
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీపై ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల రోజున సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపించింది. రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఖాతాను సస్పెండ్ చేసి ఆయనపై ఇతర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.
రాహుల్ గాంధీ శనివారం తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను పేర్కొంటూ తమకే ఓటేయాలని రాజస్థాన్ ప్రజలను అభ్యర్థించారు. అయితే ఈ పోస్టు ద్వారా పోలింగ్‌కు 48 గంటల పాటు ఎలాంటి ప్రచారాన్ని చేయకూడదన్న నిబంధనను ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్‌కు బీజేపీ శనివారం లేఖ రాసింది.
రాహుల్ గాంధీ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై క్రిమినల్ చేసుకునేలా రాజస్థాన్ ప్రధాన ఎన్నికల అధికారిని కూడా ఆదేశించాలని బీజేపీ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment