చల్ చేస్తున్నాయి. డిజైన్ చాలా సింపుల్. మీకు మీరే డిజైనర్ అయిపోవచ్చు. వేడుకలో కూల్ అండ్ కలర్ఫుల్గా వెలిగిపోవచ్చు. పటియాలా, ధోతీ స్టైల్ బాటమ్స్ని ఇప్పటి వరకు చూశాం. ఇప్పుడవే కుచ్చులను కుర్తీలకు పెట్టేస్తున్నారు. ఇలా అందంగా, ప్రెజెంట్ డేస్నికలర్ఫుల్గా మార్చేస్తున్నారు డిజైనర్లు. షల్వార్, కమీజ్‌లు కంఫర్ట్ నుంచి కంటికి ఇంపుగా మార్చే దిశగా డిజైనర్లు ఎన్నో కసరత్తులు చేస్తూనే ఉన్నారు. దీంట్లో భాగంగా డ్రేప్ కుర్తీలు రెడ్ కార్పెట్‌పై తెగ హడావిడి చేస్తున్నాయి. చూపరుల మది దోచేస్తున్నాయి. కుచ్చుల కుర్తీ... పైన లాంగ్ జాకెట్ పూర్తి ఎంబ్రాయిడరీతో ఉండగా దానికి అటాచ్ చేసిన ప్లెయిన్ జార్టెట్ క్లాత్ నడుము భాగాన ఫిట్‌గా ఉండి, కింది భాగంలో కుచ్చులు కుచ్చులుగా వదులుగా ఉంటుంది. సాధారణ కుర్తాలతో బోరెత్తిపోయినవారికి ఇప్పుడీ కుర్తీలు తెగ ఆకర్షిస్తున్నాయి. టాప్ టు బాటమ్... జాకెట్, బాటమ్ రెండూ ఒకే రంగుతోనూ, పూర్తి కాంట్రాస్ట్ కలర్స్‌తోనూ డిజైన్ చేసుకోవచ్చు. షిఫాన్, జార్టెట్ క్లాత్‌లు కుచ్చులు ఉన్న భాగాన్ని, జాకెట్ భాగానికి వెల్వెట్, బెనారస్, రా సిల్క్... వంటి మంచి ఫాల్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. ఇలా డిజైన్ చేసుకున్న కుర్తాకి బాటమ్‌గా అదే రంగు లేదా పూర్తి కాంట్రాస్ట్ లెగ్గింగ్ ధరిస్తే డ్రేప్డ్ కుర్తా సెట్ అయిపోతుంది. -
'చెంబులో నిప్పులేసి ఇస్త్రీ చేసుకునేవాడిని'
ప్రధాని నరేంద్రమోదీ తన కుర్తా రహస్యం చెప్పారు. తన ముందున్న పరిస్థితులే తనను ఆ దుస్తులు వేసుకునేలా చేశాయి తప్ప తనకేం ఫ్యాషన్ డిజైనర్ లేడని మోదీ చెప్పారు. శుక్రవారం పాఠశాల విద్యార్థులతో సంభాషించిన ఆయనను పలువురు విద్యార్థులు కుర్తా విషయంలో ప్రశంసించారు. భారతీయ వస్త్ర సంప్రదాయానికి ఆయనొక అంబాసిడర్ అని విద్యార్థులు కొనియాడారు. ఈ సందర్భంగా వారివైపు చిరునవ్వుతో చూస్తూ తన కుర్తా గురించి వివరించారు. 'నా కుర్తాకు సంబంధించి ప్రత్యేక డిజైనర్ ఉన్నాడనే వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను సాదాసీదాగా ఉండాలనే వీటిని ధరిస్తాను. గుజరాత్లో చలి ఉండదు. చాలాసార్లు నా దుస్తులు శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాను. అందుకు నా దుస్తులు నేనే ఉతుక్కునేవాడిని. అవి ఉతికేందుకు తేలికగా ఉంటాయి. దానివల్ల సమయం ఆదా అయ్యి మిగతా పనులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే నేను వాటిని ధరిస్తాను. ధరించే దుస్తులు కనిపించడానికి బాగా ఉండాలని కోరుకుంటాను. కానీ ఇస్త్రీ చేయించుకునేందుకు డబ్బులు ఉండేవి కావు. అందుకే చెంబులో నిప్పులు వేసి ఇస్త్రీ చేసుకునేవాడిని. వాటికి తగినట్లు కాన్వాస్ షూ వేసుకునేవాడిని. అలా అలవాటయిందే కుర్తా తప్ప ప్రత్యేక డిజైనర్ నాకు లేడు. ఏదేమైనా ఓ కార్యక్రమానికి తగినట్లుగా దుస్తులు ధరించాలనేది నా అభిప్రాయం' అని మోదీ చెప్పారు. -
యువతకు కమలదళం గాలం
ఎన్నికల సమయంలో పైజామా, కుర్తా ధరించనున్న ఆ పార్టీ నేతలు న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల సమయం ఆసన్నమవుతుండడంతో యువ ఓటర్లను తమవైపు తిప్పుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులోభాగంగా ఎన్నికల ప్రచార సమయంలో పైజామా, కుర్తాలతో ఆ పార్టీ నాయకులు కనిపించనున్నారు. ఏ ఎన్నికలలోనైనా అత్యధిక ప్రభావం చూపేది యువతరమేనని, అందువల్ల వారిని ఆకట్టుకునేరీతిలో దుస్తులు ధరించాలని బీజేపీ అధిష్టానం... నాయకులు, కార్యకర్తలకు ఇప్పటికే సూచించింది. ఈ విషయమై పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ‘యువకుల మాదిరిగా కనిపించడం కోసం ఎన్నికల ప్రచార సమయంలో మేమంతా పైజామా, కుర్తాలను ధరిస్తాం. ఆవిధంగా వారి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తాం’అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వార్డ్రోబ్ను గమనించి ఆ తరహా దుస్తులను ధరించాలని అధిష్టానం తమకు సూచించిందన్నారు. ‘ఈ దుస్తులను ధరించి మేమంతా ఢిల్లీ పరిధిలోని వివిధ కళాశాలలు, కేఫ్‌లు, మాల్స్‌కు కచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. ఆవిధంగా యువతరాన్ని మేము ఆకట్టుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు పార్టీలో చేరాలంటూ యువతరాన్ని కోరతాం’ అని అన్నారు. ఇదిలాఉండగా ఈ నెల 15వ తేదీవరకూ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
నమో ఫ్యాషన్
చాలాకాలం తర్వాత, బహుశా రాజీవ్‌గాంధీ తర్వాత మరోసారి రాజకీయనేతల ఆహార్యం వార్తల్లో విశేషం అయింది. దీనికి ముఖ్యకారణం ప్రధాని నరేంద్రమోడీ. విభిన్న రకాల కుర్తాలు, వస్త్రధారణతో మోడీ సమకాలీన రాజకీయనేతల్లో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సహజంగా రాజకీయనేతల వస్త్రధారణకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని ఫ్యాషన్ ప్రపంచం... మోడీ కారణంగా ఒక్కసారిగా తన దృక్పథాన్ని పూర్తిగా మార్చుకుంది. రాజకీయాల్లోనే కాదు... ఫ్యాషన్ ఐకాన్‌గానూ కూడా భారత ప్రధాని మోడీ ముందంజలో ఉన్నారు. ఆయన ధరించే హాఫ్ స్లీవ్డ్ కుర్తా, నెహ్రూ జాకెట్-ఫిట్టెడ్ పైజామాల కాంబినేషన్ ఇప్పుడు ప్రతి డిజైనర్ బొటిక్‌లో, ఇ-కామర్స్ పోర్టల్‌లో ఉండి తీరాల్సిన ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. దేశీయంగా ప్రసిద్ధి చెందిన డిజైనర్ జోడి కపిల్-మోనికా అరోరాలు మోడీ స్ఫూర్తిగా రూపొందిన దేశీస్టైల్ డ్రెస్సింగ్‌ను ‘ఓల్డ్ క్లాసిక్ బట్ న్యూ విజన్, న్యూ ఇండియా’ అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేశారు.‘‘మోడీ విజన్‌లో మాత్రమే కాదు ఫ్యాషన్‌లో కూడా ఇన్స్పిరేషన్’అంటారు కపిల్. ఢిల్లీ, ముంబయి, వారణాసి, గుజరాత్‌లలో యూత్ సైతం మోడీ స్టైల్‌ను అనుసరిస్తున్నారని మోనిక గుర్తుచేస్తారు. మోడీ మానియా డాట్ కామ్ పేరుతో ఏర్పడిన సైట్ మోడీ కుర్తా, ఆయన యాక్సెసరీస్‌ను కూడా లాంచ్ చేసింది. సగం చేతుల కుర్తా ట్రెండ్... సంప్రదాయ వస్త్రశైలితో భారతీయతకు ప్రతిబింబంలా ఉండడం మోడీకి ప్లస్ పాయింట్. ప్రత్యేకించి సగం చేతుల కుర్తా ఆయన సృష్టించిన ట్రెండ్. ఇది మోడీ కుర్తాగా ఫేమస్ అయింది. అహ్మదాబాద్‌లోని ఖరీదైన దుస్తుల విక్రయకేంద్రమైన ‘జడే బ్లూ’లో ఆయన తన దుస్తులు కొనుగోలు చేస్తారట. డిజైనర్ల ప్రశంసలు... ‘ఆకట్టుకునే డ్రెస్సింగ్‌లో మోడీని మించిన రాజకీయవేత్త లేర’ని డిజైనర్ పూనమ్ బజాజ్ స్పష్టం చేశారు. ‘నెహ్రూ జాకెట్‌ను ఆయన ధరించే తీరు యువతను సైతం అదే బాటలో నడిపించేలా ఉంది. ఇక ఆయన కుర్తా శైలికి తిరుగేలేదు’ అని డిజైనర్ పూజా మోత్వానీ కొనియాడుతున్నారు. ‘మోడీ నిజమైన భారతీయ రాజకీయనేతకు ఆధునిక చిహ్నంలా ఉంటార’ని డిజైనర్ స్వాతీ మెహ్రోత్రా అంటున్నారు. ఈ మాటతో ఏకీభవిస్తున్న డిజైనర్ రీతూ చాబ్రా... ఆయన ఖాదీ వస్త్రధారణ దేశభక్తిని ప్రేరేపిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ఏ రాజకీయవేత్తా ఎంచుకోని ఆఫ్ బీట్ రంగుల కుర్తాలతో మోడీ కలర్‌ఫుల్ గుజరాత్‌కు ప్రతిబింబంలా ఉంటారం’టూ ఫ్యాషన్ బ్లాగర్ ఆయుషి బాంగ్వర్ పొగిడేస్తున్నారు. నమో చీరలూ షురూ... ఇటీవల నరేంద్రమోడీ చీరలు కూడా వచ్చేశాయి. నరేంద్రమోడీ ఫ్యాషన్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ముంబయి పానేరి చీరల షోరూమ్ మోడీ డిజిటల్ ప్రింట్ ముఖ చిత్రం ఉన్న జార్జెట్ శారీస్ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ‘ఈ చీరలకు రూ.2,150 ధరతో, లాంచ్ చేసిన రోజే 160 శారీస్ విక్రయించాం’ అని పానేరి సిఇఒ వినోద్ అంటున్నారు. నమోశారీస్ పేరుతో నాగ్‌పూర్‌లో ఒక వస్త్రదుకాణం విక్రయాలు ప్రారంభిస్తే... మిగిలిన వారు అమాంతం అందిపుచ్చుకున్నారు. సూరత్‌లో తయారవుతున్న బెనారస్ ప్రింటెడ్ జార్జెట్ చీరలు నాగ్‌పూర్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయట. ముఖ్యంగా 20 - 30 ఏళ్ల మధ్య వయస్కులైన యువతులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని విక్రయదారులు అంటున్నారు. పల్లూపై మోడీ ముఖచిత్రం ముద్రించడంతో పాటు ఆంగ్లం, దేవనాగరి లిపిలో ‘నమో’ అక్షరాలను కూడా ముద్రించిన చీరలు ఆకట్టుకుంటున్నాయి. ఆయనే ఒక ఫ్యాషన్ బ్రాండ్... మోడీ అభిమానులు ప్రారంభించిన మోడీ మాని యా డాట్‌కామ్‌లో ఆయన కుర్తాలు, యాక్సెసరీస్ వగైరాలు విక్రయిస్తున్నారు. ‘గడచిన 2013 డిసెంబరులో ప్రారంభించిన మా వెబ్సైట్ ద్వారా బ్లాక్, స్కైబ్లూ, డార్క్‌బ్లూ... ఇలా 8 రంగుల్లోని మోడీ కుర్తాలను మేం అందిస్తున్నాం’ అని వెబ్సైట్ ప్రమోటర్ తివారీ చెప్పారు. జేడ్బ్లూలో దొరికే ఈ తరహా కుర్తాలు ఖరీదు ఎక్కువనీ, అయితే మోడీ అభిమానులు తక్కువ ధరలోనే రూ.900 - రూ.1200 వాటిని పొందేందుకు వీలుగా దీన్ని ప్రారంభించామనీ ఆయన అంటున్నారు. సూపర్బ్ అంటున్న అమెరికన్ మీడియా! సెప్టెంబరులో భారతప్రధానికి స్వాగతం పలకనున్న అమెరికాలో కూడా మోడీ ఫ్యాషన్ ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యూయార్క్‌టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి అగ్రగామి మీడియా సంస్థలన్నీ తమ కధనాల్లో మోడీ కుర్తా గురించి పొగడ్తల వర్షం కురిపించాయి. ‘మూవ్ ఎసైడ్ మిచెల్ ఒబామా. ది వరల్డ్ హేజ్ ఎ న్యూ ఫ్యాషన్ ఐకాన్’ అంటూ ఓ మీడియా వ్యాఖ్యానించడం గమనార్హం. - ఎస్.సత్యబాబు -
‘మోడీ కుర్తా’కు అమెరికా ఫిదా
అగ్రరాజ్యం మీడియా ప్రశంసల జల్లు వాషింగ్టన్: కొన్నేళ్ల క్రితం నరేంద్ర మోడీకి తమ దేశంలోకి అనుమతిలేదంటూ తిరస్కరించిన అమెరికా.. ఇపుడు ఆయన్ను ఒక తరహా ఫ్యాషన్‌కు ప్రతినిధిగా భావిస్తోంది. భారత్‌లో బీజేపీ విజయదుందుభి మోగించిన తర్వాత ఇక్కడి మూడు ప్రఖ్యాత వార్తా పత్రికలు.. టైమ్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ మోడీ ట్రేడ్‌మార్క్ కుర్తాపై, దానిని ఆయన ధరించే తీరుపై ప్రశంసలు కురిపించాయి. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ‘‘ఒక నేత ఎవరు అతను ఎలాంటివి ధరిస్తాడు’’ అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో మిషెల్లీ ఒబామా డ్రెస్సింగ్ స్టయిల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలెండీ, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రోసెఫ్ మేకప్, దివంగత నల్ల సూరీడు నెల్సన్ మండేలా చొక్కాల కన్నా భారత కొత్త ప్రధాని మోడీ వస్త్రధారణ ప్రత్యేకమైనదని, దానిని ఒక కొత్త కేస్ స్టడీలా పరిగణించవచ్చని పేర్కొంది. ఇక వాషింగ్టన్ పోస్ట్ అయితే.. ‘‘మిషెల్లీ ఒబామాను పక్కనబెట్టండి. ప్రపంచానికి కొత్త ఫ్యాషన్ ప్రతినిధి లభించాడు. అది ఫిట్నెస్తో ఉండే పుతిన్ కాదు. భారత కొత్త ప్రధాని నరేంద్ర మోడీ’’ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. కుర్తాతో మోడీ ఒక సెలెబ్రిటీలా మారిపోయారని టైమ్ పత్రిక శుక్రవారం రాసింది. భారత ఫ్యాషన్‌లో ఆయన అగ్రగణ్యుడిగా నిలుస్తాడని కొనియాడింది. మోడీ పర్యటన తేదీలు ఖరారు కాలేదు: అమెరికా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ దేశ పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. మోడీ పర్యటనపై విలేకరులతో మాట్లాడిన ఆదేశ విదేశాంగ శాఖ డిప్యూటీ ప్రతినిధి మేరీ హార్ఫ్.. తేదీలపై తుది సమాచారం లేదని తెలిపారు. భారత ప్రధానికి స్వాగతం పలకడంపై అధ్యక్షుడు బరాక్ ఒబామా, విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఎదురు చూస్తున్నారని, అయితే అది ఎప్పుడు అనేది ఇంకా తెలియదని హార్ఫ్ చెప్పారు. సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారని, ఆ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని భారత ప్రభుత్వం గతంలో చెప్పిన విషయం తెలిసిందే.