పాట్నా: బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు గుమిగూడిన జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు.
నయా గావ్ టోలి గ్రామంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భూయాన్ బాబా పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం వచినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాజిపూర్‌లోన సదర్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు సహాయంగా అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: హైవేపై లారీ బీభత్సం.. 48 వాహనాలు ధ్వంసం.. 30 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment