‘సోనాక్షి సల్మాన్‌ ఖాన్‌ చెంచా!’ | Sonakshi Sinha Gives Reply To Trolling Her Salman Khan ki Chamchi | Sakshi
Sakshi News home page

‘సోనాక్షి సల్మాన్‌ ఖాన్‌ చెంచా!’

Published Sun, Dec 8 2019 4:32 PM | Last Updated on Sun, Dec 8 2019 5:10 PM

Sonakshi Sinha Gives Reply To Trolling Her Salman Khan ki Chamchi - Sakshi

ముంబై: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దబాంగ్‌ ఫేమ్‌ సోనాక్షి సిన్హా తనపై విమర్శలు చేసిన నెటిజన్లపై ఫైర్‌ అయింది. తనను సల్మాన్‌ ఖాన్‌ చంచా అని,  నటించడం రాదని కేవలం మీ నాన్న సినిమా రంగంలో ఉండడం వల్లే  అవకాశాలు వస్తున్నాయనే ఓ నెటిజన్‌ విమర్శలకు సోనాలి ఘాటైన సమాధానమిచ్చింది.  తనకు నటన రాకుంటే 9 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో అవకాశాలు ఎందుకొచ్చాయంటూ ప్రశ్నించింది. మరికొందరు నెటిజన్లు లావుగా ఉన్నావంటూ..  ఆమె టీవీలో కనిపిస్తే టీవీనే పగలగొడుతానని, సోనాక్షిని తీవ్రంగా ద్వేషిస్తానని అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేయగా వాటికి దీటుగా సమాధానం ఇచ్చింది. 

ఈ వ్యాఖ్యలపై సోనాక్షి స్పందిస్తూ.. మీరు టీవీని పగలగొడుతున్నారంటే మీకు డబ్బులు ఎక్కువగా ఉన్నావనుకుంటా నచ్చకుంటే టీవీని ఆపేయవచ్చు..అంతేగానీ పగలగొట్టాల్సిన అవసరం లేదని గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. ప్రస్తుతం కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌కు జోడిగా సోనాక్షి దబాంగ్‌ 3లో నటిస్తుండగా ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న విడుదలవుతున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement