
దబాంగ్‌లో సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలలో దబాంగ్‌ది ప్రత్యేక స్థానం. 2010లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సల్మాన్ స్టామినా చాటిచెప్పింది. ఆ తర్వాత వచ్చిన దబాంగ్ 2 కూడా సల్మాన్‌కి మంచి విజయాన్ని అందించింది. తాజాగా దబాంగ్ 3 నిర్మిస్తున్నట్టు వార్తలు రావడంతో ఆ సినిమా విశేషాలపై ఆసక్తి నెలకొంది. ఈ సీరిస్‌లో విడుదలైన సినిమాలు భారీగా కలెక్షన్లు రాబట్టడంతో, తాజా సినిమాపై పెద్ద ఎత్తున్న అంచనాలు నెలకొన్నాయి.
దబాంగ్, దబాంగ్ 2 లలో సల్మాన్‌కు జోడిగా సోనాక్షి సిన్హా నటించారు. ఈ రెండింటిని నిర్మించిన సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్, తాజా చిత్రానికి కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. దబాంగ్‌కు అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, దబాంగ్ 2 కి అర్భాజ్ ఖాన్ ఆ బాధ్యతలు చేపట్టారు. తాజా చిత్రంపై అంచనాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో దర్శకుడు ఎవరనేది తెలుసుకోవడానికి అందరు ఆసక్తి కనబరుస్తున్నారు.
వీటన్నింటికి ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభుదేవా తెరదించారు. ఈ సినిమాకు తనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. రెండు సినిమాలకు పనిచేసిన హీరోయిన్ సోనాక్షి, మ్యూజిక్ అందించిన సాజిద్-వాజిద్‌లతో పాటు, ఇతర బృందం అంత పాతదే ఉంటుందని, తాను ఒక్కన్ని మాత్రమే కొత్తగా చేరుతున్నానని తెలిపారు. సల్మాన్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఒదులుకొవడానికి ఎవరు సిద్ధపడరని ఆయన అన్నారు. సినిమా హిట్, ప్లాఫ్ అనేది హీరో భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి, కానీ సల్మాన్‌కి వాటితో ఏ మాత్రం సంబంధం లేని సూపర్‌స్టార్ అని పేర్కొన్నారు.
గతంలో ప్రభుదేవా సల్మాన్ నటించిన వాంటెడ్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మహేశ్‌బాబు నటించిన తెలుగు మూవీ పోకిరి రిమేక్. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్‌లు రాబట్టడంతో, దబాంగ్ 3పై అంచనాలు మరింతగా పెరగనున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment