బీజేపీని వీడేది లేదు: శత్రుఘ్న సిన్హా | Shatrughan Sinha swears allegiance to BJP, but says nobody knows the future | Sakshi
Sakshi News home page

బీజేపీని వీడేది లేదు: శత్రుఘ్న సిన్హా

Published Mon, Jul 27 2015 2:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీని వీడేది లేదు: శత్రుఘ్న సిన్హా - Sakshi

బీజేపీని వీడేది లేదు: శత్రుఘ్న సిన్హా

పట్నా: బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదని ఆ పార్టీ ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. శనివారం బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో శత్రుఘ్న భేటీ నేపథ్యంలో ఆయన పార్టీ వీడతారనే ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఆదివారం ఈ విషయంపై సిన్హా స్పందించారు. ‘ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు బీజేపీలో చేరాను.. క్లిష్ట సమయాల్లోనూ పార్టీలోనే ఉన్నాను. జేడీయూలో చేరే ప్రశ్నే లేదు’ అని పేర్కొన్నారు. ‘భవిష్యత్తును ఎవరు చెప్పగలరు. రేపు ఎవరైనా నన్నే పార్టీ నుంచి గెంటేయవచ్చు..

దాని గురించిన ఆలోచనే నాకు లేదు’ అని అన్నారు.  నితీశ్‌తో సమావేశంపై మాట్లాడుతూ... ఆయనతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, పట్నా వచ్చిన ప్రతిసారీ ఆయనను కలుస్తానని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement