Zaheer Iqbal Confirms Dating With Sonakshi Sinha, Instagram Post Goes Viral - Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: డేటింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్.. నటుడి పోస్ట్ వైరల్!

Published Sat, Jun 3 2023 1:24 PM | Last Updated on Sat, Jun 3 2023 2:55 PM

Zaheer Iqbal Dating With Sonakshi Sinha Instagram Post Goes Viral - Sakshi

బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవలే దహాద్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. అయితే దబాంగ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత రౌడీ రాధోడ్ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. జూన్ 2న సోనాక్షి సిన్హా తన 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ తారలు  శుభాకాంక్షలు తెలిపారు.

(ఇది చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి)

అయితే ఆమె సహనటుడు జహీర్ ఇక్బాల్‌ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు బీ టౌన్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై సోనాక్షి, జహీర్ ఎక్కడా నోరు విప్పలేదు. అయితే ఈ జంట పలు ఈవెంట్లలో కనిపించారు. దీంతో ప్రతిసారీ సోషల్ మీడియాలో రిలేషన్ షిప్‌పై గాసిప్స్ వినిపించాయి. తాజాగా సోనాక్షి సిన్హా పుట్టినరోజు సందర్భంగా జహీర్ చేసిన పోస్ట్ డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తోంది. బర్త్‌ డే విషెష్ చెబుతూనే 'ఐ లవ్‌ యూ' అంటూ నోట్‌లో రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆమెతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా.. గత నెలలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి సిన్హా సంబంధాన్ని దాదాపుగా ధృవీకరించారు. కాగా.. వీరిద్దరు కలిసి డబుల్‌ ఎక్స్‌ఎల్‌ చిత్రంలో నటించారు.

సోనాక్షి సిన్హా ప్రస్తుతం హర్రర్-కామెడీ చిత్రం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్‌లో కనిపించనుంది. ఆ తర్వాత నికితా రాయ్ మూవీ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో నటించనుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కూడా ఉన్నారు.

(ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన బెస్ట్ ఫ్రెండ్.. వైరలవుతున్న ఫోటోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement