ప్రియుడితో పెళ్లి.. ఆ రూమర్స్‌కి చెక్ పెట్టిన హీరోయిన్ మామ! | Zaheer Iqbal Father Comments On Sonakshi Religion Change | Sakshi
Sakshi News home page

Sonakshi: హీరోయిన్ పెళ్లి.. లెక్కలేనన్ని పుకార్లు.. కానీ ఎందుకిలా?

Jun 23 2024 10:34 AM | Updated on Jun 23 2024 10:47 AM

Zaheer Iqbal Father Comments On Sonakshi Religion Change

హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోనుంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న నటుడు జహీర్ ఇక్బాల్‌తో ఒక్కటి కానుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఈమె పెళ్లి గురించి వచ్చినన్నీ రూమర్స్ మరే బ్యూటీ పెళ్లి గురించి రాలేదు. ఎందుకంటే ఈ పెళ్లి, సోనాక్షి తల్లిదండ్రులకు తెలియదు, ఇష్టం లేదనే దగ్గర నుంచి రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా మతం మార్పిడి గురించి పుకార్లు రాగా, వాటిని సోనాక్షి కాబోయే మామ తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!)

'ఈ పెళ్లి హిందూ లేదా ఇస్లాం సంప్రదాయంలో జరగదు. ఇది సివిల్ మ్యారేజ్. అలానే సోనాక్షి మతం మారడం లేదు. ఇది మాత్రం గ్యారంటీ. ఇది వారి మనసుల కలయిక. ఇందులో మతానికి ఎలాంటి పాత్ర లేదు. నేను మనవత్వాన్ని నమ్ముతాను. హిందువులు భగవాన్ అని, ముస్లింలు అల్లా అని పిలుస్తారు కానీ చివరకు మనమంతా మనుషులమే. నా ఆశీస్సులు జహీర్, సోనాక్షిపై ఉంటాయి' అని జహీర్ తం‍డ్రి క్లారిటీ ఇచ్చారు.

కొన్నిరోజుల క్రితం ఓ ప్రెస్‌మీట్‌లో సీనియర్ నటుడు శత్రుఘ‍్ని సిన్హాని.. సోనాక్షి పెళ్లి రూమర్స్ గురించి అడగ్గా.. తనకు ఆ విషయం తెలియదని అన్నారు. ఈ క్రమంలోనే సోనాక్షి.. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుందా అనే సందేహాలు వచ్చాయి. అయితే అలాంటిదేం లేదని పెళ్లిలో కచ్చితంగా తాను ఉంటానని శత్రుఘ్ని సిన్హా చెప్పుకొచ్చారు. జహీర్ ఇక్బాల్ ఇంట్లో రిజిస్టర్ మ్యారేజ్ జరుగుతుందని, ఇది తమకు సంతోషకరమైన క్షణమని ఆనందం వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement