సినిమాల్లోకి జాన్వీ కపూర్ చెల్లెలు ఎంట్రీ.. అప్పుడే డేటింగ్ రూమర్స్! | Khushi Kapoor dating her The Archies co star Vedang Raina | Sakshi
Sakshi News home page

Khushi Kapoor: ఒక్క సినిమాకే డేటింగ్ రూమర్స్.. సోషల్ మీడియాలో వైరల్!

Published Fri, Dec 29 2023 3:48 PM | Last Updated on Fri, Dec 29 2023 4:01 PM

Khushi Kapoor dating her The Archies co star Vedang Raina - Sakshi

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్ ఎక్కువ సినిమాల్లో కనిపించిన జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఆమె చెల్లెలు కూడా అక్కా బాటలోనే పయనిస్తోంది. శ్రీదేవి చ‍చిన్న కూతురిగా ఖుషీ కపూర్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ది ఆర్చీస్‌ మూవీతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం డిసెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

అయితే సినిమాల్లో అలా ఎంట్రీ ఇచ్చిందో.. లేదో అప్పుడే డేటింగ్‌ రూమర్స్ మొదలయ్యాయి. ది ఆర్చీస్‌ సహా నటుడు వేదంగ్ రైనాతో డేటింగ్‌లో ఉందంటూ బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఖుషీ కపూర్ తన మొదటి సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తుండగా.. మరోవైపు రూమర్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి.అయితే ఈ వార్తలను నటుడు వేదాంగ్ రైనా ఖండించారు. 

వేదాంర్ రైనా మాట్లాడుతూ ఖుషీ కపూర్, నేను చాలా సందర్భాల్లో కనెక్ట్ అయ్యాం. సంగీతంలో మా ఇద్దరికీ అభిరుచులు ఓకేలా ఉన్నాయి. అలాగని మేమిద్దరం డేటింగ్‌ చేయడం లేదు. ఆమెతో నాకు చాలా రోజుల నుంచి తెలుసు. మా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. ఆ టైం వస్తే నేనే మీ ముందుకొచ్చి చెబుతా' అన్నారు. కాగా..  ది ఆర్చీస్‌ మూవీలో ఖుషీతో పాటు అగస్త్య నందా, డాట్, మిహిర్ అహుజా, సుహానా ఖాన్ నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement