2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడగానే దేశంలోని రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎన్డీఏ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించే పనిలో మహాకూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయితే యూపీలోని బీజేపీ శ్రేణుల ఉత్సాహం మిన్నంటుతోంది. యూపీ రాజధాని పట్నాలో బీజేపీ కార్యకర్తలు లెక్కకుమించిన సంఖ్యలో లడ్డూలను ఆర్డర్ చేస్తున్నారు. మంగళవారం ఫలితాలు వెల్లడయ్యాక లడ్డూలు పంచుతూ సంబరాలు చేసుకునేందుకు వారు ప్లాన్ చేశారు.
పట్నాలో రాజస్థానీ నెయ్యి లడ్డూలతో పాటు మానేర్ లడ్డూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మానేర్ లడ్డూ గురించి ప్రస్తావించారు. ఈ నేపధ్యంలో ఈ లడ్డూలకు బీజేపీ నేతలు, కార్యకర్తలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. స్వచ్ఛమైన నెయ్యితో చేసిన రాజస్థానీ లడ్డూలు కిలో రూ.620కు విక్రయిస్తున్నారు. పట్నాకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక మిఠాయి దుకాణంలో క్వింటాల్ లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు.
ఈ లడ్డూలు జూన్ 4న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య బీజేపీ కార్యాలయానికి చేరుకోనున్నాయి. ఇందుకోసం బీజేపీ కార్యకర్తలు ముందుగానే సదరు దుకాణదారునికి డబ్బులు కూడా చెల్లించారు. స్వచ్ఛమైన నెయ్యి తో చేసిన క్వింటాల్ లడ్డూ ధర రూ. 62 వేలు అని దుకాణదారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment