ట్రక్కును ఢీకొన్న ఎస్‌యూవీ | Family Members killed as SUV rams into truck in Bihar Rohtas | Sakshi
Sakshi News home page

ట్రక్కును ఢీకొన్న ఎస్‌యూవీ

Aug 31 2023 6:17 AM | Updated on Aug 31 2023 3:57 PM

Family Members killed as SUV rams into truck in Bihar Rohtas - Sakshi

ససరాం(బిహార్‌): బిహార్‌లోని రొహతస్‌ జిల్లా ససరాం వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. ససరాం పట్టణంలోని శివసాగర్‌ వద్ద రెండో నంబర్‌ జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది.

కైముర్‌ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఎస్‌యూవీలో జార్ఖండ్‌లోని రాజ్‌రప్ప ఆలయానికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆ వాహనం నిలిపి ఉన్న ట్రక్కును వేగంగా  ఢీకొంది. ఘటనలో రాజ్‌మాతాదేవి(55)తోపాటు ఆమె కూతురు, అల్లుడు, మనవడు(8), మనవరాలు(9)తోపాటు ఒక బాలిక (15), మహిళ(22) చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement