పాట్నా: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అధిక వేగంలో ఉన్న ట్రక్కు కన్వరియాలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు భక్తులు మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. బీహార్‌లోని బంకా జిల్లాలో ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కన్వరియాలు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కన్వరియాలు సుల్తాన్‌గంజ్ నుంచి జస్త్ గౌర్ నాథ్ మహదేవ్ ఆలయానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. స్థానికుల రాళ్లదాడిలో కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. స్థానికులు అంబులెన్స్‌పై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. ఘటనా స్థలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment