Nitish
-
మోదీ 3.0లో 3 పదవులపై నితీష్ కన్ను?
దేశంలో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ మిత్రపక్షం అయిన జేడీయూ బీహార్‌లో 12 సీట్లు గెలుచుకుంది. ఇవి ఎన్డీఏకు చాలా కీలకం.ఈ నేపధ్యంలో జేడీయే నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ నుంచి మూడు మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేసినట్లు సమాచారం. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాతో పాటు నలుగురు ఎంపీలకు ఒక మంత్రిత్వ శాఖ అనే ఫార్ములాను ప్రధాని మోదీ ముందు ఉంచారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. నితీష్ కుమార్ రైల్వే, వ్యవసాయం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కోరుకుంటున్నారని తెలుస్తోంది. దీనిలో రైల్వే మంత్రిత్వ శాఖపై పట్టుపడతారని అంటున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుని, మెజారిటీకి దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 12 సీట్లు గెలిచిన నితీష్ కుమార్(జేడీయూ), 16 సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు(టీడీపీ) ఎన్డీఏకు కీలకంగా మారారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఇద్దరు నేతల అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. -
కొత్త ఆటకు సీఎం నితీష్ తెరలేపుతున్నారా?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమికి 292 సీట్లు రాగా, ఇండియా కూటమికి 243 సీట్లు వచ్చాయి. సంపూర్ణ మెజారిటీ సంఖ్యను ఒంటరిగా టచ్ చేయడంలో బీజేపీ విజయవంతం కాలేదు. టీడీపీ, జేడీయూ తదితర పార్టీల సాయంతో మోదీ ప్రభుత్వం మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది.లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం వచ్చింది. మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈరోజు (బుధవారం) జరిగే ఎన్డీఏ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరగనున్నాయి. మరోవైపు ఇండియా కూటమి కూడా ఈరోజు(బుధవారం) భేటీ కానుంది.ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్‌లు పట్నా నుంచి బయలుదేరి వెళ్లారు. వీరిద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఫ్లైట్‌లో కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ 12 సీట్లు గెలుచుకోగా, ఆర్జేడీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. నితీష్, తేజస్వి కలసి వెళుతుండటం చూసిన రాజకీయ విశ్లేషకులు నితీష్ కొత్త ఆటకు తెరలేపుతున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రధాని మోదీ నామినేషన్‌కు సీఎం నితీష్ గైర్హాజరు.. కారణమిదే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (మంగళవారం)వారణాసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా ఉంది. అయితే ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కావడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.సీఎం నితీష్ కుమార్ అస్వస్థతకు గురయిన నేపధ్యంలో ఆయన నేడు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదని సమాచారం. ఆయన ఎన్నికల ప్రచారానికి, బహిరంగ సభలకు కూడా హాజరుకారు. అయితే ఈరోజు సుశీల్ కుమార్ మోదీ నివాసానికి వెళ్లి, ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) సోమవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన నితీష్ కుమార్‌కు సన్నిహితునిగా మెలిగారు.ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, త్రిపుర సీఎం మాణిక్ సాహా పాల్గొననున్నారు. -
రామాయణంకి ఎంతైనా కష్టపడతాను: యశ్
‘‘నమిత్, నేను కలిసి రామాయణంపై మూవీ చేస్తే బాగుంటుందని చాలా సార్లు అనుకున్నాం. కానీ, అంత పెద్ద సబ్జెక్టు తియ్యాలంటే అది మామూలు విషయం కాదు.. బడ్జెట్స్ కూడా సరిపోవు.. అందుకే నేను కూడా కో ప్రోడ్యూస్ చెయ్యాలనుకున్నాను. ఈ ‘రామాయణం’ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు ‘కేజీఎఫ్’ ఫేమ్ హీరో యశ్. ఆయన నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ కలిసి రామాయణం నేపథ్యంలో ఓ సినిమా నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకుడు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘మన దేశ ప్రగతి అయిన రామాయణాన్ని తీయడంలో న్యాయం చేయగలను అనిపిస్తోంది’’ అన్నారు. కాగా నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ‘రామాయణ్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికే నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలనే టాక్ వినిపిస్తోంది. -
Nitish Rajput: వీడియో పెట్టు కోట్లు కొట్టు
వీడియోలు చేస్తే ఎంత వస్తుంది? యూట్యూబ్‌లో పెడితే ఎంత వస్తుంది? ఎంత టాలెంట్ ఉంటే అంత వస్తుంది. నితిష్ రాజ్‌పుట్‌కు నెలకు 25 లక్షలు సంవత్సరానికి ఎంత లేదన్నా 3 కోట్లు వస్తాయి. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అన్నారు. సామాజిక అంశాల పై విస్తృత సమాచారం అందిస్తూ అతడు చేసే వీడియోల వల్లే ఈ ఆదాయం. నితిష్ సక్సెస్ స్టోరీ. 2022లో మన దేశంలో పాన్‌మసాలా వ్యాపార లావాదేవీల మొత్తం ఎంతో తెలుసా? 43,410 కోట్లు. ఊహకు అందని భారీ వ్యాపారం. అందుకే పాన్‌మసాలా సంస్థలు తమ బ్రాండ్ పేరు జనం నాలికల మీద తద్వారా వారి పొగాకు ఉత్పత్తులు జనాల నోళ్ల లోపలకు వెళ్లాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఎలా యాడ్స్ చేయిస్తాయో నితిష్ రాజ్పుట్ తన 30 నిమిషాల వీడియోలో వివరిస్తాడు. ఎలాగైతే ఆల్కహాల్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారం కోసం మంచి నీళ్లు, మ్యూజిక్ సీడీలను తమ బ్రాండ్‌తో యాడ్స్ చేస్తాయో... పాన్ మసాలా కంపెనీలు కూడా అదే దారిలో సినిమా స్టార్స్‌ను పెట్టి లాఘవంగా ‘ఇలాచీ’, ‘గులాబ్’ అంటూ దొంగ యాడ్స్ చేస్తాయని వివరిస్తాడు. అమ్మేది మాత్రం పొగాకు ఉత్పత్తులనే అని తెలుపుతాడు. అంతేకాదు పొగాకు ఉత్పత్తుల్లో నేరుగా ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం అయి ఉందో కూడా చెప్తాడు. ఇంత సవివరంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపుగా రాయదు. అందుకే నితిష్ రాజ్పుట్ వీడియోలకు అంత డిమాండ్. అన్ని వైపుల సమాచారం నితిష్ రాజ్పుట్ 2020లో తన పేరు మీద ‘నితిష్ రాజ్‌పూట్ యూట్యూబ్ చానెల్’ను మొదలుపెట్టాడు. అందులో తనే మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతాడు? ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్‌కు కారణాలేమిటి? మణిపూర్‌లో ఏం జరుగుతోంది? ఖలిస్తాన్ ఉద్యమంలో వాస్తవం ఎంత? తాలిబన్లంటే ఎవరు? క్రెడిట్ కార్డ్స్‌లో మోసం ఎలా జరుగుతుంది... ఇలాంటి అంశాలతో వీడియోలు చేస్తాడు. అయితే ఇవి పైపైన చేసే వీడియోలు కాదు. దాదాపు పరిశోధనాత్మక జర్నలిజం స్థాయిలో ఉంటాయి. తీసుకున్న అంశంలో ఏదో ఒక పక్షం వహించకుండా అన్ని పక్షాల వైపు నుంచి సమాచారాన్ని రాసి పోస్ట్ చేస్తాడు. అంతే కాదు చరిత్రలో జరిగిపోయిన కొన్ని ఘటనలను కూడా వివరిస్తాడు. ఉదాహరణకు ఇజ్రాయిల్– పాలస్తీనాల మధ్య గొడవ. ఇలా ఒకటనేముంది మ్యూచువల్ ఫండ్స్ దగ్గరి నుంచి స్టాక్ మార్కెట్ పాఠాల వరకూ అన్నీ చెబుతాడు. అందుకే రెండేళ్ల కాలంలోనే అనూహ్యమైన విజయం సాధించాడు. ఉత్తరప్రదేశ్ కుర్రాడు నితిష్ రాజ్పుట్ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ అనే చిన్న ఊళ్లో పుట్టాడు. ఇప్పుడు అతనికి 33 ఏళ్లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బి.టెక్. చేసి ఐ.టి. కంపెనీల్లో పని చేశాడు. కాని తనకంటూ ఒక సొంత అస్తిత్వం, ఆర్థిక అంతస్తు ఉండాలని ఆశించి 2020లో వీడియో చానల్ ప్రారంభించాడు. సగటు మనిషికి నిత్యం కనిపించే విషయాలే లోతుగా తెలియచేయడం అతడు ఎంచుకున్న ఫార్ములా. ఉదాహరణకు బిట్‌కాయిన్ కథా కమామిషు ఏమిటి అనే వీడియో చూస్తే దాని గురించి మనకు దాదాపుగా ఓ సమగ్ర అవగాహన వస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లు ఎలా ఆదాయం గడిస్తాయి అనేది అతని మరో వీడియో. బాలీవుడ్లో భారీ సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులెందుకు వస్తున్నాయి అనేది మరో వీడియో. స్పష్టంగా, డేటా విజువల్స్‌తో మంచి ఎడిటింగ్‌తో అతను ధారగా చెప్పుకుపోతాడు. 50 లక్షల ఫాలోయెర్లు నితిష్ రాజ్పుట్ యూట్యూబ్ చానల్‌కు 35 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టా ఇవన్నీ కలిపి మొత్తం 50 లక్షల మంది అతణ్ణి ఫాలో అవుతున్నారు. నితిష్ రాజ్పుట్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ చేసిన వీడియోలకు 25 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోల్లో యాడ్స్ ప్లే అవుతాయి కనుక యూట్యూబ్ నుంచి అలాగే ప్రాడెక్ట్స్ ప్రమోషన్ వల్ల నెలకు అతడు 25 లక్షలు సంపాదిస్తున్నాడు. సంవత్సరానికి 3 కోట్ల ఆదాయం గడిస్తున్నాడు. రెండేళ్లల్లో సాధించిన విజయం అంటే ఆశ్చర్యమే. -
ఆ పదుగురు... 2023లో రాజకీయాలన్నీ వీరి చుట్టూనే!
కొత్త సంవత్సరం 2024 కొద్దిరోజుల్లో ప్రవేశించబోతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల సంవత్సరం. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఎవరి చేతికి నాయకత్వాన్ని అప్పగిస్తారో వేచి చూడాలి. అయితే 2023లో దేశంలోని ఏ నేతలు ముఖ్యాంశాలలో కనిపించారో.. వారిలో ఆ ‘పదుగురు’ నేతలెవరో ఇప్పుడు తెలుసుకుందాం. నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ విశేష ప్రజాదరణతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది జీ-20 సదస్సు న్యూఢిల్లీలో నిర్వహించారు. దీనిలో మోదీకి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ ఏడాది చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది. దీనికి ప్రధాని మోదీ ప్రజాకర్షక నాయకత్వమే కారణమని బీజేపీ చెబుతోంది. మార్నింగ్ కన్సల్ట్ అప్రూవల్ రేటింగ్‌లో నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భారత పర్యటనను జనవరి 2023లో ముగించారు. సెప్టెంబరు 2022లో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర శ్రీనగర్‌లో ముగిసింది. ఈ పర్యటన అనుభవాన్ని రాహుల్ పార్లమెంట్ సమావేశాల్లో అందరితో పంచుకున్నారు. మరోవైపు రాహుల్ ఈ ఏడాది పార్లమెంటు సభ్యత్వాన్ని. కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత కోర్టు నుండి ఉపశమనం పొందారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ఓటమిపాలు కాగా, తెలంగాణలో విజయం సాధించింది. నితీష్ కుమార్ 2005 నుంచి బీహార్‌లో అధికారంలో ఉన్న నితీష్ కుమార్ ఈ ఏడాది కూడా హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఒక్కోసారి ఎన్డీఏ, మరికొన్నిసార్లు మహాకూటమి.. ఎప్పటికప్పుడు మిత్రపక్షంగా మారుతుండటంతో ఆయన రాజకీయ ఇమేజ్ దెబ్బతింటోంది. నితీష్ కుమార్.. బీహార్‌లో కుల గణన నిర్వహించి చర్చల్లో నిలిచారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కులగణన దిశగా ఆలోచించేలా చేశారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఏడాది వార్తల్లో నిలిచారు. 2023 ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఉమేష్ పాల్ హత్య అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఉమేష్ పాల్ హత్య కేసులో మాఫియా అతిక్ అహ్మద్ పేరు బయటకు వచ్చింది. ఈ మాఫియాను అంతమొందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో హామీనిచ్చారు. ఈ క్రమంలో యోగి ప్రభుత్వం అతిక్, అతని అనుచరులపై ఉచ్చు బిగించింది. ఉమేష్ పాల్ హత్యకేసులో ప్రమేయం ఉన్న అతిక్ కుమారుడు పోలీసుల ఎన్ కౌంటర్లో హతమయ్యాడు. ఆ తర్వాత అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ కూడా వైద్య పరీక్షల కోసం పోలీసు కస్టడీలో ఉండగా కాల్పులకు బలయ్యారు. అజిత్ పవార్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు అజిత్ పవార్ తన రాజకీయ గురువు, మామ అయిన శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి, ఎన్డీఏలో చేరి మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అయ్యారు. అంతే కాదు ఎన్సీపీ పార్టీపై కేసు వేశారు. 2019లో కూడా అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, బీజేపీతో చేతులు కలిపారు. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లభించలేదు. మహువా మోయిత్రా ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు స్వీకరించి, పార్లమెంటు వెబ్సైట్ యూజర్ ఐడి,పాస్‌వర్డ్‌ను అతనితో పంచుకున్నందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా డిసెంబర్ 8న లోక్‌సభ నుండి బహిష్కరణకు గురయ్యారు. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నివేదిక సిఫార్సు మేరకు ఆమె పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీనిపై పార్లమెంట్లో దుమారం చెలరేగింది. ఆమె ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రభుత్వం ప్రారంభించిన లాడ్లీ లక్ష్మి పథకం ఎంతో ప్రజాదరణ పొందింది. రాష్ట్ర నాయకత్వాన్ని కొత్త వ్యక్తికి అప్పగించాలని పార్టీ నిర్ణయించడంతో శివరాజ్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పార్టీ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు. మోహన్ యాదవ్ మోహన్ యాదవ్ గతంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బంపర్ విజయం సాధించడంతో మోహన్ యాదవ్ శాసనసభా పక్ష సమావేశంలో నాయకునిగా ఎన్నికయ్యారు. శివరాజ్ స్థానంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. భజన్‌లాల్ శర్మ రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన శాసనసభా పక్ష సమావేశం తర్వాత భజన్‌లాల్ శర్మ పేరు అంతటా మారుమోగింది. ఆ సమావేశంలో ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆయన తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పలువురు సీనియర్ నేతల సమక్షంలో పార్టీ ఆయనను సీఎంగా ఎన్నుకుంది. డిసెంబర్ 15న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. విష్ణుదేవ్ సాయి ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ.. విష్ణుదేవ్ సాయిని సీఎం చేసింది. శాసనసభా పక్ష సమావేశంలో ఆయనను నాయకునిగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ సాయి గిరిజన నేతగా గుర్తింపు పొందారు. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు అధికంగా ఉన్నారు. అందుకే విష్ణుదేవ్ సాయిని బీజేపీ.. సీఎంగా ఎన్నిక చేసింది. ఇది కూడా చదవండి: టాప్-5 డైట్ ప్లాన్స్... 2023లో ఇలా బరువు తగ్గారట! -
ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న హీరోయిన్ సాయి పల్లవి. వచ్చిన అవకాశాలను కాకుండా నచ్చిన పాత్రలనే అంగీకరించి నటించే అతి కొద్దిమంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఈమె ఇప్పటివరకు లభించిన చిత్రాలన్ని అలాంటివే. గార్గీ వంటి మూవీ సక్సెస్ తర్వాత సాయి పల్లవి ఇప్పటి వరకు తెరపై కనిపించలేదు అంతకుముందు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన సాయి పల్లవి చాలా రోజులు సినిమాలేవీ లేకుండానే ఖాళీగానే ఉంది. అలా పలు అవకాశాలను తిరస్కరించిన ఈ సహజ నటికి తాజాగా భారీ బ్రహ్మాండ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది. (ఇది చదవండి: ఒకప్పుడు టాటా నానో.. ఇప్పుడు బీఎమ్‌డబ్ల్యూ - అట్లుంటది కిమ్ శర్మ అంటే!) అదీ పాన్ ఇండియా స్థాయిలో రామాయణం వంటి ఇతిహాసం నేపథ్యంలో రూపొందనున్న చిత్రంలో నటించే అవకాశం రావడం నిజంగా సాయి పల్లవి అదృష్టమే అని చెప్పొచ్చు. అవును హిందీతో సహా పలు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందబోతున్న రామాయణం చిత్రంలో సాయి పల్లవి సీతగా నటించనున్నారు. ఈ చిత్రం గురించి అనధికారికంగా ఇప్పటివరకు చాలా ప్రచారం జరిగింది. కాగా నటి సాయి పల్లవి తొలిసారిగా రామాయణం చిత్రంలో సీతగా నటించబోతున్న విషయాన్ని దర్శకుడు నితీష్ తివారి తనను సీతగా ఎలా చూశారు అన్న భావనే తనను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్నారు. ఇది నిజంగానే తనను వరించిన అరుదైన అదృష్టంగా పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్‌కు ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇది కచ్చితంగా తనకు సవాల్‌తో కూడిన పాత్ర అని పేర్కొన్నారు. ఎందరో ప్రఖ్యాత నటీమణులు పోషించిన పాత్ర అని.. వారు నటించిన దాంట్లో తాను 10 శాతం చేసిన బాగా నటించినట్లే అని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం కథ వినడానికి త్వరలోనే ముంబయికి వెళుతున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలో పలు రామాయణం గ్రంథాలు చిత్రాలుగా రూపొందాయని, ఇప్పటివరకు వాల్మీకి రామాయణాన్ని ఎవరు సంపూర్ణంగా తెరపై ఆవిష్కరించలేదని.. ఆ కొరతను తమ రామాయణం తీరుస్తుందనే భావనను వ్యక్తం చేశారు. కాగా ఈ రామ చరితం నేపథ్యంలో రామాయణం చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (ఇది చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి) -
ఆ సీన్లో ఎలాంటి తప్పులేదు.. మహాభారత్ నటుడు షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఇండియాలోను విడుదల కావడంతో ఈ సినిమాకు ప్రేక్షాదరణ పెరుగుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ సన్నివేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలోని ఓ సీన్లో భగవద్గీత గురించి ప్రస్తావించడంపై ఇండియన్స్ మండిపడుతున్నారు. అలాంటి సీన్స్‌లో భగవద్గీతను చూపించాల్సిన అవసరం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. ఆ సీన్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు నితీశ్ భరద్వాజ్ స్పందించారు. ఆయన శ్రీకృష్ణ, మహాభారతం సీరియల్స్‌లో కృష్ణుడి పాత్ర పోషించారు. అయితే ఆ సన్నివేశంలో ఎలాంటి తప్పులేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాన్ని ఆయన సమర్థించారు. అణుబాంబు సృష్టితో జపాన్‌లో పెద్దసంఖ్యలో ప్రజలు మరణించారని.. ఆ సమయంలో ఆయన ఆందోళనకు గురయ్యారని వివరించారు. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో.. ఆయన చేతుల్లో ఉందన్న నటుడు!) ఇంటర్వ్యూలో నితీష్ భరద్వాజ్ మాట్లాడుతూ..'జపాన్ జనాభాలో మెజారిటీ ప్రజలు నాశనం కావడానికి కారణంఅణు బాంబు. అలాంటి మారణహోమానికి కారణమైన ఓపెన్ హైమర్ పశ్చాత్తాప పడ్డారు. ఆ సంఘటన అతనికి కన్నీళ్లను తెప్పించింది. దీంతో అతని చేసిన తప్పుకు చింతిస్తున్నాడు. గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమవడం నేను చూశా. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. ఆయన కోణం నుంచి ఆ సీన్ చూడాలి. అది శృంగార సన్నివేశమైనప్పటికీ.. అతని ఆలోచనలన్నీ జరిగిన విధ్వంసంపైనే ఉన్నాయని చూపించే ప్రయత్నం చేశారు. అతనిది మానసిక సంఘర్షణ. ఆ సన్నివేశాన్ని వివాదం చేయకుండా..ఓపెన్ హైమర్ భావోద్వేగం కోణంలో చూడాలని ప్రజలను కోరుతున్నా.' అంటూ సలహా ఇచ్చారాయన. కాగా.. కై బర్డ్, మార్టిన్ J షెర్విన్ రాసిన 2005 జీవిత చరిత్ర అమెరికన్ ప్రోమేథియస్: ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ J రాబర్ట్ ఓపెన్‌హైమర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రంలో రామి మాలెక్, గ్యారీ ఓల్డ్మన్, డేన్ డెహాన్, జోష్ హార్ట్‌నెట్, కెన్నెత్ బ్రానాగ్, మాథ్యూ మోడిన్, కేసీ అఫ్లెక్, ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్, జాసన్ క్లార్క్ ప్రధాన పాత్రలు పోషించారు. (ఇది చదవండి: సినిమాల్లో నటనే కాదు.. అమ్మతనం ఉట్టి పడుతోంది!) -
ప్రభాస్ రాముడు రావణ బ్రహ్మగా ఎన్టీఆర్
-
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 17 పార్టీలు ఉమ్మడిగా పోటీ
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏకం కావడంలో అడుగు ముందుకు పడింది. బిహార్ రాజధాని పట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల మెగా సమావేశం కొంతమేరకు సత్ఫలితాలనిచ్చింది. పార్టీల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి లోక్‌సభ ఎన్నికల్లో 17 పార్టీలు కలసికట్టుగా పోటీ చేయడానికి అంగీకరించాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని రచించడానికి వచ్చే నెల సిమ్లాలో మరోసారి సమావేశం కావాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. జూలై 10 లేదా 12వ తేదీన సిమ్లాలో ఈ సమావేశం ఉండవచ్చని సమాచారం. దాదాపుగా 4 గంటల సేపు సమావేశమైన చర్చించిన ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ ఐక్యంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విపక్ష పార్టీల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన బిహార్ సీఎం నితీశ్ మాట్లాడుతూ.. ‘‘సమావేశం బాగా జరిగింది. చాలా మంది నేతలు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఎన్నికల్లో కలిసి పని చెయ్యడానికి ఒక అంగీకారానికి వచ్చారు’’ అని చెప్పారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల వ్యూహం, సీట్ల సర్దుబాటు వంటి అంశాలను త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. మీడియా సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ గైర్హాజరయ్యారు. అయితే వారికి ఫ్లైట్ టైమ్ అయిపోవడంతోనే వెళ్లిపోయారని నితీశ్ సమర్థించుకున్నారు. కాంగ్రెస్ ఆప్ మధ్య ఆర్డినెన్స్ చిచ్చు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కొంటాయని బయటకి చెబుతున్నప్పటికీ సమావేశంలో కాంగ్రెస్, ఆప్ మధ్య మాటల యుద్ధం జరిగిందని తెలుస్తోంది. ఢిల్లీలో అధికారులపై నియంత్రణకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటేనే కలిసి ముందుకు నడుస్తామని పట్టుపట్టారు. దీనిపై సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మౌనం వహించడం కేజ్రీవాల్‌కు మింగుడు పడలేదు. విపక్షాల సమావేశానంతరం ఆప్ ఒక ప్రకటనలో కాంగ్రెస్‌తో తాము కలిసి ముందుకు వెళ్లడం కష్టమంటూ బాంబు పేల్చింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆర్డినెన్స్ అంశం పార్లమెంటులో తేలాల్సిందే కాబట్టి తాము అక్కడే తమ వైఖరి చెబుతామని, ఇతర వేదికలపై ఎందుకు వెల్లడించాలని ఆయన ప్రశ్నించారు. ‘‘జూలైలో సిమ్లాలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తాం. ఆ సమావేశంలో ఉమ్మడి ఎజెండా రూపొందించాలని నిర్ణయించాం. కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించడానికి ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందిస్తాం’’ – మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు ‘‘వచ్చే ఎన్నికల్లో జరిగేది సిద్ధాంతాల మధ్య యుద్ధం. పార్టీల మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ కలసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. మా సిద్ధాంతాలను పరిరక్షించుకుంటూనే ఉమ్మడిగా పని చేస్తాం’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు ‘‘బీజేపీని గద్దె దింపడానికి పట్నాలో మొదలైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. మేమంతా ఒక్కటిగా ఉన్నాం. బీజేపీపై ఐక్యంగా పోరాడుతాం. ఈ నియంత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే భవిష్యత్‌లో ఎన్నికలు ఉండవు. బీజేపీ చరిత్ర మార్చాలని అనుకుంటోంది. మేము చరిత్రను కాపాడతాం’’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘మా ఐక్య ఫ్రంట్‌కు ప్రజా దీవెనలు కచ్చితంగా లభిస్తాయి.’’ – శరద్ పవార్, ఎన్సీపీ అధినేత ‘‘పట్నా సమావేశం విస్పష్టమైన సందేశాన్నిచ్చింది. మేమంతా ఐక్యంగా పనిచేసి దేశాన్ని కాపాడతాం’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ‘‘మేమంతా కలసికట్టుగా పోరాడతాం. విపక్షాలన్నీ చేతులు కలపకపోతే ఓట్లు చీలిపోతాయన్న ఆందోళన అందరిలోనూ ఉంది. భజరంగ భళి మాతో ఉన్నారు’’ – లాలూప్రసాద్ యాదవ్, ఆర్జేడీ అధినేత -
కండల పిచ్చి.. సూదిగుచ్చి..
నగర యువతలో పెరుగుతున్న కండల పిచ్చి వారిని పెడదారి పట్టిస్తోంది. వేగంగా ఆరు పలకల శరీరాకృతిని సొంతం చేసుకొనేందుకు ప్రమాదకర సూదిమందులను తీసుకుంటుండటం అందరినీ కలవరపెడుతోంది. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ జిమ్‌లో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను సోమవారం డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులు, పోలీసులతో కలిసి సీజ్ చేయడం, జిమ్ ట్రైనర్ నితీశ్, అతని స్నేహితులు సొహైల్, రాహుల్‌లను అరెస్ట్ చేయడం యువతలో మజిల్ మేనియాకు.. ఈ ఇంజక్షన్ల విచ్చలవిడి విక్రయాలకు అద్దం పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ కండల కోసం తహతహలాడే వారే టార్గెట్... సాధారణంగా పోటీలలో పాల్గొనే బాడీ బిల్డర్లు ఇంజక్షన్లను ఎంచుకుంటారు. గంటల తరబడి మజిల్ బిల్డింగ్ వర్కవుట్స్ చేయడానికి, పోటీల సమయానికి మజిల్స్ బాగా కనిపించేందుకు వాటిని వినియోగిస్తారు. అయితే అసాధారణ మార్గాల ద్వారా శరీరాన్ని బిల్డప్ చేయాలనే తపన ఉన్న యువకులకు కొన్ని జిమ్లలోని కోచ్‌లు ఈ ఇంజెక్షన్లు సిఫారసు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మంచి శరీరాకృతిని పొందుతారని చెబుతూ జిమ్‌ల యజమానులు ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోటి సుమారు రూ. 300 పలికే ఇంజక్షన్‌ను కనీసం రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకూ పెంచి అమ్ముతున్నారని సమాచారం. ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న వారిలో జిమ్ ట్రైనర్ల నుంచి ఫార్మా, మెడికల్ రిప్రజెంటేటివ్స్ దాకా ఉన్నారు. డిమాండ్‌నుబట్టి పుణే, ఢిల్లీ వంటి నగరాల నుంచి కూడా ఇంజక్షన్లను వారు దిగుమతి చేసుకుంటున్నారు. వినియోగం... ప్రాణాంతకం ఈ ఇంజక్షన్లు యాంటిహైపోటెన్సివ్స్ అనే మందుల శ్రేణిలో భాగంగా వైద్యులు చెబుతున్నారు. వాటిని సాధారణంగా లోబీపీ చికిత్సలో భాగంగా వినియోగిస్తామని... రోగి రక్తపోటును సాధారణ స్థితికి చేర్చడానికి ఆపరేషన్ థియేటర్లలో సర్జరీల సమయంలో వినియోగిస్తామని వైద్యులు అంటున్నారు. ఇది ఒక వ్యక్తి గుండె స్పందనను ఆకస్మికంగా పెంచేందుకు కూడా కారణమవడంతో అది కఠినమైన వర్కవుట్స్ చేసేందుకు ఉ్రత్పేరకంగా పనిచేస్తుందని వివరించారు. అయితే పర్యవేక్షణ లేని మెఫెంటెర్మైన్ ఇంజక్షన్ల వినియోగం వల్ల యువకుల్లో సైకోసిస్ లక్షణాలు పెరిగిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారి చర్మంపై దద్దుర్లు, రక్తపోటులో హెచ్చుతగ్గులు, శ్వాస ఆడకపోవడం, నిద్రలేమి, వికారం, వాంతులు, దృష్టి లోపాలు, భ్రాంతులు.. చివరకు గుండెపోటుకు కూడా సంభవించొచ్చని స్పష్టం చేస్తున్నారు. -
నితీశ్‌కు బీసీసీఐ అవార్డు
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర క్రికెటర్ కె.నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనకు బీసీసీఐ గుర్తింపు లభించింది. బోర్డు ప్రకటించిన 2017–18 వార్షిక అవార్డుల్లో అండర్–16 ఉత్తమ క్రికెటర్‌గా నితీశ్ ఎంపికయ్యాడు. ఈ సీజన్లో పరుగుల వరద పారించిన నితీశ్ 7 మ్యాచ్‌లలో ఏకంగా 176.71 సగటుతో 1,237 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ రాణిం చిన అతను 13.84 సగటుతో 26 వికెట్లు పడగొట్టాడు. 65 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చరిత్రలో ఆ జట్టుకు చెందిన ఒక ఆటగాడు బీసీసీఐ అవార్డు గెలుచుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ నెల 12న బెంగళూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నితీశ్ ఈ అవార్డు అందుకుంటాడు. అతనికి జగ్మోహన్ దాల్మియా ట్రోఫీతో పాటు రూ. 1.5 లక్షల నగదు పురస్కారం కూడా లభిస్తుంది. అవార్డు గెలుచుకున్న నితీశ్‌ను ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు, కార్యదర్శి అరుణ్ కుమార్ అభినందించారు. మరోవైపు సీనియర్, జూనియర్ విభాగాల్లో ఢిల్లీ జట్టు నిలకడగా రాణించడంతో ‘బెస్ట్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్’ అవార్డు ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ)కు దక్కనుంది. -
రాజకీయాలకు ‘నితీశ్’ కుదుపు
విశ్లేషణ నితీశ్ నిష్క్రమణతో బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాలన్నిటి మహాకూటమి అనే తర్కం ఇక పని చేయదు. 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక తప్పదని అనుకున్నాక, ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఓడిపోయే పక్షంలో ఉండాలని ఎందుకు కోరుకుంటుంది? వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మోదీ, షాలు రాజకీయంగా సాధ్యమైన ప్రతిదాన్నీ సాధించారు. కాక పోతే రైతు సమస్యలు, నిరుద్యోగం కలసి 2018 నాటికి ఒక్కసారిగా జాతీయస్థాయిలో బద్దలు కాకుండటానికి హామీని కల్పించాలి. ముఖ్యంగా సుపరిపాలనపై దృష్టిని కేంద్రీకరించాలి. చైనా యుద్ధ నిపుణుడు సున్ జూ 2,500 ఏళ్ల క్రితం ‘‘శత్రువును మభ్యపెట్టు, తప్పుదారి పట్టించు, ఆశ్చర్యపరచు’’ అని బోధించాడు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు సున్ జూ, చాణక్యుల రచనలు చదివారో లేదో తెలియదు. కానీ, వారు సున్ జూ ఎత్తుగడలను కచ్చితంగా అమలు చేస్తున్నట్టు అని పిస్తోంది. అనూహ్యమైన రీతిలో నితీశ్ కుమార్, బీజేపీల కూటమిని ఏర్పాటు చేసి అమిత్ షా హఠాత్తుగా భారత రాజకీయ చిత్రాన్నే మార్చి పారేశారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ మహాఘట్‌బంధన్‌గా ఏకతాటిపైకి తేవాలని కాంగ్రెస్ పార్టీ గత ఏడాది కాలంగా పథకాలు వేస్తోంది. ఆ మహా కూటమి ఇప్పుడు అదృశ్యమైపోయింది. అమిత్ షా, సున్ జూ రాసిన ‘యుద్ధ కళ’లోని ఎత్తుగడను తు. చ. తప్పక అనుసరిస్తుండగా, కాంగ్రెస్, రాహుల్ గాంధీ అందుకు సరిగ్గా విరుద్ధంగా ప్రవర్తిసున్నారు. ‘‘నితీశ్ కుమార్ పారిపోతాడని నాకు నాలుగు నెలల క్రితమే తెలుసు’’ అని రాహుల్ అన్నారు. మరి దాన్ని ఆపడానికి నాలుగు నెలలుగా ఏం చేశావు? అని అంతా అడుగుతున్నారు. నీరు గారిన మహాకూటమి ఆశలు ఉత్తర భారతంలో నేడు కాంగ్రెస్ ఉనికిలోనే లేదు. కానీ ప్రాంతీయ నేతలైన ములాయం సింగ్, లాలూ ప్రసాద్‌యాదవ్, నితీశ్ కుమార్ వంటి వారికి గొప్ప ప్రజా పునాది ఉంది. సాధారణంగా అలాంటి ప్రాంతీయ నేతలకు ఒకరంటే ఒకరికి పడదు. కాబట్టి కాంగ్రెస్ అలాంటి నేతలందరినీ ఒక చోటికి చేర్చగలిగితే గొప్ప శక్తి ఆవిర్భవిస్తుంది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో గత 25 ఏళ్లుగా ములాయం, మాయావతి ప్రత్యర్థులుగా ఉన్నారు. అలాగే బిహార్‌లో నితీశ్, లాలూ కూడా 25 ఏళ్ల పాటూ ఒకరితో ఒకరు తలపడి, ఒకటయ్యారు. కాంగ్రెస్ కూడా కర్ణాటకలో దేవెగౌడతో, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌తో, బెంగాల్లో మమతా బెనర్జీ, సీపీఎంతో కలిస్తే మహా కూటమి సిద్ధమవుతుంది. 2015లో బిహార్‌లో నితీశ్, లాలూ చేయి కలపడం బీజేపీని రాజకీయంగా కుదిపేసింది. ఈ మహా కూటమి పథకంలో నితీశ్ ఒక ముఖ్య కీలక వ్యక్తి. నితీశ్ అందులో లేకపోతే 2019లో బీజేపీ బిహార్‌లో సులువుగా గెలుస్తుంది. నితీశ్ కాంగ్రెస్, మహా కూటమితో లేకపోవడంతో, ఇక ఎలాగూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ కూటమిలో చేరడంలో అర్థమేముంటుంది? అని ప్రాంతీయ నేతలంతా ఆలోచిస్తారు.. యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్య మంత్రి ఒమర్ అబ్దుల్లా... 2019 సంగతి పక్కనబెట్టి, 2024 ఎన్నికలకు ప్రణాళికలను రచించడం ఉత్తమమని చెప్పారు కూడా. 2014 పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయలేమని బీజేపీకి బాగా తెలుసు. అందుకే అది 2019 ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీ కరించింది. ఉత్తర ప్రదేశ్ నుంచి ఉన్న 80 పార్లమెంటు స్థానాల్లో 72ను అది తిరిగి గెలుచుకోలేదు. బీజేపీ ఎక్కువ సీట్లను సాధించిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, హరియాణా, రాజస్థాన్‌లలో బలమైన అధికారపార్టీ వ్యతిరే కత ఉంది. ఆ రాష్ట్రాల్లో వాటిల్లే నష్టాన్ని బీజేపీ కొత్త ప్రాంతాల నుంచి భర్తీ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్లో అది ఒక పెద్ద శక్తిగా ఆవిర్భవించడానికి మరో ఏడేళ్లు పడుతుంది. శాసనసభ విజయాల సంగతి ఎలా ఉన్నా, 2004లో అటల్ బిహారీ వాజ్ పేయి బీజేపీకి 300 స్థానాలు వస్తాయనుకుని ఓటమి పాలైన విషయాన్ని అది ఎన్నటికీ మరిచిపోలేదు. రాజకీయాలలో రెండేళ్లంటే చాలా ఎక్కువ కాలమని మోదీ, షాలకు బాగా తెలుసు. వారు నిరంతరం ఎప్పటికప్పడు పరిస్థితిని గమనిస్తూనే ఉండాల్సి ఉంటుంది. ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణ, బెంగాల్, ఒడిశాలలో బీజేపీ ఓట్ల శాతం పెరిగినా ఎంపీ సీట్లు మాత్రం దక్కవని కూడా వారికి తెలుసు. ఇక తెలుగుదేశం, శివసేన, ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ వంటి మిత్రపక్షాలు గాలివాటం బాపతని వారికి బాగా తెలుసు. బీజేపీకి ఆధిక్యత లభించకపోతే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి గెంతేస్తారు. ప్రాంతీయ నేతలు చాలా తెలివిగా వ్యవహరిస్తారని, వారి ప్రేమ తాత్కాలికం, విడాకులు విద్వేషపూరితం అని కూడా వారికి తెలుసు. మహారాష్ట్ర, హరియాణా జార్ఖండ్, అస్సాం వంటి పలు రాష్ట్రాల్లో బీజేపీ తొలిసారిగా గెలిచింది. కాబట్టి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కాబట్టి, ఆ రాష్ట్రాల్లో రెట్టింపు అధికార పార్టీ వ్యతిరేకతను ఎదుర్కో వాల్సి వస్తుందని మోదీ, షాలకు తెలుసు. బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాలన్నీ ఐక్యమైతే ఆ రాష్ట్రాల్లో బీజేపీ పని ఏటికి ఎదురీతే అవుతుంది. నితీశ్ విశిష్ట స్థానం నితీశ్ బిహార్‌లోని ఓ చిన్న పార్టీకి నేత. కానీ బిహార్ మహాఘట్బంధన్లో ఆయనకు స్థానం ఉండటం వల్లనే లాలూ, కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమైంది. నితీశ్, లాలూ విడిగా పోటీ చేసి ఉంటే సునాయసం గానే తాము అక్కడ గెలిచి ఉండేవారమని బీజేపీ భావిస్తోంది. బిహార్ కూటమి ప్రాతిపదికపై బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉత్తరప్రదేశ్‌లో మహాఘట్ బంధన్‌ను ఏర్పాటుచేయాలని అనుకుంటున్నాయి. బద్ధ శత్రువులైన మాయా వతి బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు 2019లో కలసి పోటీచేస్తాయి. కానీ ఇప్పుడు నితీశ్ బీజేపీతో కలవడం.. అలాంటి కూట మిని నిరుపయోగంగా మార్చేసింది. ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి కూటము లను ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ తదితర బీజేపీ వ్యతిరేక పార్టీల పథకం. బెంగాల్లో మమతా బెనర్జీ, కాంగ్రెస్ కలుస్తాయి. కర్ణాటకలో కాంగ్రెస్, దేవె గౌడకు చేయి చాస్తున్నది. ఒడిశాలో నవీన్ పట్నాయక్‌తో కలిసింది. కానీ నితీశ్ నిష్క్రమణతో ఆ తర్కం పని చేయదు. బిహార్‌లో మహాఘట్బంధన్ లేకపోతే 2019లో బీజేపీ సునాయాసంగా ఆధిక్యతను సాధిస్తుంది. నితీశ్, కాంగ్రెస్ కూటమిని వీడిన వెంటనే బీజేపీ ప్రచారపరంగా గొప్ప విజయాన్ని సాధించింది. నితీశ్ తమ కూటమిలో లేనిదే కాంగ్రెస్ బిహార్‌లో మంచి ఫలితాలను సాధించలేదు. 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్ప డక తప్పదని అనుకున్నాక ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఓడిపోయే పక్షంలో ఉండాలని ఎందుకు అనుకుంటుంది? భారత రాజకీయాల్లో నితీశ్ ఒక విశిష్ట స్థానాన్ని సాధించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు లేని పార్టీ, నితీశ్ పార్టీ లేని నాయకుడు అని సుప్రసిద్ధ చరిత్రకారులు రామచంద్ర గుహ ఇటీవల అన్నారు. కాబట్టి నితీశ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి చేసి, రాహుల్ స్థానంలో ఆయ నను ప్రధాని అభ్యర్థిగా నిలపాలని సూచించారు. గుహ పరిహాసంగానే అన్నా, దేశవ్యాప్తంగా ఆ మాటలను నిజమైనవిగానే తీసుకోవడంతో నితీశ్ ప్రతిష్ట మరింత పెరిగింది. భావి పర్యవసానాలు 1. నితీశ్ నిష్క్రమణ వల్ల ఎక్కువగా నష్టపోయినది కాంగ్రెస్, రాహుల్ గాంధీలే. ఇక వారు అధికారంలోకి రాలేనట్టే అనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు దానితో కలవడానికి జంకుతాయి. పెద్ద కూటమికి నేతృత్వం వహించి, పెద్ద నేతగా కనిపించాలని రాహుల్ కలలుగంటున్నారు. ఇప్పుడిక ఏం చేయాలో ఆయనకు తెలియదు. 2. లాలూ, బిహార్‌లో తన నియంత్రణలో ఉన్న ప్రభుత్వాన్ని కోల్పో యారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇక ఆయన చెప్పు చేతల్లో ఉండదు. పైగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ కూడా లాలూ కుటుంబ ఆస్తులపై విచార ణలను మొదలెడుతుంది. ఆయన కుటుంబ సంపదపై ఇప్పటికే సీబీఐ జరుపుతున్న విచారణ ఇక ముమ్మరమవుతుంది. ఎన్ఫోర్స్ శాఖ ఆయన కుటుంబ బినామీ అస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుంటుంది. 3. నితీశ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితులుగా ఉండేవారు. కాబట్టి ఆమె కూడా నష్టపోతారు. బీజేపీ అక్కడ బలపడటమే కాదు, పొరుగున ఉన్న బిహార్‌లో అధికారంలోకి వస్తుంది. 2019లో బీజేపీ ఓడిపోతుందని మమతా బెనర్జీ చెబుతూ వస్తున్నారు. కానీ నితీశ్ నిష్క్ర మణతో అది అసాధ్యంలా అనిపిస్తోంది. 4. మహాఘట్బంధన్ ద్వారా వామపక్ష పార్టీలు ఎంతో కొంత లబ్ధి పొందాలని ఆశిస్తున్నాయి. కేవలం 20 మంది ఎంపీలే ఉన్న వామపక్షాలు ఒక బలమైన కూటమిలో భాగమై 2019లో బీజేపీని ఓడించాలని చూస్తున్నాయి. ఇక అది కష్టమనే అనిపిస్తోంది. 5. ఉత్తరప్రదేశ్‌లో మహాఘట్బంధన్ను ఏర్పాటు చేయాలని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిక ఆయన తండ్రి ములా యం... ఇక ఒంటరి పోరే మెరుగంటూ, కాంగ్రెస్‌తోగానీ, మాయావతితోగానీ సమాజ్‌వాదీ పార్టీ కలవరాదని అంటారు. కాబట్టి యూపీలో అఖిలేష్ తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. 6. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పాత రోజులు తిరిగి రానున్నాయని సంబరపడుతోంది. నితీశ్ నిష్క్రమణతో 2019లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువని ఏఐడీఎంకే, తదితరులు భావిస్తున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న డీఎంకేకు ఇది దుర్వార్తే. బీజేపీ బల హీనపడితే ఏఐడీఎంకే క్రమంగా అంతర్ధానమైపోతుందని స్టాలిన్ ఆశిస్తు న్నారు. కానీ దానికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది. 7. నితీష్ రాకతో బీజేపీ మిత్రపక్షాలైన తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ వంటి పార్టీల బేరసారాలాడే శక్తి తగ్గిపోతుంది. 8. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు నితీశ్ పెద్ద మద్దతుదారు. కాబట్టి ఆయన కూడా నష్టపోతారు. ఈ పరిణామాల వల్ల ఎక్కువగా లబ్ధిని పొందేది బీజేపీనే. మోదీ, షాల ఖ్యాతి తారస్థాయికి చేరుతుంది. మరీ ముఖ్యంగా అవసరమైతే వారు ఎవరి తోనైనా రాజీ పడటానికి సిద్ధమేనని రుజువవుతుంది. రాజకీయాలలో ఇది గొప్ప సుగుణం. నితీశ్ కూడా బాగానే లబ్ధిపొందుతారు. మహా తెలివైన లాలూ యాదవ్‌తో కంటే 15 ఏళ్లు కలసి ఉన్న బీజేపీతో పని చేయడం ఆయ నకు సులువు అవుతుంది. పైగా కేంద్రంలో మిత్ర ప్రభుత్వం ఉండటమనే సానుకూలత కలుగుతుంది. 2019 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మోదీ, షాలు రాజకీ యంగా సాధ్యమైన ప్రతిదాన్నీ సాధించారు. ఒకే ఒక్కటి మిగిలిపోయింది. మోదీ ప్రభుత్వం మంచి పరిపాలనను అందించి, రైతు సమస్యలు, నిరు ద్యోగం కలసి 2018 నాటికి జాతీయస్థాయిలో ఒక్కసారిగా బద్ధలు కాకుం డటానికి హామీని కల్పించాలి. అదే జరిగితే వారి మొత్తం పథకమంతా చెడి పోతుంది. మోదీ, షాలు ఆ పరిస్థితికి తగ్గ పథకాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. అంతకు మించి సుపరిపాలనపై దృష్టిని కేంద్రీకరించాలి. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు‘ ఈ–మెయిల్: ppr193@gmail.com పెంటపాటి పుల్లారావు -
ప్రత్యేక హోదాకు నితీశ్ డిమాండ్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: ఎన్డీయేలో అధికారికంగా భాగస్వామి అయిన జేడీయూ మరోసారి బిహార్‌కు ప్రత్యేక హోదా నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీ నేతలతో సమావేశమైన నితీశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావటంపై చర్చించారు. బీజేపీతో చేతులు కలపటం వల్ల ఆర్జేడీ, కాంగ్రెస్ నుంచి నితీశ్‌పై విమర్శలు తప్పవు. ఈ నేపథ్యంలో బిహార్ అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల ప్రజల దృష్టిని మరల్చవచ్చన్నది జేడీయూ ఆలోచన. దీనికి తోడు రెండు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే కూటమి అధికారంలోకి రావటంతో ప్రజలకు సాధారణంగానే అంచనాలు పెరుగుతాయని పార్టీ భావిస్తోంది. ప్రత్యేక హోదా రావటం వల్ల రాష్ట్రానికి 90 శాతం కేంద్ర నిధులు వివిధ పథకాల కోసం అందుతాయి. పార్లమెంటులోనూ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదాతో బిహార్ జాతీయ అభివృద్ధి సగటును చేరుకునేందుకు వీలవుతుందని డిమాండ్ చేస్తున్నారు. -
భర్తను హత్య చేసి శవంతో రెండు రోజులు..
►రోజూ తాగి వచ్చి కొడుతుండటంతో భరించలేక హత్య ►గుండెపోటు వచ్చిందని చుట్టుపక్కల వారిని నమ్మించే యత్నం ►అనుమానంతో పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి న్యూఢిల్లీ: పైసా సంపాదించకపోగా తన సంపాదనతో తాగి తననే కొడుతున్న భర్త దుశ్చర్యలను భరించలేక ఓ భార్య అతన్ని హతమార్చింది. అయితే శవాన్ని ఏం చేయాలో తెలియక గదిలో దాచిపెట్టి రెండురోజులు గడిపింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని కాపస్ హేడాలో గురువారం వెలుగు చూసింది. కానీ అంతిమ సంస్కారాల సమయంలో ఓ వ్యక్తికి అనుమానమొచ్చి పోలీసులకు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల ఎదుట ఆమె తన నేరాన్ని అంగీకరించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మిడ్నాపూర్‌కు చెందిన శిల్పి అధికారి(32) రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్లో ఊడ్చే పని చేసేది. ఆమెకు భర్త నితీశ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తన భర్త తన సంపాదనతో తాగి వచ్చి కొడుతూ పిల్లలను చదువుకోనివ్వకపోవడంతో వారిని స్వగ్రామంలోనే ఉంచి చదివించేది. శిల్పి భర్త రోజు తాగి వచ్చి చితకబాదేవాడు. కొట్టిన అనంతరం అలసిపోయి పడుకునేవాడు. చంపేస్తానని బెదిరించినా అతను మారకపోవడంతో చంపేయాలని నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి తన భర్తకు బాగా తాగించి మత్తులో నిద్రపోయిన తర్వాత గొంతు నులిమి చంపేసింది. భర్త చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఏం చేయాలో తెలియక రెండు రోజులు బయటకు రాకుండా గదిలో భర్త శవంతో గడిపింది. కమిలిన గుర్తులతో అనుమానం.. సోమవారం ఉదయం ఇంటి ముందు కూర్చుని భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ శిల్పి ఏడ్వడం ప్రారంభించింది. ఇరుగు పొరుగు వారికి కూడా ఆమెపై అనుమానం రాలేదు. సానుభూతితో వారు ఆమె భర్త అంత్య క్రియలకు తలో చేయివేశారు. శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది. శవం నుంచి దుర్వాసన రావడం, గొంతుపై కమిలిన గుర్తులు ఉండటం చూసి అతను చాటుగా వెళ్లి పోలీసులకు ఫోన్ చేవాడు. శవాన్ని చితిపై ఉంచి అంటించబోతుండగా పోలీసులు రంగప్రవేశం చేసి శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు పంపారు. పోలీసులు శిల్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గొంతు నులిమి రెండు రోజుల కింద చంపినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది. శిల్పి కూడా పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు జరిపించిన వైద్య పరీక్షలలో భర్త ఆమెను కొట్టిన విషయం కూడా రుజువైంది. -
ఒక్కతాటిపైకి ప్రతిపక్షాలు!
► రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం కసరత్తు ► ప్రాంతీయ పార్టీల ఐక్యతకు పిలుపునిచ్చిన లాలూ, మమత, ఏచూరి న్యూఢిల్లీ/కోల్‌కతా/పట్నా: యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికల్ని దీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో చేతులు కలిపేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో బిహార్ సీఎం నితీశ్ చర్చించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా సోనియాతో చర్చించారు. భేటీ అనంతరం ఏచూరి మాట్లాడుతూ.. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై అన్ని లౌకిక ప్రతిపక్ష పార్టీలు చర్చలు జరుపుతున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలిపే అవకాశంపై ఏచూరి, సోనియాలు చర్చించారని, ఈ ప్రతిపాదనకు సోనియాగాంధీ సానుకూలంగా స్పందించారని సీపీఎం వర్గాలు వెల్లడించాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సీపీఎం పార్టీ సంప్రదింపులు కొనసాగిస్తోంది. జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి గురువారం మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి ఎన్నికల్లో బలమైన ఉమ్మడి అభ్యర్థి నిలపాలని జేడీయూ కూడా భావిస్తున్నట్లు చెప్పారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా అవసరం: లాలూ బిహార్ ఆర్జేడీ అధినేత లాలూ పట్నాలో శుక్రవారం మాట్లాడుతూ... 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మహాఘట్బంధన్ పేరిట ఆర్జేడీ–జేడీయూల పొత్తు తరహాలోనే ప్రస్తుతం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరముందన్నారు. మతతత్వ, ఫాసిస్టు శక్తుల్ని ఓడించేందుకు మాయావతి, కాంగ్రెస్, మమతా బెనర్జీ, అఖిలేశ్‌లు ముందుకు రావాలన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకమవ్వాలి: బీజేపీని వ్యతిరేకిస్తే వేధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని శుక్రవారం కోల్‌కతాలో సీఎం మమతాబెనర్జీ విమర్శించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కటవ్వాలని కార్యకర్తల్ని ఉద్దేశించి మమత ప్రసంగించారు. కలిసికట్టుగా, ఐక్యంగా సాగాలని అన్ని పార్టీలను కోరుతున్నానని, తృణమూల్ పార్టీ వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. చర్చించాకే నిర్ణయం: కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలతో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు, వర్కింగ్ కమిటీలు చర్చించాకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై సరైన నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. నిర్ణయం తీసుకోగానే మీడియాకు వెల్లడిస్తామంది. -
గడ్కరీకి కుర్తా.. నితీష్‌కు పైజామా
రహదారి నిర్మాణ పనులపై ఎలాంటి ముందడుగు కనిపించకపోవడంతో కలతచెందిన బిహార్‌లోని ఓ స్థానిక ఎంఎల్ఏ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. సగం ప్యాంటు, బనీన్ను మాత్రమే ధరించి, తన కుర్తాను కేంద్ర రోడ్డు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి, పైజామాను బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు పంపి తన నిరసన తెలిపారు. బీహార్‌కు చెందిన ఎమ్ఎల్ఏ వినయ్ బిహారీ, గత మూడేళ్లుగా తమ నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జోగపట్టి మార్గాన్ని కలుపుతూ వెస్ట్ చంపారన్స్ మనుపుల్ నుంచి నావల్పుర్ రత్వాల్ చౌక్ మార్గాన్ని మీదుగా 44కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాలని ఆయన సంకల్పించారు. కానీ ఈ రోడ్డు నిర్మాణ పనులపై కనీసం సీఎం నితీష్‌కుమార్ నుంచి కానీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినా వారినుంచి స్పందన కరువైంది. దీంతో ఇరు ప్రభుత్వాల తీరుపై విసుగెత్తిన ఆయన తన కుర్తాను నితిన్ గడ్కరీకి పంపుతూ ఓ లేఖను పంపారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేవరకు తాను కుర్తాను ధరించనని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కుర్తా ఎలా ఉందో అలా భారతీయ జనతా పార్టీ అహంకారపూరిత వైఖరి కనిపిస్తుందన్నారు. అంతటితో ఆగకుండా తన పైజామాను సీఎం నితీష్‌కు పంపుతూ... మూడేళ్ల కిందట ఆయన ఇచ్చిన వాగ్దానాలపై మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల తర్వాత హామీలన్నింటినీ నితీష్ పక్కనబెట్టారని బాహాబాటంగా విమర్శించారు. -
అఖిలేష్‌కు నితీష్ సక్సెస్ మంత్రా..
పట్నా : "బాబూ అఖిలేష్.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ గెలిచి..తిరిగి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? అయితే నేను చెప్పినది పాటించు.."అంటూ జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు అద్బుతమైన సలహా ఇచ్చారు. బిహార్ మాదిరిగానే ఉత్తరప్రదేశ్‌లోనూ మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తే, ఎన్నికల్లో విజయం వెతుకుంటూ వస్తుందని, తన సక్సెస్ మంత్రకూడా అదేనని నితీష్ పేర్కొన్నారు. గతేడాది నవంబర్ లో హోరాహోరీగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ గెలుపునకు ప్రధాన కారణం సంపూర్ణ మద్య నిషేధ హామీనేనని నితీష్.. అఖిలేష్ కు చెప్పారు. అదే మంత్రాన్ని ఇప్పుడు యూపీలోనూ అమలుచేయాలని సూచించారు. ఇప్పటికే సమాజ్‌వాద్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో సీఎం అఖిలేష్, తన తండ్రి ములాయం సింగ్, బాబాయి శివపాల్ యాదవ్ ల నుంచే మద్దతు కోల్పోతున్నారు. అఖిలేష్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో తన ప్రీతిపాత్రుడైన సోదరుడు శివపాల్ యాదవ్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నియమించారు. అంతేకాక వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది కూడా ములాయం సింగ్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అఖిలేష్‌కు నితీష్ నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. యూపీలో మద్య నిషేధం అమలు చేపడితే, ఎన్నికల్లో గెలవడానికి ఎవరి సపోర్టు అక్కర్లేదని నితీష్ పేర్కొన్నారు. మహిళా ఓటర్ల మద్దతు పొందవచ్చని, దీంతో తన ఖాతాల్లో ఓట్ల సంఖ్యను పెంచుకోవచ్చని అఖిలేష్‌కు నితీష్ చెప్పారు. రిస్క్ లేకుండా దేన్ని సాధించలేవని, దేనినైనా నీవు ధైర్యంగా ఎదుర్కోలేనప్పుడు, పెద్ద పెద్ద రాజకీయ లక్ష్యాలను సాధించలేవని నితీష్ హెచ్చరించారు. -
నితీశ్ పగటి కలలు మానుకో
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన 'బీజేపీ రహిత భారత్' వాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ నితీశ్ కుమార్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. 'బీజేపీ రహిత భారత్' అని అనడానికి నితీష్ కు ఉన్న విశ్వసనీయత ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో 17 ఏళ్లపాటు మిత్రపక్షంగా కొనసాగినప్పుడు 'బీజేపీ ముక్త భారత్' నినాదం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. 'ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు తెంగించి మాట్లాడిన మాటలు'గా నితీశ్ వాఖ్యలను ఆయన అభివర్ణించారు. నితీశ్ తన పరిధిలో తానుంటే మంచిదని సూచించారు. జేడీయూ ఒక ప్రాంతీయ పార్టీ అని, అది బిహార్‌లలోని మొత్తం సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదని అన్నారు. అలాంటి పార్టీ జాతీయస్థాయిలో క్రియాశీలంగా వ్యవహరించాలనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. జనతాదళ్ యునైటెడ్ పార్టీలోనే ఐక్యత లేదని షానవాజ్ ఎద్దేవా చేశారు. నితీశ్ తన ఇంటిని ముందు చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆర్ఎస్ఎస్, బీజేపేతర శక్తులన్నీ ఒక తాటిపైకి రావాలని ఇటీవల నితీశ్ వాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ భారతదేశ ఆత్మ అని, ఆత్మ లేని ఇండియా ఎలా సాధ్యమని ఆ సంస్థ నాయకుడు రాకేష్ సిన్హా వాఖ్యానించారు. -
ఓవైపు పరిహాసిస్తూ.. మరోవైపు వేడుకలా?
పాట్నా: రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నవారు, అంబేడ్కర్ సిద్ధాంతాల పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వారు ఆయన జయంతులు చేస్తున్నారని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. గురువారం పాట్నాలోని జేడీయూ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వారు అంబేడ్కర్ పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. బలహీనవర్గాల వారి ఓట్లు దండుకోవడానికే అంబేడ్కర్ పేరుతో మోదీ ప్రభుత్వం ప్రజల్లోకి వెలుతోందని.. వారికి బాబాసాహెబ్ సిద్ధాంతం పట్ల ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు. అంబేడ్కర్ సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి పోరాటం చేశాడని, బీజేపీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను విడదీయడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులు వేధించబడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. వారిని పట్టించుకోకుండా దళితుల ఓట్లకోసం వారి పట్ల ప్రేమను నటిస్తున్నారని ఆరోపించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేని వాళ్లు జాతీయవాదం గురించి విపరీతంగా మాట్లాడుతున్నారని నితీష్ అన్నారు. -
ఐదోసారి బీహార్ పగ్గాలతో నితీశ్
-
బీహార్‌లో శుక్రవారం కొలువు దీరనున్న నితీశ్ సర్కార్
-
బిహార్ దిశానిర్దేశం
త్రికాలమ్ బిహార్ దేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి? పద్దెనిమిది మాసాల కిందట లోక్‌సభ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి అట్టహాసంగా హస్తినలో అధికారదండం చేతబట్టిన నరేంద్రమోదీ ఎందుకు బిహార్ ఎన్నికలపైన శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరిస్తున్నారు? ప్రధానిగా నరేంద్రమోదీ వ్యవహరణ తీరును ఈ ఎన్నికల ఫలితాలు నిర్దేశించబోతున్నాయి. రాజ్యసభలో ఎన్డీఏకి మెజారిటీ ఎప్పుడు లభించేదీ సూచించబోతున్నాయి. ఒక రాజకీయ నాయకుడుగా నితీశ్‌కుమార్ భవిష్య త్తును తేల్చబోతున్నాయి. పాతికేళ్ల కిందటే 'సామాజిక న్యాయం' నినాదాన్ని ఎన్నికలలో ప్రయోగించి చరిత్ర సృష్టించిన లాలూప్రసాద్ యాదవ్ పదేళ్ల అరణ్యవాసం తర్వాత బిహార్ రాజకీయాలలో తిరిగి ఒక శక్తిగా కోలుకుంటారో లేదో కూడా ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్‌గాంధీ కానీ పెద్దగా చర్చలో లేనట్టే లెక్క. ఇది రెండు కూటముల మధ్య పోరాటం. ప్రధానంగా ఇద్దరు నాయకుల మధ్య బ్యాలట్ యుద్ధం. ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, రెండో వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. బీజేపీ, దాని మిత్రపక్షాలు (నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్- ఎన్డీఏ) గెలిస్తే లోక్‌సభ నాటి హవా కొనసాగినట్టూ, మోదీ కత్తికి ఎదురు లేనట్టూ ప్రజలు అర్థం చేసుకుంటారు. లాలూతో స్నేహం వల్ల నితీశ్ దెబ్బతిన్నాడని తీర్మానిస్తారు. జనతాదళ్-యూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌లతో కూడిన మహా ఘట్బంధన్ విజయం సాధిస్తే 2019 నాటి లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోదీకి నితీశ్‌కుమార్ ఒక లౌకిక ప్రత్యామ్నాయంగా ఎదుగుతారు. విభిన్న మైన అభివృద్ధి నమూనాకు ప్రతినిధిగా నిలబడతారు. ఇద్దరి అభి వృద్ధి నమూనాలలో వ్యత్యాసం ఏమిటో పరిశీలిద్దాం. మహాకూటమికే మొగ్గు? ఇప్పటికి మూడు ఘట్టాల పోలింగ్ ముగిసింది. ఇంకా రెండు ఘట్టాలు మిగిలి ఉన్నాయి. నాలుగో విడత పోలింగ్ ఈ రోజు. చివరి ఘట్టం నవంబర్ 5న. నవంబర్ 8 న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. మొదటి రెండు దశల పోలింగ్ మహాకూటమికి అనుకూలంగా సాగినట్టూ, మూడో దశలో చెరిసగం ఆధిక్యం ఉన్నట్టూ రాజకీయ పరిశీలకుల అంచనా. చివరి రెండు దశలలో పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో ముస్లింల జనాభా గణనీయం. మొత్తంమీద మహాకూటమి (మహా ఘట్బంధన్)కి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. అంతా యాదవుల ఓట్లు కూర్మీ అభ్యర్థులకూ, కూర్మీల ఓట్లు యాదవ అభ్యర్థులకూ పడతాయా లేదా అన్నదానిపైన ఆధారపడి ఉంటుంది. లోక్‌సభ ఎన్ని కలలో మొత్తం 40 స్థానాలకు 32 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాబల్యం అంతలోనే క్షీణించిందా? లోక్‌సభ ఎన్నికలలో బిహార్ ప్రజలు యూపీఏను శిక్షించాలనే లక్ష్యంతో బీజేపీకీ, దాని మిత్రపక్షాలకు ఓట్లు వేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పట్నాలో ఎవరికి పట్టం కట్టాలనే విషయం తేల్చడానికి. ముఖ్యమంత్రిగా 2005 నుంచి ఇప్పటి వరకూ (మధ్యలో మాంఝీ హయాంను మినహాయిస్తే) నితీశ్‌కుమార్ చేసిన మంచి పనులను ప్రజలు మరచిపోలేదు. ముఖ్యంగా మహిళా సాధికారికత విషయంలో బిహార్ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ విజయాలు సాధించింది. 2010 నాటి ఎన్నికల నుంచి మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కు వినియోగిం చుకోవడం ఇందుకు నిదర్శనం. ఉన్నత కులంగా చలామణి అవుతున్న భూమిహార్ ప్రజలలో సైతం మగవారు బీజేపీని సమర్థిస్తుంటే ఆడవారు జనతా దళ్-యూని బలపర్చుతున్నారు. మహా ఘట్బంధన్ తరఫున నితీశ్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రచారం చేస్తు న్నారు. ఎన్డీఏ అభ్యర్థుల పక్షాన మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా , ఎందరో కేంద్రమంతులు, మిత్రపక్షాల నాయకులైన మాంఝీ, రాంవిలాస్ పాశ్వాన్, తదితరులు ఓటర్లను ప్రభావితులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రధాని ర్యాలీలకే జనసమీకరణ భారీగా జరుగుతోంది. ఆయన ప్రసం గాలనే జాతీయ టెలివిజన్ చానళ్లు సంపూర్ణంగా ప్రసారం చేస్తున్నాయి. మోదీ ప్రచారం ప్రభావవంతంగా ఉంది. ముప్పయ్ అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో, పాతికేళ్ల లాలూ, నితీశ్ ఏలుబడితో బిహార్‌కి ఒరిగింది శూన్య మంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు. నితీశ్‌తో పాటు తొమ్మిదేళ్లకు పైగా బీజేపీ అధికారం పంచుకున్న వైనాన్ని విస్మరిస్తున్నారు. బిహార్‌కి మేలు జరగనే లేదంటూ నొక్కి చెబుతున్నారు. ఇక లాలూపైన జంగిల్‌రాజ్ అంటూ ధ్వజ మెత్తారు. లాలూతో పొత్తుపెట్టుకోవడం నితీశ్ అవకాశవాద రాజకీయానికి నిదర్శనమంటూ ఎండగట్టారు. ఎన్నికల ప్రచారంలో మోదీ శైలి తెలిసిందే. మోదీ-నితీశ్ వైరం బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని నియమించినప్పుడు ఆ నిర్ణయాన్ని నితీశ్‌కుమార్ స్వాగతించి ఉంటే ఇప్పుడు ఎన్నికల పోరులో ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా, ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండేవారు. లాలూ, సోనియాల కూటమి పేలవంగా తేలిపోయేది. ఎన్నికల రంగం ఇంతటి రసవత్తరంగా ఉండేది కాదు. నరేంద్రమోదీ పట్ల వ్యక్తిగత, విధానపరమైన వ్యతిరేకత ఉన్న కారణంగానే ఎన్డీఏ నుంచి నితీశ్ వైదొలిగారు. లోక్‌సభ ఎన్నికలలో ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పు కొని తన స్థానంలో మాంఝీని కూర్చోబెట్టారు. ఏకులాగా వచ్చిన మాంఝీ మేకులాగా తయారై బీజేపీతో జతకట్టడంతో మాంఝీని తోసిరాజని ముఖ్య మంత్రిగా నితీశ్ తిరిగి బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. మోదీ హయాంలో గుజరాత్ గణనీయంగా అభివృద్ధి చెందినట్టు చెప్పడం, దేశమంతా గుజరాత్ అభివృద్ధి నమూనాను అమలు చేయాలని ప్రచారం చేయడం రెండేళ్లుగా చూస్తున్నాం. నిజానికి మోదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి పూర్వమే గుజరాత్ అభివృద్ధిపథంలో ఉన్నది. దాదాపు రెండు శతాబ్దాలుగా గుజరాతీయులలో వ్యాపారదక్షత పెరుగుతూ వచ్చింది. ధీరూ భాయ్ అంబానీ, గౌతమ్ అదానీ, కర్సన్భాయ్ పటేల్ వంటి దిగ్గజాలు మోదీ రావడానికి ముందే వ్యాపారరంగంలో తమ ముద్రను వేశారు. మాధవ్ సింగ్సోలంకీ ముఖ్యమంత్రిగా ఉండగా (1984) దేశంలో రూ.4,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన వంద జిల్లాల జాబితా తయారు చేస్తే అందులో పాతిక జిల్లాలు గుజరాత్ రాష్ట్రంలోనివే. ఒక్క భారూచ్ జిల్లాలో పెట్టు బడులే జాబితాలోని తక్కిన అన్ని జిల్లాల పెట్టుబడులకంటే అధికం. అప్పుడు మోదీ ఎక్కడున్నారు? వాస్తవం ఏమిటంటే గుజరాత్లో చాలాకాలంగా సాగు తున్న అభివృద్ధి నమూనానే మోదీ కొనసాగించారు. బీజేపీ సర్కార్‌కు సుస్థిరత ప్రసాదించడం మూలంగా కొన్ని రంగాలలో అభివృద్ధి కొట్టవచ్చినట్టు కనిపిస్తు న్నది. మోదీ అభివృద్ధి నమూనా విపణి చోదకమైనది. కొన్ని రంగాలలో కొన్ని సంస్థలకే అభివృద్ధి ఫలాలు అందాయి. సామాజిక న్యాయం ఆశించినంత జరగ లేదు. దేశంలోని అతిసంపన్నవంతమైన రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ, అక్షరాస్యతలో, శిశుమరణాలలో, పేదరికంలో, ఇతర అభివృద్ధి సూచీలలో గుజరాత్ చాలా వెనుకబడి ఉన్నది. బిహార్ ఇందుకు భిన్నం. ‘బీమారూ’ రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ సరసన ఉండిన బిహార్ పదేళ్లలో గణనీయమైన అభి వృద్ధి సాధించింది. నితీశ్‌కుమార్ అనుసరించిన నమూనా ఫలితంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను కొంతమేరకు పేదరికం నుంచి బయట పడవేయడం, తరతరాలుగా అణచివేతకు గురవుతూ వచ్చిన మహిళలకు అధికారం అప్పగించడం వంటి ప్రగతి సాధ్యమైంది. మానవ వికాసానికి అవసరమైన అభివృద్ధి అందుబాటులోకి వచ్చింది. 2001 నుంచి 2011 వరకూ అక్షరాస్యత 16.8 శాతం పెరిగింది. మహిళల అక్షరాస్యత 20 శాతం పెరిగింది. మూడు అంతస్తుల పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50 శాతం స్థానాలు ప్రత్యేకించడమే కాకుండా 20 శాతం బడుగు కులాలవారికీ, పది శాతం దళితులకూ కేటాయించడం ద్వారా గ్రామీణ వ్యవస్థపైన శతాబ్దాలుగా కొన సాగిన భూస్వాముల ఆధిపత్యాన్ని అంతం చేయడం నితీశ్‌కుమార్ సాధించిన అద్భుతమైన సామాజిక విప్లవం. పంచాయతీరాజ్ వ్యవస్థలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మహిళా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం విశేషం. అతి బడుగు వర్గాలకు చేయూతనివ్వడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంలో కూడా నితీశ్ కృతకృత్యుడైనారు. సామాజిక న్యాయం, సామా జికార్థిక అభివృద్ధి, ప్రాథమిక వనరుల కల్పన అనే మూడు అంశాలకు ప్రాధాన్యమిస్తూ సాగిన నితీశ్ అభివృద్ధి నమూనా సమాజంలో అంతరాలు తగ్గించడానికీ, బడుగువర్గాల అభ్యున్నతికీ దోహదం చేసింది. భూసంస్కరణలు అమలు చేయగలిగి ఉండే సామాజిక న్యాయ సాధన ఇంకా వేగవంతమై ఉండేది. భూసంస్కరణలను సూచించడం కోసం బందోపాధ్యాయ కమిటీని నియమించినప్పటికీ కమిటీ సూచనలను అమలు చేయడంలో నితీశ్ కుమార్ విఫలమైనారు. ఈసారి ఎన్నికలలో గెలిస్తే నితీశ్, లాలూ ప్రసాద్ నిర్మాణాత్మ కంగా పనిచేసి భూసంస్కరణలు అమలు చేసి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయగలిగితే బిహార్ సమాజంలో అంతరాలు మరింతగా తగ్గిపోతాయి. ఇంత కాలం దేశానికి ముడి ఖనిజం అందిస్తున్న బిహార్ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహిస్తే సంపద పెంచుకొని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన చేరుతుంది. పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష సంఘటనకు ప్రజలు అధి కారం ఇచ్చినప్పటికీ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించడంలో విఫలమైనారు. బిహార్‌లో నితీశ్‌కుమార్ కొంత వరకైనా సాధించి చూపించారు. అందుకే, మూడో టరమ్ ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం బిహార్ ప్రజలు నితీశ్‌కుమార్‌కి ఇచ్చినట్లయితే, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ప్రశాం తంగా పని చేసుకునే వీలు లాలూప్రసాద్ కల్పించినట్లయితే, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఫలితాలు సాధించేందుకు ఇంకొంత సమయం లభిస్తుంది. ఎన్డీఏ విజయం సాధిస్తే ఢిల్లీలో, గాంధీనగర్‌లో అమలు జరుగుతున్న మార్కెట్ నమూనానే బిహార్‌లోనూ అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. నితీశ్ ప్రయోగం ఆగిపోతుంది. అందుకు బిహార్ ఎన్నికలంటే కేవలం కులాల పోరాటం లేదా రాజకీయ నాయకుల ఆరాటం మాత్రమే కాదు. బిహారీ లేదా బాహరీ కాదు. రెండు అభివృద్ధి నమూనాల మధ్య పోటీ. -
ఎన్నికల వేళ పూజారిని కలిసిన నితీష్
-
ఇరువర్గాలకూ విజయంపై విశ్వాసం!
బీజేపీది అభివృద్ధి మంత్రమైతే.. నితీశ్ పనితీరు సెక్యులర్ ఫ్రంట్ ఆయుధం! న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో విజయం తమదేనని ప్రధాన కూటములు ఎన్డీయే, మహా లౌకిక కూటమి విశ్వాసం వ్యక్తం చేశాయి. వరుసగా మూడోసారి సీఎం పీఠం ఆశిస్తున్న జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్.. ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉన్నామని, సీఎంగా తన పనితీరే తనను మళ్లీ గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేయగా.. ఈసీ ప్రకటన నితీశ్ పాలనకు అంతం పలికే ప్రకటన అని, రానుంది కాషాయ దళ పాలనేనని బీజేపీ చెప్తోంది. ‘సెప్టెంబర్ 6 నుంచే ఎన్నికల నియమావళిని పాటిస్తున్నాం. ప్రస్తుతం ముఖ్యమైన అధికార విధులు తప్ప అన్ని పనులూ ముగించాం. సీఎంగా నా పనితీరే ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రజల ముందుకు వెళ్తాం’ అని నితీశ్ తెలిపారు. ఎన్నికలను ఐదు రోజులు కాకుండా, ఒకే రోజులో ముగిస్తే బావుండేదని లాలూ అన్నారు. ఈ ఎన్నికలతో బీజేపీ పని ముగుస్తుందన్నారు. ‘బీజేపీ ముసుగు మాత్రమే. అసలు ముఖం ఆరెస్సెస్. అది ఈ మధ్యే బీజేపీ చెవులు మెలేసి, ప్రభుత్వ పనితీరును సమీక్షించింది’ అని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో మహా లౌకిక కూటమి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తేదీల ప్రకటనతో నితీశ్ శకం ముగిసిందని, అది ఒకరకంగా బీజేపీ అధికారంలోకి వస్తున్నదని తెలిపే ప్రకటన అని బీజేపీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. ‘దీపావళి ముందు ఎన్నికల ఫలితాలు వెలువడటం బావుంది. బీజేపీతో సుపరిపాలన ప్రారంభం కాబోతోందన్న ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుకుంటారు’ అని బిహార్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అభివృద్ధి మంత్రంతో ప్రజల ముందుకు వెళ్తామని మరో నేత సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. 12 ఏళ్ల పాటు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటూ నితీశ్ లౌకికవాదంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై లాలూ, నితీశ్ కుమార్ జాగ్రత్తగా స్పందించారు. ములాయంపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని తన పార్టీ శ్రేణులను ఆదేశించానని లాలూ చెప్పారు. ‘లౌకిక కూటమిలో ఎస్పీ కొనసాగాలని లాలూ, శరద్‌యాదవ్ కృషి చేశారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు’ అని నితీశ్ అన్నారు. సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఎంపిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ప్రధాన కూటములు సీట్ల సర్దుబాటు ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ బుధవారం మిత్రపక్షాలతో భేటీ నిర్వహించింది. రెండు, మూడు రోజుల్లో సీట్ల పంపకం ఒక కొలిక్కి వస్తుందని ఎన్డీయే మిత్రపక్షం ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. మహా దళిత్ నేత, మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ ఇటీవల దళిత నేతగా పాశ్వాన్‌కు ప్రచారం కల్పించడాన్ని ప్రశ్నించడం, తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేయడంతో కూటమిలో విభేదాల గురించి పలు వార్తలు వెలువడ్డాయి. అయితే, అవన్నీ అన్నదమ్ముల మధ్య అభిప్రాయభేదాలవంటివని బుధవారం బీజేపీ నేత అనంత్ కుమార్‌తో భేటీ అనంతరం మాంఝీ అన్నారు.