'మమ్మల్ని వెధవల్ని చేసే ఆటలు వద్దు' | Rahul shows his torn kurta at rally, Twitter can't stop laughing | Sakshi
Sakshi News home page

'మమ్మల్ని వెధవల్ని చేసే ఆటలు వద్దు'

Published Wed, Jan 18 2017 11:49 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

'మమ్మల్ని వెధవల్ని చేసే ఆటలు వద్దు' - Sakshi

'మమ్మల్ని వెధవల్ని చేసే ఆటలు వద్దు'

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై దాడి మొదలైంది. తన కుర్తా చినిగిపోయిందని, మోదీ చినిగిపోయిన కుర్తా ఎప్పుడైనా వేసుకున్నట్లు చూశారా అంటూ రాహుల్‌ చెప్పడంపై ట్విట్టర్‌లో ఎప్పటిలాగే సెటైర్లు మొదలయ్యాయి. వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు ప్రారంభమయ్యాయి.

చదవండి..('చొక్కా చింపేసిన' రాహుల్‌!)

ఉత్తరాఖండ్‌ రిషికేష్‌లో ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్‌ యథాలాపంగా ప్రధాని మోదీపై విమర్శల కురిపిస్తూ అకస్మాత్తుగా మైక్‌ నుంచి కొంచెం ముందుకొచ్చి.. చినిగిన తన కుర్తా (చొక్కా)ను చూపించారు. అనంతరం 'చూడండి నా కుర్తా చినిగిపోయింది. కానీ మోదీజీ కుర్తా ఎప్పుడూ చినిగిపోయినట్టు మీకు కనిపించదు. ఆయన సంపన్నులు, ధనికులతోనే కనిపిస్తారు' అని రాహుల్‌ పేర్కొన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో మీడియాలు పలువురు స్పందించారు.

'మమ్మల్ని వెధవల్ని చేసే ఆటలు ఆడొద్దు. ఇటీవలే నువ్వు విదేశాలకు వెళ్లొచ్చావా లేదా? రాహుల్‌ కొత్త కుర్తా కొనుగోలు చేయలేరుగానీ, విదేశాలకు వెళ్లే వ్యయాన్ని మాత్రం సంతోషంగా భరించగలరు. బ్రేకింగ్‌ న్యూస్‌.. మన ప్రియమైన రాహుల్‌ గాంధీ(పప్పు)కి తగిన కుర్తా లేదంట. వెంటనే తలా ఒక రూపాయి నిధిని జమ చేయండి. ప్రియమైన్‌ రాహుల్‌ గారు.. మీరు చార్టెడ్‌ విమానంలో వెళుతుంటే మీ కుర్తా చినిగిపోయందా?' అంటూ ఇలా వరుసగా ట్విట్టర్‌లో ట్వీట్లు పేలాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement