Single family
-
వాగులో కొట్టుకుపోయిన కారు
సిమ్లా: ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉనా జిల్లాలోని జైజోన్ చో వాగు ఉప్పొంగడంతో ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కాగా, మరొకరు డ్రైవర్. ఉనా జిల్లాలోని డెహ్రా నుంచి పంజాబ్‌లోని ఎస్బీఎస్ నగర్ జిల్లా మెహ్రోవాల్ గ్రామానికి ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఎస్యూవీ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది, డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న జైజోన్ చో నదిని దాటుతుండగా వారి వాహనం కొట్టుకుపోయింది. స్థానికులు దీపక్ భాటియా అనే వ్యక్తిని రక్షించి జైజోన్ లోని ప్రభుత్వ డిస్పెన్సరీకి తరలించారు. వాహనం వరద నీటిలో ఇరుక్కుపోయింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం రంగంలోకి దిగింది. వాగు నుంచి ఐదుగురు మహిళలతో సహా తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీసింది. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాటొద్దని స్థానికులు హెచ్చరించినా డ్రైవర్ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. మృతులను సూర్జిత్ భాటియా, అతని భార్య పరమజీత్ కౌర్, సోదరుడు స్వరూప్ చంద్, మరదలు బిందర్, మెహత్‌పూర్‌లోని భటోలీకి చెందిన షినో, ఆమె కుమార్తెలు భావన, అను, కుమారుడు హర్షిత్, డ్రైవర్ బిందుగా గుర్తించారు. -
ట్రక్కును ఢీకొన్న ఎస్యూవీ
ససరాం(బిహార్): బిహార్‌లోని రొహతస్ జిల్లా ససరాం వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. ససరాం పట్టణంలోని శివసాగర్ వద్ద రెండో నంబర్ జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున 4 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. కైముర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఎస్‌యూవీలో జార్ఖండ్‌లోని రాజ్రప్ప ఆలయానికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆ వాహనం నిలిపి ఉన్న ట్రక్కును వేగంగా ఢీకొంది. ఘటనలో రాజ్మాతాదేవి(55)తోపాటు ఆమె కూతురు, అల్లుడు, మనవడు(8), మనవరాలు(9)తోపాటు ఒక బాలిక (15), మహిళ(22) చనిపోయారు. -
ఒకే కుటుంబంలో రెండో పింఛన్
సాక్షి, అమరావతి : కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో రెండో వ్యక్తి లేదా మహిళకు కూడా పింఛన్ మంజూరు చేసేందుకు అనుమతి తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక కుటుంబానికి ఒక పింఛను విధానాన్ని అమలు చేసిన నేపథ్యంలో తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నిబంధనలను సరళతరం చేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. 80 శాతం కంటే అంగ వైకల్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే కుటుంబంలో రెండో వ్యక్తికి పింఛన్ మంజూరుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. కిడ్నీ రోగులు, తీతీవ్రమైన మానసిక వ్యాధితో బాధ పడేవారు, ఎయిడ్స్ రోగుల విషయంలో కూడా అదే కుటుంబంలో రెండో వ్యక్తికి కూడా పింఛన్ మంజూరుకు వీలు కల్పిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. పింఛన్ మంజూరుకు కుటుంబ ఆదాయంతో పాటు పలు అర్హత ప్రమాణాలలో మినహాయింపు ఇస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు నిబంధనలలో మార్పులు చేసింది. పింఛన్ నిబంధనలు ఇవీ.. ►గ్రామీణ ప్రాంతంలో నెలకు గరిష్టంగా రూ.10,000, పట్టణాల్లో రూ.12,000 ఆదాయం ఉన్నా కూడా పింఛన్ పొందేందుకు అర్హులు. ►గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి, లేదా పది ఎకరాల మెట్ట భూమి ఉన్నప్పటికీ పింఛన్ పొందేందుకు అర్హత ఉంటుంది. రెండూ కలిపి 10 ఎకరాలలోపు ఉంటే కూడా అర్హులే. ►ప్రస్తుతం వృద్ధాప్య, చేనేత, దివ్యాంగ, మత్స్యకార, కల్లుగీత కేటగిరీల్లో పింఛన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే, వెంటనే అతని భార్యకు వితంతు పింఛన్ మంజూరు. -
ఆ కుటుంబంలో 11 మంది డాక్టర్లు
కుప్పం: కుప్పం మండలానికి చెందిన గోనుగూరు వాసి టెంకాయల మునస్వామి,మనెమ్మ మనుమళ్లు, మనుమరాళ్లు 11 మంది వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు. మునస్వామికి శ్రీనివాసులు, చౌడప్ప, షణ్ముగం ముగ్గురు కుమారులు, విమలమ్మ, రాజేశ్వరి కుమార్తెలు ఉన్నారు. వారందరికీ 13 మంది కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వీరిలో 11 మంది వైద్యవృత్తిని ఎంపిక చేసుకుని సేవలు అందిస్తున్నారు. మునస్వామి కుటుంబంలోని మోహన, శిల్పలు గైనకాజిస్టులు కాగా, మహేష్ సర్జన్‌గా, మంజునాథ్ ఆర్థోఫిడిషన్గా సేవలు అందిస్తున్నారు. అలాగే స్రవంతి, సుభాష్, చంద్రకళ, ఉదయ్‌కువూర్, బాలాజీలు ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చదువుతున్నారు. కిరణ్ ఎంబీబీఎస్, అరుణ్‌కుమార్ బీడీఎస్ చదువుతున్నారు. వీరిలో మంజునాథ్ మాత్రం కుప్పం వందపడకల ఆస్పత్రిలో ఆర్థోపిడిషన్గా పనిచేస్తున్నారు. వ్యవసాయ నేపథ్యం కలిగిన తమ కుటుంబంలో నుంచి ఇంతమంది వైద్యులు కావడానికి పేదవారికి సేవ చేయాలన్న లక్ష్యం కారణమని వారు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి కుటుంబంలోను శుభకార్యాలకు అందరూ కలుస్తారని, అయితే మా కుటుంబసభ్యులందరూ ఒక చోట కలవాలంటే చాలా కష్టం అన్నారు. ఎందుకంటే వైద్యవృత్తిలో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడడమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. -
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
పెద్ద కూతురి ప్రేమ పెళ్లితో మనస్తాపం చిన్నకుమార్తెతో కలసి దంపతుల ఆత్మహత్య నాగర్ కోయిల్‌లో విషాదం ఓ యువతి ప్రేమ వివాహం ఆ కుటుంబ సభ్యులను కుంగదీసింది. చివరకు ముగ్గురిని బలి తీసుకుంది. ఈ పెళ్లి గురించి ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలనడంతో అవమానం భరించలేని దంపతులు, రెండో కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. నాగర్ కోయిల్‌లో బుధవారం వెలుగు చూసిన ఈ విషాద ఘటన వివరాలు. సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ సమీపంలోని చెట్టికులంకు చెందిన రవీంద్రన్ (55) కూలీ. ఆయనకు భార్య శాంతి, పిల్లలు సుభాషిణి(23), కార్తీక(18)ఉన్నారు. భార్య శాంతి స్థానికంగా ఓ సూపర్ మార్కెట్లో పనిచే స్తోంది. దంపతులు ఇరువురు కూలీలైనప్పటికీ, తమ పిల్లల్ని మాత్రం విద్యా వంతుల్ని చేశారు. రేయింబవళ్లు శ్రమించి సుభాషిణిని బీఎస్సీ చదివించారు. కార్తీక ప్లస్ టూ పరీక్షలు రాసింది. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేళ ప్రేమ పెళ్లి చేసుకున్న సుభాషిణి ఆ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. బీఎస్సీ పూర్తి చేసిన సుభాషిణి ఇటీవల పోటీ పరీక్షలకు సిద్ధమైంది. మాని మడైలోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకునే సమయంలో ఆ సెంటర్ యజమాని గోవిందన్ ప్రేమలో పడింది. వీరిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడాన్ని సుభాషిణి తల్లిదండ్రులు చూశారు. సుభాషిణిని మందలించారు. ప్రేమను పక్కన పెట్టి చదువుకోవాలని లేని పక్షంలో తామే ఓ మంచి వాడిని చూసి పెళ్లి చేస్తామని హితవు పలికారు. ప్రేమ వలలో పడ్డ సుభాషిణి పట్టించుకోకుండా గత వారం వెళ్లిపోయింది. ప్రియుడు గోవిందన్‌తో కలసి మదురైలో ప్రత్యక్షమైంది. అక్కడ ఈ ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కాపురం పెట్టేశారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులతోపాటు చెల్లెలు కార్తీకను కుంగదీశాయి. దీంతో బుధవారం ఉదయం ఆ కుటుంబ సభ్యులు కూడా విగతజీవులయ్యారు. బుధవారం ఉదయం శాంతి సోదరుడు పెరుమాల్ చెట్టికులంకు రావడంతోనే ఆ ముగ్గురు మరణించిన విషయం వెలుగు చూసింది. తలుపు ఎంతగా తట్టినా సోదరి తెరవక పోవడంతో అనుమానం వచ్చిన పెరుమాల్ ఇరుగు పొరుగు వారి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ల నుంచి కూడా సరైన సమాచారం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగుల కొట్టగా, శవాలు కుళ్లిన వాసన వచ్చింది. లోనికి వెళ్లి చూడగా ఓ గదిలో శాంతి, కార్తీక ఉరి వేసుకుని వెలాడుతుండటం కనిపించింది. దీంతో ఒక్క సారిగా ఆ పరిసరాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. మరో గదిలో రవీంద్రన్ సైతం ఉరివేసుకుని వేలాడుతుండడం బయట పడింది. మృత దేహాల నుంచి దుర్వాసన వెదజల్లుతుండడంతో వీరు మరణించి ఒక రోజుకు పైగా అవుతోన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృత దేహాల్ని మార్చురీకి తరలించారు. రేయింబవళ్లు కష్టపడి పెంచినందుకు ఆ కుటుంబానికి పెద్ద కుమార్దె మంచి బహుమతే ఇచ్చి వెళ్లిందని ఇరుగు పొరుగు వారు శాపనార్థాలు పెట్టారు.