బిహార్‌లో ఎదురైన చేదు ఫలితాలను మరిపింపజేస్తూ.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ సంచనల విజయాలను నమోదుచేసే దిశగా దూసుకుపోతున్నది. మరోవైపు పంజాబ్‌లో ఢిల్లీ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కలలు కల్లలయ్యాయి. వరుస పరాభవాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌కు పంజాబ్‌లో ఊరట కలిగించే విజయం లభించింది. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తిరుగులేని నేతగా ప్రధాని మోదీ ఆవిర్భవించినట్టేనని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఒకవైపు ఈ మేరకు కౌటింగ్ కొనసాగుతుండగానే.. ఐదు రాష్ట్రాల్లో విజయం ఎవరిదనేది దాదాపుగా తేలిపోవడంతో నెటిజన్లు తమ వ్యంగ్యాస్త్రాలకు పదును పెట్టారు. ఈ ఎన్నికల్లో ఘోరంగా చతికిలపడిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా జోకులు పేలుస్తున్నారు. ఎలక్షన్‌రిజల్ట్స్ (#ElectionResults) యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో భారీగా కామెంట్లు, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. అఖిలేశ్, రాహుల్ సారీ నాన్న, సారీ అమ్మ అని ఫ్లకార్డులు పట్టుకొని నిలబడినట్టు ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. కొడకా నీతో ఈ పని సాధ్యం కాదు (బేటా తుమ్‌సే నహి హో పాయేగా) అంటూ అఖిలేశ్‌తో ములాయం అంటున్నట్టు మరో నెటిజన్ చమత్కరించారు. ఇలా ఫొటో మార్ఫింగ్ చేసిన ఫన్నీకామెంట్లు, సెటైర్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
#CloseEnough
Beta tumse na ho Payega....