లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమికి 292 సీట్లు రాగా, ఇండియా కూటమికి 243 సీట్లు వచ్చాయి. సంపూర్ణ మెజారిటీ సంఖ్యను ఒంటరిగా టచ్ చేయడంలో బీజేపీ విజయవంతం కాలేదు. టీడీపీ, జేడీయూ తదితర పార్టీల సాయంతో మోదీ ప్రభుత్వం మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం వచ్చింది. మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈరోజు (బుధవారం) జరిగే ఎన్డీఏ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరగనున్నాయి. మరోవైపు ఇండియా కూటమి కూడా ఈరోజు(బుధవారం) భేటీ కానుంది.
ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్‌లు పట్నా నుంచి బయలుదేరి వెళ్లారు. వీరిద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఫ్లైట్‌లో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ 12 సీట్లు గెలుచుకోగా, ఆర్జేడీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. నితీష్, తేజస్వి కలసి వెళుతుండటం చూసిన రాజకీయ విశ్లేషకులు నితీష్ కొత్త ఆటకు తెరలేపుతున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment