
...అంటున్నారు సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా. ఎక్కడికి అంటే.. థియేటర్స్‌లోకి. ‘దబంగ్’తో తొలిసారి ఈ ఇద్దరూ జత కట్టారు. సోనాక్షీకి అది తొలి సినిమా. ఫస్ట్ సినిమాకే సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఓ సూపర్ హిట్‌ని ఖాతాలో వేసుకోవడంతో ‘దబంగ్’ సోనాక్షీకి ఓ తీపి గుర్తు. ఎనిమిదేళ్ల క్రితం రూపొందిన ఈ చిత్రానికి ఆరేళ్ల క్రితం సీక్వెల్ వచ్చింది. ఇప్పుడు మూడో భాగానికి రెడీ అయ్యారు. ఫస్ట్ పార్ట్‌కి అభినవ్ కశ్యప్, సెకండ్ పార్ట్‌కి సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు.
మూడో భాగానికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘వచ్చే ఏడాది ‘దబాంగ్ 3’తో మేం మీ ముందుకు వస్తాం’’ అని సల్మాన్, సోనాక్షీ పేర్కొన్నారు. కాగా, తొమ్మిదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ హీరోగా తెలుగు ‘పోకిరి’ హిందీ రీమేక్ ‘వాంటెడ్’కి దర్శకత్వం వహించారు. హిందీలో దర్శకుడిగా ప్రభుదేవాకి అది తొలి సినిమా. ‘వాంటెడ్’ సూపర్ హిట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత ‘దబంగ్ 3’తో మరో సూపర్ హిట్‌కి రెడీ అయ్యారు.