'చెంబులో నిప్పులేసి ఇస్త్రీ చేసుకునేవాడిని' | How the Modi Kurta Was Born, in his own Words | Sakshi
Sakshi News home page

'చెంబులో నిప్పులేసి ఇస్త్రీ చేసుకునేవాడిని'

Published Fri, Sep 4 2015 2:16 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

'చెంబులో నిప్పులేసి ఇస్త్రీ చేసుకునేవాడిని'

'చెంబులో నిప్పులేసి ఇస్త్రీ చేసుకునేవాడిని'

ప్రధాని నరేంద్రమోదీ తన కుర్తా రహస్యం చెప్పారు. తన ముందున్న పరిస్థితులే తనను ఆ దుస్తులు వేసుకునేలా చేశాయి తప్ప తనకేం ఫ్యాషన్ డిజైనర్ లేడని మోదీ చెప్పారు. శుక్రవారం పాఠశాల విద్యార్థులతో సంభాషించిన ఆయనను పలువురు  విద్యార్థులు కుర్తా విషయంలో ప్రశంసించారు. భారతీయ వస్త్ర సంప్రదాయానికి ఆయనొక అంబాసిడర్ అని విద్యార్థులు కొనియాడారు. ఈ సందర్భంగా వారివైపు చిరునవ్వుతో చూస్తూ తన కుర్తా గురించి వివరించారు.

'నా కుర్తాకు సంబంధించి ప్రత్యేక డిజైనర్ ఉన్నాడనే వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను సాదాసీదాగా ఉండాలనే వీటిని ధరిస్తాను. గుజరాత్లో చలి ఉండదు. చాలాసార్లు నా దుస్తులు శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాను. అందుకు నా దుస్తులు నేనే ఉతుక్కునేవాడిని. అవి ఉతికేందుకు తేలికగా ఉంటాయి. దానివల్ల సమయం ఆదా అయ్యి మిగతా పనులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే నేను వాటిని ధరిస్తాను. ధరించే దుస్తులు కనిపించడానికి బాగా ఉండాలని కోరుకుంటాను. కానీ ఇస్త్రీ చేయించుకునేందుకు డబ్బులు ఉండేవి కావు. అందుకే చెంబులో నిప్పులు వేసి ఇస్త్రీ చేసుకునేవాడిని. వాటికి తగినట్లు కాన్వాస్ షూ వేసుకునేవాడిని. అలా అలవాటయిందే కుర్తా తప్ప ప్రత్యేక డిజైనర్ నాకు లేడు. ఏదేమైనా ఓ కార్యక్రమానికి తగినట్లుగా దుస్తులు ధరించాలనేది నా అభిప్రాయం' అని మోదీ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement