Sonakshi Sinha
-
మహిళల సంతోషమే దేశానికి సంపద : శ్రీ శ్రీ రవిశంకర్
బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్న ఈ సదస్సులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుని, శ్రేయస్సును అందుకునే దిశగా అడుగులు పడ్డాయి. సామాజిక, లౌకిక విషయాలపై లోతైన చర్చలు, ప్రగాఢమైన మానసిక విశ్రాంతి నిచ్చే అంతరంగ ప్రయాణాలు, వాటికి తోడుగా సాంస్కృతిక ప్రదర్శనలు కలగలిసి ఆహుతుల కోసం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. బహ్రెయిన్‌కు చెందిన మహిళా సైనిక సైనికాధికారిణి, ఒక భారతీయ నటి, టర్కీదేశపు డిజిటల్, కృత్రిమ మేధ కళాకారుడు కలుసుకుని,మనస్సు, చైతన్యం - వీటిపై సృజనాత్మకత ప్రభావం గురించి చర్చించారు.ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, “నేను ఎదుగుతున్న దశలో కళలు నాకు ధ్యానాన్ని నేర్పాయి. అది సహజంగా జరిగిపోయింది. ఐతే నేను ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే నా శక్తిసామర్థ్యాలలో చిత్రమైన మార్పును గమనించాను. ప్రజలు మంచిగా ఉంటూ, అందరి మంచినీ కోరుకున్నప్పుడే సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.” అని అన్నారుబహ్రెయిన్ సైనిక, క్రీడా విభాగాలకు అధిపతిగా పనిచేస్తున్న కుమారి నూరా అబ్దుల్లా మాట్లాడుతూ, “సైన్యంలో ఆజ్ఞలను పాటించడమే తప్ప సృజనాత్మకతకు తావు లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను చూసిన తర్వాత, మార్పును సృష్టించేందుకు స్వేచ్ఛ అవసరమని, నిజమైన సృజనాత్మకత సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుందని నేను గ్రహించాను.” అన్నారు.ఈ సదస్సుకు చోదకశక్తిగా ఉన్న చైర్ పర్సన్ భానుమతి నరసింహన్ మాట్లాడుతూ, మహిళల జీవితంలో విశ్రాంతి, పని మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. “మహిళలుగా మనము మరింత ఎక్కువగా, మరింత త్వరగా సాధించాలనే ఆతృతలో ఉంటాము. నిజానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నపుడే మీరు అనుకున్నవి సాధించగలరు. ఇది విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండేందుకు తగిన సమయం.” అని పేర్కొన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ 180 దేశాలలో కోట్లాదిప్రజలకు అంతర్గత శాంతిని అందించడంలో ప్రపంచ శాంతి నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పోషించిన పాత్రను ఈ సదస్సుకు హాజరైన పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంలో గురుదేవ్ పాత్రను ప్రశంసిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, “భారతదేశం ఆధ్యాత్మిక దేశం, కానీ మారుతున్న కాలంతో మనం మన మూలాలకు దూరమవుతున్నాము. అందుకోసమే, మనం మరచిపోయిన విలువలను గుర్తుచేందుకు, మనకు స్ఫూర్తినిచ్చేందుకుగురుదేవ్ వంటి ఆధ్యాత్మిక నాయకులు ఇక్కడ ఉన్నారు.” అని అన్నారు.ప్రతిష్టాత్మకమైన విశాలాక్షి అవార్డు అందుకున్న సందర్భంగా కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ, "ఒక సాధుపుంగవునికి జన్మనిచ్చిన తల్లి పేరు మీద అవార్డును అందుకోవడం కంటే గొప్ప బహుమతి మరొకటి లేదు." అని భావోద్వేగానికి గురయ్యారు.జపాన్ మాజీ ప్రథమ మహిళ అకీ అబే మాట్లాడుతూ, హింసలేని ప్రపంచం కోసం గురుదేవ్ దృక్పథాన్నితన స్వీయ అనుభవంతో పోల్చి చూశారు. ఆమె భర్త, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుండగుని కాల్పులలో మరణించిన సంగతి విదితమే.“ప్రతి నేరస్థుడిలో ఒక బాధితుడు ఉంటాడని గురుదేవ్ చెప్పడం నేను విన్నాను. నా భర్త ప్రాణం తీసిన వ్యక్తిని ద్వేషించే బదులు, నేను కరుణించగలనా? అటువంటి హింస జరుగకుండా ఉండేందుకు నేను ఏమైనా సహాయం చేయగలనా? కేవలం నేరం జరిగిన తర్వాత బాధితులకు మద్దతిచ్చే సమాజం కంటే, నేరాలు తక్కువ జరిగే సమాజమే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.” అని ఆమె అన్నారు.సీతా చరితం: సాంస్కృతికదృశ్య వైభవంఈ 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు కేవలం చర్చలు, ఆత్మపరిశీలనలకు మాత్రమే పరిమితం కాకుండా, సీతా చరితం అనే చక్కని రంగస్థల సాంస్కృతిక ప్రదర్శనకు, వేదికగా కూడా మారింది. భారతీయ కావ్యమైన రామాయణాన్ని ఏ షరతులూ లేని ప్రేమ, జ్ఞానం, ఆత్మస్థైర్యం, భక్తి, కరుణరసాల కలయికగా సీతాదేవి దృక్కోణం నుండి చూపే ప్రయత్నం ఇక్కడ జరిగింది. 500మంది కళాకారులు 30 విభిన్న సంగీత నృత్య రీతులను మేళవించి, దేశంలో మొట్టమొదటిసారిగా 4-డి సాంకేతికతను ఉపయోగించి చేసిన సంగీత నృత్య రూపకం ప్రపంచం నలుమూలలనుండి హాజరైన ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.కాలానికి అతీతంగా, మానవాళికి ఆదర్శంగా నిలచిన రామకథను ఈ ప్రదర్శన 190 దేశాలకు తీసుకువెళుతుంది. ఇంగ్లీషులో రూపొందించిన స్క్రిప్ట్ కోసం 20కి పైగా వివిధ భాషలు, సంస్కృతులలోని రామాయణాలను పరిశీలించారనీ, ఇది నిజమైన ప్రపంచ సాంస్కృతిక అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. సీతా చరితం నిర్మాణం వెనుక ఉన్న ప్రేరణ గురించి సృజనాత్మక దర్శకురాలు శ్రీవిద్యా వర్చస్వి మాట్లాడుతూ, “సీతమ్మవారి కథ పరివర్తకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అంతే కాక, ఈ నాటకం, స్క్రిప్ట్, డైలాగ్‌లు అన్నీ గురుదేవుల జ్ఞానంతో నిండి ఉన్నాయి.” అని అన్నారు. -
లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే!
హీరోయిన్ సోనాక్షి సిన్హా మొత్తానికి తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించింది. సంజయ్ లీలా భన్సాలీ పీరియాడికల్ డ్రామా హీరామండి: ది డైమండ్ బజార్లో చివరిసారిగా కనిపించిన సోనాక్షి సిన్హా, సముద్రం వైపున ఉన్నతన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను రూ.22.50 కోట్లకు విక్రయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ (81 Aureate) 16వ అంతస్తులో 4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందీ అపార్ట్మెంట్. దీన్ని 2022, మార్చి దాదాపు రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే తాజా విక్రయం ద్వారా దాదాపు 61 శాతం లాభాన్ని ఆర్జించిందిఆధునిక సౌకర్యాలతో కూడిన విశాలమైన 4-BHK అపార్ట్‌మెంట్‌ను reD ఆర్కిటెక్ట్స్‌కు చెందిన రాజీవ్ , ఏక్తా పరేఖ్ 1.5-BHKగా సొగసైన రీతిలో తీర్చిదిద్దారు. ఎంతో స్పెషల్‌గా, అందంగా ఈ ఇంటిలో వాక్-ఇన్ వార్డ్రోబ్, ప్రత్యేక జిమ్, అందమైన కళాకృతులు, అరేబియా సముద్రాన్ని వీక్షించేలా విశాలమైన బాల్కనీ ఉన్నాయి. చదవండి: లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!ముఖ్యంగా గత ఏడాది (2024, జూన్ 23న ) సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్న ఇల్లు కూడా ఇదే. ఇటీవల సోనాక్షి, జహీర్ పెళ్లి వేడుకలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ ఇంటిని రూ.25 కోట్లకు అమ్మకానికి పెట్టడం వార్తల్లో నిలిచింది.కాగా బాలీవుడ్ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. ప్రారంభంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. తరువాత బాగా బరువు తగ్గించుకుని, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన యాక్షన్-డ్రామా దబాంగ్ (2010)మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఉత్తమ డెబ్యూనటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. వరుస ఆఫర్లతో చాలా బిజీగా మారింది. ముఖ్యంగా దక్షిణాదిన రజినీకాంత్ నటించిన లింగ సినిమాతో తమిళం సినిమాకి పరిచయం అయినది. సహనటుడు జహీర్ ఇక్బాల్‌తో సుదీర్ఘ కాలం ప్రేమలో ఉన్న సోనాక్షీ ఎట్టకేలకు గత ఏడాది పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భర్తతో మూడు హనీమూన్లు, ఆరు టూర్లు అన్నట్టుగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. -
భర్తతో కలిసి సముద్రగర్భంలో హీరోయిన్ సాహసాలు (ఫొటోలు)
-
'సోనాక్షి రియాక్షన్ ఆశ్చర్యం కలిగించింది'.. హీరోయిన్‌పై ముకేశ్ ఖన్నా సెటైర్లు
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదానికి దారితీసింది. ప్రముఖ శక్తిమాన్ ఫేమ్, నటుడు ముకేశ్ ఖన్నాను ఉద్దేశించి ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. మీ మాటలు చూస్తుంటే కావాలనే నన్ను టార్గెట్ చేసినట్లు ఉందని రాసుకొచ్చింది. నా తండ్రి శతృఘ్న సిన్హా పెంపకంపై మీరు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. నాతో పాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారని సోనాక్షి గుర్తు చేశారు.అసలేం జరిగిందంటే..గతంలో అంటే 2019లో సోనాక్షి సిన్హా కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్లో ప్రత్యేక అతిథిగా పాల్గొంది. ఆ సమయంలో రామాయణం గురించి ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడని సోనాక్షిని హోస్ట్ ప్రశ్నించాడు. దీనికి ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయింది. సోనాక్షి మాత్రమేకాదు.. అక్కడే ఉన్న మరో ఇద్దరు సైతం ఆన్సర్ చేయలేకపోయారు. ఇది చూసిన ముకేశ్ ఖన్నా.. కూతురిని సరిగా పెంచలేదంటూ శతృఘ్న సిన్హాను ఉద్దేశించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది కాస్తా వైరల్ కావడంతో తాజాగా సోనాక్షి ఆయనకు కౌంటర్‌గా పోస్ట్ పెట్టింది.అయితే తాజాగా సోనాక్షి పోస్ట్‌పై శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా స్పందించారు. ఈ విషయంపై సోనాక్షి చాలా ఆలస్యంగా స్పందించిందని అన్నారు. తన పెంపకాన్ని ప్రశ్నించడం పట్ల తనకు ఎలాంటి దురుద్దేశం తెలిపారు. ఆమె తండ్రి చేసిన తప్పువల్లే సోనాక్షి సమాధానం చెప్పలేకపోయిందన్నారు. అయితే ఇంత ఆలస్యంగా రియాక్ట్ కావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ముకేశ్ అన్నారు.ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ.. 'తను రియాక్ట్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఈ విషయంలో నాకు ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ విషయంలో ఆమెను, అలాగే ఆమె తండ్రిని కించపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. అతనితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి' అని తెలిపారు. -
Diwali 2024: హ్యపీ దివాలీ సెలబ్రిటీల సందడి
-
దివాళీ పార్టీలో మెరిసిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీపై క్రేజీ కామెంట్స్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం కుటుంబంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ భర్తతో కలిసి దిపావళీ పార్టీలో తళుక్కున మెరిసింది. ముంబయిలో జరిగిన దివాళీ బాష్‌లో అనార్కలీ సూట్ ధరించి కనిపించింది. ఇద్దరు కలిసి తమ పెట్ డాగ్‌తో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. గెస్ దిస్ అంటూ సోనాక్షి క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఇది చూసిన నెటిజన్స్ సోనాక్షి సిన్హాను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి బేబీ బంప్‌తో ఉందంటూ ఇన్‌స్టాలో రిప్లై ఇస్తున్నారు. తన భర్త జహీర్ ఇక్బాల్‌తో కలిసి త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఏకంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ గురించి ఇప్పటి వరకు సోనాక్షి నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.(ఇది చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్)కాగా.. ఈ ఏడాది జూన్ 23న హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీరి పెళ్లి వేడుక ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న సోనాక్షి అపార్ట్మెంట్లోనే జరిగింది. మరోవైపు సోనాక్షి ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో అనే చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
ఇటీవలే ప్రియుడితో పెళ్లి.. ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై సోనాక్షి ఏమందంటే?
ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఇందులో మనీషా కొయిరాలా, ఆదితి రావు హైదరీతో పాటు ఆరుగురు హీరోయిన్లు నటించారు. ప్రస్తుతం సోనాక్షి కాకుడ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ కూడా నటించారు. ఈ చిత్రం జూలై 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్కు రానుంది.ఇదిలా ఉండగా.. గతనెల 23న సోనాక్షి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి పెళ్లికి సినీతారలు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ఇటీవల ఈ జంట హనీమూన్ కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.తాజాగా తన రాబోయే మూవీ కుకుడ ప్రమోషన్లలో సోనాక్షి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటరాక్షన్‌లో జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి తర్వాత ఆమె జీవితం గురించి ప్రశ్నించారు. నా లైఫ్ పెళ్లికి ముందు సంతోషంగానే ఉందని తెలిపారు. పెళ్లి తర్వాత మరింత ఆనందంగా ఉన్నానని సోనాక్షి వెల్లడించారు.గతంలో మీరిద్దరు కలిసి ఓ ఆస్పత్రికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆ సమయంలో మీరు గర్భంతో ఉన్నారని ఊహనాగాలొచ్చాయి కదా? దీనిపై మీరేమంటారు? అంటూ సోనాక్షిని ప్రశ్నించారు. దీనిపై మాట్లాడుతూ..' ఇప్పుడు మేము ఆస్పత్రి వెళ్లలేము.. ఎందుకంటే మీరు వెంటనే గర్భవతి అని డిసైడ్ చేసేస్తారు' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. -
పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది?
పెళ్లయి వారం రోజులు కూడా కాలేదు. ఇంతలోనే హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆస్పత్రిలో కనిపించింది. దీంతో లేనిపోని పుకార్లు మొదలయ్యాయి. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చేసిందని అంటున్నారు. దీంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరీ ఇంత తొందరగానా అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్‌పై సుమోటో కేసు.. అసలేం జరిగిందంటే?)బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. 'దబంగ్' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత వరసగా పలు హిందీ చిత్రాల్లో నటించింది. రీసెంట్ టైంలో ఈమెకు సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఇండస్ట్రీకే చెందిన జహీర్ ఇక్బాల్ అనే నటుడిని ప్రేమించి.. ఈ మధ్యనే జూన్ 23న పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది.అయితే పెళ్లయి ఐదురోజులకే ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి సోనాక్షి-జహీర్ వస్తూ కనిపించారు. దీంతో ఈమె ప్రెగ్నెన్సీ వచ్చిందనే రూమర్స్ వచ్చాయి. అయితే ఇది అబద్ధమని తేలింది. శత్రుఘ్ని సిన్హా రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్లో ఉన్నారని, తండ్రిని కలిసేందుకు ఇలా ఆస్పత్రికి వచ్చి వెళ్లడంతో పుకార్లు వచ్చాయి తప్పితే ఇంకేం లేదని తెలుస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్)बिना प्रेगनेंट हुए ये लोग ब्याह नहीं करती है 😷खैर इसका तो निकाह हुआ है 🤪#SonakshiSinha जाहिल इकबाल pic.twitter.com/46SEIfiBOh— साधना सक्सेना (@Bharatdarshan22) June 29, 2024 -
హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
హీరోయిన్ సోనాక్షి సిన్హా రీసెంట్గా పెళ్లి చేసుకుంది. గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్న రైటర్ జహీర్ ఇక్బాల్‌తో ఒక్కటైంది. జూన్ 23న జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే మతాల వేరు కావడంతో ఈ వివాహం సోనాక్షి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని రూమర్స్ వచ్చాయి. ఇందుకు తగ్గట్లే పెళ్లిలో సోనాక్షి అన్నదమ్ములు కనిపించలేదు.(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?)ఇకపోతే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సోనాక్షి-జహీర్ ఇక్బాల్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే సోనాక్షితో వివాహం జరగడానికి ముందే జహీర్ ఖరీదైన బహుమతి ఇచ్చాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని ఖరీదు దాదాపు రూ.2 కోట్లకు పైనే అని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.పెళ్లి తర్వాత సెలబ్రేషన్స్ కోసం సోనాక్షి-జహీర్ కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి బీఎండబ్ల్యూ ఐ7 కారులో వచ్చారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు.. జహీర్, సోనాక్షికి బహుమతిగా ఇచ్చాడని తెలుస్తోంది. మార్కెట్లో దీని ధర రూ.2 నుంచి రూ.3 కోట్ల మధ్యలో ఉంది. ఏదేమైనా పెళ్లికి వేరే వాళ్లు గిఫ్ట్స్ ఇవ్వడం కామన్. కానీ భర్త నుంచి ఇంత కాస్ట్ లీ బహుమతి రావడం మాత్రం సోనాక్షికి మరపురాని బహుమతిగా మిగిలిపోతుంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా!) -
కొత్త పెళ్లికూతురు సోనాక్షి ‘ఫ్యామిలీ’ విశేషాలు, సల్మాన్‌తో లింకేంటి?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (జూన్ 23, 2024న)న తన డ్రీమ్ బోయ్ జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. చాలా సింపుల్‌గా రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ ప్రముఖులందరూ తరలి వచ్చారు. అలాగే వీరి వెడ్డింగ్, రిసెప్షన్ వీడియోలు, ఫోటోలు నెట్టింట బాగా సందడి చేసాయి. రేఖ, కాజోల్ లాంటి సీనియర్ హీరోయిన్లతోపాటు ,సోనాక్షి తన అత్తమామలతో సన్నిహితంగా, ప్రేమగా మెలిగిన ఫోటోలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ క్రమంలో సోనాక్షి మెట్టినిల్లు, జహీర్ ఇక్బాల్ కుటుంబం, నేపథ్యం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. సోనాక్షి భర్త, నటుడు, మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్ జహీర్ ఇక్బాల్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ. అలాగే సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హాకు సన్నిహితుడైన ఇక్బాల్ రతాన్సీకి వ్యాపార పరిశ్రమలో మంచి పేరుంది. ప్రధానంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు చాలా సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే రతాన్నీ సల్మాన్‌కు 'పర్సనల్ బ్యాంకు' లాంటి వాడట. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ వెల్లడించాడొక సందర్భంలో. 2011లో తీసుకున్న ఆయన అప్పు ఇంకా తీర్చలేదని, వడ్డీ కూడా లేదంటూ చెప్పుకొచ్చాడు. ఎవరీ రతాన్సీ?ముంబైకి చెందిన ఇక్బాల్ రతాన్సీ నగల వ్యాపారంతో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రవేశం లేనప్పటికీ అనేక సినీరంగ ప్రముఖులతో సంబంధాలు మాత్రం ఉన్నాయి. 2005లో స్టెల్మాక్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. 2011 వరకు ఈ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగంలో మరింత విస్తరించేలా బ్లాక్‌స్టోన్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించారు. ప్రస్తుతం దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు రతాన్సీ.ఇక్బాల్ రతాన్సీ సినిమా వ్యాపారం 2016లో సినిమా రంగంలోకూడా తన వ్యాపారాన్ని విస్తరించారు. ఫిల్మ్ టూల్స్, లైట్స్ అండ్ గ్రిప్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తరువాత కోవిడ్ సమయంలో జహీరో మీడియా అండ్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు.ఇక్బాల్ రతాన్సీ కుటుంబంరతాన్సీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు ఒక్కొక్కరూ ఒక్కో రంగంలో స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు జహీర్ నటుడు కాగా మరో కుమారుడు, మొహమ్మద్ లోధా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. ఇక ఏకైక కుమార్తె సనమ్ రతాన్సీ. ఈమె స్టైలిస్ట్ , కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోంది. సోనాక్షి వ్యక్తిగత స్టైలిస్ట్‌గా పేరొందింది.సల్మాన్ ఖాన్‌తో ఇక్బాల్ రతాన్సీ బంధంఇక్బాల్ , సల్మాన్ల స్నేహం మూడు దశాబ్దాలకు పైబడి కొనసాగుతోంది. కష్ట సమయాల్లో సల్మాకు ఆర్థికంగా, నైతికంగా మద్దతుగా నిలిచిన వారిలో రతాన్సీ ఒకరు. ఈ నేపథ్యంలో ఇక్బాల్ కుమారుడు జహీర్‌ను బాలీవుడ్లో నోట్‌బుక్ చిత్రంతో పరిచయం చేశాడు. అంతేకాదు ఇక్బాల్ రతాన్సీ వ్యాపారవేత్తగా రాణిస్తూనే, స్నేహితులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే ప్రియమైన స్నేహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. -
Sonakshi-Zaheer Wedding: సోనాక్షి - ఇక్బాల్ సింపుల్ రిసెప్షన్: సెలబ్రిటీల జబర్దస్త్ సందడి (ఫోటోలు)
-
పెళ్లి వేడుకల్లో సోనాక్షి డ్రెస్సింగ్ స్టైల్ వేరేలెవెల్!..పూజకు అందరిలా..!
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకుంది. పైగా ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న నటుడు జహీర్ ఇక్బాల్‌ని వివాహం చేసుకుంది. అందిరిలా హంగు ఆర్భాటంగా కాకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంది. పెళ్లి కూతురు ముస్తాబులో సోనాక్షి ఎలా ఉంటుందా అని అభిమానులంతా ఎదురు చూడగా తన స్టైల్ వేరేలెవెల్ అన్నట్లుగా ఢిఫరెంట్ లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) పెళ్లి తంతుకి ముందు జరిగే పూజా కార్యక్రమం, సింధూర ధారణ, రిసెప్టన్ వరకు ప్రతి ఘట్టంలో అంచనాలకు అందని విధంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఉంది. ఈ గ్రాండ్ వివాహ వేడుకలో సోనాక్షి ఎలాంటి చీరలు, డ్రెస్‌లు ధరించిందంటే..గత కొన్ని రోజులుగా వాళ్ల పెళ్లికి సంబంధించిన పుకార్లకు చెక్‌పెట్టి మరీ ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లికి ముందు సోనాక్షి సిన్హా కుటుంబం తమ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ వేడుక అనంతరం నీలిరంగు డ్రెస్సులో కనిపించింది. ఆమె ధరించిన నీలి రంగు డ్రెస్సు చాలా అందంగా ఉంది. పెళ్లి అనగానే కేవలం లెహెంగాలు, చీరలు మాత్రమే కాదు, ఇలా డ్రెస్సులో కూడా అందంగా ఉండొచ్చని సోనాక్షి నిరుపించింది. అలాగే పెళ్లి సమయంలో ఐవరీ చీరలో అద్భుతంగా కనిపించింది. వివాహ వేడుకకు లేటెస్ట్ డిజైన్‌తో చీరను ఎంచుకోవడానికి బదులుగా తన తల్లి పూనమ్ సిన్హా పెళ్లి చీరను ఎంచుకుంది. అలాగే శిల్పాశెట్టి రెస్టారెంట్లో జరిగిన రిసెప్టన్లో సంప్రదాయ ఆభరణాలతో అద్భుతమైన బనారసీ చీరలో గ్లామరస్‌గా కనిపించింది. ఇక ఆమె భర్త ఇక్బాల్ బార్యకు అనుబంధంగా తెల్లటి కుర్తా ట్వీట్ జాకెట్, ప్యాంటుని ధరించారు. "సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున మనం కలుసుకున్నాం. ఎన్నో సవాళ్లు, విజయాల తర్వాత తల్లిదండ్రలు, దేవుడి ఆశీర్వాదంతో భార్యభర్తలయ్యాం అంటూ భావోద్వేగంగా ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టింది సోనాక్షి సిన్హా. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) (చదవండి: మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!) -
సోనాక్షి పెళ్లి.. రిసెప్షన్లో మెరిసిన కాబోయే వధూవరులు!
బాలీవుడ్ భామ సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్, దక్షిణాది సినీతారలు సందడి చేశారు. బాంద్రాలో జరిగిన ఈ ఫంక్షన్లో కాబోయే వధూవరులు అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ మెరిశారు.కాగా.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ ఈ ఏడాది మార్చి 27న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట తమ బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా సోనాక్షి పెళ్లికి వీరిద్దరు జంటగా హాజరయ్యారు. అయితే ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌లో ఆదితిరావు కీలక పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్‌లో సోనాక్షి సిన్హాతో కలిసి నటించింది. వీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లే రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. 2021 తెలుగు సినిమా మహా సముద్రం సెట్స్‌లో సిద్ధార్థ్, అదితి మొదటిసారి కలుసుకున్నారు. -
అతనితో పెళ్లి అనగానే కుటుంబంలో గొడవలు: సోనాక్షి సిన్హా తండ్రి కామెంట్స్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా.. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోనుంది. ఈ నెల 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమైంది. ముంబయిలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లికి సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరు అవుతున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లికి ముందు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పిన ఆయన.. ఆ తర్వాత నా ఏకైక కుమార్తె సోనాక్షినే అని చెప్పుకొచ్చాడు. ఈ రోజుల్లో పెళ్లికి పిల్లలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోరని.. వారి నిర్ణయాన్ని మాత్రమే తెలియజేస్తారని ఆయన అన్నారు.పెళ్లికి ముందు విభేదాలుసోనాక్షి తన ప్రియుడు ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోనుందని తెలియగానే మా కుటుంబంలో విభేదాలు వచ్చాయని శతృఘ్న సిన్హా తెలిపారు. పెళ్లి అనేది అందరి ఇళ్లలో జరుగుతుందని.. వివాహనికి ముందు గొడవలు కూడా మామూలే అని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం అంతా బాగానే ఉందని వెల్లడించారు. సోనాక్షి, జహీర్ రిసెప్షన్‌కు తమ కుటుంబం హాజరవుతుందని శతృఘ్న తెలిపారు. కాగా.. పెళ్లికి ముందు సోనాక్షి, జహీర్ స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. -
ప్రియుడితో పెళ్లి.. ఆ రూమర్స్‌కి చెక్ పెట్టిన హీరోయిన్ మామ!
హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోనుంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న నటుడు జహీర్ ఇక్బాల్‌తో ఒక్కటి కానుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఈమె పెళ్లి గురించి వచ్చినన్నీ రూమర్స్ మరే బ్యూటీ పెళ్లి గురించి రాలేదు. ఎందుకంటే ఈ పెళ్లి, సోనాక్షి తల్లిదండ్రులకు తెలియదు, ఇష్టం లేదనే దగ్గర నుంచి రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా మతం మార్పిడి గురించి పుకార్లు రాగా, వాటిని సోనాక్షి కాబోయే మామ తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!)'ఈ పెళ్లి హిందూ లేదా ఇస్లాం సంప్రదాయంలో జరగదు. ఇది సివిల్ మ్యారేజ్. అలానే సోనాక్షి మతం మారడం లేదు. ఇది మాత్రం గ్యారంటీ. ఇది వారి మనసుల కలయిక. ఇందులో మతానికి ఎలాంటి పాత్ర లేదు. నేను మనవత్వాన్ని నమ్ముతాను. హిందువులు భగవాన్ అని, ముస్లింలు అల్లా అని పిలుస్తారు కానీ చివరకు మనమంతా మనుషులమే. నా ఆశీస్సులు జహీర్, సోనాక్షిపై ఉంటాయి' అని జహీర్ తండ్రి క్లారిటీ ఇచ్చారు.కొన్నిరోజుల క్రితం ఓ ప్రెస్మీట్లో సీనియర్ నటుడు శత్రుఘ్ని సిన్హాని.. సోనాక్షి పెళ్లి రూమర్స్ గురించి అడగ్గా.. తనకు ఆ విషయం తెలియదని అన్నారు. ఈ క్రమంలోనే సోనాక్షి.. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుందా అనే సందేహాలు వచ్చాయి. అయితే అలాంటిదేం లేదని పెళ్లిలో కచ్చితంగా తాను ఉంటానని శత్రుఘ్ని సిన్హా చెప్పుకొచ్చారు. జహీర్ ఇక్బాల్ ఇంట్లో రిజిస్టర్ మ్యారేజ్ జరుగుతుందని, ఇది తమకు సంతోషకరమైన క్షణమని ఆనందం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?) -
స్టార్ హీరోయిన్ పెళ్లి హడావుడి.. బ్యాచిలర్ పార్టీ ఫొటోలు వైరల్
స్టార్ హీరో సోనాక్షి సిన్హా పెళ్లికి రెడీ అయిపోయింది. జూన్ 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని పెళ్లి చేసుకోబోతుంది. అయితే ఈ వివాహం జరగనుందని, తల్లిదండ్రులకు సోనాక్షి నిన్న మొన్నటి వరకు చెప్పలేదట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక పెళ్లి హడావుడి ఓ పక్క జరుగుతుండగా, మరోవైపు బ్యాచిలర్ పార్టీలు గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి:ఖరీదైన ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ కంగన.. ఎవరికో తెలుసా?)బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురే సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. దక్షిణాదిలోనూ రజనీకాంత్ 'లింగా' మూవీలో నటించింది. రీసెంట్ టైంలో ఈమెకు పెద్దగా కలిసి రావట్లేదు. ఈ క్రమంలోనే జహీర్ ఇక్బాల్ అనే నటుడితో ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇది జరిగిన కొన్నిరోజులకే పెళ్లి గురించి న్యూస్ బయటకొచ్చింది.పెళ్లి కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనాక్షి పెళ్లి నిజమేనని క్లారిటీ వచ్చేసింది. జూన్ 23న వీళ్ల పెళ్లి వేడుక జరగనుంది. ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు. శుభకార్యానికి మరికొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీల్లో కాబోయే వధూవరులు బిజీగా ఉన్నారు.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?) -
‘‘నా పెళ్లి, నా ఇష్టం..మీకెందుకబ్బా!’’ సోనాక్షి రియాక్షన్, వీడని సస్పెన్స్!
సినీ నటి సోనాక్షి సిన్హా పెళ్లి పుకారు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడ బోతోందంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ నెల 23న దక్షిణ ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సోనాక్షి- జహీర్ పెళ్లాడబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై సోనాక్షి ఘాటుగా సమాధాన మిచ్చింది. ‘ ..ఇది నా పెళ్లి.. ఇది ఎవరికి సంబంధించిన విషయం కాదు. ఇక రెండోది నా పెళ్, నా ఇష్టం. జనాలకు ఎందుకింత ఆందోళన అంటూ మండిపడింది. అలాగే తన పెళ్లి గురించి అడగాల్సింది తనను గానీ, తన తల్లిదండ్రులను కాదంటూ చురకలేసింది. ఎపుడూ తన పెళ్లి గురించి అడుగుతూ ఉంటారని అయితే దీన్ని తాను పెద్దగా పట్టించుకోనని వ్యాఖ్యానించింది.అటు సోనాక్షి తండ్రి, బాలీవుడ్ హీరో, నేత శత్రుఘ్న సిన్హా కూడా స్పందించారు. తన కుమార్తె పెళ్లి గురించి తనకు తెలియదని సోనాక్షి పెళ్లి గురించి ప్రశ్నించిన మీడియాతో చెప్పారు. ‘‘ ఎన్నికల ఫలితాలు తరువాత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. సోనాక్షి వెడ్డింగ్ ప్లాన్స్ గురించి నాకేమీ తెలియదు. నాకేమీచెప్పలేదు నేనూ ఎవరితోనూ మాట్లాడలేదు’’ అంటూ సమాధానమిచ్చారు.అంతేకాదు ఈ విషయంలో ప్రధానమీడియాకు ఎంత తెలుసో, తనకూ అంతే తెలుసుననీ, ఈ రోజుల్లో, పిల్లలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోరు.. జస్ట్ వారు సమాచారం ఇస్తున్నారు.. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం అంటూ ముగించారు. దీంతో సోనాక్షి-జహార్ పెళ్లి సందడిపై సస్పెన్స్ మరింత ముదిరింది.కాగా సోనాక్షి, జహీర్ ఇద్దరూ సల్మాన్‌ఖాన్ సినిమాలతోనే బాలీవుడ్లో అడుగుపెట్టారు. సోనాక్షి 2010లో దబాంగ్ సినిమాలో నటించగా, సల్మాన్ నిర్మించిన నోట్‌బుక్ సినిమాతో 2019లో జహీర్ బాలీవుడ్లో అరంగేట్రం చేశాడు. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో జూన్ 23న సోనాక్షి, జహీర్ వివాహం జరుగు తుందని, ఆ తర్వాత రాత్రి రిసెప్షన్ కూడా ఉంటుందనేది మీడియా నివేదికల సారాంశం వీరిద్దరూ చాలా కాలంగా తమ పెళ్లికి ప్లాన్ చేస్తున్నప్పటికీ, సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఇప్పటిదాకా వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. -
Heeramandi సోనాక్షి లుక్స్: జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! ఫోటోలు
-
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
బాలీవుడ్ టాప్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొట్టమొదటి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ హిట్ టాక్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. మే 1నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అలరిస్తుంది. ఇందులో మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ తదితరులు నటించారు.హీరామండి వెబ్ సిరీస్‌లో ఉస్తాద్‌జీ పాత్రలో మెప్పించిన ఇంద్రేష్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇందులో సోనాక్షి సిన్హాతో ఇంటిమేట్ సీన్ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.‘సోనాక్షీకి, నాకు మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్స్ కోసం ఎక్కువ రీటేక్‌లు తీసుకోలేదు. ఈ సీన్స్ తీస్తున్న సమయంలో నేను భయాందోళనకు గురైయాను. కాస్త సిగ్గుగా కూడా అనిపించింది. కానీ, సోనాక్షీ నాతో మాట్లాడి రిలాక్స్‌గా ఉండమని కోరారు. ఈ సీన్స్ కూడా ఆమె అమ్మగారి ముందే జరిగాయి. ఈ క్రమంలో సోనాక్షీ తల్లి ముందే నాతో మాట్లాడారు. ఈ సిరీస్‌లో ఇలాంటి సీన్లు అవసరం, కంగారు పడొద్దని చెప్పారు. సుమారు గంటకు పైగానే అందరం చర్చించుకున్నాకే షూట్ మొదలపెట్టాం. అందుకే ఎక్కువ రీటేక్‌లు తీసుకోలేదు. ఈ సిరీస్‌లో నా పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇది నా కోసమే రూపొందించబడిందని నేను అనుకుంటున్నాను. సంజయ్ భన్సాలీ ప్రతీ సీన్‌ను చాలా జాగ్రత్తగా తీశారు.మరోక సన్నివేశంలో సోనాక్షి తన కాళ్లతో నా తలను టచ్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆమె తల్లి పూనమ్ సిన్హా కూడా సెట్స్‌లో ఉన్నారు. ఆ సీన్ సమయంలో కాస్త ఇబ్బంది ఉన్నా.. ఆమె నాకు కొంత ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. ఇలాంటి ఎన్నో సీన్స్ మా మధ్య ఉన్నాయి. హీరామండి సెట్ నుంచి నాకు చాలా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి.' అని ఇంద్రేష్ మాలిక్ చెప్పాడు. -
Stunning Looks of Sonakshi Sinha: రెడ్ లెహంగాలో జిగేలుమంటున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా
-
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్‌తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. -
Sonakshi Sinha Photos: స్టైలిష్ అండ్ ఎత్నిక్ లుక్‌లో.. (ఫోటోలు)
-
అందాల తార సోనాక్షి సిన్హా ధరించిన డ్రస్ ధర తెలిస్తే..షాకవ్వుతారు!
స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత ఎప్పుడూ ఆ ప్రీఫిక్స్ అవసరం రానివ్వకుండానే కెరీర్‌ని మలచుకుంది సోనాక్షి సిన్హా.. కేవలం తన టాలెంట్‌తోనే! సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ పాత్రల ఎంపికలో తన స్టయిల్ ప్రత్యేకమని చాటుకుంది. ఫ్యాషన్‌లోనూ ఆ స్టయిల్‌నే క్రియేట్ చేసుకున్న ఆమె ఫాలో అయ్యే బ్రాండ్స్ కొన్ని..‘ఎలాంటి సమస్యకైనా పనిని మించిన మందు లేదు. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. తీరిక సమయాల్లో నా కాలక్షేపం.. జిమ్‌లో గడపడం, పెయింటింగ్, స్కెచెస్ వేయడం, సినిమాలు చూడడమే! ఏకే – ఓకే... ఫ్యాన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలన్న అనామికా ఖన్నా తపనకు.. కోల్‌కతాలోని ఆమె డిజైనర్ స్టోర్ అద్దం పడుతోంది. భారతీయ సంప్రదాయ వస్త్రాల పద్ధతులకు పాశ్చాత్య ధోరణులను మిక్స్ చేసి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించడం అనామికా ప్రత్యేకత. అదే అమెను.. వారానికో డ్రెస్ కూడా అమ్ముడవని రోజుల నుంచి సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, దీపికా పడుకోణ్, ఐశ్వర్య రాయ్ లాంటి సెలబ్రిటీలు అనామికా డిజైనర్ వేర్లో ఒక్కసారైనా మెరిసిపోవాలని ఆశపడే స్థాయికి ఎదిగేలా చేసింది. ఆపై తన బ్రాండ్ నేమ్‌ని పలు దేశాలకూ విస్తరింపజేసి తిరుగులేని ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది. సామాన్యులు వీటి ధరలను అందుకోవడం కష్టమే. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. సోనాక్షి సిన్హా ధరించి ఏకే ఓకే డ్రస్ ధర రూ. 38,000/- క్యూరియో కాటేజ్.. ఇదొక మహిళల బ్రాండ్! ఇక్కడ పనిచేసేవారందరు కూడా మహిళలే! ఒకరకంగా చెప్పాలంటే మహిళల చేత మహిళల కోసం రూపుదిద్దుకున్న ప్రత్యేక బ్రాండ్ ఇది. అందుకే ఇక్కడ లభించే ఏ డిజైన్‌ను చూసినా వెంటనే ప్రేమలో పడిపోతారు. 1971లో ఏక్తా బఠీజా ప్రారంభించిన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రస్తుతం వారి మూడోతరం వారసులు అదే ప్యాషన్‌తో కొనసాగిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. సోనాక్షి సిన్హా ధరించిన జ్యూలరీ ధర రూ. 23,990/-, ఉండగం ధర రూ. 6,990/- ---దీపిక కొండి (చదవండి: అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?) -
బీచ్‌లో 'దబంగ్' భామ.. టైట్ డ్రస్‌లో శిల్ప!
జాన్వీ కపూర్ టెంప్టింగ్ పోజులు బీచ్ లో 'దబంగ్' బ్యూటీ హీరోయిన్ శిల్పా సెక్సీ స్టిల్స్ వైట్ అండ్ వైట్‌లో సారా అలీఖాన్ బెడ్‌పై పడుకుని కేజీఎఫ్ బ్యూటీ పోజులు రెండు జడలతో శ్రుతిహాసన్ ముద్దొచ్చేలా హీరోయిన్ సీరత్ కపూర్ ఎండలో సేదతీరుతున్న లవ్ లీ బ్యూటీ పెళ్లి కూతురిలా రాశీఖన్నా న్యూయార్క్ వీధుల్లో వర్షిణి వాకింగ్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shilpa Manjunath (@shilpamanjunathofficial) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) -
సహనటుడితో హీరోయిన్ డేటింగ్.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవలే దహాద్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. అయితే దబాంగ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత రౌడీ రాధోడ్ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. జూన్ 2న సోనాక్షి సిన్హా తన 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ తారలు శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి) అయితే ఆమె సహనటుడు జహీర్ ఇక్బాల్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై సోనాక్షి, జహీర్ ఎక్కడా నోరు విప్పలేదు. అయితే ఈ జంట పలు ఈవెంట్లలో కనిపించారు. దీంతో ప్రతిసారీ సోషల్ మీడియాలో రిలేషన్ షిప్‌పై గాసిప్స్ వినిపించాయి. తాజాగా సోనాక్షి సిన్హా పుట్టినరోజు సందర్భంగా జహీర్ చేసిన పోస్ట్ డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తోంది. బర్త్ డే విషెష్ చెబుతూనే 'ఐ లవ్ యూ' అంటూ నోట్లో రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆమెతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా.. గత నెలలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి సిన్హా సంబంధాన్ని దాదాపుగా ధృవీకరించారు. కాగా.. వీరిద్దరు కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. సోనాక్షి సిన్హా ప్రస్తుతం హర్రర్-కామెడీ చిత్రం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనుంది. ఆ తర్వాత నికితా రాయ్ మూవీ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో నటించనుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కూడా ఉన్నారు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన బెస్ట్ ఫ్రెండ్.. వైరలవుతున్న ఫోటోలు) View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్
వెండితెరపై మెరుపుతీగలా కనిపించే హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తే బొద్దుగా కనిపించడానికి కూడా వెనకాడరు. అందుకు తాజా ఉదాహరణ సోనాక్షీ సిన్హా, హ్యుమా ఖురేషీ. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘డబుల్ ఎక్స్ఎల్’ చిత్రం ఈరోజు రిలీజవుతోంది. అధిక బరువుతో హేళనకు గురయ్యే ఇద్దరి అమ్మాయిల కథతో ఈ సినిమా ఉంటుంది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఈ విషయాన్ని వినోదాత్మకంగా చెబుతూ చాలా జాగ్రత్తగా డీల్ చేశారట చిత్రదర్శకుడు సత్రమ్ రమణి. ‘బాడీ షేమింగ్’ తప్పనే సందేశం కూడా ఈ చిత్రంలో ఉంది. ఈ చిత్రం కోసం సోనాక్షి, హ్యూమా పదిహేనేసి కిలోల బరువు పెరిగారు. నిజానికి కెరీర్ ఆరంభంలో సోనాక్షి బొద్దుగానే ఉండేవారు. ‘దబాంగ్’ చిత్రంతో పరిచయం కాకమునుపు ఆమె దాదాపు 90 కిలోలు ఉంటే.. 30 కిలోలు తగ్గి ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అప్పటినుంచి దాదాపు అదే బరువుతో కొనసాగుతున్నారామె. ఇప్పుడు ‘డబుల్ ఎక్స్ఎల్’కి బరువు పెరిగిన విషయం గురించి సోనాక్షి మాట్లాడుతూ.. ‘‘బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా ఆరోగ్యకరమైన పద్ధతిలో అయితేనే సేఫ్. కానీ ‘డబుల్ ఎక్స్ఎల్’ నాకు అలా తగ్గేంత సమయం ఇవ్వలేదు. రెండే నెలల్లో పెరగాల్సి వచ్చంది. దాంతో ఏది పడితే అది తిన్నాను. ఎన్నో ఏళ్లుగా చేస్తూ వచ్చిన వర్కవుట్లు మానేశాను. ఫలితంగా 15 కిలోలు పెరిగాను. కానీ ఇలా పెరిగితే కష్టాలు తప్పవు. వర్కవుట్లు చేయకపోవడం అనేది శారీరకంగా, మానసికంగా నా ఒత్తిడిని పెంచింది. అంతకు ముందులా యాక్టివ్‌గా ఉండలేకపోయేదాన్ని. అదే కొంచెం సమయం తీసుకుని, ఆరోగ్యకరమైన పద్ధతిలో పెరిగి ఉంటే.. ఇలా ఉండేది కాదు. అందుకే తగ్గాలన్నా, పెరగాలన్నా పద్ధతి ప్రకారమే చేయండని సలహా ఇస్తున్నాను. ఇక, ఈ సినిమా పూర్తి కాగానే.. ఎక్కువ టైమ్ తీసుకుని, చక్కగా తగ్గడం మొదలుపెట్టాను. అది బాగా అనిపించింది’’ అన్నారు. హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ.. ‘‘అధిక బరువు అనేది అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పోగొడుతుంది. అయితే మనం ఎలా కనిపిస్తున్నాం అనేదాని కన్నా ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నామన్నదే ముఖ్యం. మన ప్రవర్తన బాగుంటే అదే అందం. అయితే ఆరోగ్యం కోసం తగ్గాలనుకుంటే తగ్గొచ్చు. ఎవరో ఏదో అంటారని కాదు. అమ్మాయిల బాడీ షేప్‌ని హేళన చేయడం సరికాదు. ఇక ఒక సినిమా కోసం బరువు పెరగడం అనేది ఓ సవాల్. ఆరోగ్యకరమైన పద్ధతిలో పెరగకపోతే కష్టాలు మాత్రం తప్పవు’’ అన్నారు. -
సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ కోసం సోనాక్షి డేరింగ్ స్టేప్!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా డేరింగ్ స్టేప్ తీసుకుంది. ‘ఆర్.. రాజ్‌కుమార్’, ‘దబాంగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలల్లో నటించి మెప్పించిన సోనాక్షికి ఇటీవల అవకాశాలు బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వేశ్య పాత్రలో నంటించేందుకు రేడి అయ్యింది. దీంతో ఈ సమయంలో సోనాక్షి ఇలాంటి డేరింగ్ స్టేప్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ భారీ స్థాయిలో ‘హీరా మండి’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో రెడ్‌లైట్ ఎరియా నేపథ్యంలో సెక్స్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వెబ్ సీరిస్ సాగనుంది. ఇందులో వేశ్య పాత్రలో నటించేందుకు సోనాక్షి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ పాత్రకు సంజయ్ లీలా భన్సాలీ సోనాక్షిని ఖరారు చేశారట. ఈ వెబ్ సిరీస్ కథ వివరించగానే సోనాక్షి తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను బట్టి మరు క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే ఇప్పటికే ఈ సిరీస్‌లో వేశ్య పాత్ర కోసం సీనియర్ నటి మాధురి దీక్షిత్, హ్యూమా ఖురేషిల పేర్లు తెరపై రాగా చివరకు హ్యూమా ఖురేషిని దర్శకుడు ఓకే చేశాడు. తాజాగా మరో ప్రధాన వేశ్య పాత్రకు సోనాక్షిని కూడా ఎంపిక చేశారు. ఇందులో సోనాక్షి కథక్ డ్యాన్సర్‌గా కనిపించనుండటంతో ఆమె కథక్ నేర్చుకునే పనిలో కూడా పడిందట. కాగా ఇది వరకు సోనాక్షి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చి ‘రౌడీ రాథోడో’ మూవీలో నటించింది. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం అలియా భట్ ‘గంగూభాయ్ కథియావాడి’ మూవీని తెరెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తెయిన అనంతరం ‘హీరా మండి’ని తెరకెక్కించే ప్లాన్ ఉన్నాడు. దీనికోసం ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ప్టిక్స్తో చర్చలు కూడా జరపుతున్నాడట. -
‘బంగార్రాజు’తో జతకట్టనున్న బాలీవుడ్ భామ!
కింగ్ నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్లో బంగార్రాజు మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. 2015లో విడుదలై ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. కింగ్ నాగార్జున డబుల్ రోల్ పోషించిన ఈ చిత్రం ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో బంగార్రాజు పాత్రకు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ ప్రాత పేరు మీద సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన దర్శకుడు ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఇటీవల స్క్రిప్ట్‌ను పూర్తి చేసిన దర్శకుడ అందులో కొన్ని మార్పులు చేసి కథ ఫైనల్ చేశాడట. ఇదిలా ఉండగా నాగార్జున సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్షాను కథానాయికగా తీసుకొవాలనుకుంటున్నారని, దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్లో వినికిడి. ఒకవేళ అంతా ఒకే అయితే ఇందులో బంగార్రాజుతో సోనాక్షి సిన్హా ఆడిపాడనుందట. దీంతో పాటు ఫీమేల్ లీడ్ రోల్ కాకపోయిన, ఓ స్పెషల్ రోల్ కోసమైన సోనాక్షిని సంప్రదించాలని డైరెక్ట్ భావిస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అనుకున్నట్లుగానే జూన్, జూలేలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తిసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. చదవండి: ఒక్క నెలలోనే 6కేజీలు తగ్గిన పాయల్.. ఏం చేసిందంటే.. అరియానా అసలు పేరు తెలుసా? నాగార్జునకు కూడా చెప్పలేదు! -
ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన హీరోయిన్
ముంబై: తనపై విపరీతంగా ట్రోల్స్‌పై చేస్తున్న నెటిజన్లపై తానే గెలిచానని హీరోయిన్ సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత వారం తన ట్విటర్ ఖాతాను డియాక్టివేట్ చేసినప్పటి నుంచి తనని మరింత ఎగతాలి చేస్తూ నెటిజన్లు ఫన్నీ మిమ్స్ క్రియోట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపై సోనాక్షి స్పందిస్తూ కేవలం ట్విటర్ నుంచి మాత్రమే తాను నిష్క్రమించానని.. ఇవి నిజమైన ట్రోల్స్ కాదంటూ నెటిజన్లకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు షేర్ చేస్తూ.. ‘కొంతమంది తాము ఏదో గెలిచినట్లు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. సరే నేను దానికి సంతోషిస్తాను. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎవరికి లాభం లేదు, నష్టం కూడా లేదు. ఇక మీరు ప్రత్యేక్షంగా చేసే విమర్శలు, అవమానాలకు కేంద్రమైన నా ట్విటర్ అకౌంట్ తీసేశాను. నన్ను, నా కుటుంబాన్ని, స్నేహితులను బాధ పెట్టాలనుకున్నారు. కానీ ఇకపై మీకు ఆ అవకాశం లేకుండా చేశాను. కాబట్టి ఇక్కడ గెలిచింది నేనే’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (ట్విటర్ అకౌంట్ డియాక్టివేట్ చేసిన హీరోయిన్!) తాను తన ట్విటర్ నుంచి వైదొలుగుతున్నట్లు గత వారం సొనాక్షి ప్రకటించారు. ‘‘తమ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి తెలివైన వారు మొదటగా వేసే అడుగు నెగిటివిటికీ దూరంగా ఉండటం. కాబట్టి నేను ట్విటర్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. అందుకని నా ఖాతాను తొలగిస్తున్నాను. గుడ్ బై గాయ్స్. ఇక ప్రశాంతంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. (‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’) View this post on Instagram How i got myself off twitter and away from the negativity 😂 Some people are celebrating like they won something... im happy for you, tumhe laga raha hai na... lagne do, kisi ko koi farak nahi padh raha. But lets face it, ive cut the direct source of insult and abuse in my life. Ive taken away YOUR power to be able to say whatever it is that you want to me, my family and my friends. Ive taken away that access you had to me, that i had given you so trustingly. So theres only one winner here. Me. Your negativity has never served me or my life, which is why it literally took a snap of a finger to get rid of a following of 16 million people which ive garnered over the last ten years. Just like that. And im better off for it. I wish all those haters and trolls lots of love and healing, or you can continue with the hate but please know it’ll NEVER reach me. Accha ab yeh chakkar mein i know the people who love me are caught up too... please know that your love and support is what has kept me going all this while, and it always will! And I request you all to keep spreading that love and light wherever you go and to as many people as you can. Because Love is the answer. Always ❤️ A post shared by Sonakshi Sinha (@aslisona) on Jun 21, 2020 at 8:11am PDT కాగా సుశాంత్ ఆత్మహత్యపై స్పందిస్తూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ పరిశ్రమలోనిప్రముఖులు, స్టార్‌కిడ్స్‌పై మండిపడుతూ ట్విటర్లో వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోనాక్షి స్పందిస్తూ..కొంత మంది సోదరభావంతో ఇతరుల మరణాలను కూడా ఫేమ్ కోసం వాడుకుంటున్నారు అంటూ కంగనాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అంతేగాక ఆభ్యంతరక వ్యాఖ్యలతో విమర్శలు చేయడంతో నెటిజన్లు సోనాక్షిపై విమర్శలు గుప్పిస్తూ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇక అవి తారాస్థాయికి చేరడంతో తన ట్విటర్ ఖాతాను సోనాక్షి గత శనివారం తోలగించారు. (ఎంతగా ప్రాధేయపడ్డాడో పాపం సుశాంత్..) -
‘అది తప్పే నిజాయితీగా ఒప్పుకుంటున్నా’
ముంబై: గతంలో చేసిన తప్పుకు ఇప్పటికీ విమర్శించడం తనని తీవ్రంగా బాధిస్తోందని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమానికి సోనాక్షి అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు రామయణానికి సంబంధించిన ప్రశ్న అడగడంతో దానికి ఆమె సమాధానం చెప్పలేకపోయారు. దీంతో మన సంస్కృతిని తెలిపే రామయణం గురించి తెలియకపోవడం సిగ్గుచేటు అంటూ ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. (‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’) ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సోనాక్షి మాట్లాడుతూ.. ‘నేను కౌన్ బనేగా కరోడ్ పతిలో రూపాదేవి అనే కంటెస్టెంట్‌తో కలిసి హాట్ సీట్లో పాల్గొన్నాను. అప్పుడు నన్ను రామయణంలో ఆంజనేయుడు ఎవరికి కోసం సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు అని అడిగిన ప్రశ్నకు ఆ క్షణం నా మైండ్ బ్లాక్ అయ్యింది. రూమా కూడా సమాధానం చెప్పలేక పోయింది. నిజం చెప్పాలంటే దానికి సమాధానం చెప్పలేకపోయినందుకు ఇబ్బందిగా అనిపించింది. అది తప్పే నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రామయణం చదువుతూ, వింటూ పెరిగినా కూడా సమాధానం చెప్పలేకపోవడం బాధకరం. అయితే ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ దీనిపై నన్ను ట్రోల్ చేయడం నిజంగా బాధిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. (రెండు రోజుల పని ఒక రోజులోనే పూర్తి: అమితాబ్) ఇక లాక్డౌన్ నేపథ్యలో గతంలోని రామయణం సీరియల్ పునఃప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా సోనాక్షి విమర్శలకు గురయ్యారు. దీనిపై సోనాక్షి మాట్లాడుతూ.. రామయణం అర్ధం చేసుకోవడంలో తనని విమర్శించిన వారంతా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎందుకంటే రామయణంలో రాముడు తల్లిదండ్రులకు మంచి కుమారుడు, మంచి భర్త, మంచి మానవుడు ఎలా ఉండాలో అందరికి ఆయన ఓ ఉదాహరణగా ఉంటాడు. ఇక రాముడి నుంచి మంచి నేర్చుకోకుండా వీరంతా నాపై విమర్శలు చేశారని అన్నారు. ఇకపై తాను ఈ విమర్శలను పటించుకోనని ఆమె స్పష్టం చేశారు. (‘ఈ జంట కటిఫ్ చెప్పేసుకున్నట్టేనా?!’) -
‘సోనాక్షి సల్మాన్ ఖాన్ చెంచా!’
ముంబై: బాలీవుడ్ ముద్దుగుమ్మ దబాంగ్ ఫేమ్ సోనాక్షి సిన్హా తనపై విమర్శలు చేసిన నెటిజన్లపై ఫైర్ అయింది. తనను సల్మాన్ ఖాన్ చంచా అని, నటించడం రాదని కేవలం మీ నాన్న సినిమా రంగంలో ఉండడం వల్లే అవకాశాలు వస్తున్నాయనే ఓ నెటిజన్ విమర్శలకు సోనాలి ఘాటైన సమాధానమిచ్చింది. తనకు నటన రాకుంటే 9 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో అవకాశాలు ఎందుకొచ్చాయంటూ ప్రశ్నించింది. మరికొందరు నెటిజన్లు లావుగా ఉన్నావంటూ.. ఆమె టీవీలో కనిపిస్తే టీవీనే పగలగొడుతానని, సోనాక్షిని తీవ్రంగా ద్వేషిస్తానని అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేయగా వాటికి దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ వ్యాఖ్యలపై సోనాక్షి స్పందిస్తూ.. మీరు టీవీని పగలగొడుతున్నారంటే మీకు డబ్బులు ఎక్కువగా ఉన్నావనుకుంటా నచ్చకుంటే టీవీని ఆపేయవచ్చు..అంతేగానీ పగలగొట్టాల్సిన అవసరం లేదని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు జోడిగా సోనాక్షి దబాంగ్ 3లో నటిస్తుండగా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలవుతున్న విషయం తెలిసిందే. -
సోనాక్షి ఫోటోషూట్ తళుకులు
ముంబై : దబాంగ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు సోనాక్షి సిన్హా. మొదటి సినిమాతోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో జతకట్టి ఈ బ్యూటీ భారీ విజయాన్నితన ఖాతాలో వేసుకున్నారు. ఎల్లప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటూ, తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పడు అభిమానులతో షేర్ చేస్తుంటారు ఈ బొద్దుగుమ్మ. ఈ క్రమంలో ఇటీవల ఓ ఆన్లైన్ షాపింగ్ ప్రచార కార్యక్రమం ఫోటో షూట్లో దిగిన చిత్రాలను సోనాక్షి బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘బ్లాక్ మ్యాజిక్ వుమెన్’ అనే క్యాప్షన్ జతచేర్చారు. ఈ ఫోటోలో ఆఫ్ షోల్డర్తో ధరించిన నల్లని దుస్తుల్లో, విరబోసిన కురులతో సోనాక్షి అందాలను ఆరబోశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ గ్లామర్ ఫోటోలు తన అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. హాట్ లుక్స్‌తో మెరిసిపోతున్న సోనాక్షిని ఫ్యాఫన్ క్వీన్‌గా చెప్పవచ్చు. కాగా ప్రస్తుతం సోనాక్షి దబాంగ్-3 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. View this post on Instagram Black magic woman! For the @myntrafashionsuperstar promo shoot! Styled by @mohitrai @miloni_s91 (tap for deets), hair by @themadhurinakhale, makeup @mehakoberoi and photos by @saurabhdalvi_photography 🖤 A post shared by Sonakshi Sinha (@aslisona) on Sep 11, 2019 at 6:24am PDT -
‘మిషన్ మంగళ్’పై కిషన్ రెడ్డి రివ్యూ!
ముంబై: ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రేక్షకులను అలరించేందుకు ‘మిషన్ మంగళ్’ సినిమా సిద్ధమవుతోంది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌కుమార్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరి, నిత్యమీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మిషన్ మంగళ్’ గురువారం (ఆగస్టు 15న) ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఒకింత దేశభక్తి నేపథ్యంలో ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ప్రాజెక్టు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. జగన్ శక్తి దర్శకత్వంలో ఆర్ బాల్కీ రచన, పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి అప్పుడే పాజిటివ్ టాక్ మొదలైంది. ఆదివారం ఢిల్లీలో ఈ సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ చూసినవారిలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు సెలబ్రెటీలు ఉన్నారు. ఈ సినిమా తమకు చాలా బాగా నచ్చిందని, సినిమా అద్భుతంగా ఉందని ఈ స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించిన ప్రముఖులతోపాటు పలువురు నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. సినిమాకు సర్వత్రా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ‘ఓ చక్కని రోజును ఆసక్తికరంగా ముగించాను. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హాతోపాటు ఇతర చిత్రయూనిట్‌తో కలిసి ‘మిషన్ మంగళ్’ ప్రివ్యూ చూడటం అమేజింగ్‌గా అనిపించింది. సినిమాను బాగా తెరకెక్కించారు. ఇస్రో ఘనతను, విజయాలను అద్భుతంగా చూపించారు’ అని కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. What an interesting way to end a good day! Had an amazing time watching the preview of the movie #MissionMangalyaan along with the movie leads @AkshayKumar, @Sonakshisinha, and other cast & crew members. It's a movie very well shot, to depict the glory of @isro and its success. pic.twitter.com/biSSpRhttD — G Kishan Reddy (@kishanreddybjp) August 13, 2019 -
ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అంటే చాలు.. చాలా మంది నటులు పెద్దగా ఉత్సాహం చూపరు. కొందరు సినిమా అంగీకరించడానికి ముందే ప్రమోషన్ కార్యక్రమాల్లో తాము పాల్గొనమని ఒప్పందం చేసుకుంటారు. కానీ బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ మాత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. తోటి నటులతో కూడా చాలా సరదాగా ఉంటారు. ప్రస్తుతం అక్షయ్ అండ్ టీమ్ మిషన్ మంగళ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రమోషన్ కార్యక్రమంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. హీరోయిన్ సోనాక్షి సిన్హా, అక్షయ్‌ని కింద పడేసింది. ‘మిషన్ మంగళ్’ ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హీరోయిన్లు నిత్యా మీనన్, తాప్సీ, విద్యాబాలన్, కీర్తి కుల్హరి, సోనాక్షి సిన్హా, అక్షయ్ కుమార్ హాజరయ్యారు. వీరంతా కూర్చొని చిత్రానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు.ఈ క్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. కుర్చీతో పాటు వెనక్కి వాలాడు. అప్పుడు పక్కనే ఉన్న సోనాక్షి.. అక్షయ్ ఛాతిపై చేత్తో కొట్టింది. దాంతో అక్షయ్ కుర్చీతో సహా వెనక్కి పడిపోయాడు. అతను పడిపోతుండగా తాప్సీ పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం లేకపోయింది. అక్షయ్‌ని చూసి అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురవగా.. సోనాక్షి మాత్రం పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. అక్షయ్ సైతం దీన్ని సరదాగా తీసుకొని సోనాక్షి వైపు చేయి చూపుతూ ఏంటిది అన్నట్లుగా ఓ ఎక్స్ప్రెషన్ పెట్టడంతో మిగతావారూ నవ్వడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. జగన్ శక్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ మంగళ్’. భారతదేశం చేసిన మిషిన్ మార్స్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. -
‘ఆ సెలబ్రిటీతో డేటింగ్ చేశా’
ముంబై : బాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్లలో ముందువరుసలో నిలిచే సోనాక్షి సిన్హా తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారిగా పెదవివిప్పారు. తాను గతంలో ఓ సెలబ్రిటీతో డేటింగ్లో ఉన్నానని, తమ ప్రేమ వ్యవహారం గురించి ఎవరికీ తెలియదని వెల్లడించారు. సినీ ఇండస్ర్టీ వ్యక్తితో ఎవరితోనైనా డేటింగ్ చేశారా అని సోనాక్షిని ఓ చాట్ షోలో ప్రశ్నించగా ఓ మంచి యువకుడితో తాను డేటింగ్ చేయాలని సినీ పరిశ్రమలోనే ఏ ఒక్కరూ భావించని రీతిలో తన తల్లితండ్రులు కోరుకున్నారని చెప్పుకొచ్చారు. గతంలో సినీ పరిశ్రమకు చెందిన ఓ సెలబ్రిటీతో తన ప్రేమ వ్యవహారం గురించి ఆమె వెల్లడించారు. అయితే తమ డేటింగ్ గురించి ఎవరికీ తెలియదని చెప్పిన సోనాక్షి ఆ సెలబ్రిటీ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. రిలేషన్షిప్లో మోసాలను మాత్రం తాను సహించనని ఆమె తేల్చిచెప్పారు. తనను తన భాగస్వామి మోసం చేస్తే మరుసటి రోజును అతడు చూడలేడని చెప్పడం గమనార్హం. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పారు. -
మిల మిల మెరిసే మీనాక్షి!
సోనాక్షి సిన్హా నటి మాత్రమే కాదు...చక్కగా బొమ్మలు గీస్తుంది. అంతకంటే చక్కగా పాడుతుంది. ‘దబాంగ్–3’లో ‘రజ్జో పాండే’గా మరోసారి అలరించనుంది. ‘సంతోషం సగం బలం... ఆ బలం పనిలోనే ఉంది’ అంటున్న సోనాక్షి చెప్పిన కొన్ని ముచ్చట్లు... గొప్ప ఔషధం ఎలాంటి సమస్య నుంచి బయట పడడానికైనా ఒక ఔషధం ఉంది. అదే పని! పనిలో తలమునకలైపోతే ఎలాంటి సమస్యను అయినా అధిగమించవచ్చు. ఇది నేను సొంత అనుభవంతో చెబుతున్న మాట. తీరిక సమయాల్లో జిమ్‌లో గడపడం, పెయింటింగ్, స్కెచ్చింగ్ వేయడం, సినిమాలు చూడడంలాంటివి చేస్తుంటాను. ఆత్మవిశ్వాసం వుమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని ఉంది. ‘అకిరా’ సినిమా తరువాత ఆచితూచి పాత్రలు ఎంచుకుంటున్నాను. టైటిల్ రోల్ పోషించిన నా సోలో ఫిల్మ్ ఇది. ఇది నాలోని ‘స్కిల్స్’ని నాకు తెలియజేసిన సినిమా. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సినిమా. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని ఉంది. చాలెంజింగ్‌గా ఉండే స్క్రిప్ట్‌లను ఇష్టపడతాను. అప్పుడు మనలో మరోకోణం పరిచయమవుతుంది. మల్టీస్టారర్ సినిమాలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం వల్ల నటులలో అభద్రతాభావం తలెత్తితే...హాలీవుడ్లోగానీ, బాలీవుడ్లోగానీ ఎన్నో మంచి సినిమాలు వచ్చి ఉండేవి కావు. నాకు అలాంటి భయాలేమీ లేవు. ‘కళంక్’ సినిమాలో మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, ఆలియా భట్, వరుణ్‌లతో నటించడం మంచి అనుభవం! సంతోషం జీవితంలో నా మొదటి ప్రాధాన్యత...ఎప్పుడూ సంతోషంగా ఉండడం! నేను సంతోçషంగా ఉండడం ఎంత ముఖ్యమో అవతలి వ్యక్తిని సంతోషంగా ఉంచడం అంతే ముఖ్యమని నమ్ముతాను. సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రభావం చేసే పని మీద పడి చురుగ్గా ఉండగలుగుతాం. చదువు చదివిన చదువు ఎప్పుడూ వృథా పోదు. నటి కావడానికి ముందు మూడు సంవత్సరాలు ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నది ఇప్పుడు ఏదో ఒకచోట ఉపయోగ పడుతూనే ఉంది. ఉదాహరణకు సెట్లో ఉన్నప్పుడు ‘క్విక్ అల్టరేషన్’ అవసరమైంది అనుకోండి... సై్టలిస్ట్లు, డిజైనర్లకు ఏంచేయాలో చెబుతాను. ఇది నా వృత్తిలో భాగం అనుకుంటాను. -
ఆలియా ఓటు వేయదట ఎందుకంటే..
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయబోనని చెబుతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్. తన దగ్గర ఇండియన్ పాస్ పోర్టు లేదని అందుకే ఓటు వేయలేకపోతున్నానని చెప్పింది. వరుణ్ ధావన్, అలియా భట్ లీడ్ రోల్స్‌లో వస్తున్న తాజా చిత్రం 'కళంక్. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తున్నారు. కళంక్ టీంతో ఇండియా టూడే ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రభావం మీపై ఎలా ఉంది అని ప్రశ్నించగా.. వరుణ్, సోనాక్షి, ఆదిత్యలు ఓటు వేయడం మా బాధ్యత అని చెప్పారు. ఇక ఆలియానును అడగ్గా తాను ఓటు వేయలేనని చెప్పింది. తనకు ఇండియన్ పాస్‌పోర్టు లేదని అందుకే ఓటు వేయలేనని సెలవిచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. ఆలియా భట్ బ్రిటీష్ పౌరురాలు అందుకే ఆమెకు భారత్‌లో ఓటు హక్కులేదు. అభిషేక్ వర్మ డైరక్ట్ చేస్తున్న ‘కళంక్’ మూవీని కరణ్ జోహర్, సాజిద్ల నదియావాలా, ఫాక్స్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మాధురి దీక్షిత్, సంజయ్ దత్, సోనాక్షి సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ లు నటిస్తున్నారు. ఏప్రిల్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. -
శ్రీదేవి గర్వపడేలా చేయాలనుకున్నా
‘‘శ్రీదేవి చనిపోయి ఏడాది పూర్తయింది. కానీ శ్రీదేవి మన మధ్య లేరు అనే వాస్తవాన్ని అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం శ్రీదేవి చేయాల్సిన ఓ పాత్రను నేను చేయడం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. శ్రీదేవి గర్వపడేలా చేస్తాననే అనుకుంటున్నాను’’ అని మాధురీ దీక్షిత్ అన్నారు. కరణ్ జోహార్ నిర్మాణంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, ఆలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో అభిషేక్ వర్మన్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘కళంక్’. ఇందులో మాధురి పోషిస్తున్న పాత్రను మొదట శ్రీదేవి చేయాలి. కానీ శ్రీదేవి అకాల మరణంతో ఆ పాత్ర మాధురికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి మాధురి మాట్లాడుతూ – ‘‘ఈ పాత్ర కోసం కరణ్ నన్ను సంప్రదించగానే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. శ్రీ, నేను చివరిసారిగా డిజైనర్ మనీష్ మల్హోత్రా బర్త్‌డే పార్టీలో కలుసు కున్నాం. ఆ పార్టీలో పిల్లలిద్దరితో (జాన్వీ, ఖుషీ) సంతోషంగా కనిపించింది. సడన్‌గా శ్రీదేవి చనిపోవడం బాధగా అనిపించింది. తన మరణంతో జీవితం చాలా చిన్నది అనే విషయాన్ని తెలుసుకున్నాను. ప్రతిరోజుని ఆస్వాదించాలి, ఆనందించాలి అని తెలుసుకున్నాను. ఎందుకంటే రేపు ఏమవుతుందో మనం ఎవ్వరం ఊహించలేం’’ అని అన్నారు. ‘కళంక్’ ఈ ఏడాది రిలీజ్ కానుంది. -
చీటింగ్ ఆరోపణలపై స్పందించిన సోనాక్షి బృందం
సాక్షి, న్యూఢిల్లీ : ఈవెంట్లో పాల్గొనేందుకు డబ్బులు తీసుకుని చివరి నిమిషంలో హాజరయ్యేందుకు నిరాకరించారంటూ ఓ ఈవెంట్ నిర్వాహకుడి ఫిర్యాదుతో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సహా మరో నలుగురిపై చీటింగ్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. అయితే తాము ఎన్ని సార్లు గుర్తు చేసినా సోనాక్షికి ముందుగా చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని ఈవెంట్ నిర్వాహకుడిపై సోనాక్షి సిన్హా ఏజెన్సీ ఆరోపించింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈవెంట్లో పాల్గొనేందుకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి పలుమార్లు గుర్తుచేసినా నిర్వాహకులు సోనాక్షికి డబ్బు చెల్లించకపోవడంతో పాటు చివరికి తప్పుడు ప్రచారం చేసుకునేందుకు వారు ప్రస్తుతం మీడియాను వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించకపోవడంతో పాటు ఈవెంట్ ముగియగానే సోనాక్షి, ఆమె బృందానికి తిరుగు ప్రయాణం టికెట్లు పంపలేదని సోనాక్షి సిన్హా ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. నిర్వాహకులు స్పందించకపోవడంతో సోనాక్షి, ఆమె బృందం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వెనుతిరిగిందని సోనాక్షి ప్రచార వ్యవహారాలు పర్యవేక్షించే ఏజెన్సీ పేర్కొంది. అయితే ఈవెంట్‌ను మరోసారి నిర్వహించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలపై పలుసార్లు నిర్వాహకులతో తాము కోరినా వారి నుంచి స్పందల లేదని సోనాక్షి మేనేజ్మెంట్ టీం ఆవేదన వ్యక్తం చేసింది.తమపై దుష్ర్పచారం మానకుంటే సోనాక్షి సహా ఆమె బృందం చట్టపరమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది -
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై ఎఫ్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ ఈవెంట్ సంస్ధ నుంచి డబ్బులు తీసుకుని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సదరు కార్యక్రమానికి గైర్హాజరు కాకపోవడంతో నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోనాక్షి సహా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోనాక్షి సిన్హా గత ఏడాది సెప్టెంబర్ 30న కార్యక్రమానికి హాజరయ్యేందుకు రూ 37 లక్షలు తీసుకున్నారని, అయితే చివరినిమిషంలో ఈవెంట్లో ఆమె పాల్గొనలేదని ఆరోపిస్తూ ఆర్గనైజర్లు ఫిర్యాదు చేయడంతో సోనాక్షి సహా ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో బాలీవుడ్ నటితో పాటు అభిషేక్ సిన్హా, మాళవిక పంజాబి, ధుమిల్ ఠక్కర్, ఎద్గార్‌ల పేర్లు పొందుపరిచామని మొరదాబాద్ డీఎస్పీ గజ్రాజ్ సింగ్ తెలిపారు. ఈవెంట్ నిర్వాహకుల ఫిర్యాదుపై తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. -
వచ్చే ఏడాది వస్తాం
...అంటున్నారు సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా. ఎక్కడికి అంటే.. థియేటర్స్‌లోకి. ‘దబంగ్’తో తొలిసారి ఈ ఇద్దరూ జత కట్టారు. సోనాక్షీకి అది తొలి సినిమా. ఫస్ట్ సినిమాకే సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఓ సూపర్ హిట్‌ని ఖాతాలో వేసుకోవడంతో ‘దబంగ్’ సోనాక్షీకి ఓ తీపి గుర్తు. ఎనిమిదేళ్ల క్రితం రూపొందిన ఈ చిత్రానికి ఆరేళ్ల క్రితం సీక్వెల్ వచ్చింది. ఇప్పుడు మూడో భాగానికి రెడీ అయ్యారు. ఫస్ట్ పార్ట్‌కి అభినవ్ కశ్యప్, సెకండ్ పార్ట్‌కి సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. మూడో భాగానికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘వచ్చే ఏడాది ‘దబాంగ్ 3’తో మేం మీ ముందుకు వస్తాం’’ అని సల్మాన్, సోనాక్షీ పేర్కొన్నారు. కాగా, తొమ్మిదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ హీరోగా తెలుగు ‘పోకిరి’ హిందీ రీమేక్ ‘వాంటెడ్’కి దర్శకత్వం వహించారు. హిందీలో దర్శకుడిగా ప్రభుదేవాకి అది తొలి సినిమా. ‘వాంటెడ్’ సూపర్ హిట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత ‘దబంగ్ 3’తో మరో సూపర్ హిట్‌కి రెడీ అయ్యారు. -
‘హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగీ’ టీజర్
-
పారిపోయిన పెళ్లికూతురి కోసం..!
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దబాంగ్ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్తో వెండితెరకు పరిచయం అయిన సోనాక్షి తరువాత సినిమాల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తున్నారు. కేవలం గ్లామర్‌షోకు పరిమితమైపోకుండా నటనకు అవకాశమున్న పాత్రల్లో ఆకట్టుకుంటున్నారు. అదే బాటలో త్వరలో హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగీ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తుండగా ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పారిపోయిన పెళ్లికూతురు హ్యాపి సోనాక్షి అనుకొని ఆమెను పట్టుకోవటం తరువాత నిజం తెలుసుకోని హ్యాపిని పట్టుకునేందుకు సోనాక్షి సాయం చేయటం అనే కథతో ఈ సినిమా రూపొందుతోంది. డయానపెంటీ, పియూష్ మిశ్రా, జిమ్ శెర్గిల్, అభయ్ డియోల్ అలీ ఫజల్‌లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
హైదరాబాద్‌కు తరలిరానున్న తారాలోకం
హైదరాబాద్‌లో వేసవిని కూల్ చేయడానికి బాలీవుడ్ స్టార్స్ తరలి రానున్నారు. మే నెలలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హైదరాబాద్‌లో ‘ద -బాంగ్’ పేరుతో ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఈవెంట్... లూనెట్టీస్ సంస్థ ఆధ్వర్యంలో జరుగనుంది. లూనెట్టీస్ సమర్పిస్తున్న ది ద-బాంగ్ టూర్‌ను సోహాలీ ఖాన్ ఎంటర్టైన్మెంట్, జేఏ సంయుక్తంగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా, జాక్వలిస్ ఫెర్నాండెజ్, డైసీ షా, ప్రభుదవ, గురు రంధ్వా తదితరులు ‘ది ద-బాంగ్’ టూర్లో భాగం కానున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 120 మందికి పైగా నృత్య కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. మే 12 గచ్చిబౌలీలో ఈవెంట్‌ను ప్లాన్ చేయనున్నట్లు చీఫ్ ఆర్గనైజర్ ఫర్హాన్ హుస్సేన్ తెలిపారు. వీటికి సంబంధించిన ఎంట్రీ పాసులు మేరా ఈవెంట్స్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రౌండ్ ఔట్లెట్లలో లభిస్తాయని తెలిపారు. -
దబాంగ్ 3 డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలలో దబాంగ్‌ది ప్రత్యేక స్థానం. 2010లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సల్మాన్ స్టామినా చాటిచెప్పింది. ఆ తర్వాత వచ్చిన దబాంగ్ 2 కూడా సల్మాన్‌కి మంచి విజయాన్ని అందించింది. తాజాగా దబాంగ్ 3 నిర్మిస్తున్నట్టు వార్తలు రావడంతో ఆ సినిమా విశేషాలపై ఆసక్తి నెలకొంది. ఈ సీరిస్‌లో విడుదలైన సినిమాలు భారీగా కలెక్షన్లు రాబట్టడంతో, తాజా సినిమాపై పెద్ద ఎత్తున్న అంచనాలు నెలకొన్నాయి. దబాంగ్, దబాంగ్ 2 లలో సల్మాన్‌కు జోడిగా సోనాక్షి సిన్హా నటించారు. ఈ రెండింటిని నిర్మించిన సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్, తాజా చిత్రానికి కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. దబాంగ్‌కు అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, దబాంగ్ 2 కి అర్భాజ్ ఖాన్ ఆ బాధ్యతలు చేపట్టారు. తాజా చిత్రంపై అంచనాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో దర్శకుడు ఎవరనేది తెలుసుకోవడానికి అందరు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటన్నింటికి ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభుదేవా తెరదించారు. ఈ సినిమాకు తనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. రెండు సినిమాలకు పనిచేసిన హీరోయిన్ సోనాక్షి, మ్యూజిక్ అందించిన సాజిద్-వాజిద్లతో పాటు, ఇతర బృందం అంత పాతదే ఉంటుందని, తాను ఒక్కన్ని మాత్రమే కొత్తగా చేరుతున్నానని తెలిపారు. సల్మాన్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఒదులుకొవడానికి ఎవరు సిద్ధపడరని ఆయన అన్నారు. సినిమా హిట్, ప్లాఫ్ అనేది హీరో భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి, కానీ సల్మాన్‌కి వాటితో ఏ మాత్రం సంబంధం లేని సూపర్‌స్టార్ అని పేర్కొన్నారు. గతంలో ప్రభుదేవా సల్మాన్ నటించిన వాంటెడ్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మహేశ్‌బాబు నటించిన తెలుగు మూవీ పోకిరి రిమేక్. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబట్టడంతో, దబాంగ్ 3పై అంచనాలు మరింతగా పెరగనున్నాయి. -
స్పూఫ్ ఆఫ్ బాలీవుడ్
‘వెలకమ్ టు న్యూయార్క్’... ఐఫా అవార్డ్స్ మీద వచ్చిన స్పూఫ్ అని చెప్పొచ్చు. వెంకటేష్, కమల్‌హసన్ నటించిన ‘ఈనాడు’ సినిమా దర్శకుడు చక్రి తోలేటి నిర్దేశకత్వంలో వచ్చిన చిత్రం వెల్కమ్ టు న్యూయార్క్. నిజానికిది పారిస్ ఫ్యాషన్ వీక్ మీద రాబర్ట్ అల్ట్మన్ తీసిన ‘ప్రెట్ ఎ పోర్టర్’ సినిమాకు రీమేక్ లాంటిదని చెప్పొచ్చు. ఫ్యాషన్ వీక్ చోట ఐఫా అవార్డ్ ఫంక్షన్ ఉంది అంతే. కథ.. సోఫియా (లారా దత్తా) ఐఫా అవార్డ్స్ ఈవెంట్‌ను నిర్వహించే సంస్థ ఎంప్లాయి. గ్యారీ (బొమన్ ఇరానీ) ఆమె బాస్. పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా అహోరాత్రులు కష్టపడి ఆ సంస్థను నిలబెడుతుంది. అంత కష్టపడ్డా తనకు రావల్సిన వాటా ఇవ్వడు గ్యారీ. ఈసారి జరగబోయే ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ ఫెయిల్ చేసి కక్ష తీర్చుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే ఇండియాలో టాలెంట్ సెర్చ్ పెట్టి జీనల్ పటేల్ (సోనాక్షి సిన్హా), తేజి (దిల్జిత్)లను ఎంపిక చేస్తుంది. వాళ్లు గొప్ప ప్రతిభావంతులని కాదు.. ఎందుకూ పనికిరారని. ఇంతకీ ఆ ఇద్దరికున్న టాలెంట్ ఏంటీ? జీనల్ పటేల్.. యాంబిషియస్ గుజ్జి గర్ల్. డ్రెస్ డిజైనర్. గొప్ప డిజైనర్‌గా పేరు తెచ్చుకోవాలని.. ఎలాగైనా సరే బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారాలని కలలు కంటుంది.. కష్టపడుతుంటుంది. తేజీ విషయానికి వస్తే.. రికవరీ ఏజెంట్. యాక్టింగ్ అంటే పిచ్చి. అద్దాన్ని చూస్తే అతనిలో ఉన్న నటుడు నిద్రలేస్తాడు. బాలీవుడ్‌లోని నటులను అనుకరిస్తూ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. జీనల్ డ్రెస్ డిజైనింగ్, తేజ్ నటనతో పంపిన వీడియోలను ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ చేసేస్తారు. తన బాస్ మీద రివేంజ్ తీసుకోదల్చిన సోఫియా వాటిని ఏరి ఓకే చేస్తుంది. న్యూయార్క్‌లో జరగబోయే ఐఫా అవార్డ్స్‌కు టికెట్స్, హోటల్ గదులు బుక్ చేసి వాళ్లకు ఆహ్వానం పంపుతుంది. ఇంకో వైపు.. ఈ అవార్డ్స్ ఫంక్షన్‌కు యాంకర్స్‌గా కరణ్ జోహార్, రితేష్ దేశ్‌ముఖ్‌లను పిలుస్తారు. కరణ్‌జోహార్.. ఫ్యాషన్ ఫ్రీక్.. బ్రాండ్స్ అంటే పడి చస్తుంటాడు. అయితే కరణ్‌కు ఓ కవల సోదరుడు ఉంటాడు. అతని పేరు అర్జున్. న్యూయార్క్‌లో అతనో గ్యాంగ్‌స్టర్. కరణ్ జోహార్ తీసిన కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్ వంటి సినిమా అభిమానులు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్, మ్యాన్ హటన్ లాంటి వీథుల్లో అర్జున్ తిరుగుతుంటే జనాలు భయపడకపోగా.. కరణ్.. కరణ్ అంటూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల కోసం వెంటపడుతుంటారు. ఇది అర్జున్‌కు చాలా కోపం తెప్పిస్తుంది. తన దందాను పాడు చేస్తున్నాడు అని కరణ్ మీద చిరాకు కలుగుతుంది. ఎలాగైనా కరణ్‌ను చంపాలనుకుంటాడు. ఐఫా అవార్డ్స్‌కు న్యూయార్క్ వస్తున్నాడని తెలుసుకొని ఆ టైమ్‌ను వినియోగించుకోవాలనుకుంటాడు. కాని కథ అడ్డం తిరిగి అర్జున్ ప్లాన్ పాడవుతుంది. అతను కటకటాల్లో చిక్కుకుంటాడు. కరణ్, రితేష్‌తో కలిసి హోస్ట్ చేసి ఐఫా అవార్డ్ ఫంక్షన్‌ను హిట్ చేస్తాడు. ఆ షోను వరెస్ట్ షోగా చూపించాలనుకున్న సోఫియా కుట్రను అర్థం చేసుకున్న జీనల్, తేజీలు అలా కానివ్వకుండా నిజంగానే తమ టాలెంట్‌ను చూపిస్తారు. సల్మాన్‌కు డ్రెస్ డిజైన్ చేసి జీనల్, షోలో తన అభినయ కౌశలం చూపించి తేజీలు తమలో ప్రతిభ ఉందని రుజువు చేస్తారు. టీవీ షోకి కొనసాగింపుగా.. సినిమా అవార్డుల ప్రదానోత్సవ వేడుకల వెనక ఉన్న డ్రామా, డబ్బు వంటి విషయాలను హాస్యరసప్రధానంగా తెరకెక్కించే ప్రయత్నమే వెల్కమ్ టు న్యూయార్క్. కరణ్ జోహార్ తన సినిమాల మీద తానే సెటైర్ వేసుకుంటుంటాడు. బాలీవుడ్ స్టార్స్ మీద వ్యంగ్యోక్తులూ ఉన్నాయి. అయితే ఈమాత్రం టీవీ షోల్లో, టీవీల్లోనే ప్రసారమయ్యే స్టాండప్ కామెడీ షోలో చాలా కనపడుతున్నాయి. దీన్ని సినిమాగా తీస్తున్నప్పుడు చక్రీ తోలేటి ఇంకాస్త పకడ్బందీ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను పెట్టుకుంటే బాగుండేది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి తెలుగువారికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. – శరాది -
బ్యాట్ పట్టేదేవరు?
యస్.. బ్యాట్ పట్టి క్రీజ్‌లో బాదేదెవరు? గ్రౌండ్లో ఆపోజిట్ టీమ్‌ని పరిగెత్తించేదెవరు? తాప్సీనా లేక సోనాక్షి సిన్హానా? వీరిద్దరిలో ఎవరు?... ఇదిగో ఇలాంటి చర్చే ప్రస్తుతం బాలీవుడ్లో జరుగుతోంది. ఇంతకీ అసలు కహానీ ఏంటంటే.. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బయోపిక్స్ మంత్రం ఎలా వర్క్ అవుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. లేటెస్ట్గా ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబైలోని ఓ ప్రముఖ నిర్మాణసంస్థ ఆల్రెడీ రైట్స్‌ను దక్కించుకున్నారట. అయితే మిథాలీ పాత్రకు సోనాక్షి సిన్హా, తాప్సీలను ఆ నిర్మాణ సంస్థ సంప్రదించారని బాలీవుడ్ టాక్. ఆల్రెడీ సందీప్‌సింగ్ బయోపిక్‌లో తాప్సీ హాకీ ప్లేయర్‌గా నటించారు. సో... తాప్సీనే ఫైనల్‌గా ఫిక్స్ అవుతారని కొందరు అంటుంటే.. లేదు..లేదు.. సోనాక్షి సిన్హానే సెలక్ట్ అవుతారని మరికొందరు అంటున్నారు. తాప్సీ బ్యాట్ పట్టుకుంటారా లేక తొలి బయోపిక్ కోసం సోనాక్షి బ్యాట్ పట్టుకుంటారా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. -
మెరుపులా మెరిసి..
రానా కేవలం తెలుగు హీరోనే కాదు. టాలీవుడ్, బాలీవుడ్ అటు తమిళం కూడా కవర్ చేస్తూ బిజీగా ఉన్న నటుడు. కథ బావుంటే హీరో, విలన్ అని పట్టించుకోరు. సినిమాలో తన స్క్రీన్ టైమ్ ఎంత సేపు అని కూడా ఆలోచించరు. అతిథి పాత్రలో ఇలా కనిపించి అలా మాయమవుతుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ మెరుపులా మెరుస్తా అంటున్నారు రానా. చక్రి తోలేటి దర్శకత్వంలో సోనాక్షి సిన్హా, కరణ్ జోహార్, రితేష్ దేశ్‌ముఖ్, బొమన్ ఇరానీ ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న సినిమా ‘వెల్కమ్ న్యూయార్క్’. ప్రస్తుతం రానా ‘మడై తిరందు’, ‘హాతీ మేరా సాథీ’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘వెల్కమ్ న్యూయార్క్’ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. -
కుంచెతో కుస్తీ పడతా
మనందరం ఖాళీ సమయాల్లో ఏం చేస్తాం? పుస్తకాలు చదువుతాం, లేదా సినిమాలు చూస్తాం. లేదా వేరే ఏదైనా చేస్తాం. మరి మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? అనే ప్రశ్నను సోనాక్షీ సిన్హా ముందుంచితే – ‘‘కుంచె పట్టుకొని బొమ్మలు గీసేస్తా అంటున్నారు. చిన్నప్పుడు నా బుక్స్ నిండా చిన్న చిన్న బొమ్మలే ఉండేవి. నేను చిన్నప్పటి నుంచి బొమ్మలు బాగా గీసేదాన్ని. సంవత్సరం క్రితం నుంచి స్కెచ్‌లు మరియు కలర్స్‌తో ప్రయోగాలు మొదలెట్టాను. ఈ మధ్యనే అబస్ట్రాక్ట్ ఆర్ట్ (ఆకారం లేకుండా రంగులతో భావ వ్యక్తీకరణ చేసే కళ)తో మొదలెట్టి యానిమల్స్, ఉమెన్ ఫేస్‌లు గీస్తున్నా. రీసెంట్గా నేను గీసిన బొమ్మలను బ్రెస్ట్ క్యాన్సర్ భాదితుల విరాళం కోసం వేలం వేశాను. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి స్వచ్ఛంద సేవల కోసం నా డ్రాయింగ్స్ వాడదలుచుకున్నాను. బొమ్మలు గీయటం నాకు ఓ మెడిటేషన్ లాంటిది. ఈ మధ్య నా స్నేహితులకు నేను గీసిన పెయింటింగ్స్ బహుమతిగా ఇచ్చాను. ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలిసిపోయి ‘మాకో గిఫ్ట్ ప్లీజ్’ అంటున్నారు. వాళ్ళ కోసమైనా తరచుగా గీయాల్సి వస్తోంది’’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. -
ప్యారీ పరిణీతీ... టిప్స్ చెప్పవా?
...అనడుగుతున్నారట సోనాక్షీ సిన్హా! ఇంతకీ, ఏం టిప్స్ అడుగుతున్నారు? అంటే... వెయిట్ లాస్ టిప్స్ అట! ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? సోనాక్షి బొద్దుగా ఉన్నా... బీటౌన్ ప్రేక్షకుల అభిమానం బాగుంది కదా! అనే సందేహం రావొచ్చు. అయితే... మరింత స్లిమ్ముగా అవ్వాలని సోనాక్షి సీరియస్‌గా నిర్ణయం తీసుకున్నారట! ఎందుకంటే... ఎవరికీ తెలీదు. బట్, సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్–3’ షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు స్లిమ్ అవ్వాలనుకుంటున్నారు. యాక్చువల్లీ... హీరోయిన్ కాక ముందు సోనాక్షీ సిన్హా ఇంత కంటే బొద్దుగా ఉండేవారు. ఒక్కసారి హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాక చాలా బరువు తగ్గారు. అటువంటప్పుడు, ఓల్డ్ ఫార్ములా ఫాలో అవ్వొచ్చు కదా! పరిణీతి చోప్రాను టిప్స్ అడగడం ఎందుకు? అంటే... ఒకప్పుడు పరిణీతి కూడా సోనాక్షిలా బొద్దుగా ఉండేవారు. గత రెండేళ్లలో బాగా బరువు తగ్గారు. ‘గోల్మాల్ ఎగైన్’లో పరిణీతిని చూసిన సోనాక్షి సర్ప్రైజ్ అయ్యారట! అందుకే, ఆమెను టిప్స్ చెప్పమని అడుగుతున్నారట! ‘దబాంగ్–3’లో సోనాక్షి ఎంత స్లిమ్ముగా కనిపిస్తారో... వెయిట్ అండ్ సీ!! -
విజయ్‌తో మళ్లీ ఇద్దరు..
తమిళసినిమా: ఇళయదళపతితో మళ్లీ ఇద్దరు ముద్దుగుమ్మలు రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. అయినా యువ హీరోలే ఒకరికి మించిన హీరోయిన్ల చిత్రాల్లో డ్యూయెట్లు పాడడానికి ఆశ పడుతుంటే విజయ్ లాంటి స్టార్ హీరోకు ఇద్దరు హీరోయిన్లతో యువళగీతాలు పాడాలనుకోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది? అదీగాక మెర్శల్ చిత్రంలో ఏకంగా ముగ్గురు బ్యూటీస్‌తో ఆడి పాడేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఇళయదళపతి ఇంతకు ముందు కూడా తెరి చిత్రంలో ఇద్దరు భామలతో స్టెప్స్ వేసి విజయతీరాలను చేరారు. ఇక తాజాగా తన 62వ చిత్రానికి రెడీ అవుతున్న విజయ్ తుపాకీ, కత్తి చిత్రాల దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌తో ముచ్చటగా ముడోసారి పనిచేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం జనవరిలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇందులో ఒక కథానాయకిగా రకుల్‌ప్రీత్‌సింగ్ ఎంపికైంది. ఇక మరో కథానాయకిగా బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హాను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ బ్యూటీ ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా లింగా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యిందన్నది గమనార్హం. అయితే ఆ చిత్రం అపజయం పాలవ్వడంతో కోలీవుడ్‌లో సక్సెస్ అందుకోవాలన్న సోనాక్షి ఆశ నెరవేరలేదు. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ఇళయదళపతితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోందన్న మాట. ఈ చిత్రంతోనైనా ఈ అమ్మడు విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం. విశేషం ఏమిటంటే సోనాక్షిసిన్హా, రకుల్‌ప్రీత్‌సింగ్ ఈ ఇద్దరూ ఇప్పటికే ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించారు. హిందీ చిత్రం అకిరలో సోనాక్షిసిన్హా నాయకిగా నటించగా తెలుగు, తమిళం భాషల్లో రూపొందిన స్పైడర్ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ నటించింది. ఇప్పుడు ఈ బ్యూటీస్ ఇద్దరూ ఒకే చిత్రంతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
సోనాజాజి
సోనాక్షి సిన్హా కొంచెం బొద్దుగా ఉంటారు. అయినా చూశారా.. ఫ్యాషన్ ఎంత బాగా ఫిట్ అవుతుందో..! సైజ్జీరోలకే కాదండీ మనకీ ఫ్యాషన్ అవసరం. అందంగా ఉండటానికి ‘సన్న’జాజులే కాన్నర్లేదు బొద్దుగా ఉన్నా సోనాజాజిలా ఉంటే చాలు. ►లెహంగా మీదకు స్లిట్ లాంగ్ కుర్తీ వేస్తే వచ్చే అందం ఇది. లాంగ్ స్లీవ్స్ గల వెల్వెట్ ఫ్యాబ్రిక్ కుర్తీని బెనారస్ లెహెంగా మీదకు ధరించింది. పుట్టిన రోజు వంటి ఈవెనింగ్ పార్టీలకు ఈ డ్రెస్ బాగా నప్పుతుంది. బొద్దుగా ఉన్నా కట్, ఫిట్ సరిగ్గా ఉంటే అందంగా వెలిగిపోతారు. ►బొద్దుగా ఉన్నవారు నెటెడ్ శారీస్ కట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుందని ఫీలవుతుంటారు. ఇలాంటి చీరలు కట్టుకున్నప్పుడు శారీ కలర్ బ్లౌజ్, సింపుల్ జువెల్రీని ధరించాలి. ►ఇది పూర్తిగా రెట్రో స్టైల్. చెక్స్ స్కర్ట్ మీదకు ప్లెయిన్ ట్యూనిక్.. దాని మీదకు బ్లేజర్ ధరిస్తే పార్టీలో వెలిగిపోతారు. ఈ స్టైల్‌కి బంగారం కాకుండా యాక్ససరీస్ సిల్వర్వి ఎంచుకోవాలి. బర్త్‌డే, కాక్టెయిల్ వంటి ఈవెనింగ్ పార్టీలకి ఈ తరహా స్టైల్ బాగా నప్పుతుంది. ►ఇది రెడీమేడ్ హాఫ్‌శారీ. ఒకే రంగు లెహెంగా, ఓణీని ఎంపిక చేసుకోవడం, ఆభరణాల హంగు లేకుండా చూసుకోవడం, పొడవుగా వదిలేసిన హెయిర్.. ఇలాంటి జాగ్రత్తలు వల్ల బొద్దుగా ఉన్నప్పటికీ డ్రెస్‌కి మరింత అందాన్ని తీసుకురావచ్చు. ► ఇదీ రెట్రో స్టైల్ కాన్సెప్ట్. రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహెంగా దాని మీద ఎంబ్రాయిడర్ వర్క్, మగవారు ధరించే డబుల్ కాలర్ సూట్‌ని ఇలా డిజైన్ చేసి సెట్ చేయడంతో గ్రాండ్‌గా కనువిందు చేస్తుంది. కాక్టెయిల్పార్టీస్కి ఈ డ్రెస్సింగ్ బాగా నప్పుతుంది. ► డెనిమ్ ప్యాంట్, వైట్ ట్యూనిక్ వంటి క్యాజువల్‌వేర్ ధరించినప్పుడు నలుగురిలో స్టైలిష్‌గా కనిపించాలనుకునే అమ్మాయిలు ఫ్రంట్ ఓపెన్ కేప్ ధరిస్తే చాలు. ► రెండ్ లాంగ్ గౌన్ వెస్ట్రన్ పార్టీలకు బాగా నప్పుతుంది. డీప్ వి–నెక్, బాటమ్ అన్ఈవెన్కట్ .. ఈ డ్రెస్‌ని అందంగా మార్చింది. ఈవెనింగ్ పార్టీలలో స్టైలిష్ లుక్‌తో వెలిగిపోయేలా చేస్తుంది. ఒకే రంగు, వి–నెక్, స్లీవ్‌లెస్ ప్యాటర్న్ వల్ల బొద్దుగా ఉన్నా సన్నగా కనిపిస్తారు. భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్ -
సారీ చెప్పిన హీరోయిన్
ముంబైః మాట జారి తప్పు చేశానని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అంగీకరించింది. ట్విట్టర్ ద్వారా సరబ్జిత్ సింగ్‌పై అనుచితంగా వ్యాఖ్యానించినందుకు చింతిస్తున్నట్లుగా ఆమె పేర్కొంది. దీంతో పాటు బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పింది. ఇలా క్షమాపణలు చెప్పడం చిన్నతనం కాదనీ, హుందాతనమని ఈ దబాంగ్ భామ పేర్కొంది. వివరాల్లోకి వెళితే సరబ్జిత్ సింగ్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నట్లుగా ఓ యువతి.. అతని ఫొటోని సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఈ బాలీవుడ్ భామ కూడా స్పందించింది. ఆ ఫొటోలోని వ్యక్తిని తిడుతూ కామెంట్ పోస్ట్ చేసింది. క్షణాల్లో ఈ ఫొటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు సరబ్జిత్ సింగ్‌ని అరెస్ట్ చేశారు. అయితే ఆ యువతి కావాలనే సరబ్జిత్ సింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాలో వెల్లడించారు. దీంతో తప్పు తెలుసుకున్న సోనాక్షి తాను తొందరపడ్డానంటూ క్షమాపణలు తెలిపింది. Admitting a mistake and apologizing doesn't make anyone a smaller person...thats what I've been taught! https://t.co/3hQtJcPhHg — Sonakshi Sinha (@sonakshisinha) August 27, 2015 -
'లింగా' ఆడియో సక్సెస్ మీట్
-
సోదరులతో కలసి నిర్మాతగా మారనున్న సోనాక్షి
ముంబై: బాలీవుడ్ యువనటి సోనాక్షి సిన్హా సినీ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నారు. సోదరులతో కలసి సినిమాలు నిర్మించేందుకు సన్నద్ధమయ్యారు. సోనాక్షి తన కవల సోదరులు లవ్, కుశ్లతో కలసి సినిమాలు తీయనున్నారు. క్రటోస్ ఎంటర్టైన్మెంట్ పేరుతో తాను, సోనాక్షి, లవ్ కలసి సినిమాలు నిర్మించనున్నట్టు కుశ్ ట్వీట్ చేశారు. తన కుటుంబంతో కలసి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సినీ నిర్మాణంలో భాగస్వామిని అవుతానని సోనాక్షి ఇంతకుముందు ప్రకటించారు. వీరు ముగ్గరూ బాలీవుడ్ వెటరన్, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా వారసులు.