
రాహుల్ ట్వీట్.. మోదీ రెస్పాన్స్!
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. జయాపజయాలు ఎలా ఉన్నా నాయకులు హుందాగా స్పందించాల్సిందే. ప్రత్యర్థి విజయాన్ని కూడా స్వాగతించాల్సిందే. అదే పనిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అభినందనలు తెలిపారు.
ఈ మేరకు రాహుల్ చేసిన ట్వీట్‌పై ప్రధాని మోదీ హుందాగా రిప్లై ఇచ్చారు. రాహుల్‌గాంధీకి ధన్యవాదాలు చెప్తూ.. 'ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి' అంటూ మోదీ రీట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ విజయాలతో ప్రధాని నరేంద్రమోదీ ఛరిష్మా మరింత పెరిగిందని భావిస్తున్నారు.
Thank you. Long live democracy! https://t.co/hJoGsO5lGA
— Narendra Modi (@narendramodi) 11 March 2017