యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి | 7 dead in road accident in Uttar Pradesh Banda | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Jul 1 2023 6:13 AM | Updated on Jul 1 2023 6:13 AM

7 dead in road accident in Uttar Pradesh Banda - Sakshi

బాందా: విద్యుదాఘాతానికి గురైన ఒక బాలు డిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వేగంగా వెళ్తు న్న వాహనం ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. టిలౌసా గ్రామానికి చెందిన కల్లు(13) అనే బాలుడు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు.

కుటుంబసభ్యులు అతడిని తీసుకుని దగ్గర్లోని బబెరు ఆరోగ్య కేంద్రానికి ఎస్‌యూవీలో బయలుదేరారు. వారి వాహనం అదుపుతప్పి కమాసిన్‌ రోడ్డులో నిలిపిఉన్న ట్రక్కును వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ఘటనలో కల్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో వారి వాహనం గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుతోందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్‌ కోసం గాలిస్తున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement