‘‘నా పెళ్లి, నా ఇష్టం..మీకెందుకబ్బా!’’ సోనాక్షి రియాక్షన్‌, వీడని సస్పెన్స్‌! | 'Its Nobody's Business': Sonakshi Sinha FINALLY Reacts About Her Wedding | Sakshi
Sakshi News home page

‘‘నా పెళ్లి, నా ఇష్టం..మీకెందుకబ్బా!’’ సోనాక్షి రియాక్షన్‌, వీడని సస్పెన్స్‌!

Published Tue, Jun 11 2024 1:36 PM | Last Updated on Tue, Jun 11 2024 1:48 PM

'Its Nobody's Business': Sonakshi Sinha FINALLY Reacts About Her Wedding

సినీ నటి సోనాక్షి సిన్హా పెళ్లి పుకారు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడ బోతోందంటూ పుకార్లు షికారు చేశాయి.  ఈ నెల 23న దక్షిణ ముంబైలో  అత్యంత సన్నిహితుల సమక్షంలో సోనాక్షి- జహీర్ పెళ్లాడబోతున్నారని వార్తలొచ్చాయి. 

ఈ వార్తలపై సోనాక్షి  ఘాటుగా సమాధాన మిచ్చింది.  ‘ ..ఇది నా పెళ్లి.. ఇది ఎవరికి సంబంధించిన విషయం కాదు. ఇక రెండోది నా పెళ్, నా ఇష్టం. జనాలకు ఎందుకింత  ఆందోళన అంటూ మండిపడింది. అలాగే తన పెళ్లి  గురించి అడగాల్సింది తనను గానీ, తన తల్లిదండ్రులను కాదంటూ చురకలేసింది. ఎపుడూ తన పెళ్లి గురించి అడుగుతూ ఉంటారని అయితే దీన్ని తాను పెద్దగా పట్టించుకోనని వ్యాఖ్యానించింది.

అటు  సోనాక్షి తండ్రి, బాలీవుడ్‌ హీరో, నేత శత్రుఘ్న సిన్హా కూడా  స్పందించారు. తన కుమార్తె పెళ్లి గురించి తనకు తెలియదని సోనాక్షి పెళ్లి గురించి ప్రశ్నించిన మీడియాతో చెప్పారు. ‘‘ ఎన్నికల ఫలితాలు తరువాత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. సోనాక్షి వెడ్డింగ్‌ ప్లాన్స్‌ గురించి నాకేమీ తెలియదు. నాకేమీచెప్పలేదు నేనూ ఎవరితోనూ మాట్లాడలేదు’’ అంటూ సమాధానమిచ్చారు.

అంతేకాదు  ఈ విషయంలో ప్రధానమీడియాకు ఎంత తెలుసో, తనకూ అంతే తెలుసుననీ, ఈ రోజుల్లో, పిల్లలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోరు.. జస్ట్‌ వారు  సమాచారం ఇస్తున్నారు.. మేము దానికోసం వెయిట్‌ చేస్తున్నాం అంటూ ముగించారు. దీంతో సోనాక్షి-జహార్‌ పెళ్లి సందడిపై  సస్పెన్స్‌  మరింత ముదిరింది.

కాగా సోనాక్షి, జహీర్ ఇద్దరూ సల్మాన్‌ఖాన్ సినిమాలతోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సోనాక్షి 2010లో దబాంగ్ సినిమాలో నటించగా, సల్మాన్ నిర్మించిన నోట్‌బుక్ సినిమాతో 2019లో జహీర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో జూన్ 23న సోనాక్షి, జహీర్  వివాహం జరుగు తుందని, ఆ తర్వాత రాత్రి రిసెప్షన్ కూడా ఉంటుందనేది మీడియా నివేదికల సారాంశం వీరిద్దరూ చాలా కాలంగా తమ పెళ్లికి ప్లాన్ చేస్తున్నప్పటికీ, సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఇప్పటిదాకా వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement