హైదరాబాద్‌లో వేసవిని కూల్ చేయడానికి బాలీవుడ్ స్టార్స్ తరలి రానున్నారు. మే నెలలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హైదరాబాద్‌లో ‘ద -బాంగ్’ పేరుతో ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఈవెంట్... లూనెట్టీస్ సంస్థ ఆధ్వర్యంలో జరుగనుంది. లూనెట్టీస్ సమర్పిస్తున్న ది ద-బాంగ్ టూర్ను సోహాలీ ఖాన్ ఎంటర్‌టైన్‌మెంట్, జేఏ సంయుక్తంగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా, జాక్వలిస్ ఫెర్నాండెజ్, డైసీ షా, ప్రభుదవ, గురు రంధ్వా తదితరులు ‘ది ద-బాంగ్’ టూర్‌లో భాగం కానున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 120 మందికి పైగా నృత్య కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. మే 12 గచ్చిబౌలీలో ఈవెంట్‌ను ప్లాన్ చేయనున్నట్లు చీఫ్ ఆర్గనైజర్ ఫర్హాన్ హుస్సేన్ తెలిపారు. వీటికి సంబంధించిన ఎంట్రీ పాసులు మేరా ఈవెంట్స్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రౌండ్ ఔట్లెట్లలో లభిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment