డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా థియేటర్లలోకి రావడానికి మరో నాలుగు రోజులే ఉంది. ఈ క్రమంలోనే సినిమాపై హైప్ రోజురోజుకి మెల్లగా పెరుగుతోంది. మరోవైపు టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని అభిమానులు వెయిటింగ్. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు అనుమతి వచ్చేసింది. కాకపోతే ఆ రేట్స్ చూస్తుంటేనే మైండ్ బ్లాంక్ అవుతోంది.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)
ఈనెల 27 నుంచి జూలై 4 వరకు అంటే 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించారు. అలానే 27న ఉదయం 5:30 గంటలకు బెన్‌ఫిట్ షో వేసుకోవడానికి అనుమతిచ్చారు. ఐదురోజుల పాటు రోజుకి ఐదు షోలు వేసుకునేలా ఉత్వర్తులు జారీ చేశారు. అలానే ఒక్కో టికెట్‌పై గరిష్టంగా రూ.200 పెంచుకోవచ్చని పేర్కొన్నారు.
సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిబట్టి చూస్తే బెన్‌ఫిట్ షో కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.377, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.495 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.265, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ.413 రూపాయలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్, త్రీడీ గ్లాస్ ఛార్జీలు అదనం. దీనిబట్టి చూస్తే ఒక్కో టికెట్ ధర రూ.500కి మించే ఉంటుంది!
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)
Comments
Please login to add a commentAdd a comment