laddoos
-
ఫలితాల పండుగకు క్వింటాళ్లలో లడ్డూల ఆర్డర్లు
2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడగానే దేశంలోని రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎన్డీఏ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించే పనిలో మహాకూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయితే యూపీలోని బీజేపీ శ్రేణుల ఉత్సాహం మిన్నంటుతోంది. యూపీ రాజధాని పట్నాలో బీజేపీ కార్యకర్తలు లెక్కకుమించిన సంఖ్యలో లడ్డూలను ఆర్డర్ చేస్తున్నారు. మంగళవారం ఫలితాలు వెల్లడయ్యాక లడ్డూలు పంచుతూ సంబరాలు చేసుకునేందుకు వారు ప్లాన్ చేశారు.పట్నాలో రాజస్థానీ నెయ్యి లడ్డూలతో పాటు మానేర్ లడ్డూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మానేర్ లడ్డూ గురించి ప్రస్తావించారు. ఈ నేపధ్యంలో ఈ లడ్డూలకు బీజేపీ నేతలు, కార్యకర్తలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. స్వచ్ఛమైన నెయ్యితో చేసిన రాజస్థానీ లడ్డూలు కిలో రూ.620కు విక్రయిస్తున్నారు. పట్నాకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక మిఠాయి దుకాణంలో క్వింటాల్ లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు.ఈ లడ్డూలు జూన్ 4న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య బీజేపీ కార్యాలయానికి చేరుకోనున్నాయి. ఇందుకోసం బీజేపీ కార్యకర్తలు ముందుగానే సదరు దుకాణదారునికి డబ్బులు కూడా చెల్లించారు. స్వచ్ఛమైన నెయ్యి తో చేసిన క్వింటాల్ లడ్డూ ధర రూ. 62 వేలు అని దుకాణదారు తెలిపారు. -
పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు
అదేమిటో కానీ, మన ఇంటి వంట కంటే పక్కింటి పోపుకే ఘుమఘుమలు ఎక్కువ. మన పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రం ఉడిపి వాళ్ల ఆరోగ్యవంటలకు మన వంటింట్లో పోపు వేద్దాం. పాలిచ్చే తల్లి ఏమి తినాలో ఉడిపి వాళ్ల మెనూ చూద్దాం. సొప్పు పాల్య కావలసినవి: ►పాలకూర – 2 కట్టలు ►ఉల్లిపాయ– 1 (తరగాలి) ►ఉప్పు – అర టీ స్పూన్ ►మిరియాల పొడి– టీ స్పూన్. ►పోపు కోసం: నెయ్యి– 2 టీ స్పూన్లు ►జీలకర్ర – అర టీ స్పూన్ ►కరివేపాకు– 2 రెమ్మలు. తయారీ: ►పాలకూరను శుభ్రం చేసి తరగాలి. ►బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయాలి. ►అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ►ఆ తర్వాత కరివేపాకు వేయాలి. ►ఇప్పుడు పాలకూర, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మూత పెట్టి సన్న మంట మీద పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి (ఆకులోని నీటితోనే మగ్గుతుంది). ►దీనిని పాలిచ్చే తల్లికి రెండు రోజులకొకసారి పెడతారు. మోహన్ లడ్డు కావలసినవి: ►గోధుమ పిండి– కప్పు ►బియ్యప్పిండి– టేబుల్ స్పూన్ ►నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు ►చక్కెర– కప్పు ►నీరు – అర కప్పు ►యాలకుల పొడి– అర టీ స్పూన్ ►జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – టేబుల్ స్పూన్ ►నూనె – పూరీలు కాలడానికి తగినంత. తయారీ: ►వెడల్పు పాత్రలో గోధుమపిండి, బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నీటిని పోస్తూ ముద్దగా కలపాలి. ►బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండినంతటినీ పూరీలు చేసుకోవాలి. ►మోహన్ లడ్డు కోసం చేసే ఈ పూరీలు మెత్తగా ఉండకూడదు, కరకరలాడాలి. ►చల్లారిన తరవాత వీటిని తుంచి చిన్న ముక్కలు చేయాలి. ►బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పూరీ ముక్కల్లో కలపాలి. ►ఒక పాత్రలో చక్కెర వేసి, నీరు పోయాలి. చక్కెర కరిగిన తరవాత, యాలకుల పొడి వేసి మీడియం మంట మీద సిరప్ తయారయ్యే వరకు మరిగించాలి. ►ఈ చక్కెర పాకాన్ని పూరీ ముక్కల మీద పోస్తూ లడ్డు చేయాలి. ఇది ఉడిపి స్పెషల్. చదవండి: Menopause: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు.. Facial Brush: మృత కణాలు, దుమ్ము, ధూళి మాయం.. ఈ డివైజ్ ధర ఎంతంటే! -
వావ్.. 4 వేల ఏళ్ల క్రితమే మల్టీ గ్రేయిన్ లడ్డూలు..
న్యూఢిల్లీ : అతి ప్రాచీన నాగరికతల్లో ఒకటైన హరప్పాలో నివసించిన ప్రజలు లడ్డూలు తినే వారన్న సంగతి తెలిసిందే. 2017లో జరిపిన తవ్వకాల్లో 7 లడ్డూలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గోధుమ రంగులో ఉన్న ఈ లడ్డూలు ఒకే సైజును కలిగి ఉన్నాయి. వాటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అవి క్రీస్తు పూర్వం 2500 సంవత్సరానికి చెందినవని తేల్చారు. ఈ లడ్డూలపై జరిపిన పరిశోధనలకు సంబంధించిన నివేదిక ఒకటి తాజాగా వెలువడింది. దీనిపై పురావస్తు శాస్త్రవ్తేత ఆగ్రిహోత్రి మాట్లాడుతూ.. వాటిపై భాగం బాగా గట్టిపడటంతో ఇంత కాలం పూర్తిగా పాడవకుండా ఉన్నాయని అన్నారు. వీటిపై నీళ్లు పడినపుడు వాటి రంగు మారుతోందని తెలిపారు. ఈ లడ్డూలు అన్నీ బార్లే, గోధుమ, బఠాణీలు మరికొన్ని తృణ, పప్పు ధాన్యాలతో తయారు చేశారని, ఈ విషయం మైక్రోస్కోపిక్ పరిశోధనల్లో తేలిందని వెల్లడించారు. వ్యవసాయ ఆధారితులైన హరప్పా ప్రజలు అత్యధిక మాంసపుకృతులు కలిగిన పదార్ధాలను ఆహారంగా తీసుకునేవారన్నారు. రెండు ఎద్దు బొమ్మలు, ఓ ఆయుధంతో పాటు ఈ లడ్డూలు దొరికాయని చెప్పారు. హరప్పా ప్రజలు వీటిని కొన్ని రకాల పూజల కోసం వాడేవారని పేర్కొన్నారు. చదవండి, చదివించండి : 2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం.. బైకర్‌ను ఆపిన పోలీస్.. చేతులెత్తి దండం పెడతారు! -
యాదాద్రి లడ్డూలకు ఫంగస్
సాక్షి, యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విక్రయించే 20 రూపాయల చిన్న లడ్డూలకు ఫంగస్ వచ్చింది. దీంతో వాటిని దేవస్థానం అధికారులు ఆదివారం ఉదయం చెత్త తరలించే ట్రాక్టర్లో గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి పడేశారు. సుమారు 2,500 లడ్డూలకు బూజు రావడంతో వీటిని పెద్దపెద్ద బ్యాగుల్లో నింపి ట్రాక్టర్లో ఉంచి కనిపించకుండా పైనుంచి చెత్త వేసి తరలించారు. వీటి విలువ రూ.50 వేల వరకు ఉంటుంది. పది రోజుల క్రితం తయారు చేసిన ఈ లడ్డూలను భక్తులకు విక్రయించేందుకు కౌంటర్లోకి తీసుకెళ్లి ఉంచారు. అక్కడ గాలి, వెలుతురు సరిగా లేకపోవడంతో లడ్డూలకు బూజు రావడంతో రెండు రోజుల క్రితం తిరిగి వాటిని తయారీ కేంద్రానికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఆదివారం ఉదయం వీటిని ఎవరూ చూడకుండా పెద్దపెద్ద సంచుల్లో నింపి చెత్త ట్రాక్టర్లో తరలిస్తుండగా గమనించిన స్థానికులు పాతగుట్ట రోడ్డు మధ్యలో అడ్డుకున్నారు. డ్రైవర్‌తో గొడవకు దిగడంతో అక్కడే రోడ్డు పక్కన పారబోసి వెళ్లారు.అయితే వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడం, కౌంటర్లో గాలి, వెలుతురు సరిగా లేకపోవడం వల్ల లడ్డూలకు బూజు వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఏడాది క్రితం లడ్డూలకు బూజు రావడంతో పడేసిన ఘటనలు ఉన్నాయి. అయినా దేవస్థానం అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. -
రోజు లడ్డూలే... విడాకులు ఇప్పించండి
లక్నో: వరకట్న వేధింపులు.. అత్తింటి వారి ఆరళ్లు తట్టుకోలేక విడాకులు తీసుకునే వారి గురించి విన్నాము. అయితే ఈ మధ్య కాలంలో చాలా సిల్లీ కారణాలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే దంపతులు కూడా ఈ కోవలోకే వస్తారు. ‘ఆహారంలో భాగంగా నా భార్య ప్రతిరోజు కేవలం లడ్డూలు మాత్రమే పెడుతుంది. విడాకులు ఇప్పించండి’ అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మీరట్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. బాధితుడికి పదేళ్ల క్రితం వివాహమయ్యింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు బాగానే సాగిన వీరి దాంపత్యంలో ఓ తాంత్రికుడి వల్ల కలతలు రేగాయి. గత కొద్ది కాలంగా బాధితుడు తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు. దాంతో అతడి భార్య ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. అతని సూచన మేరకు బాధితుడికి ప్రతి రోజు ఉదయం 4, సాయంత్ర నాలుగు చొప్పున లడ్డూలు భోజనంగా పెడుతుంది. ఇక ఇతర ఏ పదార్థాలు ముట్టుకోనివ్వడం లేదు. దాంతో విసిగిపోయిన బాధితుడు, భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అధికారులు వీరిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. అప్పటికి మనసు మార్చుకోకపోతే.. విడాకులు ఇప్పిస్తామని తెలిపారు. -
యాదాద్రి లడ్డూలకు బూజు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వచ్చే భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి బూజు పట్టింది. భక్తులకు పంపిణీ చేసేందుకు కౌంటర్లో ఉంచిన సుమారు 3 వేల లడ్డూలకు ఫంగస్ రావడంతో దేవస్థానం అధికారులు శనివారం వాటిని పారబోయించారు. ప్రసాద విక్రయశాలకు చెందిన అధికారులు తయారైన లడ్డూలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి కౌంటర్లకు పంపుతున్నా కౌంటర్లలో గాలి ఆడక, వేడి వాతావరణంతో పాడవుతున్నాయి. ఒకే సారి పెద్ద మొత్తంలో తయారు చేయించడం, స్టాక్ ఉంచడంతో అవి బూజు పట్టి వృథా అవుతున్నాయని అంటున్నారు. ఎందుకు పాడవుతున్నాయంటే..: తయారు చేసిన లడ్డూలను గాలికి ఆరబెట్టడం, లేదా చల్లని ప్రదేశాల్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కానీ, దేవస్థానం అధికారులు ఇష్టానుసారం లడ్డూలను పంపడం, కౌంటర్లలో వేడివాతావరణం మధ్య అలాగే వదిలేస్తుండటంతో తొందరగా బూజు వచ్చి పాడవుతున్నాయి. ఇనుప రేకుల కౌంటర్ల వల్లే.. యాదాద్రి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల బాలాలయం పక్కన ఉన్న ప్రసాద విక్రయశాలను కూల్చివేశారు. కొత్తగా ఇనుప రేకులతో తయారు చేసిన కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో సరైన గాలి ఆడక, మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రతకు వేడి అధికంగా ఉంటోంది. దీంతో లడ్డూలకు బూజు వచ్చినట్లు కౌంటర్ సిబ్బంది అంటున్నారు. కాగా, కౌంటర్లలోని లడ్డూలకు బూజు పట్టినమాట వాస్తవమేని ప్రసాద విక్రయశాల సూపరింటెండెంట్ విజయకుమార్ అన్నారు. లడ్డూలు పాడుకాకుండా కౌంటర్లలో ఏసీలు అమర్చుతామని వెల్లడించారు. -
లడ్డూలు మార్చుకోవడం కుదరదు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడుతున్న ప్రజల ఓపికకు మెచ్చుకొని వారికి లడ్డూలు పంచాలని ఢిల్లీలోని బీజేపీ శాఖ నిర్ణయించింది. ప్రతి పార్టీ కార్యకర్త ఇందులో క్రియాశీలకంగా పాల్గొనాలని. జనవరి ఒకటవ తేదీ నుంచి పది తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక ఇంటికి ఒక లడ్డూ లేదా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని లడ్డూల చొప్పున ఇవ్వాలంటూ ఆయన చేసిన సూచనపై సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో స్పందించారు. ‘నెలలో నాలుగు లడ్డూలు మాత్రమే ఇస్తారు. పాత వాటితోని కొత్త లడ్డూలు మార్చుకోవడం కుదరదు. పది లడ్డూలకు మించి లడ్డూలుంటే ఐటీ దాడులు జరుగుతాయి...ఏటీఎంల ముందు క్యూలో నిలబడితే లడ్డూలు ఇస్తారట, వాస్తవానికి రెండు లడ్డూలు వస్తాయి. ఒకటి క్యూలో, మరోటి ఏటీఎం నుంచి....లడ్డూ వ్యాసానికి సరిపడే పరికరాలు ఏటీఎంలో లేవట. వాటన్నింటిని మూసేసి మరమ్మతులకు పంపిస్తారట...డబ్బుకు బదులుగా లడ్డూలు ఇమ్మని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదంటూ ఆర్బీఐ వివరణ....మొదటి రోజు కుటుంబానికి ఒక లడ్డూ ఇస్తారు. రెండో రోజు మూడు కుటుంబాలకు కలిపి రెండు లడ్డూలు ఇస్తారు. మూడోరోజు ఆప్ లడ్డూ కా రహా హై, వా బార్డర్ పర్....నరేంద్ర మోదీ క్యాష్‌లెస్ సొసైటీ కోరుకుంటున్నందున నమో యాప్‌పై డిజిటల్ లడ్డూలను పంచుతారు....’ఇలా తమదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.