ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల కోడ్‌ను మోదీ, రాహుల్ ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 29, ఉదయం 11 గంటల లోపు ఇరువురు నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ ఇద్దరు నేతలు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్వేషపూరిత ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రసంగించారు. ఈ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్‌ను ఈసీ వివరణ కోరింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులే జాగ్రత్త వహించాలని పేర్కొంది.
ECI issues notice to BJP President JP Nadda seeking party’s response on complaints of violation of model code of conduct by PM Modi during campaign in Rajasthan.
BJP asked to respond by April 29. pic.twitter.com/9TmNOoWlE7— Arvind Gunasekar (@arvindgunasekar) April 25, 2024
Comments
Please login to add a commentAdd a comment