గడ్కరీకి కుర్తా.. నితీష్కు పైజామా
Published Fri, Oct 28 2016 4:48 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM
రహదారి నిర్మాణ పనులపై ఎలాంటి ముందడుగు కనిపించకపోవడంతో కలతచెందిన బిహార్లోని ఓ స్థానిక ఎంఎల్ఏ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. సగం ప్యాంటు, బనీన్ను మాత్రమే ధరించి, తన కుర్తాను కేంద్ర రోడ్డు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి, పైజామాను బిహార్ సీఎం నితీష్ కుమార్కు పంపి తన నిరసన తెలిపారు. బీహార్కు చెందిన ఎమ్ఎల్ఏ వినయ్ బిహారీ, గత మూడేళ్లుగా తమ నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జోగపట్టి మార్గాన్ని కలుపుతూ వెస్ట్ చంపారన్స్ మనుపుల్ నుంచి నావల్పుర్ రత్వాల్ చౌక్ మార్గాన్ని మీదుగా 44కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాలని ఆయన సంకల్పించారు.
కానీ ఈ రోడ్డు నిర్మాణ పనులపై కనీసం సీఎం నితీష్కుమార్ నుంచి కానీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినా వారినుంచి స్పందన కరువైంది. దీంతో ఇరు ప్రభుత్వాల తీరుపై విసుగెత్తిన ఆయన తన కుర్తాను నితిన్ గడ్కరీకి పంపుతూ ఓ లేఖను పంపారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేవరకు తాను కుర్తాను ధరించనని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కుర్తా ఎలా ఉందో అలా భారతీయ జనతా పార్టీ అహంకారపూరిత వైఖరి కనిపిస్తుందన్నారు. అంతటితో ఆగకుండా తన పైజామాను సీఎం నితీష్కు పంపుతూ... మూడేళ్ల కిందట ఆయన ఇచ్చిన వాగ్దానాలపై మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల తర్వాత హామీలన్నింటినీ నితీష్ పక్కనబెట్టారని బాహాబాటంగా విమర్శించారు.
Advertisement