బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదానికి దారితీసింది. ప్రముఖ శక్తిమాన్ ఫేమ్, నటుడు ముకేశ్ ఖన్నాను ఉద్దేశించి ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. మీ మాటలు చూస్తుంటే కావాలనే నన్ను టార్గెట్ చేసినట్లు ఉందని రాసుకొచ్చింది. నా తండ్రి శతృఘ్న సిన్హా పెంపకంపై మీరు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. నాతో పాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారని సోనాక్షి గుర్తు చేశారు.
అసలేం జరిగిందంటే..
గతంలో అంటే 2019లో సోనాక్షి సిన్హా కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొంది. ఆ సమయంలో రామాయణం గురించి ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడని సోనాక్షిని హోస్ట్ ప్రశ్నించాడు. దీనికి ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయింది. సోనాక్షి మాత్రమేకాదు.. అక్కడే ఉన్న మరో ఇద్దరు సైతం ఆన్సర్ చేయలేకపోయారు. ఇది చూసిన ముకేశ్ ఖన్నా.. కూతురిని సరిగా పెంచలేదంటూ శతృఘ్న సిన్హాను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది కాస్తా వైరల్ కావడంతో తాజాగా సోనాక్షి ఆయనకు కౌంటర్‌గా పోస్ట్ పెట్టింది.
అయితే తాజాగా సోనాక్షి పోస్ట్‌పై శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా స్పందించారు. ఈ విషయంపై సోనాక్షి చాలా ఆలస్యంగా స్పందించిందని అన్నారు. తన పెంపకాన్ని ప్రశ్నించడం పట్ల తనకు ఎలాంటి దురుద్దేశం తెలిపారు. ఆమె తండ్రి చేసిన తప్పువల్లే సోనాక్షి సమాధానం చెప్పలేకపోయిందన్నారు. అయితే ఇంత ఆలస్యంగా రియాక్ట్ కావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ముకేశ్ అన్నారు.
ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ.. 'తను రియాక్ట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఈ విషయంలో నాకు ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ విషయంలో ఆమెను, అలాగే ఆమె తండ్రిని కించపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. అతనితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి' అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment