టెకీలు, ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు ఎలాంటి దస్తులు వేసుకుని వస్తారు..? చక్కగా సూటు బూటు వేసుకుని వస్తారు. కానీ కుర్తాలు వేసుకుని రావాలని చెబుతున్నారు ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్.
ఏఎన్‌ఐకి చెందిన స్మితా ప్రకాష్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతీయులందరూ పాశ్చాత్య దుస్తులకు స్వస్తి పలికి కుర్తాలను ధరించాలని సూచించారు.
“మనం కుర్తాలో మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చు. ఇది ప్రత్యేకంగా భారతీయమైనది. నా దృష్టిలో, కుర్తా చాలా సొగసైన డ్రెస్. భారతీయులందరూ, ముఖ్యంగా యువ సాంకేతిక నిపుణులు కుర్తాలను ధరించాలని నేను అనుకుంటున్నాను” అని అగర్వాల్ అన్నారు.
జూలై 8న షేర్ చేసిన ఈ పాడ్‌కాస్ట్ కొద్ది సమయంలోనే ట్రాక్‌ని పొందింది. చాలా మంది అగర్వాల్ భావాలతో ఏకీభవించడంతో కామెంట్ సెక్షన్ సానుకూల స్పందనలతో నిండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment